క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!


Sat,October 6, 2012 04:21 PM

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం లలో క్రీమిలేయర్ పెట్టాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఎవరూ అడగకుండానే ‘క్రీమిలేయర్’ పెట్టాలనే కొరివితో తలగోక్కునే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎందుకు పెట్టాలనుకుంటున్నారో అంతుపట్టడంలేదు. క్రీమిలేయర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో, అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నియామకాల లో మన రాష్ట్రం మినహా దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో బీసీ ఉద్య మం బలంగా ఉండడంతో ప్రభుత్వం భయపడి గత 18 ఏళ్లుగా దీన్ని అమలు చేయలేదు. ప్రస్తుతం పెట్టాలని చూస్తున్నారు. క్రీమిలేయర్ అంటే బీసీలు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు పొందడానికి సంవత్సరాదాయం నాలుగు లక్షల గరిష్ఠ పరిమితికి లోబడి ఉండా లి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే అనర్హులు.

క్రీమిలేయర్ నిబంధన ఒక బీసీ వర్గానికే ఎందుకు విధించాలి. రిజర్వేషన్లు తొమ్మిది వర్గాలు పొందుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు ఇతర వర్గాలకు లేని క్రీమిలేయర్ బీసీలకెందుకు? ఓపెన్ కాంపిటీషన్ వర్గాలకు కూడా క్రీమిలేయర్ పెడితే అగ్రకులాలలోని పేదవారికి ఉద్యోగాలు దక్కుతాయి కదా? ఎస్సీ, ఎస్టీ, మహిళా కోటాలకు క్రీమిలేయర్ పెట్టకుండా బీసీలకు పెడితే ఏమైనా న్యాయం ఉందా? సహజంగానే బీసీలు దీనిని వ్యతిరేకిస్తారు. ఓపెన్ కాంపిటీషన్ ఉద్యోగాల భర్తీలో సాధారణంగా అగ్రకులాల వారికే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందులో కూడా క్రీమిలేయర్ పెడితే అగ్రకులాలలోని పేదవారికి దక్కుతాయి కదా? ఇటీవల సమాజంలో వచ్చిన పరిణామాలలో బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా చిక్కిపోయారు. రెడ్లు, కాపులు, వెలుమలు కూడా చాలామంది లేబర్ పనికిపోయే వారున్నారు. ఇక్కడ క్రీమిలేయర్ పెడితే ఇందులో ఉన్న పేదవారికి ఉద్యోగాలు వస్తాయి. క్రీమిలేయర్ పెడితే మొదట ఇక్కడ నుంచి ప్రారంభించాలి. అప్పుడు మిగతా వారికి పెడితే అభ్యంతరాలు ఉండవు.
క్రీమిలేయర్ బీసీ రిజర్వేషన్లకు పెట్టడం సమంజసమా? రాజ్యాంగబద్ధమేనా? ఇది బీసీ వర్గాలకు ఉపయోగపడుతుందా? సీట్లు ఉద్యోగాలు భర్తీ అవుతాయా?అనే కోణాల్లో పరిశీలించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, వర్గాలకు, కులాలకు ముఖ్యంగా పీడిత వర్గాలకు, కొన్ని శతాబ్దాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు అనివార్యం.

రాజ్యాంగబద్ధంగా వీరి అభివృద్ధికి చర్య లు తీసుకోవాలి. ఈ ప్రక్రియలో అనేక వాద, వివాదాలు రావడం సహజం. రాజ్యాంగంలో ని 340 ఆర్టికల్ ప్రకారం విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యంలేని కులాలను గుర్తించి సాంఘిక, విద్యా వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగంలోని 15(4), 16 (4) ఆర్టికల్స్‌లోనూ ఇదే అంశం స్పష్టంగా ఉంది. ఆర్థికాంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఎక్కడా లేదు.

రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది సామాజిక వివక్ష, సాంఘిక వెనుకబాటుతనం, విద్యారంగంలో వెనుకబాటుతనమే కానీ ఆర్థిక వెనుకబాటుతనం మాత్రం కాదు. ఈ విషయా న్ని రాజ్యాంగం ప్రకారం నియమించిన రెండు జాతీయ కమిషన్లు మండల్ కమిషన్, కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగ రచయితల దృక్పథంలో గానీ, సామాజిక శాస్త్రవేత్తల దృక్పథంలో గానీ కేవలం సామాజిక వివక్ష కారణంగానే రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. రిజర్వేషన్లపై అనేక సిద్ధాంతపరమైన చర్చలు జరిగాయి. సమాజాన్ని సమాజ నిర్మాణాన్ని లోతుగా అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు కూడా‘కులపరమైన’ విధానాన్ని ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని సూచించారు.

రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికనపై పెట్టాలనే విషయంపై హైకోర్టు- సుప్రీంకోర్టులలో ఇప్పటికీ కొన్ని వందలసార్లు చర్చలు జరిగాయి. వందలాది తీర్పులు వచ్చాయి. అయితే మండల్ కమిషన్ తీర్పు మినహా మిగతా తీర్పులన్నీ సామాజిక వెనుకబాటుతనం, విద్యారంగంలో వెనుకబాటుతనాన్నే ఆధారంగా తీసుకోవాలని తీర్పులు వచ్చాయి. క్రీమిలేయర్ లేదా ఆర్థిక పరిమితి ఆలోచన మండల్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టులో వాదన కు వచ్చినప్పుడు తెరమీదకు వచ్చిన కొత్త అంశం. మండల్ కమిషన్‌కు ముందు అనేక సుప్రీంకోర్టు తీర్పులు కూడా సామాజిక వెనుకబాటు తనమే ప్రాతిపదికగా కులాన్ని ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పారు. కులాన్ని - కుల వివక్షను, సాంఘిక అసమానతలను ఆర్థికకోణంలో చూడరాదు.

కొన్ని కులాలకు ముఖ్యంగా వడ్డెర, వాల్మీకి, చాకలి, మంగలి, వీరముష్టి, పాముల, బుడుబుక్కల, గంగిద్దుల వాండ్లు, మేదర, కుమ్మర, కురుమ తదితర 40 కులాల వారికి ఇప్పటికి సమాజంలో గౌరవం లేదు. ఈ కులాలను చిన్న చూపు చూస్తారు. ఈ 64 ఏళ్ల తర్వాత కూడా ఈ కులాల నుంచి ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ కాలేదు. కనీసం గ్రూప్-1 ఆఫీసర్ కూడా లేరు. వృత్తి విద్యా కోర్సులు చదవలేదు. ఈ కులాల వారు ఈ మధ్యనే కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎదుగుతున్నారు, చదువుకుంటున్నా రు. క్రీమిలేయర్ పెడితే ఈ కులాల వారు ఎలా అధికారంలో వాటా పొందుతారు?
క్రీమిలేయర్ నిబంధన చూడటానికి చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ మౌలిక ఆశయాలకే విరుద్ధమైనది. ఇది బీసీల నాయకత్వాన్ని దెబ్బతీస్తుంది. పైగా ఆదాయ మొత్తాన్ని లెక్కించడానికి ఒక హేతుబద్ధమైన, శాస్త్రీయమైన విధానం లేదు. రెవెన్యూ అధికారులు ఆదాయ మొత్తాన్ని లెక్కించడంలో అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడే అవకాశాలు ఉంటాయి. ఇందులో రాగద్వేషాలు పనిచేస్తాయి. వ్యాపారస్తుల, వ్యవసాయదారుల నిక ర ఆదాయాన్ని లెక్కించేందుకు శాస్త్రీయమైన విధానం లేదు. దీనివల్ల నిజమైన పేదవారికి అన్యాయం జరుగుతుంది. చివరకు సంపన్నులు, డబ్బున్న వాళ్ళు తమ పలుకుబడి, డబ్బు ఉపయోగించి క్రీమిలేయర్ మినహాయింపు సర్టిఫికెట్లు పొందుతారనడంలో సందేహం లేదు. ఇబీసీ స్కాలర్‌షిప్‌లలో ఈ అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాజ్యాంగంలో నిర్బంధ విద్యను పొందుపరిచినట్లు ఈ పేదకులాలకు ఇంతవరకు చట్టసభలలో అడుగుపెట్టని కులాలకు నిర్బంధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధం గా రాజ్యాంగాన్ని సవరించాలి. బీసీ జాబితాలలోని 2900 కులాలు 2850 కులాల వారు ఇంతవరకు పార్లమెంటు గేటు దాటలేదు. ఈ పేద బీసీ కులాలకు ఒక గవర్నర్ పదవి, ఒక రాష్ట్రపతి పదవి ఇవ్వలేదు. ప్రధానమంత్రి-ముఖ్యమంత్రి పదవులు బీసీ కులాలలో పుట్టడమే అనర్హతగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు గేట్లు దాటని కులాల వేల సంఖ్యలో ఉన్నాయి. అంతేకాదు. చివరకు నామినే పదవులలో కూడా బీసీలకు ఒక చిన్న పోస్టు కూడా ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టులో ఇంతవరకు 670 మందికి పైగా జడ్జిలను నియమిస్తే ఇంతవరకు ఒక్క బీసీ కూడా అవకాశం రాలేదు. అక్కడ జరుగుతు న్న అన్యాయం గుర్తుకు రావడం లేదా? ఏనాటికైనా సమాజ సంపదలో, అధికారంలో పేదకులాలకు వాటా ఇవ్వక తప్పదు. ఇది ప్రజాస్వామ్యంలో వాటా కోసం జరిగే పోరాటమే తప్ప జాతి విద్వేష పోరాటం కాదు.

-ఆర్.కృష్ణయ్య
ఆంధ్రవూపదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

35

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప

Featured Articles