అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ


Sat,November 5, 2016 01:24 AM

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్లాడాలి. అప్పుడే వారికి ఈ సమావేశంలో జరిగిన విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ మరాఠీ వారితో పాటు మరాఠీ మాట్లాడని రాష్ర్టాలకు చెందిన షెడ్యూల్డు కులాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన షెడ్యూల్డు కులాల ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారని మనం మదిలో ఉంచుకోవాలి. కొంతమంది బెంగాల్ నుంచి, బీహార్ నుంచి మద్రాసు నుంచి, పంజాబ్ నుంచి, ఆంధ్రా నుంచి ఇంక అనేకచోట్ల నుంచి వచ్చినవారు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. వారందరికీ ఇక్కడ మాట్లాడే విషయాలు అర్థం కావాలంటే ఇంగ్లీషులోనే మాట్లాడక తప్పదు. ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి ఒకసారి ఇంగ్లీషులో, తర్వాత మరాఠీలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను చెప్పదలుచుకున్నది అందరికీ అర్థం అవుతుంది. ఇవాళ ఇంగ్లీషులో మాట్లాడుతాను. రేపు మరాఠీలో మాట్లాడుతాను.
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉపన్యాసాల నుంచి

rao
ఇకముందు కేజీ నుంచి పీజీ వరకు తెలుగు భాషను ఒక భాషగా మాత్రమే బోధనా అధ్యయన భాషగా నిర్దేశింపబడుతుందని అధికారికంగా ప్రకటించబడింది.ఒక భాష పరిపాలనా భాష కానిదే, అది అన్ని రంగాలకు అన్నిచోట్ల వాడబడే భాష కానిదే, వాటికోసం అది బోధనా అధ్యయన భాష కానిదే అది అట్టే కాలం నిలువదని ఎవరో కాదు యునెస్కో ఏనాడో నిర్వచించింది.అన్ని అవసరాలకు, ఉద్యోగాలకు, వృత్తులకు చెందని భాష ను ఊరికే ఒక భాషగా మాత్రమే నేర్చుకోవడానికి ఎవరెంత నచ్చజెప్పినా ఎవరూ పట్టించుకోరు. అందెందుకు చదువాలి, దానివల్ల వచ్చే ఉపయోగాలేమిటీ అని ప్రశ్నించి దానిని దాటే సి పక్కదోవ పడుతారు. అందువల్లనే సంస్కృతాన్ని ఎవరూ అంత పట్టించుకోవడం లేదు. అలాగే ఒకప్పుడు ఉర్దూ భాష తెలంగాణలో పరిపాలనా భాష, బోధనా భాషగా ఉండేది. కానీ తెలుగు వారి పిల్లలు తెలుగును పట్టించుకోన ట్లే దానిని ఇప్పుడు ఉర్దూ మాతృభాష అయినవారే పట్టించుకోవడం లేదు. తెలుగు, ముస్లింల ఇళ్లల్లోనే వారి పిల్లలు ఆ భాషను నేర్చుకోవడం లేదు.

అలాంటప్పుడు తెలుగును ఒక భాషగా మాత్రమే బోధనా అధ్యయన భాషగా నిర్దేశిస్తే దానినెవరు నేర్చుకుంటారు? అది నామకార్థంగా సంస్కృతం లాగే నిలిచిపోతుంది, ఒకప్పటి రాజభాష అయినా ఉర్దూ భాషలాగే మాయమైపోతుంది. ఇంటిలో మాట్లాడబడని, వాడబడని భాష బయటలా మాట్లాడబడుతుంది, వాడబడుతుంది?
ఇప్పుడు మన ఇళ్ళల్లో పిల్లలందరూ ఇం గ్లీషే కదా మాట్లాడుతున్నారు. తెలుగు మాట్లాడలేరు, రాయలేరు, అర్థం చేసుకోలేరు, వాడలేరు. మరి ఇకముందు అదెలా బతుకుతుంది. అది నేర్చుకోవాలంటే, బతుకాలంటే కొన్ని మార్గాలున్నాయి.

బోధనా అధ్యయనాల్లో ఇంగ్లీషు, తెలు గు అనువాదాలను తప్పనిసరి చేయడం. వాటివల్ల ఉభయభాషలు బాగుపడుతా యి. తెలుగుభాష కలకాలం నిలిచిపోతుం ది. బోధనా మాధ్యమం ఇంగ్లీష్ అయినా కూడా గ్రామీణ ప్రాంతాల వారి, వెనుకబడిన వర్గాల వారి సౌకర్యం కోసం పది పన్నేండేండ్ల వరకు తెలుగును వ్యాఖ్యాన భాషగా, ఇంగ్లీష్‌ను పరిభాషగా బోధనా అధ్యయనాల్లో వాడటం (సాధ్యమైనంతవరకు ఉభయ భాషల ద్వారా బోధించడం).
తెలుగులో ఉద్యోగ పరీక్షలు తదితర పరీక్షలు రాయదలచుకున్నవారికి అలాంటి స్వేచ్ఛ కల్పించడం, తెలుగులో పరీక్షలు రాసేవారికి ఉన్నత విద్యా ప్రవేశాల్లో, ఉద్యోగాలలో కనీసం పదిశాతం ప్రోత్సాహక Concessions, incentives కల్గించడం.

ఇంగ్లీష్ మీడియంలో చదివే విద్యార్థుల సులభ అవగాహన కోసం తెలుగు అకాడమీ ద్వారా తెలుగులో కూడా మౌలిక అనువాద పాఠ్య పుస్తకాల ప్రచురణలు కొనసాగించడం, అదనంగా అందజేయడం.
అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్, తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో, ప్రభుత్వ సాంస్కృతిక పరిపాలనా విభాగంలో, శాసనసభ, సక్రెటేరియట్ మున్నగు వాటిల్లో అనువాద విభాగాలు నెలకొల్పి వాటికి తగు వసతులు, వనరులు సిబ్బంది సమకూర్చడం.

తెలుగు, ఇంగ్లీష్‌ఉ బోధనా సిబ్బంది నియామకాల్లో ఉభయ భాషా ప్రావీణ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఆ ప్రావీణ్యతలు కనుగొనడానికి ఉభయ భాషల్లో మౌలిక పరీక్షలు, లిఖిత పరీక్షలు నిర్వహించడం.
తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు, వివిధ కళాశాలల్లోని తెలుగు శాఖల ద్వారా తెలుగు మాతృభాష కాని వారికి, తెలుగు రానివారికి తెలుగు నేర్పడం.
తెలుగు భాషాభివృద్ధికి, ప్రత్యేకంగా పారిభాషా పదాల ప్రయోగ ప్రగతికి తెలుగు అకాడమీ ద్వారా, తెలుగు యూనివర్సిటీ ద్వారా, విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల ద్వారా పరిశోధనలు చేయించడం.
తెలుగు భాషా పరిరక్షణ సమితి ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించడం లేదు. గ్లోబల్ ఎకానమీ, దృష్ట్యా, అంతర్జాతీయ ఉద్యోగాల, ఉన్నత విద్యావకాశాల దృష్ట్యా దానిని ఆహ్వానిస్తున్నది. కానీ తెలుగును పోడగొట్టుకొని కాదు, తెలుగును రక్షిస్తూ, దానిని బాగుపరుస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని అమలుపరచమని ప్రభుత్వాన్ని కోరుతున్నది.

తెలంగాణ అస్తిత్వ వాదంతో తెలుగు అస్తిత్వవాదం కూడా ముడిపడి ఉన్నదని, తెలంగాణ అస్తిత్వ వాదం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వారం తెలుగు భాషకే ముప్పు తెచ్చుకోవడం బాగుండదని, దాని పరిరక్షణ కోసం ప్రభుత్వం కంకణం కట్టుకోవాలని, ఇంగ్లీష్‌ను తల్లిచూపు చూస్తూ, తెలుగును సవితి తల్లి చూపు చూడగూడదని ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నది.తెలుగుభాష అడుగంటే పరిస్థితులు ఏర్పడితే తెలుగు భాషను మెరుగుపరచటానికి ఇంటా బయటా జరుగుతున్న అనేకానేక సాంకేతిక పరిశోధనలు వెనుకబడుతాయని, ఇప్పుడు తెలుగు భాష వల్ల లభిస్తు న్న అనేకానేక రంగాల్లో ఉద్యోగాలు మాయ మై మధ్య తరగతి, కింది తరగతి ఉద్యోగావకాశాలు మరీ తగ్గి నిరుద్యోగ సమస్యలు ఏర్పడుతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నది.
అలాగే మన పిల్లల ఇంగ్లీష్ భాష మెరుగుపడాలంటే అనువాదాలను ప్రోత్సహించే మార్గం తప్ప మరో మార్గం లేదని కూడా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నది.

తెలుగు భాష రానురానూ అదృశ్యమైతే తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి కూడా మాయమవుతాయని, అది తెలుగువారి అస్తిత్వానికే ప్రమాదమని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నది. సమితి చేస్తున్న ఈ సూచనలను సవివరంగా ఆలోచించి తగు చర్యలు తీసుకోవడానికి తెలుగు భాసా పరిరక్షణ కమిషన్ లాంటిదొకటి వెంటనే స్థాపించి దానిద్వారా ఆ చర్చాగోష్ఠులు చేపట్టాలని కోరుతున్నది.తెలుగు భాషా పరిరక్షణ సమితి ఇంతవరకు వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, చర్చాగోష్ఠులు జరిపి ప్రజాభిప్రాయాలు సేకరించింది. ప్రజలు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారు. కానీ సమితి చేస్తున్న సూచలన్నింటికీ సుముఖంగా ఉన్నారని, అది సూచిస్తున్నప్పటికీ విశేష ప్రజాదరణ ఉందని ప్రభుత్వానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నది.

1438

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు