బాబుది అధికార ఆరాటమే


Thu,October 11, 2012 12:27 AM

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబుతుంది. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు హిందూపురంలో ఓడిపోలేదు. రైతులు, యువత, బడుగు బలహీన వర్గాలు దుర్భరస్థితిని ఎదుర్కొంటున్నారు కనుక వీరిని కలుసుకుని కనీసం రెండుపూటలైనా తింటున్నారా? లేదా అన్న విషయం తెలుసుకోవాలన్న తపనతో ఈ యాత్ర నిజంగా చేపడితే హర్షించదగినదే. అయితే బాబు పాదయాత్రలో నిజాయితీ ఎంత?

తొమ్మిదేళ్లు రాజ్యమేలిన బాబుకు మరో తొమ్మిదేళ్లు అధికారానికి దూరమవ్వడం పార్టీకి చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ లేక సమర్థవంతమైన నాయకులులేక దయనీయమైన పరిస్థితిలో ఆ పార్టీ ఉన్నది. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చి 2014 ఎన్నికల్లో గెలవాలన్నదే బాబు కర్తవ్యం. దీనికోసం పాదయావూతలే ప్రధానమ న్న విషయాన్ని అందరూ గమనించారు. పాదయాత్రలు పదవులకు ప్రధానమే కావచ్చు కానీ, అన్ని పాదయావూతలు పదవులను తెచ్చిపెట్టవని 2009 ఎన్నికల సందర్భంగా చేసిన మీ కోసం అనుభవం మర్చిపోకూడదు. ఇప్పుడు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర ప్రయోగం వికటిస్తే ఇక ప్రయోగ శాల మిగులుతుందా అన్నదే ప్రధాన ప్రశ్న.
రాష్ట్రంలో మారిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి కాస్త జాగ్రత్తపడి పాదయావూతకు ముందే బాబు బీసీ డిక్లరేషన్, ఎస్‌స్సీ, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించాడు. వీటిని గొప్పగా ప్రచారంలో పెట్టాడు. తెలంగాణ పై తన వైఖరిని ప్రకటిస్తూ లేఖ రాస్తానని చాలా కాలంగా నాన్చుతూ చివరికి, అఖిల పక్ష సమావేశం లో తన అభివూపాయాన్ని ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ డిక్లరేషన్ల వల్ల భవిష్యత్తులో ఒనగూరే లాభమేమో గానీ తక్షణం మాత్రం పార్టీకి తీవ్ర నష్టం జరిగింది.

వర్గాలు విడివిడి దూరం అయ్యాయి. నాయకులు రాజీనామాలకు, తిరుగుబాటుకు తెరదీశారు. అంటే పార్టీ పాదయావూతకు ముందే నష్టాలబోణితోనే మొదలైంది. తెలంగాణపై రాసిన లేఖను తనే స్వయంగా గొప్పగా చెప్పుకోలేనం త వికారంగా ఉన్నది. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, స్పష్టతలు కోల్పో యి విలువలకు కట్టుబడకపోతేనే ఏ పార్టీకైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈసారి ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్న చంద్రబాబు మానసిక పరివర్తనకు సంబంధించి ప్రజలతో సున్నితంగా వ్యవహరించడానికి శిక్షణ కూడా పొందా డు . వస్తున్నా..మీకోసం అంటూ..ండు వేళ్లు చూపడం మాని, రెండు చేతుపూత్తి ప్రజలకు దండం పెడ్తూ తన వ్యవహారశైలిని సాధన చేశాడు. ముందు జాగ్రత్తగా అంబేద్కర్, పూలే ఫోటోలు రక్షణగా పెట్టుకొని గాంధీ జయంతి నాడు బయలుదేరాడు. ఈ జిత్తులన్నీ దేనికోసమో ప్రజలకు అర్థమైంది.

అహింసామూర్తి మహాత్ముని సాక్షిగా పాదయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన ఎంత హింసాత్మకంగా సాగిందో ప్రజలకు తెలుసు. అందుకే ఆయనను సాగనంపారు. ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్నప్పుడు బ్లాక్ క్యాట్ కమెండోల రక్షణ వలయం లో ఉంటే ప్రజలకు ఎలా దగ్గరవుతారో ఆయన అర్థం చేసుకోవడం లేదు. పాదయావూతలో ఒకరినో, ఇద్దరినో దగ్గరికి తీసి భుజాలపై చేతులు వేసి, చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్లు చేస్తే.పజల కు దగ్గరైనట్లు కాదు. తాను అధికారం చేపట్టగానే తన మామ పెట్టిన రెండురూపాయల కిలో బియ్యం, సంపూర్ణమద్య నిషేధం ఎత్తేసినప్పుడే ప్రజల్లో స్థానం కోల్పోయారు.

అందు కే ప్రజలు ఇప్పుడు బాబు చేస్తున్నవన్నీ గారడీ ఆటలుగా చూస్తారే గానీ ఆయనను విశ్వసించరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్వాక్రా మహిళల సంఘాలను తాను కొత్తగా ప్రవేశపెట్టిన కొంగొత్త పథకాలుగా ప్రచారం చేసుకుని మహిళా సంఘాలను ప్రోత్సహించి వారిని ఓట్ల బ్యాంకుగా మార్చుకున్నా.., తర్వాతి కాలంలో అవలంబించిన విధానాలు ఆ మహిళలను కూడా దూరం చేశాయి. బహుళజాతి కంపెనీలకు చెందిన మినీ సిగట్లకోసం బీడీలపై కత్తిగట్టినప్పుడు రాష్ట్రంలోని మహిళలంతా బాబు బండారాన్ని తెలుసుకున్నారు. బిడ్డపుట్టగానే అయిదువేల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు, కొన్నాళ్ల తర్వాత దాన్ని ముందడుగులో విలీనం చేసి నీరుగార్చాడు. ఇలా ప్రతి పథకాన్ని తుంగలో తొక్కి ప్రజలను వంచించాడు. వీటిని ప్రజలు ఇంతతొందరగా మరిచిపోరు.

తాను రాష్ట్రానికి ముఖ్యమంవూతిని కాను, సీఈఓనని చెప్పుకుని బహుళజాతి కంపెనీలకు తాను ఎలా నమ్మిన బంటుగా, జీతగాడుగా పనిచేయదల్చుకున్నాడో స్వయంగా తానే చెప్పుకున్నాడు. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రచారం కోసం చేసిన జిమ్మిక్కులో ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు, భూమి కోసం విజ్ఞప్తులు రావడంతో.. బెంబేపూత్తి పోయాడు. ప్రజల వద్దకు పాలననుంచి తప్పించుకునేందుకు కారణాలు వెతుకుతూ కాలం గడిపాడు. నీరు,మీరు, ఇంకుడు గుంతలు, శ్రమదానం కార్యక్షికమాల లాంటి ప్రచార కార్యక్షికమాలను రూపొందించి పాపులారిటీ కోసం తెగ ఆరాటపడ్డాడు. ఈ అన్నింటి వల్ల చంద్రబాబు పట్ల అపనమ్మకం పెరిగిందే కానీ., తగ్గలేదు. జన్మభూమి కార్యక్షికమం పేరుతో పార్టీ కార్యకర్తల జేబులు నింపే కార్యక్షికమాన్ని చేపట్టి ప్రజల్లో మరింత వ్యతిరేకతను మూట గట్టుకున్నాడు.

విద్యుత్‌చార్జీలు పెంచి.. ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో ప్రజావ్యతిరేక సంస్కరణలకు శ్రీకా రం చుట్టడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలన్నందుకు కాల్చిచంపి తాను ఎవరి ప్రయోజనాలకోసం ఉన్నాడో చూపెట్టుకున్నాడు. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి మహిళంటే ఉన్న గౌరవాన్ని చాటుకున్నా డు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ పాదయాత్ర చేస్తూ మీకోసం వస్తున్నానంటే..అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. దీపం పథకం, మైనార్టీల రోష్నీ పథకాలను అటకెక్కించి వారి జీవితాల్లో చీకట్లు నింపిన చంద్రబాబును మహిళలు నమ్ముతారా? మరోవైపు విజన్ 2020 పేరుతో రాష్ట్రాన్ని స్వర్ణాంవూధవూపదేశ్‌గా మారుస్తానని బాకాలూదుకున్నాడు. దీనికోసం బహుళజాతి కంపెనీలు, ప్రపంచ బ్యాంకునుంచి కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు, అప్పులు తెచ్చి హైటెక్కు అభివృద్ధి అంటూ ఫ్లైఓవర్‌లూ,

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటూ..సేవారంగాలను పెంచీ గారడీ చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి దోపిడీదారులకు లాభాల పంట పండించాడు. ప్రజలు తమ దైనందిన సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రదర్శన చేసినా, ధర్నాలు చేసినా పోలీసు బలగాలతో హింసను ప్రయోగించాడు. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న ఉద్యమకారులను తన హయంలోనే 600 పైచిలుకు మందిని బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపించాడు. చివరికి ప్రజల హక్కులకోసం మాట్లాడే పౌరహక్కుల సంఘం కార్యకర్తలను సైతం పోలీసులతో, ప్రైవేటు గుండాలతో దాడులు, హత్యలు చేయించాడు. కులరహిత సమాజం కావాలని అడిగినందుకు, మహిళల హక్కుల కోసం పోరాడినందుకు మహిళని కూడా చూడకుండా కాల్చిచంపిన చరిత్ర చంద్రబాబుది. ఆదివాసుల జీవితాలకు ఉరిని బిగించే 1/70 చట్టాన్ని రద్దుచేయడానికి ప్రయత్నించాడు. దీన్ని తుంగలో తొక్కి ఆదివాసుల భూములను అక్రమంగా కాజేస్తున్న మైదాన ప్రాంత దోపిడీదారులకు అండగా నిలిచి గిరిజనులపై హింసను ప్రయోగించాడు.

చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కరువు, అనావృష్టి , నిత్యం తుపాకుల మోత, ఇనుపబూట్ల చప్పుళ్లతో తెలంగాణ ఊర్లన్నీ వల్లకాడు అయ్యా యి. నిప్పుల చెరిగే నిర్బంధకాండ అమలు చేసి గ్రామీణ యువతను కన్న ఊరికీ కాకుండా చేశాడు. మంగళ సూత్రం తెగిన మహిళలు, కడుపుకోత మిగిలిన తల్లు లు, చెట్టంత కొడుకును పోగొట్టుకున్న తండ్రులు చంద్రబాబు పాలనను ఇప్పుడిప్పుడే మరిచిపోయే పరిస్థితి ఏమీలేదు. రాష్ట్ర ప్రజానీకమంతా బాబు పాలననొక పీడకలగా భావిస్తున్నారు. అదొక గ్రహణ కాలంగా ఈసడించుకుంటున్నారు.

ఈ పరిస్థితిలో.. రాబోయే 2014 ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలు పరిష్కరిస్తారన్న భ్రమలు ఎవరికీ లేవు. ప్రజలు కూడా అలా భావించడంలేదు. ఈ దోపిడీదారుల కొట్లాటలో ఎవరు గెలిచినా.. ప్రజల జీవించే హక్కును, కనీస అవసరాలు తీర్చే దిశగా కనీస అడుగులు ఎవరు వేస్తారో నిలదీసి అడగా లి. ప్రజాస్వామిక హక్కులు కాపాడుకోవడం కోసం పోరాడే ఎజెండా మిగిలే ఉంటుంది. ఎందుకంటే.. ఈ పాలకులు ప్రజల ప్రతినిధులు కారు. బహుళజాతి కంపెనీలు, ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు. దోపిడీదారుల ప్రయోజనాలకోసమే వారు ఉన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేయకతప్పని పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది.

పొఫెసర్ గడ్డం లక్ష్మణ్
ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం

35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష