మా ఆకాంక్షపై మాదే తీర్పు..


Sat,October 6, 2012 05:32 PM

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అంశం లోక్‌సభలో చర్చకు రావడం హర్షణీయం. బీజేపీ లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ చర్చను ప్రారంభించి, ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టండి, మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని ప్రతిపాదన చేశారు. కానీ దానికి చిదంబరం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. ఎప్పటిలాగే చిదంబరం ‘ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి’ అన్నట్టుగా సమాధానమిస్తూ ‘తెలంగాణ అంశాన్ని తెలుగువాళ్లే తేల్చుకోవాలి’ అని ప్రకటించి చేతులు దులుపుకున్నరు. ప్రతిపక్ష, స్వపక్ష సభ్యుల ప్రసంగాల తర్వాత చర్చకు సమాధానమిస్తూ పేర్కొన్న చాలా అంశాలు ఆక్షేపణీయమైనవి. వారు తమ ప్రసంగంలో చేసిన ఈ అంశాల ను ఒకసారి పరిశీలించాలి.


చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తమ పార్టీయే (కాంగ్రెస్) ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదంటున్నారు. 2004 ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పం దం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాకుండా కరీంనగర్‌లో జరిగిన ఒక సభలో సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ ‘తెలంగాణ ప్రజల మనోభావాలు తనకు తెలుసునని, వారి భావోద్వేగాలను గౌరవిస్తానని, అధికారంలోకి వస్తే, మీ ఆకాంక్షలను సఫలం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా’మని వాగ్దానం చేసింది. ఆ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టిన యూపీఏ సర్కార్ తమ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో ‘అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి సరైన సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని చేపడుతుంది’ అని ప్రకటించింది.

ఆ తర్వాత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యూపీఏ సర్కార్ తమ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో పేర్కొన్నదానికి కట్టుబటి ఉన్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రధాని మన్మోహన్ తన మొదటి ‘ప్రెస్ కాన్ఫన్స్’లో పునరుద్ఘాటించారు. దానిలో భాగంగానే ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. మళ్లీ ఇప్పుడు ‘తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు’ అంటున్నరు చిదంబరం. ఏ నిర్ణయం తీసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆ ప్రకటనలన్నీ చేసింది అంటే క్షమించరాని మోసం.

‘తెలంగాణ అంశంపై తెలుగువాళ్లే’ తేల్చాలి అంటున్నారు చిదంబరం. ఆయన భాషలో తెలుగువాళ్లు అంటే మొత్తం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజలు. తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది తెలంగాణ ప్రజలు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కాదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల మధ్య ‘మనందరిది ఒకే భాష, ఒకే సంస్కృతి ఒకే చరిత్ర కాబట్టి మనం అంతా ఒక్కటే’ అనే భావం నెలకొని ఉండాలి. అప్పుడే అది సమైక్యంగా మనుగడ సాధించగలదు. ‘మనమంతా ఒక్కటే’ అనే భావన ఆ ప్రజల్లో లేనప్పుడు దాన్ని సమైక్యంగా ఉంచలేమన్నది చారివూతక సత్యం.

1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలనే పరిగణనలోకి తీసుకున్నరు. కానీ మద్రాసు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ మద్రాసు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఆనాడు ఏర్పడి ఉండేది కాదు. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి తీర్మానాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టలేదు. తీర్మానం ప్రవేశపెడితే అది వీగిపోతుందని ముందే గ్రహించి దాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టిండ్రు. కానీ దీనికి భిన్నంగా తెలంగాణను కోస్తాంవూధతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన్రు. నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్ర ఏర్పాటుపై జరిగిన చర్చలో ఏకాభివూపాయం రాలేదు. 29 మంది తెలంగాణ శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని, కోస్తాంధ్ర ప్రాంతాలతో కలిపి విశాలాంధ్ర ఏర్పాటుకు పూనుకోవద్దని డిమాండ్ చేశారు. 101 మంది తెలంగాణ శాసనసభ్యులో 15 మంది అసలు ఓటింగ్‌లోనే పాల్గొనలేదు. విశాలాంధ్ర ఏర్పాటుకు ఏకాభివూపాయం ఎక్కడ వచ్చింది? అందుకే తెలంగాణ అంశంపై తెలుగువాళ్లే తేల్చుకోవాలంటే ఏకాభివూపాయం ఉండాల్సింది తెలంగాణ ప్రజల్లోనే కానీ కోస్తాంధ్ర ప్రజల్లో కాదు.

చిదంబరం తన ప్రకటనలో ‘తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం కేవ లం ఒక సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది’ అన్నారు. ఇది నిజంగా బాధ్యతారహితమైన ప్రకటన. నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కేంద్రం ఒక సంధానకర్తగా మాత్రమే వ్యవహరించి ఉంటే నేడు దేశంలో 28 రాష్ట్రాలు ఉండేవి కావు. 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత దేశంలో 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28కి చేరింది. ఇవన్నీ ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వ చొరవతోనే అన్నది నిజం. నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కేంద్రానిది నిజంగా సంధానకర్త పాత్రే అయితే ‘ఎన్డీఏ’ హయాంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడి ఉండేవి కావు. బీహార్ రాష్ట్ర శాసనసభ రెండు సార్లు జార్ఖండ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. అయినప్పటికీ కేంద్రం చొరవతో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కేంద్రానిది సంధానకర్త పాత్ర కాదు అంతిమ నిర్ణయమని తేటతెల్లమయింది.

చిదంబరం తెలంగాణ అంశంపై ఏమంటున్నారో ఓసారి చూద్దాం. ‘తెలంగాణ అంశంపై ఆంధ్రవూపదేశ్ ప్రజలు రెండుగా చీలిపోయారు, రెండు ప్రధాన రాజకీయ పార్టీల్లో విభజన వచ్చింది. రాష్ట్రంలో ఇంకా నాలుగు పార్టీలు తెలంగాణ అంశంపై ఏ నిర్ణయం తీసుకోలేదు.’ అని అంటున్నారు. మన రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నాయి. సీపీఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ అంశంపట్ల ఇంకా ఏ నిర్ణయం తీసుకోని రాజకీయ పార్టీలు చిదంబరం దృష్టిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, కాంగ్రెస్‌లు. ఈ మధ్యకాలంలోనే పురుడు పోసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే ప్రధా న రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ ,టీడీపీ పార్టీలు తీసుకునే నిర్ణయం ఆధారం గా తాము ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

అంటే తెలంగాణ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్, టీడీపీల పైన నే ఉందన్నమాట. అంతేగాక అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన 7 డిసెంబర్, 2009న రాష్ట్ర శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాల్లోనూ తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుపై తమ అభివూపాయాలను వెల్లడించాయి. వాటి ఆధారంగానే చిదంబరం డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్, టీడీపీలు వివిధ సందర్భాల్లో తెలంగాణ అంశంపట్ల తమ పార్టీల వైఖరులను వెల్లడించాయి. దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి గానీ, ప్రాంతాలవారీగా ప్రజావూపతినిధులు, ప్రజలు చీలిపోయిన దాన్ని కాదు.
లోక్‌సభ చర్చలో తెలంగాణ ప్రజలకు చిదంబరం ఇచ్చిన సమాధానం నిరాశకు గురిచేసింది. అదే పాత పాట. తెలంగాణ కోసం యాదిడ్డి అనే యువకు డు దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దాని తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు. పైపెచ్చు, అతని ఆత్మత్యాగాన్నే కొందరు శంకించడం క్షమించరాని విషయం. ఈ ఆత్మబలిదానాల న్నీ చిదంబరం డిసెంబర్9 ప్రకటన తర్వాతనే జరిగాయి. తెలంగాణ పై ఇప్పటి వరకు చేసిన భిన్న ప్రకటనలతో తెలంగాణ ప్రజలు నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి కారకుడు చిదంబరం. ఆత్మ బలిదానాలకు పాల్పడ్డ యువకుల ఆత్మలు ఘోషిస్తున్నయి. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించమని డిమాండ్ చేస్తున్నయి. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరిచి నాలుగున్నర కోట్ల ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తుందని ఆశిద్దాం.

పొ.జి. లక్ష్మణ్, ప్రొ. బి. సత్యనారాయణ,
ప్రొ.ఎస్. మల్లేష్. ప్రొ.విష్ణువర్ధన్‌డ్డి,
ప్రొ.ఎం. వెంక ప్రొ.ఎ. కరుణాకర్


35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles