ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు


Sat,October 6, 2012 04:21 PM

e-exam talangana patrika telangana culture telangana politics telangana cinemaరాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సాహసమే! కానీ వాస్తవంగా వివిధ ప్రభుత్వశాఖలలో 4 లక్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. ఇవన్నీ రిటైర్‌మెంటు వల్ల ఏర్పడ్డ ఖాళీలు, మొత్తం ఖాళీలు భర్తీచేయకుండా కొన్ని ఖాళీలు భర్తీ చేస్తే లక్ష్యం ఏలా నెరవేరుతుంది. ఏళ్ళ తరబడి ప్రభుత్వం వివిధ శాఖలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవ డంతో ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడింది.
ఇంత వరకు ప్రకటించిన వాటిలో కేవలం 20 శాఖల పోస్టులు ప్రకటించారు. అవికూడా పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. ఇంకో 30 శాఖల పోస్టులు ప్రకటించాలి. ము ఖ్యంగా జిల్లా స్థాయి క్లారికల్ పోస్టు లు భర్తీచేయాలి.

అధికారులు డైరెక్టు రిక్రూట్‌మెంటు కోటా పోస్టులను తక్కువ చూపిస్తున్నారు.ఎందుకంటే 2000 సంవ త్సరంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 14 లక్షల 82 వేలు ఉండేవి. ప్రస్తుతం 10 లక్ష ల 40 వేలు మాత్రమే ఉన్నారు. అంటే 4 లక్షల 42 వేల ఉద్యోగాలు రిటైర్‌మెంట్ వల్ల ఏర్పడ్డట్లు స్పష్టంగా కన్పిస్తున్నది. పైగా ఈ మధ్యకాలంలో బడ్జెట్ పెరిగింది. అభివృద్ధి కార్యక్షికమాలు విస్తరించాయి. దీనికి తగినట్లు ఉద్యోగాల సంఖ్య పెంచాలి. కానీ పెంచడం లేదు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 10 లక్షల 40 వేలు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపు తున్నాయి. మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో 18 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. అలాగే మన కంటే చిన్న రాష్ట్రమైన కర్ణాటకలో14 లక్షలకు పైగా ఉద్యోగస్థులు పనిచేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగస్థుల సంఖ్య మనకంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 1994 నుంచి ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు తలొగ్గి ఏటా 4 శాతం ఉద్యోగాలు తగ్గించుకుంటూ వస్తున్నది. దీని మూలంగా భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గాయి. రిటైర్‌మెంటు వల్ల ఏర్పడే ఉద్యోగాలు తగ్గించకపోగా ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తున్నారుయగూప్-1 కేటగిరి పోస్టుల లెక్కింపులో డైరెక్టు రిక్రూట్ మెంట్ అభ్యర్థులకు మొదటి నుంచి అన్యాయం జరుగు తూనే ఉంది. వాస్తవంగా 2 వేల వరకు పోస్టులు రావలసి ఉంది. వీటిని కచ్ఛితంగా లెక్కించడం లేదు.

ఇటీవల పబ్లిక్ సర్వీసు కమిషన్ వారు దాదాపు 306 పోస్టులు ఉన్నట్లు ప్రకటించారు. పైగా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు వాస్తవంగా80 వరకు వస్తాయి. కానీ కేవలం 6 మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇది చాలా అన్యాయం. ఇక గ్రూప్-2 పోస్టుల పూర్తి వివరాలు ప్రకటించలేదు. వాస్తవంగా వేలకొద్ది గ్రూప్-2 సర్వీస్8 కిందకు వచ్చే పోస్టులు ఉన్నాయి. సర్వీసు కమిషన్ వారు 600 పోస్టులు ఉండవచ్చునని చూచాయగా ప్రకటించారు. ఇక గ్రూప్-4 పోస్టుల విషయంలో జిల్లా కార్యాలయాలు, మండల డివిజ న్ కార్యాలయాలకు సంబంధించిన క్లారికల్ స్థాయి పోస్టు లను 25 సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. క్లారికల్ పోస్టులు 80 వేల వరకు భర్తీ చేయవలసి ఉంది. కానీ ప్రభుత్వం కేవలం సచివాలయం డైరెక్టరేట్లలో ఉన్న 2 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా ఇరిగేషన్, పంచాయత్‌రాజ్, రోడ్లు, భవనాలు తదితర శాఖలలో 6 వేలకు పైగా ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. కానీ ప్రభుత్వం కేవలం 2 వేల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. రెవిన్యూ శాఖలలో అన్ని కేటగిరిలో 18 వేలు ఖాళీ ఉండగా గత 25 ఏళ్లుగా భర్తీచేయలేదు. కానీ ప్రస్తుతం వీఆర్‌వో-వీఆర్‌ఓ పోస్టులు కేవలం 7235 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఉద్యోగ ఖాళీ భర్తీ ప్రస్తావన లేదు. హోంశాఖలో కానిస్టేబుళ్ళు, జైల్‌వార్డర్లు, ఫైర్‌మెన్స్ కలిసి 35 వేలు, సబ్ ఇన్స్‌పెక్టర్స్ 3వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ హోంశాఖ దాని అనుబంధ శాఖలలో 38 వేల పోస్టులు ఉంటే 22 వేల కానిస్టేబుళ్లు, 2200 ఎస్8ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.మిగతా పోస్టుల విషయం ప్రస్తావించడం లేదు.

టాన్స్‌కో,జెన్‌కోలలో4 డిస్కం కంపెనీలలో కలిసి 36 వేల ఖాళీలు ఏళ్ళతరబడి ఉన్నాయి. కానీ విద్యుత్ శాఖ వారు 12 వేల ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖలో 67 వేల టీచర్ పోస్టులతోపాటు 8 వేల నాన్- టీచింగ్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. అలాగే ఎయిడెడ్ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ కలిసి 5 వేలకు పైగా ఖాళీలు ఉన్నవి. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలో భారీ ఖాళీలు ఉన్నవి. విద్యా హక్కుచట్టం కింద 35వేల పోస్టులు మంజూర య్యాయి. వాటిని భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణా లు అడుగంటి పోతున్నాయి. ప్రభు త్వం మాత్రం కేవలం 26, 379 పోస్టులు భర్తీచేసి చేతులు దులుపు కోవాలని చూస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల పోస్టులు, ఇతర పంచాయతీ రాజ్ సంస్థల్లో అన్ని కేటగిరిల్లో కలిసి 14 వేల పోస్టు లు భర్తీ చేయవలసి ఉండగా 3100 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్‌మెంట్‌లో కలిసి 16 వేల పోస్టులు ఉండగా 4200 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ జూనియర్ లెక్చకర్లు 9 వేలు, డిగ్రీ లెక్చరర్లు 2 వేలు,నాన్- టీచింగ్ పోస్టులు 4 వేలు భర్తీ చేయకుండా విద్యావూపమాణాలను దెబ్బతీస్తున్నారు.

రాష్ట్రంలో ఉన్న 24 యూనివర్శిటీల్లో 2294 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 3200 నాన్ టీచింగ్ పోస్టులు15 ఏళ్ల నుంచి భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయి. ఎయిడెడ్ కాలేజీలలో టీచింగ్-నాన్ టీచింగ్ కలిసి 2 వేలు, డైట్ కాలేజీలో600 పోస్టులు, 23 జిల్లాల్లోని గ్రంథాలయాలల్లో 800 పోస్టులు, సాంకేతిక విద్యాశాఖ కార్మిక ఉపాధిశాఖలలో టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి 3600 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వం 4 వేల జూనియర్ లెక్చరర్ పోస్టులు 1100 డిగ్రీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తామని చెబుతున్నది. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ వికలాంగుల శాఖలో 8400, సాంఘిక సంక్షేమ టీచింగ్- నాన్ టీచింగ్ కలిపి 3200 పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మొక్కుబడిగా 1600 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నది. నీటిపారుదల శాఖలో ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాలు కలిసి 6400 పోస్టులు ఖాళీగా ఉన్నవి. టెక్నికల్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రాజెక్టులు, చెరువులు, కాలువల నాణ్యత దెబ్బతింటోంది. 2 వేల వరకు ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ నాన్ టెక్నికల్ పారామెడికల్ కలిసి 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

10,306 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ళ అన్ని కేటగిరిలు కలిపి 15 వేల ఖాళీలు ఉన్నట్లు ఆయా శాఖలు చెప్పుతుండగా 2 వేల పోస్టులు మాత్రమే ప్రకటించింది. మిగతా వాటి ప్రస్తావన లేదు.

వాణిజ్య శాఖలో4200, సహకార ఆప్కో, అప్కాబ్, హౌసింగ్ అనుబంధ సంస్థల్లో 11,500, పశు సంవర్ధక శాఖ లో 2200, స్త్రీ శిశు సంక్షేమ అనుబంధ సంస్థల్లో 15, 600, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ మత్స్యశాఖలో గెజిటెడ్-నాన్ గెజిటెడ్ కలిపి 13,500 పోస్టు లు ఏళ ్లతరబడి భర్తీ చేయకుండా ఉన్నా ప్రభుత్వం వాటి ప్రస్తావనే తేవడం లేదు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖలో 3200, సెక్ర వివిధ డైరెక్టరేట్ క మిషనర్ కార్యాలయాల్లో కలిసి 4 వేల కు పైగా క్లారికల్ తదితర పోస్టులు, ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు మెకానిక్ క్లారికల్ పో స్టుల్లో 32 వేల ఖాళీలు భర్తీ కాకుండా ఉ న్నాయి. దేవాదాయ, ధర్మాదాయ టూరి జం శాఖలో 1600 వేల పోస్టులు, ట్రెజరీ, ఆడిటింగ్ శాఖలో 42 పోస్టులు, 35 ప్రభుత్వ రంగ సంస్థలో అన్ని కార్పొరేషన్లలో కలిసి 40 వేల పోస్టులు, అటవీశాఖ, చేనేత, జౌళిశాఖ, కార్మిక ,గనుల శాఖలో దాదాపు 9వేల పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. కానీ ప్రభుత్వం వీటి ఊసెత్తడం లేదు.

ప్రభుత్వ శాఖలలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉండడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి- సంక్షేమ కార్యక్షికమాలు దెబ్బతింటున్నాయి. ఉన్నత విద్యావంతులు యువకులు ఉద్యోగాలు, ఉపాధి లేక తమ శక్తి సామర్థ్యాలు వృధా చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా ఉండాలంటే ఉన్నత విద్యావంతులను భాగస్వాములను చేయాలి. దీని వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్షికమాలు వేగవంతం అవుతాయి.

-ఆర్. కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

36

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప

Featured Articles