హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు


Sat,October 6, 2012 04:20 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వాస్తవంలో ఆ ఉపన్యాసాలు ఉత్తమాటలే అనడానికి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న అవస్థలు చూస్తే అర్థమవుతుంది. డిగ్రీ స్థాయిలో వివిధ రకాల కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలు ఏమూలకూ సరిపోవడంలేదు. దీంతో.. విద్యార్థులంతా అర్థాకలితో అలమటిస్తున్నారు. డిగ్రీ చదివే విద్యార్థికి పూటకు 5.70 రూపాయలు మాత్రమే మంజూరు చేస్తున్నది. వీటితో విద్యార్థులు ఇవాళ పెరిగిన ధరల తో ఏమైనా తినగలరా? ప్లేట్ ఇడీక్లి కూడా సరిపోని విధంగా మెస్‌చార్జీ లు మంజూరు చేయడం ఎలా సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆలోచించడంలేదు? అలాంటప్పుడు అరకొర మెస్ బిల్లులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పాలకులు వెనుకబడి న విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.

విద్యార్థులకు ఇచ్చే మెస్‌చార్జీలను ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంతో చూడాలి. నవ భారత నిర్మాతలుగా ఎదిగే విద్యార్థులకు పౌష్టికాహారం అటుంచి, కడుపునిండా తిండి కూడా పెట్టకపోతే వాళ్లు ఉన్న త విద్యావంతులుగా ఎలా ఎదుగుతారు? దేశం ఎలా ముందుకుపోతుంది? పాలకులు వెనుకబడిన పేద బడుగు వర్గాల పిల్లలకు అన్నం పెట్టినా, పెట్టకపోయినా నడుస్తుందనే అలసత్వం సరికాదు. ఇది సమాజ సమైక్యతను దెబ్బతీస్తుం ది. ఇది బడుగు వర్గాల, కులాల అణచివేతగాక మరేమిటి?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 627 బీసీ బాలికల హాస్టళ్లు, 552 ఎస్సీ, 269 ఎస్టీ హాస్టళ్లు నిర్వహించబడుతున్నాయి. ఒక్కో హాస్టల్‌లో వందమంది విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు. ప్రభు త్వం ఇస్తున్న చాలీచాలని మెస్‌చార్జీల కారణంగా చాలా హాస్టళ్లలో మెస్‌ల ను మూసివేశారు. దీంతో.. హాస్టళ్లలో ఉండి చదువుతున్న విద్యార్థులు అన్నం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. కొంతమంది కాలేజీ సమయం అయి పోయాక పనులకుపోతున్నారు. కొందరు కేటరింగ్ పనులకుపోతున్నారు. మరికొందరైతే.. తమ రక్తాన్ని సైతం అమ్ముకుంటున్నారు. ఇంకా ధీనమైన పరిస్థితి ఏమంటే విద్యార్థులు అడ్డామీద కూలీలుగా మారుతున్నారు. దినకంతటికీ కారణం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్‌చార్జీలు మంజూరు చేయకపోవడమే. దీంతో విద్యార్థులు అర్థాకలితో చదువులు కొనసాగించలేక ఇంటిదారి పడుతున్నారు. ఈ పరిస్థితులను ఆసరా చేసుకుని ప్రభుత్వం హాస్టళ్లను మూసివేయాలనే కుట్రలు చేస్తూ.. పొమ్మనలేక పొగపెడుతోంది.

కానీ ఇదే ప్రభుత్వం ఇతర శాఖల మెస్‌చార్జీలు పెద్ద ఎత్తున ఇస్తున్నది. ఉదాహరణకు జైళ్లలోని ఖైదీలకు భోజనానికి గాను నెలకు 1300 రూపాయలు ఇస్తోంది. ఈ డబ్బులు సరిపోవడం లేదని వీటిని 100లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ హాస్పిటళ్లలోని రోగులకు నెలకు 1500 రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ట్రిపుల్ ఐటీలలో చదివే విద్యార్థుల భోజనానికి 2100 మంజూరు చేస్తున్నది. అలాగే జూనియర్ డాక్టర్లకు మెస్‌బిల్లు కింద నెలకు మూడువేల రూపాయలు కేటాయిస్తున్నది. నవోదయ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నెలకు 990 రూపా యలు కేటాయిస్తున్నారు. కానీ.. అదే డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం నెలకు 520 రూపాయలు కేటాయిస్తున్నది. ఇంత వివక్ష ఎందుకో ఏలికలే చెప్పాలె.
వివిధ డిగ్రీ స్థాయి చదువులు చదువుతున్న విద్యార్థులు ఎదిగే దశలో ఉంటారు. ఈ వయస్సులోనే విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. ఈ దశలోనే విద్యార్థులకు సరైన ఆహారం అందివ్వకపోతే.. వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఎలా ఉంటుంది? ప్రభుత్వ పెద్దలకు ఈ విషయాలు తెలియవనుకోవాలా? తెలిసి కూడా ఇలా వ్యవహరిస్తున్నా రంటే పేదల పట్ల పాలకులకున్న ప్రేమను శంకించాల్సి వస్తోంది.

ప్రభుత్వం ఇస్తున్న మెస్ బిల్లులతో హాస్టళ్లు నడపలేక కొందరు వార్డెన్లు అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెట్టిన వారున్నారు. వాటిని కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో దాదాపు 65 మంది హాస్టల్ వార్డెన్లు అప్పుల పాలై ఉద్యోగాలే వదిలిపెట్టారు. ఈ దుస్థితిపై విద్యార్థులు, బీసీ సంక్షేమ సంఘం ఎన్నో పోరాటాలు చేసింది. విద్యార్థుల మెస్ చార్జీల ను పెంచాలని డిమాండ్ చేసింది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంత్రి కాగానే మెస్‌చార్జీలు పెంచాలని విద్యార్థిలోకం కలిసి విన్నవించింది. దీనిపై ప్రతిపాదనలు పంపాలని కిరణ్ సంక్షేమ శాఖ అధికారులను కోరారు. అలాగే సంక్షే మ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శులకు మెస్ చార్జీలను సంవత్సరానికొకసారి పెంచడానికి ‘సమీక్షా కమిటీ’వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాలేజీ హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను గ్రీన్ చానల్‌లో పెట్టి నెల నెలా చెల్లించాలన్నారు. అయినా మన ఐఏఎస్ అధికారులు ముఖ్య మంత్రి ఆదేశాలను కూడా చెత్త బుట్టలో పారేశారు. సమీక్షా కమిటీ వేయలే దు. మెస్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన చేయలేదు.మొత్తంగా పేద, దళిత బడుగు వర్గాల విద్యార్థుల ఆకలి కేకలకు అటు పాలకు లు, ఇటు ఉన్నతాధికారులు కారణమవుతున్నారు. విద్యార్థుల గోస పుచ్చుకుంటున్నారు.

రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల పిల్లల చదువులు కొనసాగాలంటే.. పెరిగిన ధరల కనుగుణంగా మెస్ చార్జీలను అందించాలి. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే మార్కెట్ ధరలను సమీక్షించి వాటికి అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్థులు కూడా చదువులపై శ్రద్ధ వహించగలుగుతారు. ఇప్పుడున్న మెస్ చార్జీలు 520 నుంచి 1500రూపాయలకు పెంచాలి. కాలేజీ హాస్టల్ విద్యార్థులకు సంవత్సరానికొకసారి విద్యాసంవత్సరం చివరలో కాకుండా నెల నెలా మెస్ చార్జీలు చెల్లించాలి. అలాగే విద్యార్థుల మెస్ చార్జీలు, హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌ను గ్రీన్ చానల్‌లో పెట్టాలి. కాలేజీ విద్యార్థులలో అమ్మాయిలకు కాస్మొటిక్ చార్జీలకు నెలకు రెండు వంద లు, అబ్బాయిలకు వంద రూపాయలు చెల్లించాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలి. ఇది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యగా కాకుండా.. దేశ భవిష్యత్తు సమస్యగా zూడాలి.
-ఆర్.కృష్ణయ్య
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు
(రేపు జ్యోతిబా ఫూలే జయంతి)

35

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప

Featured Articles