మహాసభలతో తెలుగు వెలుగులు


Thu,November 30, 2017 11:39 PM

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాసభల్లో పాలుపంచుకునే సుప్రసిద్ధులను, ప్రముఖులను అన్నిచోట్ల నుంచి ఆహ్వానించాలి. ప్రపంచ తెలుగు మహాసభలతో మన తెలుగు వెలుగులు ప్రపంచ నలుమూలలా కాంతులీనేలా నిర్వహించాలి.

ఇటీవలి తెలుగు మహాసభలకు చెందిన సమాలోచన సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రారంభ, ముగింపు సుదీర్ఘ ప్రసంగాలు చాలామందిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచాయి. సభ నాలుగు గంటలకు మొదలై తొమ్మిది గంటలకు ముగిసిం ది. దాదాపు ఆరు గంటలు ఒక ముఖ్యమంత్రి సాహిత్య సాంస్కృతిక సభలో ఓపికగా కూర్చుని వినడమే మున్నెన్నడూ కనీవినీ ఎరుగని విచిత్రమంటే, స్వయంగా సాధికారతతో రెండు గంటలు మాట్లాడటం కూడా మరొక వింత.

ఈ సభ సీఎం కేసీఆర్‌కు సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న ఆందోళన, ఆసక్తిని ప్రస్ఫుటం చేసింది. వారికి వాటిపై గల అవగాహనను కూడా మరింత సువిదతం చేసింది. ఇదెంతో శుభసూచకం. వాటి భవిష్యత్తు బాగుండబోతున్నదనడానికి ఇది తార్కాణం. సమావేశంలో అందరికీ అవకాశం ఇవ్వడం మరొక మంచి సంప్రదాయం. దానికి సీఎం కేసీ ఆర్, రమణాచారిగార్లు అభినందనీయులు. సాధారణంగా ఇలాంటి సభ ల్లో ముగ్గురు, నలుగురు మాత్రమే సభాకార్యక్రమాలను డామినేట్ చేస్తా రు. ఈ సమావేశంలో అందరికి వారివారి అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛ లభించింది. ఇలాంటి సత్సంప్రదాయం ఇకముందు కూడా అవలంబిస్తే బాగుంటుంది. ఈ సభలో నేను మూడు సూచనలు చేశాను.

1. పుస్తకాలు చదువడం మరీ తక్కువవుతున్న, వాటిని కొని చదువుతున్న పద్ధతి సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం సాహిత్య సాంస్కృతిక సభల్లోనైనా దుశ్శాలువలు తదితర బహుమతులకు బదులు తెలుగులో ప్రచురించబడిన మంచి పుస్తకాలను ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని బహుమతులుగా ఇస్తే బాగుంటుంది.(వాటిని దుశ్శాలవలతో సహా కూడా ఇవ్వవచ్చు.) దానివల్ల రెండు లాభాలుంటాయి. కనీసం మంచి పుస్తకా లు ఇలాగైనా కొనుగోలు చేయబడుతాయి. ప్రభుత్వం రచయితలకు కొం త సహాయపడినదవుతుంది. ఇంటింటా బహుమతులుగా ఇవ్వబడిన పుస్తకాలుంటాయి. కనుక కొంతమందైనా వాటిని చదువడానికి అవకాశం ఉంటుంది. పుస్తకం హస్త భూషణం అను వాడుక మనకు ఎలాగూ ఉంది. కాబట్టి పుస్తకాలు ఇంటింటా ఆభరణాల్లాగా, అలంకారాలలాగైనా ఉండిపోతాయి.

మనం ఎప్పుడూ ఏదైనా ఒక కొత్త విషయం చేయాలని ఉబలాటపడుతుంటాం. సీఎం కేసీఆర్ కొత్త సంప్రదాయాల పక్షపాతి కదా? అందుకని వారి హయాంలో బహుమతులు ఇవ్వడానికి ఒక సరికొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినవారు కూడా అవుతారనే భావన నాది. 2.సీఎం కేసీఆర్ తెలుగు భాషను ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరి చేసి చాలా మంచి పనిచేశారు. తద్వారా సీఎం వారి గౌరవాన్ని నిలబెట్టుకున్నారు, ఇటు తెలుగు భాష గౌరవాన్ని నిలబెట్టారు. తెలుగుభాషా పరిరక్షణ సమితి అయిదు జిల్లాల్లో ఎంతోమంది మంత్రులు, ఎంపీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న కిక్కిరిసిన సభల్లో అందరూ ఏకగొంతుకతో తెలుగును కనీసం కేజీ నుంచి పీజీ వరకు తప్పనిసరిసరిగా నైనా నిర్దేశించాని కోరిన కోరికను సీఎం కేసీఆర్ విని స్పందించారు. ఆ సంస్థ అధ్యక్షునిగా నేను ప్రత్యేకంగా ఇదివరకే వారికి కృతజ్ఞతలు తెలిపా ను. మరొకసారి కూడా ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగుభాషను ఒక భాషగానైనా విద్యార్థులు సీరియస్‌గా చదువాలంటే ఆ భాష చదివేవారికి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని కోరాను. ఆ ఇన్సెంటివ్స్ కోసమైనా ఆ భాష బాగా చదువబడుతుందని, లేకపోతే అది సంస్కృతం చదివేవారి చదువులాంటిదే అవుతుంది. ఉద్యోగ నియామకాల్లో, వారి ఉన్నతుల్లో, ఉన్నత విద్య సాంకేతిక ప్రవేశాల్లో, స్కాలర్‌షిప్ ఫ్రీషిప్స్‌లో, తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, తెలుగు ట్రాన్స్‌లేషన్, కల్చరల్ డిపార్ట్‌మెంట్, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ మున్నగువాటికి చెందిన నియామకాల్లో తెలుగులో మార్కులు బాగా వచ్చినవారి కి మాత్రమే ఉద్యోగాలిచ్చే విధానాలను అవలంబిస్తే కానీ తెలుగు భాషా బోధనా అధ్యయనాలకు ప్రాధాన్యం పెరుగుతుంది.మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అన్నట్లు ఏ భాషా పాలసీ అయినా ఎంప్లాయిమెంట్ పాలసీ దానికి అనుగుణంగా లేనిదే సఫలం కాదు. అందుకే గతంలో ఉర్దూ మీడియంలో చదివినవారికి ఎన్నో ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది.
kondal-rao
పీవీ గారు తెలుగు అకాడమీ పంచవార్షికోత్సవాల్లో నూతన గ్రంథాలయాలను అవిష్కరిస్తూ ఈ విషయంగా ఏమన్నారో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏటా పదివేల మంది, ఇరువై వేలమంది, యాభై వేల మంది బీఏలు, బీఎస్సీలు తెలుగు మీడియంలో పాసై ఏం చేయాలి వీళ్ళు? వీళ్లకు ఉద్యోగాలేవీ? చెప్పండి. ఇస్తున్నారా మీరు? ఇంగ్లీష్ మీడియంలో చదివితే కశ్మీర్‌కైనా, బొంబాయికైనా పోతాడని అం టారు. అక్కడివారికి ఉద్యోగాల అర్హతలు లేనట్లు మనవారికే ఉన్నట్లు. ఇహ మనమే ఎగుమతి చేయాలన్నట్లు. చేయకపోతే వారికి ఉద్యోగాలకు మనుషులే లేనట్లు. కాబట్టి ఎడ్యుకేషన్ పాలసీకి ఎంప్లాయ్‌మెంట్ పాలసీకి సమన్వయం లేకపోతే మరి ఆ పాలసీ ప్రవేశపెట్టినవాడు ఈ పాలసీ ప్రవేశపెట్టకపోతే అది ఫెయిలవుతుంది కదా మరి!
తెలుగు చదివేవారినేమో చదివించి తుదకు నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా అని అడిగితే ఎలా? నీకు తెలుగొస్తుందా, తెలుగొస్తే నీకేదో ఉద్యోగంలో, ప్రమోషన్లో ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పడానికైనా.. తెలుగొస్తే నీకు ఉద్యోగాలకు నియామకాల్లో, ప్రమోషన్స్‌లో కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పగలు గాలి కదా. అలాంటి ప్రాధాన్యం ఉద్యోగాలు ప్రమోషన్లు ఇచ్చే పాలసీలో లేకపో తే ఎలా? 1973, ఆగస్టు 6న జరిగిన తెలుగు అకాడమీ పంచవర్షీయోత్సవంలో నూతన గ్రంథాలను ఆవిష్కరిస్తూ అకాడమీ అధ్యక్షులుగా పీవీ నర్సింహారావు చేసిన ప్రసంగ పాఠం ఇది. తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాసభల్లో పాలుపంచుకునే సుప్రసిద్ధులను, ప్రముఖులను అన్నిచోట్ల నుంచి ఆహ్వానించాలి. ప్రపంచ తెలుగు మహాసభలతో మన తెలుగు వెలుగులు ప్రపంచ నలుమూలలా కాంతులీనేలా నిర్వహించాలి. మన కీర్తి ప్రతిష్ఠలు హిమశిఖరాయమానం కావాలి.

1052

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles