కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?


Sat,October 6, 2012 05:32 PM

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొదటిసారిగా గుర్తించారు. 18వ శతాబ్ద ఆరంభంలోనే ఇంగ్లండ్‌లో బొగ్గు తవ్వకం పనులు ప్రారంభించిన అనుభవాలతో.. మన దేశంలో బొగ్గు వెలికితీత ప్రక్రియను తొలిసారిగా 4మే 1774లో అవిభక్త బెంగాల్ రాష్ట్రంలోని రాణీగంజ్ ప్రాంతంలో ప్రారంభించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువ భాగం నదీతీర ప్రాంతాల్లో ఉన్నాయి. బెంగాల్లో ప్రవహించే దామోదరనది పశ్చిమ భాగంలో భారీ సంఖ్యలో బొగ్గు గనులు ప్రారంభించారు. బొగ్గు వెలికితీత ప్రక్రియకు సాంప్రదాయ పద్ధతులను పాటించారు. పికాస్, తట్టా, చెమ్మాస్ విధానంతో బొగ్గును తవ్వి, గుర్రపు బగ్గీల ద్వారా రవాణా చేశారు. బ్రిటీష్ పాలకులు వారి కనుసన్నల్లోని కాం ట్రాక్టర్లతో భూగర్భ గనుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు పిల్లల ను వినియోగించేవారు. జీవితానికి గ్యారెంటీలేని ప్రమాదకరమైన బొగ్గుఉత్పత్తి పనుల్లో పనిచేసే కార్మికుల్లో 60శాతానికి పైగా షెడ్యూల్డు కులాలకు, 10 శాతానికి పైగా షెడ్యూల్డు తెగలకు చెందిన వారు ఉండేవారు. ముస్లింలు, బీసీ కులాల వాళ్లు కూడా భాగస్వాములయ్యేవా రు. బొగ్గు గని పనుల్లో ప్రమాదాలు సంభవించి వేల సంఖ్యలో కార్మికులు మరణిస్తు న్నా, రక్షణ సూత్రాలు మచ్చుకైనా ఉండేవి కావు.

పొట్టగడవడమే కష్టమైన పేద వర్గాలు కుటుంబ సమేతంగా బొగ్గు బావుల్లో పనిచేసేందుకు వెళ్లేవారు.
ఏడాదికి మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే ఆ రోజుల్లో ఉత్పత్తి చేసేవారు. అయితే వ్యాపార అభివృద్ధికి, వనరుల తరలింపుకు, త్వరితగతిన రాజ్య విస్తరణకు రైల్వేలైన్ల నిర్మాణం అవసరమని ఈస్టిండియా కంపెనీ భావించింది. 1853లో స్టీమ్ ఇంజన్ల రూపకల్పనతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. 1900 సంవత్సరంలో 6.12 మిలియన్ టన్నులు, 1920లో 18 మిలియన్ టన్నులు, 1942 లో 29 మిలియన్ టన్నులు ఉన్న బొగ్గు ఉత్పత్తి 1946వ సంవత్సరంలో 30 మిలియన్ టన్నులకు చేరింది. దేశ స్వాతంవూత్యానంతరం అభివృద్ధికి ఏర్పర్చుకున్న పంచవర్ష ప్రణాళికలతో బొగు ్గఉత్పత్తిని గణనీయంగా పెంచారు. ప్రమాదకరమైన బొగ్గుగని పనుల్లోకి వచ్చేందుకు ప్రజలు భయపడేవారు. తెల్లదొరలు, కాంట్రాక్టర్లు తమ లాభం కోసం గూండాలను ఉపయోగించి బొగ్గు తవ్వకం కోసం ప్రజలను బలవంతంగా తరలించేవారు. మరోవైపు గ్రామాల్లో ఏర్పడిన కరువు, భూస్వాముల ఆగడాలతో గత్యంతరం లేక ప్రజలు ప్రాణాలకు తెగించి గనుల పనుల్లోకి వెళ్లేవారు. భూగర్భంలో పనులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా తిరిగి వస్తారో, రారో అనే అపనమ్మకంతో మహిళలు మెళ్లోని పుస్తెలను దేవుడి పటం ముందుచేవాళ్లు. భర్త గని నుంచి తిరిగొచ్చాకే వాటిని మెళ్లో మేసుకునే వారు.

బండ రాళ్లు కొట్టే వృత్తి కులాలవారు భూగర్భంలో కోల్ కటింగ్ పను లు చేసేవారు. కార్మికులకు సహాయంగా స్త్రీలు, పిల్లలు సైతం పనుల్లోకి పోయేవారు. 1956లో కోల్‌మైన్స్ చట్టం ఏర్పడిన తర్వాత భూగర్భంలో మహిళలు, పిల్లలతో పనులు చేయించడం నిషేధించారు. దేశ పారిక్షిశామి క వృద్ధికి బొగ్గు కీలక ఇంధనంగా మారింది. దేశ విద్యుత్ అవసరాలను తీర్చడానికి బొగ్గును ప్రధాన ఇంధనంగా నేటికీ వాడుతున్నారు. దేశంలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిలో 70శాతానికి పైగా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతుండగా.., స్టీల్, సిమెంట్ తయారీకి ఎక్కువగా వాడుతున్నారు . బొగ్గు రంగంలోనూ కార్పోరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు రంగవూపవేశం చేయడంతో యాంత్రీకరణ గణనీయంగా పెరిగింది. మానవ వనరుల వినియోగం తగ్గింది. పర్యావరణానికి పెను ముప్పు తీసుకువచ్చే ఓపెన్ కాస్ట్ గనులతో కోల్‌బెల్టు ప్రాంతాలను బొందల గడ్డలుగా మారుతున్నా యి. ఓపెన్ కాస్టులతో జీవన విధ్వంసమే జరుగుతున్నది.


1947 ప్రాంతంలో కేవలం 33 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తిని సాధించే దశ నుంచి, నేడు 450 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తిని సాధిస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్ మేరకు బొగ్గును సరఫరా చేయలేక విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. దేశాభివృద్ధికి తమ రక్తాన్ని చెమటగా మార్చి అనేక ప్రాణత్యాగాలతో బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నరు. వ్యాపార దృక్పథంతో ఫాదర్స్ డే, మదర్స్ డే, వాలంటైన్స్ డే’లు జరిపే పాలకులు.. త్యాగాల పునాదుల మీద నిలబడ్డా కోల్ మైనర్స్ డే జరపకపోవడం శోచనీయం. దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులకు సరైన వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉంచడం లేదు. దశాబ్దాలుగా గని పనుల్లో నిమగ్నమైన కార్మిక కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం నిలువ నీడలేకుండా ఉంటున్నా రు. మరోవైపు బొగ్గు ఉత్పత్తి వేగం గా జరిపేందుకు విదేశాల నుంచి భారీ యంత్రాలను భూగర్భంలోకి దింపుతున్నరు. ప్రధానంగా షటిల్ కార్లు, రోడ్ హెడర్లు, లాంగ్‌వాల్ మైనింగ్, ఎల్‌హెచ్‌డీ, ఎస్‌డీఎల్, బీజీ టెక్నాలజీ, కంటిన్యూయెస్ మైనర్ లాంటి యంత్రాలను గనుల్లోకి తెచ్చారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో డంపర్, షవల్, డ్రాగ్‌లైన్, ఇన్‌పిట్ క్రషింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నరు.

కొండల కింద, నదుల అడుగు భాగాన, బొగ్గుగనుల తవ్వకం, సరిహద్దు ప్రాంతాల్లో బొగ్గు వెలికితీత అసాధ్యంగా భావించేవారు. కానీ నేడు హైవాల్ మైనింగ్ పేరుతో అక్కడ కూడా బొగ్గు వెలికి తీసే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నరు. ఓపెన్ కాస్ట్‌లతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, మైనింగ్ ప్రాంతాలు బొందల గడ్డలుగా మారుతాయని భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ప్రజలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిస్క్ సెక్టార్‌గా బొగ్గు పరిక్షిశమను గుర్తించి, గని కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మే 4ను ‘జాతీయ కోల్ మైనర్స్ డే’గా గుర్తించి వేతనంతో కూడిన సెలవు దినంగావూపకటించాలి. అప్పుడే నల్ల సూరీళ్లకు నిజమైన గుర్తింపు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

-కెంగర్ల మల్లయ్య
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు

35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles