హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు


Sat,October 6, 2012 04:22 PM

-ఆర్ కృష్ణయ్య
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు


డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల పట్ల ప్రభుత్వం కపట ప్రేమను కనబరుస్తున్నది. ఎస్సీ, బీసీ, ఎస్టీ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం పెట్టే భోజనం ఖర్చు ఎంతో తెలుసా..? కేవలం 5 రూపాయల 70 పైసలు. ఇంత తక్కువ మొత్తంలో హోటల్‌లో టీ, కాఫీ కూడా రాదు. మరి విద్యార్థులకు భోజనం ఎలా పెడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? ‘మేము ఇచ్చేది ఇంతే. మీరు ఎలాగైనా తిని చావండి! మా పిల్లలు ఈ హాస్టళ్లలో లేరు కదా. ఉంటే సాధక బాధకాల గురించి ఆలోచించేది’ అంటున్నారు మంత్రులు, అధికారులు. విద్యార్థులకు కనీస పోషక పదార్థాలతో కూడిన భోజనం పెట్టకపోతే భావి భారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్తు ఘోరంగా దెబ్బతింటుంది.
విద్య మానవ వనరులను పెంచే సాధనం.

ఏ దేశమైతే విద్యారంగంలో వంద శాతం విజయం సాధించిస్తుందో ఆ దేశమే ప్రపంచంలో అగ్ర దేశంగా రూపు దిద్దుకుంటుంది. విద్య పై పెట్టే ఖర్చును ప్రపంచదేశాలన్నీ పెట్టుబడిగా పరిగణిస్తూ ప్రాధాన్యం ఇస్తుంటే మనదేశం మాత్రం ఇందుకు భిన్నంగా ‘భిక్షం’ వేస్తున్నట్లు భావిస్తున్నది. పేదకులాలు ఉన్నత విద్యా, సాంకేతిక విద్య చదువుకోవడం వలన శాశ్వత అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాజిక, ఆర్థిక రాజకీయాభివృద్ధికి పునాది ఏర్పడుతుంది. ఆర్థికం గా ఉన్నవారు సామాజికంగా ఎదగకపోవచ్చు. సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలు ఉన్నవి. కానీ విద్యాపరంగా ఎదిగిన కుటుంబాల కు సామాజిక గౌరవం, ఆర్థిక పెరుగుదల రెండూ కలిసొచ్చే అంశాలు.
హాస్టళ్లమీద పెట్టే ఖర్చును సంక్షేమ పథకం అనడం కంటే, పెట్టుబడి పథకం కింద పరిగణించాలి. విద్యపై పెట్టే బడ్జెట్ సమాజ వికాసంలో శాశ్వత అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

హాస్టళ్లలో ఉండి ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివిన విద్యార్థుల కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. భవిష్యత్తులో ఈ కుటుంబాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అవసరం ఉండదు. ఇలాంటి కుటుంబాలకు తెల్లకార్డు మొదలు కొని ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, లాంటి స్కీములను ఈ కుటుంబాలకు ఇవ్వవలసిన అవసరం లేదు. పొందడానికి అర్హత కూడా ఉండదు. మిగతా అన్ని సంక్షేమ పథకాలు పేదవారి ని పేదవారిగానే ఉంచుతాయి. కానీ ఉన్నత విద్యా కోర్సులు చదివిన కుటుంబాల వారు శాశ్వతంగా సమక్షిగంగా అభివృద్ధి చెందుతారు . దీంతో భవిష్యత్తులో సంక్షేమ పథకాల కు కేటాయించే బడ్జెట్ భారం తగ్గుతుంది.

అమెరికా అధ్యక్షులు ఒబామా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంకేతిక విద్యలో ఉన్నత విద్యలో శరవేగంతో దూసుకుపోతోంది. చాలా స్పల్ప కాలంలో ప్రపంచంలో భారత్ నెంబర్‌వన్ స్థాయికి ఎదిగినా ఆశ్చర్యం లేద’న్నారు. కాబట్టి పేద, బడుగు వర్గాల పిల్లలకు విద్య అందుబాటులో ఉంటే సమాజ స్వరూపమే మారిపోతుంది. కాబట్టి వీరికి ఉన్నత విద్యాకోర్సులు చదవడానికి కాలసిన అన్ని మంచి పరిస్థితులు కల్పించాలి.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 628 బీసీ కాలేజీ బాలికల, బాలుర హాస్టళ్లు, అలాగే ఎస్సీలకు 552, ఎస్టీలకు 269 హాస్టళ్లు ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ఈ హాస్టళ్లు ఏర్పడ్డాయి. ఈ హాస్టళ్లలో మెస్ చార్జీల కింద డిగ్రీ విద్యార్థులకు రూ. 520 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ డబ్బు ప్రస్తుతమున్న ధరలను బట్టి చూస్తే.. ఎలా తినగలరో ఊహించుకోవచ్చు. ఈ చాలీ చాలని మెస్ చార్జీలతో హాస్టళ్లలో నీల్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారు. ఈ అన్నం తిన్న విద్యార్థులు అనేక చోట్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక బాలికల హాస్టళ్లలో మెస్‌లను ఎత్తివేశారు. దీంతో చాలామంది అమ్మాయిలు హాస్టళ్లను వదిలి, చదువులు విడిచి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇది పేదలపట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని తెలుపుతోంది.

బడుగు వర్గాల విద్యార్థులంటే.. ప్రభుత్వానికున్న నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. జైళ్లలో ఉన్న ఖైదీలకు నెలకు 1300 రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం అదే.. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మాత్రం 520 మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటోంది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు రోజుకు 40 రూపాయల చొప్పున నెలకు 1200 చెల్లిస్తోంది. కానీ.. ప్రైవేటు హాస్టళ్లలో కాలేజీ విద్యార్థుల మెస్ బిల్లు నెలకు 1800 వస్తుంది. యూనివర్సిటీ హాస్టళ్లలో మెస్ బిల్లు నెలకు 1600 వస్తుంది. జూనియర్ డాక్టర్లకు మెస్ బిల్లు కోసం నెలకు మూడు వేలు ఖర్చుచేస్తున్నారు. ఇదిలా ఉంటే నవోదయ పాఠశాలల్లో చదువుతున్న 6 వ తరగతి విద్యార్థికిమెస్ చార్జీ కింద 960 ఖర్చు చేస్తున్నారు. ఇంత దయనీయంగా.. విద్యార్థుల పరిస్థితి ఉన్నా.. రాష్టంలో నేతలుగా ఉన్న వెనుకబడిన కులాలకు చెందిన నేతలు ఒక్కరూ నోరు మెదపడం లేదు.

కాలేజీ హాస్టళ్ల మెస్ చార్జీలు పెంచాలని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖలను కోరారు. సంక్షే మ శాఖలు ప్రతిపాదనలు పంపాయి. కానీ ఆర్థిక శాఖ అధికారులు అడ్డుపుల్లలు వేస్తూ జాప్యం చేస్తున్నారు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కూడా మెస్ చార్జీలు పెంచాలని ఆదేశించారు. ఇంత తక్కువ పైసలతో భోజనం ఎలా చేస్తారని కూడా అధికారుల ను నిలదీశారు. అయినా మెస్ చార్జీలు పెరగడంలేదు. ఈ ఫైళ్లను ఉన్నతాధికారులు తొక్కిపెడుతున్నారు. ముఖ్యమంవూతులు చెప్పినా అమలు కాని పరిస్థితి ఉంది. అంటే.. ఈ సర్కారులో తిష్టవేసిన అధికార యంత్రాంగమంతా బీసీ, వెనుకబడిన వర్గాలంటే.. చిన్నచూపని అర్థంచేసుకోవచ్చు. ఏమైనా అంటే.. ఆర్థిక భారమని తప్పించుకుంటున్నారు.

కానీ అదే తమకు నచ్చిన డిపార్ట్‌మెంట్లలో మాత్రం ప్రభుత్వం నోటి నుంచి మాట వెలువడిన వెంటనే బడ్జెట్ భారం మరిచిపోతారు. వెంటనే నిధులు విడుదల చేస్తున్నా రు. ఇదే సందర్భంలో ఇతర శాఖల్లోని ఫైళ్లు శరవేగంగా కదిలి వెంటనే జీవోలు విడుద లై లబ్ధి పొందుతున్నారు. జూనియర్ కాలేజీ లెక్చరర్లకు 7500నుంచి 18,500లకు జీతాలు పెంచారు. అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు 8500నుంచి 20400 లకు పెంచారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రెట్టింపు చేశారు. అలాగే శాసనసభ్యుల జీతాలు మూడు రెట్లు పెంచుకున్నారు. రోగుల భోజన అల కూడా రెట్టింపు చేశారు. ఈ పెంపుదలలన్నీ సీఎం కిరణ్ హయాంలో జరిగిపోయాయి. కానీ బీసీల విషయానికి వచ్చేసరికి ఆర్థికభారమని సాకులు చెపుతున్నారు. దీనికంతటికీ.. ప్రభుత్వ చిత్తశుద్ధి లేకపోవడమేనని అనుకోకతప్పదు.

ఎలాగూ సాచురేషన్ పద్ధతి మీదనే స్కాలర్ షిప్ మంజూరు చస్తున్న ప్రభుత్వం, విడుదల చేస్తున్న నిధులతోనే సర్దుకోవచ్చు. స్కాలర్ షిప్పుల కోసం 3400 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం వీటి నుంచే కొంత కేటాయించి చదువులు కుంటుపడకుండా చూడవచ్చు. ఇలా కనీస చిత్తశుద్ధి ఉన్నా పేద బడుగు వర్గాల పిల్లల చదువులు ఆగిపోకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ.. ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా... విద్యార్థులు లేరనే సాకుతో హాస్టళ్లను మూసి వేయడానికి సిద్ధమైంది. ఇది చాలా దుర్మార్గం.

యూనివర్సిటీలలో కూడా ఇదే పరిస్థితి. గతంలో విద్యార్థుల పోరాటాల ఫలితంగా.. యూనివర్సిటీ విద్యార్థులకు మెస్ బిల్ ఎంత వస్తే.. అంత మెస్ చార్జీలు ప్రభుత్వం మంజూరు చేసే విధానం ఉండేది. మెస్ బిల్లు పోనూ.. పాకెట్ మనీ, ఇతర ఖర్చులకు గానూ విద్యార్థులకు డబ్బులు ఇచ్చేవారు. ఇవాళ యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బిల్ 1800 వస్తోంది. కానీ.. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు 682 రూపాయలు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 962 చెల్లిస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో మెస్ బిల్లు ఎక్కువ వచ్చి, ప్రభుత్వం ఇస్తున్నది తక్కువగా ఉండటంతో.. విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు రక్తం కూడా అమ్ముకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పెరిగిన ధరలకనుగుణంగా.. యూనివర్సిటీ, డిగ్రీ విద్యార్థులకు మెస్ చార్జీలు ప్రభుత్వం మంజూరు చేయాలి.

డిగ్రీ స్థాయినుంచి పీజీ, వృత్తివిద్యాకోర్సుల విద్యార్థులందరికీ.. నెలకు 1500 రూపాయల చొప్పున చెల్లించాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులు చదువుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కాలేజీ హాస్టల్ బాలికలకు కాస్మొటిక్ చార్జీలను 75 నుంచి 200లకు పెంచాలి. బాలురకు 50 నుంచి 100కు పెంచాలి. రాష్టంలోని అన్ని కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లన్నింటిలో.. విద్యార్థులకు ‘ఫుల్ చార్జీల స్కీము’ను పునరుద్ధరించాలి. వెనుకడిన బడుగు వర్గాల పిల్లల చదువులు సజావుగా సాగేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.

TOP News35

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా