సీమాంధ్ర దొరతనం-1


Tue,October 9, 2012 03:34 PM

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు ఉంటే అదెలా చెల్లుతుందని లోక్‌పాల్’ బిల్లు సందర్భంగా అనేకానేకులు మాట్లాడుతున్నారు.అది నిజమే కాని, శాసనసభ్యులే, పార్లమెంటు సభ్యులే ఆంధ్రవూపదేశ్‌కు చెందినవారిలా పదేపదే ఆడినమాట తప్పితే, అనలేదంటే,అబద్దాలాడితే, అవకాశవాదానికి దిగితే అనేక అవినీతులకు పాల్పడితే బయటి వారు ఊర్కోవలసిందేనా!

పాపం తెలంగాణ ప్రజానీకం ఒకనాటి తెలంగాణాలోని దొరతనానికి , దొరలకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లు పోరాడి, పోరాడి ఉద్యమాలుచేసి.. చేసి విముక్తులైనారు. అటు ఆ దొరతనం నుంచి, ఆదొరలనుంచి వారు విముక్తులైనారో లేదో ఇటు వారి నెత్తిపై మరొక , అంతకన్నా పెద్ద దొరతనం , అంతకన్నా పెద్ద దొరలు సీమాంధ్ర ప్రాంతం నుంచి ‘సమైక్యాంధ్ర’‘ విశాలాంధ్ర’ పేరిట వచ్చి పడ్డారు.
ఆనాటి దొరలు చాలావరకు భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు, సంస్థానాధీశులు, రాచరికపు వారు. కానీ.. ఈనాటి దొరలు వారికన్నా ఎంతో ఆర్థిక స్థోమత , విద్యాస్థోమత, రాజకీయ పట్టుగల వలస పెట్టుబడిదారులు. రియల్ ఎస్టేట్, సారా, కార్పొరేట్ విద్య, గ్రానైట్ గనులు, భారీ పరిక్షిశమలు మున్నగు వాటికి చెందినవారు. వారు ఫ్యూడలిస్టులైతే.. వీరు క్యాపిటలిస్టులు. వీరందరూ వివిధ రంగాల్లో , స్థాయిల్లో ఎన్నికలకు పోటీచేసే రాజకీయ పెత్తందార్లకు పెట్టుబళ్లు పెట్టి గెలిపించి అటు తదుపరి వారిని మరింత సంపాదించుకోవడానికి వాడుకునే వారు.

వారే స్వయానా రాజకీయాల్లోకి దిగి రాజకీయాలను వ్యాపారాల కొరకు , వ్యాపారాలను రాజకీయాల కొరకు వినియోగించుకునే వారు. వీరందరూ ఈ నాటి ‘దొరలు’. వీరందరిదీ ఈనాటి ‘దొరతనం’ఆనాటి దొరతనమంతా భూముల ఆధిపత్యానికి చెందిందైతే.., ఈనాటి దొరతనమంతా ధనాధిపత్యానికి , విద్యాధిపత్యానికి, ప్రజాస్వామ్యం పేరిట ప్రజాస్వామ్యాన్ని ప్రభువుల స్వామ్యంగా , రాచరికంగా వాడుకునే ఆధిపత్యానికి చెందింది. ఆనాటి తెలంగాణాను తెలంగాణకు చెందిన నల్లదొరలు వారినెలా బానిసలుగా చూశారో. , ఈనాడు వీరు తెలంగాణ వారిని అలా బానిసలుగా చూస్తున్నారు. వారు సీమాంవూధులతో మేము పరిపాలకులము కనుక ఏమైనా చేస్తాము, మేమనుకున్నది, మాకు కావలసింది ఎలాగైనా సాధిస్తాము. అని అన్నట్లే వీరు ఇప్పుడు తెలంగాణ వారితో.. మాకు మెజారిటీఉంది కనుక మేమేమైనా చేస్తాం, ఎంత డోపిడికైనా , అణగదొక్కడానికైనా ,మీకు చెందినవి ఎనై్ననా కాజేయడానికైనా పాల్పడతాం. మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండిఅని అహంభావంతో మాట్లాడుతున్నారు.

తమాషా ఏమిటంటే.. ఈ సీమాంధ్ర దొరలే ఇలాంటి దొరతనం చెలాయిస్తూ.., తెలంగాణ వారితో వారి ఒకప్పటి దొరల గురించి, దొరతనం గురించి, ఫ్యూడలిజం గురించి మాట్లాడుతుంటారు. వారు వచ్చి వీరి కంటినీరు ఏదో తుడిచినట్టు.

వీరి బాగోగులేవో కోరినట్లు. సీమాంధ్ర దొరలు ఒక వందేళ్ల క్రితపు దొరతనాన్ని నిస్సిగ్గుగా తిరిగి ఈరోజు ప్రత్యక్షంగా , పరోక్షంగా వారి పరిపాలన ద్వారా ప్రవేశపెడుతూ, అనాటి కన్నా మరెన్నో అన్యాయాలు తెలంగాణావారికి తలపెడుతూ ,ఆనాటి తెలంగాణవారిని ఎద్దేవా చేస్తూ.. పరిహసిస్తూ ఉంటారు. అపుడు జరిగిందంతా చెడ్డ , ఇప్పుడు జరిగేదంతా మంచి అన్నట్లు. ఇంకొక తమాషా ఏమిటంటే ఈ దొరలే క్యాపిటలిజంకు చెందిన దొపిడీ తక్కువదనుకుంటారు. ఫ్యూడలిజంకు చెందిన దొపిడి ఎక్కువదనుకుంటారు. దోపిడి ఎలా చేసినా దోపిడియే కదా... ఏ వ్యవస్థ చేసినా.. ఎవరు చేసినా. ఆ దోపిడి ఫ్యూడలిజం ద్వారా చేయబడిందయితేనేమి!, క్యాపిటలిజం ద్వారా చేయబడిందయితేనేమి, తెలంగాణ దొరలచే చేయబడిందయితేనేమి లేక సీమాంధ్ర దొరలచే చేయబడిందయితేనేమి?
మరొక తమషా ఏమిటంటే ఆ ప్రాంతం మేధావులు, విద్యాధికులే కాదు.

ఆ ప్రాంతపు సి.పి.ఐ. పార్టీకి చెందిన వారు కూడా ఆనాటి దొరల మాట,దొరతనపు మాటే మాట్లాడుతారు కాని ఈనాటి దొరలమాట, దొరతనపు మాట మాట్లాడరు. దాని గురించి పట్టించుకొంటారు. కాని దీని గురించి పట్టించుకోరు. ఆంగ్లేయ భాషను విద్యాభాషగా, అధికారభాషగా అంతటా ప్రవేశపెడుతూ ఈ సీమాంవూధదొరలే పదేపదే భాషా రాష్ట్రాలను విచ్చిన్నం చేయకూడదని గొంతు చించుకొని ఆరుస్తుంటారు. అసలు భాష పోతున్నప్పుడు, దానిని పోడగొట్టుకుంటున్నప్పుడు భాషా రాష్ట్రాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా లేదూ? వీరికున్న ప్రేమంతా భాషా రాష్ట్రం పేరిట హైదరాబాద్ మీద ఉన్న ప్రేమే కదా! అది అక్షరాలా అందరికీ కనబడుతూనే ఉంది.

అది వారి తెలుగు వారి పట్ల, భాష పట్ల ప్రేమకన్నా హైదరాబాద్‌పై ప్రేమనే చాటుతోంది.ఈ దొరలు ప్రజాస్వామ్యం పేరిట బీదవూపజలను దోచుకుంటూ, వారికి చెందిన సంపత్తిని కాజేస్తూ పదేపదే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, దేశం గురించి మాట్లాడడం, దేశ ఐక్యత గురించి మాట్లాడడం చూచేవారికి, వినేవారందరికీ ఒక డ్రామాలా, నాటకంలా , బూటకంలాగానే ఉంది. కాని వాస్తవంగా లేదు. ఆంధ్రవూపదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నాటకం , రాజకీయ బూటకం ఈ దేశ చరివూతలోనే కాదు. ఏ దేశ చరివూతలో కూడా ఎన్నడూ కనీవినీ ఎరుగనిది . ఎంతో విద్య పెరిగింది. ప్రగతి పెరిగింది, అభివృద్ధి, అభ్యున్నతి పెరిగింది అని విర్రవీగుతుంటామే మనం ! ఇదేనా ఆ విద్య, ఆ ప్రగతి , ఆ అభివృద్ధి, ఆ అభ్యున్నతి.

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది.కాని, బయటివారికి అలాంటి హ క్కు ఉం అదెలా చెల్లుతుందని లోక్‌పాల్’ బిల్లు సందర్భంగా అనేకానేకులు మాట్లాడుతున్నారు. అది ని జమే కాని, శాసనసభ్యులే, పార్లమెంటు సభ్యులే ఆంధ్రవూపదేశ్ చెందినవారిలా పదేపదే ఆడినమాట తప్పితే, అనలేదంటే, అబద్దాలాడితే, అవకాశవాదానికి దిగితే అనేకానేక అవినీతులకు పాల్పడితే బ యటివారు ఊర్కోవలసిందేనా, వారికి ‘ఊ’ కొ డుతూ పోవలసిందేనా మరి? పదవుల కొరకు అక్ర మ అవినీతి అర్జనల కొరకు వారు మాట్లాడినవన్నీ, వారి ‘మానిఫెస్టో’లలో వ్రాసినవన్నీ, మరిచి పో యి ఔనన్నదానిని కాదన్నా ఊర్కోవలసిందేనా?

ఈనాటి పరిపాలకులంతా అహింస ద్వారా ఎన్నాళ్ళు పోరాడినా, పోరాటానికి చెందింది ఎంత న్యాయమైంఐనా దానిని దశాబ్దాలే కాదు శతాబ్దాల వరకు కూడా పట్టించుకోరు. అయినా హింసకు దిగవద్దంటారు. హింసకు దిగొద్దాయె .అహింస నడువదాయె మరి. పార్లమెంటు అవతల ఉన్నవారు శాసన సభల బయట ఉన్నవారు వారి న్యాయమైన హక్కులు తీర్చుకునేది ఎలా?
డా॥ వెలిచాల కొండల్‌రావు
కన్వీనర్ తెలంగాణ కల్చరల్ ఫోరం

35

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని