ఆంగ్లం వల్ల ఆలస్యం


Thu,February 2, 2017 01:22 AM

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి చెందాడో బేరీజు వేసుకుంటే మనకు మన అసలు సిసలైన అభివృద్ధి తెలుస్తుంది. అదే తేలుస్తుంది నిజమైన అభివృద్ధిని, సంస్కారాన్ని, సంస్కృతిని కూడా.

మన కార్యాలయాల్లో ఆలస్యానికి మూడు ముఖ్య కారణాలుంటాయి. ఒకటి లంచం కోసం, రెండవది చేయవలసిన పని చేయరాకపోవడం, మూడవది ఇంగ్లీష్ భాష సక్రమంగా రాయరాకపోవడం. ఈ మూడు విద్య విద్య కాకపోవడానికి, శిక్షణ శిక్షణ, భాష భాష కాకపోవడానికి చెందినవి.లంచం కోసం ఆలస్యం చేయడం గురించి నేను రాయను. ఎందుకం టే అది అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ భాష సక్రమంగా రాకపోయినందు న కార్యాలయాల్లో జరుగుతున్న కాలయాపన గురించి అనుభవపూర్వకంగా రాస్తాను. కాస్త శిక్షణ గురించి కూడా.
ఇంగ్లీష్ భాష అందరికీ రావాలి. ఎందుకంటే అది అంతర్జాతీయ భాష కనుక, మన ఆంగ్ల మాధ్యమం మోజువల్ల అది ఇప్పుడు స్వదేశీయ రాజభాష కూడా అయిపోయింది, అయిపోతోంది కాబట్టి. అవును కానీ, అది బాగా రావాలి కదా? బాగా రావాలంటే బాగా కష్టపడి నేర్చుకోవాలి, కష్టపడి నేర్పాలి కదా మరి? అలా అది నేర్వబడుతుందా? నేర్పబడుతుందా? అనేవి రెండు ముఖ్య ప్రశ్న లు. నేర్వబడటం లేదు, నేర్పబడటం లేదనే జవాబులు పలు ఉదాహరణలతో ఇవ్వవచ్చు. అవి మన ప్రభుత్వరంగ కార్యాలయాల్లో మనకు కళ్ళారా కనబడుతూనే ఉంది. ఆ భాష చక్కగా రానితనం పెద్ద ఆఫీసర్ నుంచి చిన్న ఆఫీసర్ వరకు వివిధ మోతాదుల్లో ఉంటుంది.

ఆ రానివారిలో నేనూ ఒకడిని కనుక నేను నా అనుభవం కొద్ది రాస్తు న్నా. నాకు ఆంగ్లభాష రాక పడ్డ ఇబ్బందులు అనేకం. నేను ఆంగ్లంలో ఏదో రాసి దానిని పదిసార్లు దిద్దడం, అయినా కనీసం కామా, ఫుల్‌స్టాప్, కోలన్, సెమికోలన్ లాంటి తప్పులు ఖాయం కాబట్టి. ఇక అండర్ ఆఫీసర్స్, మరీ కిందిస్థాయి వారి అంగ్రేజీ తప్పులు కోకొల్లలు. వాటిని ఒకర య్యాక ఇంకొకరు, మధ్యవారు, పైవారు సవరించడం మామూలే. అయి నా ఆఖరికి ఎన్నో కొన్ని మిగులుతూనే ఉంటాయి. దీనివల్ల ఒక ఫైల్ ఒక రోజులో ముగించగలిగేది పదిరోజులైనా పడుతుంది. ఆంగ్లం సరిగా రాని సిబ్బంది వాటిని పడవేసే ఫైల్స్ ఎన్నో ఉంటాయంటే నమ్మండి. ఒకరెవరై నా దొరుకాలి దానిని రాసిపెట్టడానికి. లేకపోతే పైవారు, ఇదేం భాషయ్యా? అని నాలుగు మాటలను మళ్లీ రాసుకరమ్మని తిప్పి పంపించవచ్చు. అప్పటికీ మళ్లీ ఎన్నోకొన్ని తప్పులు దొర్లవచ్చు.

ఇది ఆంగ్లేయ భాషకు చెందిన ఇబ్బందైతే, ఎలా నోట్ రాయాలో, వివరణ రాయాలో, ఫార్మాట్ ఎలా ఉండాలో, ఎవరిని ఎలా అడ్రస్ చేయాలో చాలామందికి తెలియకపోవడం వల్ల జరిగే కాలయాపన మరొకటి. ఇది శిక్షణ అసలే లేకపోవడానికి, ఉంటే అది బాగా లేకపోవడానికి చెందింది. భాష తెలిసినంతనే సరిపోదు కదా, ఏం రాయాలో, ఎలా రాయాలో ఎవరికి ఎలా రాయాలో కూడా తెలియాలి కదా? అది సుశిక్షణ వల్ల, అనుభవం వల్ల వస్తుంది. ఇపుడు ఏ శిక్షణ లేకుండానే, ఏమం త నైపుణ్యాలు, అనుభవాలు లేకుండానే నియామకాలు, పదోన్నతులు జరుగుతున్నాయి. ఇక అలా నియమించబడిన వారి చేతుల్లో పడే ఫైల్స్ కాలయాపనకు గురికాక ఏమవుతాయి?

వీటివల్ల అవినీతి అందలానికెక్కక ఎలా ఆగుతుంది? వీటిని అంగ్రేజీ మాధ్యమం నుంచి కూడా వచ్చే వచ్చీరాని ఇంగ్లీష్ వచ్చిన వారి ద్వారా ఎలా అరికట్టగలం? శిక్షణ లేకుండా కేవలం ఏదో ఒకవిధంగా సంపాదించిన డిగ్రీల పేరిట వేల లక్షల ఉద్యోగులను నియమించి ఎలా ఆపగ ల? (ఆంగ్లేయ భాషా తప్పులు అనేకం చేసేవారిలో ఆంగ్ల మాధ్యమం ద్వారా చదివిన వారు కూడా కోకొల్లలు.)
మన వద్ద బీదరికానికి, దురాశకు చెందిన అవినీతి ఎంతోకొంత ఉం ది. అది ఎప్పుడూ ఉంటుంది. అది ఇక్కడే కాదు సుసంపన్న దేశాల్లో కూడా. అది పూర్తిగా ఎప్పుడూ పోదు. కానీ అవిద్యకు చెందిన అవినీతి, శిక్షణ లేని కారణంగా ఉద్భవించే అవినీతిని, భాష సక్రమంగా రాని అవినీతిని కొంతైనా అరికట్టవచ్చు కదా? దానికి కావలసినవి దృఢనిశ్చయా లు, సుస్థిర అభివృద్ధికి చెందిన నిర్ణయాలు మాత్రమే. కాని అస్థిర అభివృ ద్ధికి చెందిన నిర్ణయాలు కావు. అవి ఇంగ్లీష్ మీడియం లాంటి బహు కొద్ది మంది ( రెండు శాతం) ప్రయోజనాలకు, అవసరాలకు చెందిన నిర్ణయా లు కావు, బహుజనుల ప్రయోజనాలకు, అవసరాలకు చెందిన నిర్ణయా లు. తెలుగు మీడియంలో చదువం, చదివించం, చదివించకూడదనే వారిని ఒప్పించి, మెప్పించే నిర్ణయాలు.

మూకుమ్మడి ఆంగ్లేయ మాధ్యమం వల్ల మూకుమ్మడి కాలయాపన పెరుగడం ఖాయం. మూకుమ్మడి కాలయాపన వల్ల మూకుమ్మడి అవినీతి, మూకుమ్మడి అవినీతి వల్ల ఎఫీషియన్సీ ఎఫెక్టివ్‌నెస్ (efficiency effectiveness) తగ్గడం ఖాయం. వాటివల్ల అభివృద్ధి కుంటుపడ టం, అవినీతి మరింత పెరుగడం ఖాయం.

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి చెందాడో బేరీజు వేసుకుంటే మనకు మన అసలు సిసలైన అభివృద్ధి తెలుస్తుంది. అదే తేలుస్తుంది నిజమైన అభివృద్ధిని, సంస్కారాన్ని, సంస్కృతిని కూడా. దానినే ఇంగ్లీష్‌లో standard of life అంటారు. టీ.ఎస్.ఇలియట్ అనే మహాకవి, దానిని మన దిగజారుతున్న విద్యా ప్రమాణాలతో జోడించి ఇలా అంటాడు ఎంతో విచారగ్రస్తుడై.. Where is the knowledge we have lost in information? Where is the wisdom we hav -e lost in knowledge? Where is the Life we have lost in living? ఆ మూడింటికి మనం Where is enlightenment we have lost in education? Where is the education we have lost in qualificatio? అని జోడించవచ్చేమో.
doctor

1645

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles