ఎంతకాలం బాల‘శిక్ష’!


Thu,May 2, 2013 04:51 PM

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి జీవిత పోరాటం చేస్తున్నారు. ఎన్ని బాలకార్మిక చట్టాలు వచ్చినా ఇంకా అనేకమంది బాలలు బాలకార్మికులుగానే బతుకులీడుస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి వలస వచ్చి ఇటుక బట్టీల్లో ఇటుకలు తయారు చేసేది ఈ చిన్నారులే. వీరిని చూస్తే భారతదేశం అభివృద్ధి చెందుతున్నదని మురిసిపోవాలో? ఏడవాలో? అర్థం కాదు. భావి భారత భవనం ఎలా పేకమేడలా ఉండబోతున్నదో ఊహకందనిది కాదు.

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇటుక బట్టీల్లో సుమారు నాలుగు లక్షల మంది ఒరిస్సా వలస కార్మికులున్నారు.దుండిగల్, కుత్బుల్లాపూర్ మండలాల్లో దాదాపుగా 200 ఇటుక బట్టీలున్నాయి. ఇందులో దాదాపు ఐదు వేలమంది కార్మికులు ఒరిస్సా నుంచి వలస వచ్చి బానిసలుగా పని చేస్తున్నారు. వీరితోపాటు చిన్నారులు కూడా వచ్చి బట్టీల్లో పనిచేస్తున్నారు. వీరిలో చంటి పిల్లలున్నారు. 6-14ఏళ్ల వయస్సు నిండినవారు దాదాపు రెండు వేలమంది ఉన్నారు. వీరందరు తల్లిదంవూడులతోపాటు ఎర్రటిఎండలో మాడిపోతున్నారు.

బాలలు ఇటుకలను అటు ఇటు తిప్పతూ ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని బట్టి దగ్గరకు మోసే ప్రక్రియ చాలా కష్టతరమైనది. ప్రతి కార్మికుడు తలపై ఇటుకలు మోస్తూ 50- 150 మీటర్ల దూరం నడవాలి. ఒక్కో ఇటుక నాలున్నర కిలోలు బరువుంటుంది. మగవాళ్లు , మహిళలు అందరూ మోయాల్సిందే! ఇటుకను కాల్చడానికి అనువుగా వరిపొట్టును సద్దతూ బట్టి ఏర్పాటు చేసి కాల్చితే ఎర్రని ఇటుకలు తయారవుతాయి.అవస్థాపన సౌకర్యాల కల్పన ఇక్కడ నుంచి మొదలై రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుంది.

మనదేశంలో మొత్తం సంవత్సరానికి 140 మిలియన్ల ఇటుక తయారవుతుంది. ఇది ప్రధానంగా అవస్థాపన సౌకర్యాల కల్పనలు, రియల్ ఏస్టేట్ వ్యాపారానికి ప్రేరేపితమై 280 మిలియన్ల వ్యాపారానికి నాంది అవుతున్నది.ఇటుక యజమానుల సం ఘం ప్రకారం సుమారుగా ఒక లక్ష ఇటుక బట్టీలు మన దేశం లో ఉన్నాయి. దాదాపు నలభై లక్షల మంది పేదలకు ఉద్యోగా లు కల్పిస్తున్నది. అయితే ఇటుకబట్టీల్లో పనిచేసే వారు బడుగు బలహీనవర్గాల,దళితులు, ఆదివాసీలే. తమ సొంత ఆవాసాలు వదిలి వలస వచ్చి నూతన ఆర్థిక వ్యవస్థ నూతన బానిసలు మారుతున్నారు.

స్వామి అగ్నివేశ్ నాయకత్వంలోని ‘బంద్వా ముక్తి మోర్చా’ అనే సంస్థ 1981లోనే ఈ అంశాన్ని లేవదీసి నూతన బానిస వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్ ప్రభుత్వం ముందుంచింది.1979లో రూపొందించిన ‘అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం’ కార్మికుల రక్షణ, సంక్షేమం, జీవన స్థితిగతులను మెరు గుపర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయి.

ఒడిషా,ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం, బాలల విద్య సౌకర్యం అం దించడం, కనీస వేతనం, చెల్లించడం, పని పరిస్థితులను పర్యవేక్షించడం, ఆరోగ్య సంరక్షణ, రేషన్ కార్డుల పంపిణీ జరగాలి. హైదరాబాద్ చుట్టూ ఇటుక బట్టిల్లో ఈ సౌకర్యం కల్పించిన దాఖలాలు ఎక్కడా లేవు. అనధికారిక అంచనాల ప్రకారం ఒరి స్సా నుంచి మన రాష్ట్రానికి వలసవచ్చిన వారి సంఖ్య కానీ అనధికార అంచనాల ప్రకారం అది దాదాపు 20 లక్షలు దాటుతుంది. బాలల బంగారు భవితను బుగ్గిపాలు చేస్తూ వారిని కార్మికులుగా చేస్తున్నదెవరు? తల్లిదంవూడులా? పేదరికమా? అమాయకత్వమా? అజ్ఞానమా? నిరక్షరాస్యతా? ప్రభుత్వ నిర్లక్ష్యమా? సామ్రాజ్యవాద విధానాలా? అందరూ ఆలోచించాలి.

బాలల కోసం రూపొందించిన చట్టాలు, పథకాలు ఆమోదించడం వరకే గాని, పాలకులు ఆచరణలో శ్రద్ధపెట్టడ లేదు. ఈ దారుణమైన పరిస్థితికి తమ స్వార్థాన్ని చూసుకుంటున్న పాలకులు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ వ్యవస్థను తాత్కాలికంగా ప్రయోజనకారిగా కల్పించే పునరావాస కార్యక్షికమాలతోపాటు దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారానికి ఒక బలోపేతమైన ఉద్యమం కావాలి.ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం ఈ అవసరాన్ని గుర్తించి ముందుకు సాగుతున్నది. దీనికి పౌరసమా జం, ప్రజా సంఘాలు సంఘీభావం కూడగట్టి ఉద్యమాన్ని నిర్మించాలి.

పొఫెసర్ గడ్డం లక్ష్మణ్
ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం కార్యకర్త

35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష