సీమాంధ్ర దొరతనం-2


Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్నిట్లు ఎక్కువ ధనవంతులైనారో జ్ఞాపకం రాదు. తెలంగాణ రక్షణకు ఉన్న చట్టాలన్నింటిని తుంగలో తొక్కి ఎన్ని భూములు కాజేశారో, ఎన్ని వనరులను, వసతులను, ప్రత్యక్షంగా పరోక్షంగా కాజేశారో చెప్పరు.


తెలంగాణలో దొరతనం ఎప్పుడో అడుగంటింది. తెలంగాణ పల్లెలోని దొరలు ఎప్పుడో పట్టణాలకు తరలిపోయి అందరిలో కలిసిపోయారు.వారిప్పుడు వారి వారి వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అసలిప్పుడు పల్లెల్లో భూస్వాములనే వారే లేరు. ఈనాటి జమీందారులు అంటే.. పట్టణాల వారే. దొరతనమంతా పట్టణాల వారిదే.అందులోనూ అతి ధనవంతులది. ఆ అతి ధనవంతులంతా ఇప్పుడు సీమాంవూధవారే. కనుక వారే.ఈనాటి దొరలు. వారిదే ఈ నాటి దొరతనం .తెలంగాణవారి పోరాటమంతా ఈ దొరలకు, ఈ దొరతనానికి వ్యతిరేకంగానే. తెలంగాణ పోరాటం సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, సీమాంధ్ర దొరతనానికి వ్యతిరేకం. ‘మాకొద్ది సీమాంధ్ర దొరలు, మాకొద్దు వారి దొరతనం’ అని తెలంగాణవారు నినదిస్తున్నారు. ఇకముందు ‘అస్తిత్వ పోరాటానికి’ ముస్లింలే ముందుండాలి. ఎందుకంటే ఆంధ్రవూపదేశ్ ఏర్పడినాక తెలంగాణలోని ముస్లింలకు జరిగినం అన్యాయం మరెవ్వరికీ జరుగలేదు.

ముస్లింల భాష వారికే కాకుండా పోయింది. వారి భూములను సీమాంధ్ర వారు అతి చౌ కగా కాజేశారు. వారి ఇళ్ళను సస్తాగా కొనేశారు. వారి సంస్కృతినంతా సమాధి చేశారు. తెలంగాణలోని తెలుగువారు తెలుగులో ఉర్దూ పదాలు కొన్ని కలిపి మాట్లాడితే.. వారిని ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. అనాటి ముస్లింలు హిందువులతో పాటు ఎంతో మంది విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించేవారు, వారి సంఖ్య విద్యాలయాల్లో ఇప్పడు తగ్గిపోయింది. సీమాంధ్ర వారు ముస్లింల కల్చరంటే అదొక నవ్వాబీ కల్చర్, సోమరిపోతు కల్చర్, ప్యూడల్ కల్చర్ అని అంటారు. అంతేకాదు దానిని ఒక ఆకతాయి సంస్కృతిగా, చౌకబారు సంస్కృతిగా సినిమాలలో చూపిస్తూ ఉంటారు. తెలంగాణ తెలుగు వారిని కూడా అలాంటి సంస్కృతికి చెందిన వారుగా చిత్రీకరిస్తుంటారు. వారి డ్రెస్సులను పరిహసిస్తారు. వారి గల్లీని పరిహసిస్తారు.

ఆంధ్రా వాళ్ళ భాషలో ఆంగ్లేయ పదాలు దొరిలినా అదొక గొప్పతనం కిందనే లెక్క. కానీ.. తెలంగాణ వారి తెలుగులో ఉర్దూ పదాలు దొరిలితే అది చిన్నతనం కింద లెక్క . తెలంగాణ వారి తెలుగును వారు ‘తురక తెలుగు’ అని పరిహసిస్తుంటారు. హైదరాబాద్ నగరం హిందువులు, ముసల్మానులు కలిసి కట్టుకున్న ,అభివృద్ధి చేసుకున్న నగరం.దాని అభివృద్ధికి ముసల్మానులు ఎంతో కష్టపడ్డారు. హిందువులు, మరీ తెలంగాణ పల్లెలకు చెందినవారు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి దాదాపు నాలుగైదు వందల సంవత్సరాలకు చెందినది. అలాంటి అభివృద్ధిని యాభైయేళ్ళ కితం ఇక్కడికి వచ్చి అభివృది మేము చేసిందేనని విర్రవీగడం కూడా వారి దొరతనానికి నిదర్శనం.

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్నిట్లు ఎక్కువ ధనవంతులైనారో జ్ఞాపకం రాదు. తెలంగాణ రక్షణకు ఉన్న చట్టాలన్నింటిని తుంగలో తొక్కి ఎన్ని భూములు కాజేశారో, ఎన్ని వనరులను, వసతులను, ప్రత్యక్షంగా పరోక్షంగా కాజేశారో చెప్పరు. సీమాంధ్ర దొరల గురించి, దొరతనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే.. వీరే.. నిసిగ్గుగా తెలంగాణలోని ఏనాడో అంతమైపోయిన దొరలగురించి, దొరతనం గురించి పదేపదే మాట్లాడుతూ.. వారేదో గొప్ప సామ్యవాదుల్లాగా ఫోజు పెడతారు. అందుకే తెలంగాణ వాదం పుట్టుకొచ్చింది. ఈ వాదం ‘ఆత్మగౌరవం వాదం. ఆస్తిత్వవాదం అని తెలంగాణ కల్చరల్‌ఫోరం పదేపదే చెబుతూనే ఉంది. అందుకే దీనిపైనే 550 పేజీలతో కూడిన ‘తెలంగాణ ఆస్తిత్వ పోరాటం’ అను పుస్తకాన్ని కూడా ప్రచురించింది. తెలంగాణ ఆత్మగౌరవ వాదాన్ని, ఆస్తిత్వవాదాన్ని తెలుసుకో గోరేవారు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.

కేంద్ర ప్రభుత్వం ఎప్పడు మాట్లాడినా ఆర్థిక రాజకీయ అసమానతల గురించే మాట్లాడుతోంది. కాని తెలంగాణ వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడడంలేదు. తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన అంశం సెక్యూలరిజం. అది ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక చాలా అవమానాల పాలైందని ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. వినిపించుకోవడం లేదు. దీనికి ఒకే ఒక ఉదాహరణ చాలు. హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని వందలయేళ్ళుగా.. ఎన్నో ప్రాంతాల వాళ్ళు, హిందువులు, ముస్లింలు, పారశీయులు, మహారాష్ట్రీయులు, కన్నడిగులు, మార్వాడీలు, గుజరాతీలు, బెంగాలీలు మరింకెంతో మంది కలిసి మెలిసి ఉన్నారు. వీరిని తెలంగాణ వారు ఎన్నడూ పరాయివారుగా చూడలేదు.

వారు ఎన్నడూ ఆంధ్రులకు వ్యతిరేకంగా ‘గోంగూర’ గోబ్యాక్’ అని నినాదాలు చేసినట్లు చేయలేదు. అంతెందుకు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఎంతో మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఇక్కడ నివసించేవారు. వ్యవసాయ చేసుకునేవారు, వృత్తు లు, వ్యాపారాలు నిర్వహించేవారు. వారి జోలికి ఎన్నడూ తెలంగాణ పోలేదు. వారిని ఏమీ అనలే దు.ఎప్పుడైయితే ఆంధ్రవూపదేశ్ ఏర్పడిందో, సీ మాంధ్ర నేతలు వారి మెజారిటీ’ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వారిపై ‘దొరతనం చెలాయించడం మొదలుపెట్టారో, అవమానించడం, అవహేళన చే యడం మొదలుపెట్టారో, విద్యా ఉద్యోగ అవకాశాలనుకాజేయడం మొదలుపెట్టారో,సెకండ్‌క్షిగేడ్ సిటిజన్స్‌గా చూడడం మొదలుపెట్టారో అప్పటినుంచి ఆంధ్ర ప్రాంతం వారిని అనుమానంగా చూస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని తక్కువ సం స్కృతిగాభాషా సాహిత్యాలను , దైనందిన బ్రతుకులను సన్నకారువిగా చూడడం మొదలుపెట్టారో అప్పుటినుండి తెలంగాణలో సీమాంధ్ర వ్యతిరేకత మొదలయింది. సీమాంధ్ర దొరలపై, దొరతనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అది రానూ రానూ ఒక ఉద్యమంగా,విప్లవంగా మారింది.

ఇపుడా ఉద్యమం ఊరూరా, ఇంటింటా అరని మంటగా చెలరేగుతోంది. పదేళ్ల నుండి సీమాంధ్ర దొరలు ప్రత్యేక తెలంగాణ రాకుండా ఎత్తులు, జిత్తులు చేస్తున్నారు. అంతేకాకుండా..తెలంగాణలోఎంతోమంది యువకులు , విద్యార్థులు చచ్చిపోతున్నా అయ్యో పాపం అనకపోవడాన్ని , తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కొంతమంది స్వార్ధపరుల పోరాటంగా చిత్రీకరించడాన్ని , కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న పద్దతులను తెలంగాణ ప్రజలు భరించలేకపోతున్నారు. ఆంధ్రవూపదేశ్ ఇలాగే కొనసాగితే తమ బతుకులు బానిస బతుకులే అవుతాయని , సీమాంవూధుల దోపిడి, దొరతనపు పోకడలు ఇక ముందుకూడా కొనసాగుతాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఎన్ని హామీలిచ్చినా.. నమ్మడానికిక తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే కేంద్రవూపభుత్వం దీనిని‘ క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్’ ఆత్మగౌరవానికి సంబంధించిన ఆఖరు పోరాటంగా భావించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే తప్ప ఇది ఆగే అవకాశం ఆస్కారం లేదు.

-డా. వెలిచాల కొండలరావు,
కన్వీనర్, తెలంగాణ కల్చరల్ ఫోరం

35

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles