బీసీ రిజర్వేషన్లకు ఎసరు!


Sat,October 6, 2012 04:20 PM

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని ఆంధ్రవూపదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు రాకముందే కేంద్ర న్యాయశాఖామంత్రి సల్మాన్ కుర్షీద్ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించారు. తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై యూపీఏ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ కేంద్రమంత్రి అన్నీ తానే అయినట్లు అధికార దర్పంతో ఏకపక్షంగా ప్రకటించారు.

బీసీలకు ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్ల ను 22కు తగ్గించి అందులో నుంచి 4.5శాతం మైనారిటీ లకు ఇవ్వడం అన్యాయం. బీసీల నోటికాడి ముద్ద లాగి మైనారిటీలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ఓట్ల కోసం మైనారిటీలను నెత్తికెత్తుకుంటున్నారు. మైనారిటీలకు రాజ్యాంగంలో ప్రత్యేక కోటా ఇస్తే చట్టపరంగా, రాజ్యాంగపరంగా చెల్లుబాటు అయ్యేది. అలాకాకుండా బీసీ కోటాకు కోత కోసి సబ్ కోటా ఇవ్వడంతోనే సమస్య మొదలయ్యింది.జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు లేకుండా బీసీ జాబితాలో ఎలా కలుపుతారని కోర్టు కూ డా ప్రశ్నించింది. వీటితోపాటు మైనారిటీ రిజర్వేషన్లను కొట్టివేయడానికి 13కారణాలున్నాయని స్పష్టం చేసిం ది. మైనారిటీలకు రిజర్వేషన్లు కేంద్రవూపభుత్వానికి ఆసక్తి ఉంటే రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక కోటా ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు.

కానీ బీసీల కోటా తగ్గించి ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ దేశంలోని 65 కోట్ల మంది బీసీలు అంగీకరించబోరు. ఇప్పుడు బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు 27 శాతం మాత్రమే. ఇవే సరిపోవని వాటినే 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తుంటే.. ఉన్నవాటిలోనే తగ్గించేందుకు ప్రయత్నించడం అమానుషం.
ఏవైనా కొత్త కులాలను బీసీ జాబితాలో కలుపాలన్నా, తీసివేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జాతీయ బీసీ కమిషన్ సిఫారసుల ప్రకారం మాత్రమే చేయాలని 1992లో మండల్ కమిషన్ కేసు సందర్భం గా సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇప్పటిదాకా బీసీలలో 9 సార్లు 590 కులాలను బీసీ జాబితాలో చేర్చారు. ఇవన్నీ బీసీ కమిషన్ సిఫారసుల ప్రకారం కలిపారు. కానీ ఇప్పుడు మైనారిటీలకు ఇచ్చిన సబ్‌కోటా బీసీ కమిషన్ అనుమతి లేకుండా కలిపారు. అలాగే.. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ల గురించి ప్రస్తావన లేదు.

సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటును గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలోని 340 ఆర్టికల్స్ 16(4) (5), 15 (4)(5) నిర్దేశిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించింది. ఇదిలా ఉంటే..దేశంలోని కోట్లాదిమంది బీసీలకు అన్యాయం జరుగుతుంటే పార్లమెంటులోని బీసీ పార్లమెంటు సభ్యులు నోరుమెదపలేదు. పోనీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కోర్టు నిర్ణయాన్ని సమర్థించలేదు. పార్లమెంటులో అన్నిపార్టీల వారు కలిసి బీసీలు 142మంది ఉంటారు. వీరిలో ఒక్కరు కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదు. బీసీ రిజర్వేషన్లు,మైనారిటీలకు సబ్ కోటా విషయంపై ఇంత రభస జరుగుతున్నా రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి. మరోవైపు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. రిజర్వేషన్లకున్న మౌలిక లక్షణాలు, లక్ష్యాలు మరిచిపోయి ప్రతివారూ రిజర్వేషన్లు కావాలంటున్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు.

ఉపాధి హామీ పథకం అంతకంటే కాదు. సామాజిక వెనుకబాటు ఉద్యోగ, విద్యా రంగాలలో వెనుకబాటు తనాన్ని రూపు మాపడం కోసం రిజర్వేషన్లు కల్పించాలి. కానీ ఒత్తిడికి లొంగి ఇచ్చే ప్రసక్తి ఉండకూడదు.ఇప్పటిదాకా దేశంలో జాతీయస్థాయిలో రెండు బీసీ కమిషన్లు, వివిధ రాష్ట్రాల్లో 64 బీసీ కమిషన్లు నియమించారు. ఈ కమిషన్లన్నీ ఆర్థిక వెనుకబాటు తనాన్ని రిజర్వేషన్లకు పునాదిగా చెప్పలేదు. కాబట్టి సామాజిక వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా తీసుకున్నారు. దీనినే కొనసాగిస్తున్నారు.

సమాజంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వివక్షకు, నిర్లక్ష్యానికి గురయ్యారు. 54 శాతం జనాభా గల బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా 7 శాతానికి దాటలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లు పెట్టి 18 ఏళ్లైంది. అలాగే కేంద్ర విద్యాసంస్థలలో రిజర్వేషన్లు పెట్టి 6 సంవత్సరాలు అయ్యింది. అప్పుడే వీటికి గండి కొట్టే ప్రయత్నాలు చేయడం అన్యాయం.
మరో వైపు సమాజంలో బీసీలతో పోల్చితే.. మైనారిటీలు ఎంత శాతం? అయినా వీరి నుంచి నలుగురు రాష్ట్రపతులు అయ్యారు. ఒకరు ప్రధానమంత్రి అయ్యారు. కానీ బీసీలు ఒక్కసారి కూడా రాష్ట్రపతి కాలేదు. ప్రధాని కాలేదు. అంటే.. ఈదేశంలో బీసీలు ఓట్లు కాసే చెట్లు మాత్రమేనా? కేంద్రంలో మైనారిటీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నది. కానీ బీసీలకు ఇంతవరకు ప్రత్యేకశాఖ లేదు. మైనారిటీలకు బడ్జెట్ ఉన్నది. రాజ్యాంగబద్ధమైన మైనారిటీ కమిషన్ ఉన్నది. దేశజనాభాలో సగభాగానికి ఏ కమిషన్, ప్రత్యేక బడ్జెట్ లేకపోవడం వివక్షగాక మరేమిటి?

బీసీ కోటానుంచి మైనారిటీలకు రిజర్వేషన్లు కేటాయించడం బీసీలకు అన్యాయం చేయడమే. మైనారిటీలది ఆకలి పోరాటమైతే.., బీసీలది ఆకలిపోరాటమే కాదు ఆత్మగౌరవపోరాటం. ఇప్పటికే మైనారిటీ వర్గాలకు చెందిన క్రిష్టియన్లను దళిత క్రిష్టియన్లుగా ,ముస్లిం మతంలోని దూదేకుల, పింజరి, పకీర్లు, షేక్‌లు, సాహెబ్‌లు బీసీ జాబితాలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలను నిర్వచించడంలో సరియైన విధానం అవలంబించడంలేదు. దేశంలో కులపరమైన రెండు రకాలమైనారిటీలు ఉన్నారు. పాలకులు మతపరమైన మైనారిటీలను మాత్రమే గుర్తించి, కులపరమైన మైనారిటీలను గుర్తించడంలేదు.మైనారిటీల నిర్వచనంలో ఒక ప్రాంతాన్ని, మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదు. ఒక ప్రాంతంలో మైనారిటీ అయితే, మరో ప్రాంతంలో మెజారిటీ కావచ్చు.

కాశ్మీర్‌లో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. పంజాబ్‌లో సిక్కులు, క్రైస్తవులు ఈశాన్య భారతంలో మెజారిటీగా ఉన్నారు. అయనా వీరిని అక్కడ మైనారిటీలుగా పరిగణిస్తారా? బుద్దులు, పార్శీలు ఏప్రాంతంలోనూ మెజారిటీగాలేరు. రిజర్వేషన్లు ఇవ్వడానికి ఉండవలసిన పారామీటర్లు మైనారిటీ లలో చాలా వర్గాల్లో లేవు. పైగా బుద్దులు, పార్శీలు చాలావరకు హిందువులుగానే క్లెయిమ్ చేస్తుంటారు. ఇక మైనారిటీ బీసీ కులాలు చాలా ఉన్నాయి. ఈ కులాల వారు కనీసం అటెండర్ స్థాయికి చేరుకోని కులాలు ఉన్నవి. బుడుబుక్కల, దాసరి, గంగిద్దుల, పాముల తదితర సంచార జాతులు భిక్షాటన చేసే కులాలు గిరిజన సంస్కృతి కలిగి ఉన్నాయి. వీరికి చదువులు, రిజర్వేషన్లు అందిన పరిస్థితేలేదు.

బీసీలను పట్టించుకోకపోవడం కారణంగానే తమిళనాడు, బీహార్, ఉత్తరవూపదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పటికైనా.. పాలకులు బీసీలకు అన్ని రంగాలలో తగిన ప్రాతినిథ్యం కల్పించాలి. లేకుంటే.. అధికార పార్టీలను బీసీలు దూరం పెడతారు. రాజకీయపార్టీల నిర్లక్ష్యం ఇలాగే ఉంటే.. రాజ్యాధికారం దిశగా బీసీలు అడుగులు వేస్తారు. ఓట్లు బీసీలవి అయినప్పుడు అధికారం వారికే దక్కడం సహజ న్యాయం కాదా?

-ఆర్. కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు


35

KRISHNAIAH R

Published: Sun,February 15, 2015 12:09 AM

సమగ్ర బీసీ కమిషన్ కావాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముంద

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప