పీవీ నోట తెలుగు భాష మాట


Fri,December 15, 2017 05:56 PM

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అలా చేస్తే తెలుగును ఒక భాషగానైనా బతికించడానికి సీఎం గారు పకడ్బందీ ప్రయత్నాలు చేస్తున్నారనే సందేశం రాష్ట్ర నలుమూలల మార్మోగుతుంది. అలావారు తెలుగు నేర్చుకున్నవారికి ఎన్నో ఉద్యోగాలు కల్పించిన వారవుతారు.

ఇక తెలుగుభాష మిగలదేమోనని ఆవేదన చెందుతున్న రోజుల్లోనే ఉన్నట్లుండి తెలుగు మీడియం ఇక మీదట ఉండదు, ఎందుకంటే తల్లిదండ్రులు, వారిపిల్లలు ఇంగ్లీష్ మీడియ మే కావాలని కోరుతున్నారని అన్న ముఖ్యమంత్రి గారే ఉన్నట్లుండి కేజీ నుంచి పీజీ వరకు తెలుగు ఒక అధ్యయన భాషగా ఉం టుందని ప్రకటించడం తెలంగాణ వారినందరిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తింది. ఒక్కమాట తెలుగు భాష పరిరక్షణ సమితి నిర్వహించిన సభల్లో ప్రజలు తెలుగును ఒక అధ్యయన బోధనా భాషగానైనా నిర్దేశించకపోతే అది ససేమిరా బతుకదని ముక్తకంఠంతో కోరారని, అటు కోరిన ప్రజలకు, ఇటు నిర్వహించిన వారికి కూడా కాస్తా క్రెడిటిస్తే మరింకెంతో సంతోషించేవారం. ప్రజలు కోరుతున్నారని కదా ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు. అదే ప్రజలు తెలుగు భాషా పరిరక్షణ సమితి నిర్వహించిన సభల్లో ఇది కోరారు కనుకే ప్రజల వాయిస్‌కు అనుగుణంగా ఇది చేస్తున్నామంటే మొదటి సమాధానానికి రెండవ సమాధానం సరిపోయేది. లేకపోతే రెండూ వారి ఇష్టానుసారమే చేశారనుకోవడానికి ఆస్కారముం ది కదా? అంత కష్టపడి అన్ని సభలు అంతమందితో నిర్వహించాం కదా? అంతమంది వాటికి హాజరయ్యారు, వాటిలో మాట్లాడారు కదా? ఒక టీవీ ఛానల్ సౌజన్యంతో వాటిని సీఎం దృష్టికి తీసుకురావడానికి రెం డు రోజులు ప్రసారం చేయించాం కదా! Do we not desreve a wor d of appreciation and acknowledgement from the CM మేమంతా ప్రజలమే కదా!

కంచె ఐలయ్య తెలుగుభాషా వ్యతిరేకానికి దీటుగా సమాధానం చెప్పిం ది మేమే, మా సభ ద్వారానే. అవి భాషపైనా ఇంతవరకు కనీవినీ ఎరుగ ని సభలు, కొన్ని వేల మంది అటెండ్ చేసిన సభలు. ఎంతోమంది పెద్ద లు, యువకులు, విద్యార్థులు పాల్గొన్న సభలు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఈ సమయాన్నైనా ఒక మంచి మాటైనా సీఎం గారు వాటి గురించి అంటే వారందరూ వారి చేతులను బలపరిచినందుకు ప్రజాస్వామ్యంలో సీఎం గారికి ప్రజల గొంతు వినడం ఎంత ఇష్టమో తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటిది కనీస ధర్మం కాదా మరి?
ఆ సభల్లో తెలుగు ఒక భాషగా చదివేవారికి ప్రోత్సాహకంగా ఉద్యోగ నియామకాల్లో, ఉన్నతుల్లో, టెక్నికల్ కోర్సు అడ్మిషన్లలో, తెలుగు ట్రాన్స్‌లేషన్ విభాగంలో, తెలుగు అకాడమీలో, తెలుగు యూనివర్సిటీలో, కల్చరల్ డిపార్ట్‌మెంట్‌లో, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌లో, అలాంటి తెలు గు భాష విరివిగా ఉపయోగించే వాటన్నింటిలో తెలుగు భాషలో అత్యధిక మార్కులతో పాసయ్యేవారికి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని కూడా సూచన చేయడం జరిగింది. (యూజీసీ వారు లెక్చరర్ ఉద్యోగాలు మొత్తం పరీక్షల్లో 55 శాతం వేస్తేనే కాని ఇవ్వగూడదనే నిబంధన చేశారు. కనీసం అలాంటి నిబంధననైనా మనం తెలుగు భాష కోసం చేయవచ్చు) అలాగే తెలుగు అనువాదాల యూనివర్సిటీ ఒకటి స్థాపించి దానిద్వారాకూడా తెలుగుభాషను ప్రోత్సహిస్తే, యూనివర్సిటీ ఫర్ జర్నలిజంను కూడా స్థాపిస్తే బాగుంటుందని సూచనలు కూడా చేశాం.

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటి గురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అలా చేస్తే తెలుగును ఒక భాషగానైనా బతికించడానికి సీఎం గారు పకడ్బందీ ప్రయత్నాలు చేస్తున్నారనే సందేశం రాష్ట్ర నలుమూలల మార్మోగుతుంది. అలావారు తెలుగు నేర్చుకున్నవారికి ఎన్నో ఉద్యోగాలు కల్పించిన వారవుతారు. దానికి తెలంగాణ వారందరూ వారిని చిరకాలం గుర్తుంచుకుంటారు. లేకపోతే తెలుగు భాషకు మున్ముందు ఏం జరుగుతుందోనని అనుకుంటారు.
తెలుగు భాష బాగా చదువడానికి ఎలాంటి ప్రోత్సాహకాలిస్తే బాగుంటుందనే విషయాన్ని లోతుగా పరిశీలించి సూచనలివ్వడానికి సీఎం గారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా వేసి ప్రకటిస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఈ సందర్భంగా పీవీ గారు లాం గ్వేజ్ పాలసీకి, ఎంప్లాయ్‌మెం ట్ పాలసీకి సంబంధం ఉండాలని, తెలుగు భాష చదివేవారికి ప్రోత్సాహకాలుండాలని ఆ రోజుల్లో ఏమన్నారో మరొకసారి ఇచట ఉటంకిస్తున్నాను.

kondal-rao ప్రతి సంవత్సరం పదివేల మంది, ఇరువై వేలమంది, యాభై వేలమంది బీఏలు, బీఎస్సీలు తెలుగు మీడియంలో పాసయి ఏమి చేయాలి వీళ్ళు? వీళ్లకి ఉద్యోగాలేవీ? చెప్పండి. ఇస్తున్నారా మీరు? ఇంగ్లీష్ మీడియంలో చదివితే కాశ్మీర్‌కైనా, బొంబాయికైనా పోతాడని అంటారు... అక్కడి వారికి ఉద్యోగాల అర్హతలు లేనట్లు మనవారికే ఉన్నట్లు. ఇహ మన మే ఎగుమతి చేయాలన్నట్లు. చేయకపోతే వారికి ఉద్యోగాలకు మనుష్యు లే లేనట్లు. కనుక ఎడ్యుకేషన్ పాలసీకి ఎంప్లాయ్‌మెంట్ పాలసీకి సమన్వయం లేకపోతే మరి ఆ పాలసీ ప్రవేశపెట్టినవాడు ఈ పాలసీ ప్రవేశపెట్టకపోతే అది ఫెయిలవుతుంది కదా మరి!
తెలుగు చదివేవారినేమో చదివించి తుదకు నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా అని అడిగితే ఎలా? నీకు తెలుగొస్తుందా, తెలుగొస్తే నీకేదో ఉద్యోగంలో, ప్రమోషన్‌లో ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పడానికైనా. తెలుగొస్తే నీకు ఉద్యోగాలకు నియామకాల్లో, ప్రమోషన్స్‌లో కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పగలుగాలి కదా. అలాంటి మాట ఉద్యోగాలు ప్రమోషన్లు ఇచ్చే పాలసీలో లేకపోతే ఎలా?
(6-8-1973వ తేదీన జరిగిన తెలుగు అకాడమీ పంచవర్షీయోత్సవంలో నూతన గ్రంథాలను ఆవిష్కరిస్తూ అకాడమీ అధ్యక్షులుగా పి.వి.నరసింహారావు గారు చేసిన ప్రసంగ పాఠం నుంచి జయంతి ప్రత్యేక సంచికలోని బోధనభాష-సమ్యగ్దృష్టి అన్న వ్యాసం నుంచి.. పేజీ 94)

1356

KONDAL RAO VELICHALA

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles