తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!


Sat,April 22, 2017 11:35 PM

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాంటిది కావాలి.

kondalrao
భరతుడు పాలించిన దేశం కనుక భారతదేశం అని పేరు పెట్టబడిందట. భారతదేశం కూడా ప్రాంతానికి పేరే కాని భాషకు పేరు కాదు. భాషల పేరిట కూడా రాష్ర్టాలున్నాయి. కన్నడ, మలయాళ, తమిళ మున్నగునవి. కానీ భాషలను తల్లులుగా భావించి వాటి పేరుతో ఎవ్వ రూ తల్లులను సృష్టించి ప్రతిష్ఠించలేదు ఒక్క తెలుగు వాళ్లు తప్ప. సకల భాషలకు, విద్యల కు సంగీత సాహిత్యాలకు అనాదిగా మనం భావించే తల్లి సరస్వతి. ఆమెను అన్నిటికి తల్లి గా భావించినపుడు వాటి పేరిటే మరొక తల్లిని సృష్టించడం సవతి తల్లిని సృష్టించడమౌతుంది. అసలు తల్లి అన్ని భాషలకూ ఒక్కటే, సరస్వతి.

అందువల్ల మనం తెలంగాణ తల్లి అనవచ్చునేమో కాని తెలు గు తల్లి అనగూడదు. తెలుగు భాష పేరిట ఆంధ్ర ప్రాంతంలోనైనా, తెలంగాణ ప్రాంతంలోనైనా తెలుగు తల్లిని సృష్టించడం, ప్రతిష్ఠించడం సరస్వతినే అవమానించినట్లవుతుంది.తెలుగంతా ఒకటే కనుక తెలుగు వారంతా ఒకటే కావాలి. అలాగే తెలుగు భాషా ప్రాంతాలన్నీ ఒకటే కావాలి అని అంటూ తెలుగు భాష కన్నా ఎక్కువ హైదరాబాద్‌పై కన్నేశారు. తీరా ప్రాంతాలన్నీ ఒకటయ్యాక రామన్న గుడిలో భీమన్న దూరె నన్నట్లు ఆధిపత్యం సంపాదించాక తెలుగు వారికే అసలు ప్రాంతమైన తెలంగాణనే అన్నివిధాలా అణగదొక్కారు. తెలుగు భాషకే తల్లి భాషైన తెలంగాణ తెలుగును అన్నివిధాలా అవమానాల పాలు చేసి ఆంధ్రానేతలు విభజనకు దారితీశారు.

అలాంటి గత చరిత్రకు చెందిన తెలుగు తల్లిని మనమెందుకు స్వీకరించాలి? అలా ఆ పేరును మనమెందుకు అరువడుక్కొచ్చుకోవాలి? అపుడు తెలుగు భాషలు ఒకటా, రెండా, వాటికి తల్లులు ఒకరా, ఇద్దరా అన్న ప్రశ్నలు ఎవరైనా లేవదీస్తే మనమెందుకు అవాక్కవాలి. ఒక నదికి పాయలెన్నైనా అయినట్లు ఒక భాషకు పాయలెన్నైనా దాని మూలం ఒకటే ఔతుంది కదా! ఎందుకంటే భాష కూడా ఒక విధంగా నదిలాంటిదే కదా!
ఆ ప్రాంతంలో నెలకొల్పే విగ్రహాన్ని కూడా తెలుగు తల్లి అని సంబోధిస్తే, మనం కూడా అదే పని చేస్తే ఆ తల్లి వేరు, ఈ తల్లి వేరా? అని పదిమంది ఫక్కుమని ఎద్దేవా చేయవచ్చు, నవ్వవచ్చు.

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాంటిది కావాలి. అలాంటిది తెలంగాణ ఉద్యమ మొదటిరోజుల్లో చిన్నదైనా చిచ్చరపిడుగులా నిలదొక్కుకొని నినదించిన ఒకనాడు సిటీ కాలేజ్ నుంచి ప్రారంభించిన demonstration లో పాల్గొని జై తెలంగాణ అంటూ ఎత్తిన జెండాను దించక అలాగే పట్టుకొని బుల్లెట్లకు గురై మరణించిన బాలిక మనకుంది. ఆ బాలికను సింబాలిక్‌గా తీసికోవాలి. దానిని తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్ అని ఆమె పేరిట నెలకొల్పుకుంటే ఎంతో సమంజసంగా ఉంటుంది. అలాంటిది ఉద్యమానికి ప్రతీక అవుతుంది కాని భాషకు కాదు. కాకపోతే తెలుగుతల్లికి బదులు తెలంగాణ తల్లి అనికూడా అనవచ్చు.

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్ అని శిల్పానికి పేరిడితే అది ఏ వ్యాఖ్యానం అక్కరలేకుండా జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి తెలంగాణ ధీరవనితయని వెంటనే స్ఫురించి అందరికీ అవలీలగా అర్థమౌతుంది. కానీ తెలంగాణ తల్లి అని శిల్పానికి పేరిడితే అలాంటిది తల్లిలాగా ఉంటుంది. కనుక ఉద్యమానికి చెందిన ఒక వీర వనిత ను తల్లిలా భావించడానికి కుదరదు కదా! అటు ఫ్రెంచి జోన్ ఆఫ్ ఆర్క్ అయినా, ఇటు మన తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్ అయినా ఏళ్లు మీదబడని వారే కాని ఏళ్లు మీదబడిన వారు కూడా కాదు కదా! (ఒకామె 19 ఏళ్లదైతే ఇంకొకామెకు 16 -17 ఏళ్లు కావచ్చని వినికిడి.) ఇద్దరూ స్వాతంత్య్ర పోరాటాల్లో గొంతుపైకెత్తి నినదించినవారే, ఎత్తిన జెండాను దించనివారే. ఒకరు హెయిల్ ఫ్రాన్స్! అని అరుస్తూ చనిపోతే, ఇంకొకరు జై తెలంగాణ అని అరుస్తూ అసువులు కోల్పోయినవారే. కనుక వారు నాటి ఆమెను ఎలాగైతే ఫ్రాన్స్ జోన్ ఆఫ్ ఆర్క్ అని సంబోధించినట్లే, నేటి ఈమె ను మనం తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్ అని సంబోధిస్తే సందర్భోచితంగా ఉంటుంది. శిల్పి కి శిల్పాన్ని చేయడంలో ఒక వీరవనిత ప్రతీక ఆధారమవుతుంది. అదక్కరలేకపోతే దానిని మనం తెలంగాణ ఝాన్సీ అని అనవచ్చు. అదీ అక్కరలేకపోతే తెలంగాణ తల్లి అని కూడా అనవచ్చు.

కనుక తెలుగు తల్లి స్థానే, పూర్వం అలాంటిది నెలకొల్పిన చోటైనా లేకపోతే మరొక అనువైన చోటైనా మంచి శిల్పితో జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి లేక ఝాన్సీరాణి లాంటి శిల్పాన్ని చేయించి నెలకొల్పి దానికి తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్ లేక తెలంగాణ ఝాన్సీ యని పేరు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదీ ఇదీ రెండూ కాకపోతే తెలంగాణ తల్లి అని కూడా అనవచ్చు. అప్పుడు తెలుగు భాషకు కాదు తెలంగాణ ప్రాంతానికి తల్లిలాంటిదవుతుంది. మన అస్తిత్వవాదాన్ని, పోరాటాన్ని అచ్చంగా చాటగలుగుతుంది.

మూడేళ్ల పరిపాలనా సంబురాల్లో ఈ శిల్పావిష్కరణ సంబురాన్ని కూడా జోడిస్తే బాగుంటుంది. ఎన్నో స్వాతంత్య్ర పోరాటా ల్లో పాల్గొని, ఎన్నో కరవళ్లు మోసి, కారాగృహాల పాలైన నాబోటి సీనియర్ మోస్ట్ ఫ్రీడమ్ ఫైటర్‌కు ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసే సంబురాన్ని కలిగిస్తే అది సంబురానికి మరింత సంబురం, సమంజసానికి మరింత సమంజసం జోడించినట్లవుతుంది. నిజమైన త్యాగానికి ఎవరమైనా ఏమివ్వగలం? సంవత్సరానికొక్కసారైనా అలాంటి వారిని సగౌరవంగా తలచుకోవడం, వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్కరించి, రవీంద్రభారతిలాంటి ఒకచోట వారి పేరిట సంతాప సభ జరిపి వారిని స్మరించుకోవడం తప్ప.

ఆ శిల్పం నెలకొల్పిన చోటుకు, అది నెలకొల్పబడిన రోజున విద్యార్థులను అత్యధికంగా రప్పించాలి. వారందరితో కిక్కిరిసిన సభ నిర్వహించి ఆ శిల్పాన్ని గురించి వివరించి వారికి ఎంతో త్యాగస్ఫూర్తి, దేశభక్తి, రాష్ట్రభక్తి కలిగించవచ్చు. తద్వారా వారికి వినయమంటే, వికాసమంటే, వివేకమంటే ఏమిటో పుస్తకాల ద్వారానే కాక చక్కటి ఉపన్యాసాల ద్వారా తెలియజేయవచ్చు.
వివరణలు:
1.మనం తరచుగా మాతృభాష, మాతృభూమి అని అంటుంటాం. మాతృభాషంటే మనం దానిని ఇంట్లో మాట్లాడే తల్లి భాష అని అర్థం చేసుకోవాలి. ఆ భావన మాతృభాషలో విద్య గరిపితే బాగుంటుందను భావంతో ముడిబడి ఉంది. మాతృభూమి అంటే మనం పుట్టిన చోటు లేక నేల అని అర్థం. అది మన భూమితో సహా అన్ని భూములకు భూదేవి యను అర్థంలో వాడబడే పదం. ఆ పదాలకు తెలుగుతల్లి అంటే భాషామతైల్లెన సరస్వతి అర్థం రాదు. 2.జోన్ ఆఫ్ ఆర్క్ ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల మధ్య 1431లో జరిగిన భయంకర పోరాటంలో చిన్న వయసులోనే (19 సంవత్సరాలు) ఎంతో ధైర్యంగా పాల్గొని చనిపోయిన (చంపబడిన) వీరవనిత. ఆమె అద్భుతమైన శిల్పాన్ని ప్యారిస్ నగర నడిబొడ్డులో నెలకొల్పారు.
-(వ్యాసకర్త: తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ వ్యవస్థాపక కన్వీనర్)

785

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles