ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు


Fri,October 12, 2012 02:27 PM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు చేసి జీవో 7 జారీ చేసింది. దీనివల్ల ఆరు లక్షల మంది బి.ఎడ్. అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతు న్నారు . ఈ డీఎస్సీలో బి.ఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీలో అవకాశం లేదని కొత్త నిబంధన విధించింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ 70 శాతం ప్రమోషన్ల ద్వారా ఎస్జీటీలకే కట్టబెడుతున్నారు. నలభై వేల మందిలేని డి.ఎడ్ అభ్యర్థులకు 11,000 పైచిలుకు ఎస్జీటీ పోస్టులు కేటాయించి, బి.ఎడ్ అభ్యర్థులకు మాత్రం అందులో అవకాశం కల్పించకపోవడం దారుణం. నిబంధనల పేరుతో ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్నది. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు విద్యావేత్తల, మేధావులతో చర్చలు కూడా జరపకుండా ప్రభుత్వం ఒంటెద్దుపోకడలకుపోతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానాలతో విద్యాశాఖ రోజుకో జీవో జారీచేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. బి.ఎడ్. చేస్తే ఉద్యోగం గ్యారెంటీ అనే ఆశతో అప్పో సప్పో చేసి శిక్షణ పూర్తి చేసిన ఆరులక్షల మంది అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదనడం సరికాదు. ఏ ఉద్యోగానికైనా ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ సెకండరీ టీచర్ పోస్టుకు మాత్రం ఉన్నత విద్య అనర్హతగా మారడం శోచనీయం. ‘చైల్డ్ సైకాలజీ’ పేరు తో ఉన్నత విద్యావంతులను ఈ పోస్టుకు దూరం చేయడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. డి.ఎడ్ విద్యార్థులకు వారు చదివే కోర్సులో చైల్డ్ సైకాలజీ ఎక్కువ భాగం ఉంది. అందువల్ల వారికే ఈ పోస్టులంటున్నారు. చైల్డ్ సైకాలజీ చాలా చిన్న అంశం. బి.ఎడ్ అభ్యర్థులకు చైల్డ్ సైకాలజీ ఉంది. అవసరమైతే సిలబస్8 పెంచవచ్చు. ఇంకా సరిపోకపోతే డిఎస్సీలో సెలక్టయిన తర్వాత స్పెషల్ క్లాసులు ఆరు నెలల అంతర్గత శిక్షణ ఇవ్వవచ్చు. కానీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా మొదటికే అర్హులు కాదంటూ మోసం చేయడం సరైన పద్ధతి కాదు.

అంతెందుకు డి.ఎడ్ విద్యార్థులకు చైల్డ్ సైకాలజీ పాఠాలు ఎవరు చెబుతున్నారు? బి.ఎడ్. ఎం.ఇ.డి. చేసిన వారు చెబుతున్నారు. బి.ఎడ్. ఎం.ఇ.డి చేసిన వారు లెక్చరర్లుగా పనికి వస్తా రు కానీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి పనికిరారా? కేంద్ర ప్రభుత్వం ఎన్.సి.టి.ఇ లేదా ఎన్ సి.ఇ.ఆర్.టి విద్యా పరిశోధన మండలి శాస్త్రీయ, గుణాత్మకమైన, సృజనాత్మకమైన ప్రాథమిక విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ విధానం పెడితే బాగుంటుందని సూచించవచ్చు. ఇదొక ప్రతిపాదిత నిర్ణయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుడ్డిగా ఎలా అమలు చేస్తుంది? అవసరాలకు తగ్గుట్టు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. కానీ లక్షలాది మందిని అనర్హులను చేయడం తగదు.

ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల చదువుకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో చదివితేనే మంచి విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. . ప్రైవేట్ పాఠశాలలో చదువు చెబుతున్న ఉపాధ్యాయులలో 50 శాతం మందికి బి.ఎడ్. డి.ఎడ్ అర్హతలు కూడా లేవు. మరి ఈ టీచర్లకు ‘చైల్డ్ సైకాలజీ’ లేదంట మా? విద్యా ప్రమాణాలు లేకపోతే ప్రజలు ఎందుకు ఆసక్తి చూపుతారు? ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే రెగ్యులర్‌గా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, తనిఖీలుచేసి,మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా విధాన నిర్ణయాలు తీసుకుంటే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి. ‘దేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందని కొఠారీ కమిషన్ పేర్కొంది’. ఆ తరగతి గదే నేడు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నది.

ఎస్జీటీ పోస్టులు మొత్తం డిఎడ్ శిక్షణ పూర్తిచేసిన వారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని జీవో 7ను జారీ చేసింది. ఇలా రెండు పద్ధతుల ద్వారా మొత్తం పోస్టుల్లో 90 శాతం పోస్టులు డి.ఎడ్. వారికే పోతాయి. కేవలం 10 శాతం పోస్టులు బి.ఎడ్ అభ్యర్థులకు కేటాయించడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు. ఇదేదో బి.ఎడ్. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడవలసిన అంశం కాదు. ఉన్న త కోర్సులు చదివిన వారి శక్తియుక్తులను జాతి ఉద్ధరణ కోసం ఉపయోగిస్తున్నామనే కోణంలో చూడాలి.
ఎన్.సి.టి.ఇ. 2001 మార్గదర్శకాలకు అనుగుణంగా 2004 సంవత్సరం నాటికి డి.ఎడ్. కళశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా బి.ఎడ్. కాలేజీలకు అనుమతి ఇచ్చింది. దీంతో 2004 నాటికి 350 బి.ఎడ్. కళాశాలలు, 23 డి.ఎడ్.కళాశాలలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం బి.ఎడ్. కళాశాలలను ప్రోత్సహించింది. తర్వాత వైఎస్8 ప్రభుత్వం మరో 300 బి.ఎడ్ కళాశాలలకు అనుమతి ఇచ్చింది.

దీంతో బి.ఎడ్. కళాశాలల సంఖ్య 650కి చేరింది. 2007 నవంబర్‌లో 200ప్రైవేట్ డి.ఎడ్. కళశాలలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2001 రాష్ట్ర ప్రభుత్వం బి.ఎడ్. అభ్యర్థులను ఎస్జీటీకి అనర్హులుగా ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ ఈ విషయాన్ని చెప్పలేదు. 2001లోనే ఎన్.సి.టి.ఇ. మార్గదర్శకాలను పాటించి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు నేడు లక్షలాది మంది బి.ఎడ్. అభ్యర్థులకు శాపంగా మారింది. కనుక ప్రభుత్వం తాను చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలి. లక్షలాది మంది అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుని వారికి న్యాయం చేయాలి.

-ఆర్. కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

35

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప

Featured Articles