జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె


Sun,June 26, 2016 01:19 AM

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత పెరిగితే ఉద్యోగాలు అన్ని సమకూరుతాయి. ఆ అభివృద్ధి ఎంత ఇంట పెరిగితే ఆ ఉద్యోగాలు కూడా ఇంటనే అంత పెరుగుతాయి. దానికి కావలసింది మన విద్య అధికంగా జ్ఞానాత్మకం,సృజనాత్మకం కావడం.ఈ మధ్య ఇంగ్లీషు మీడియం గురించి చర్చ జరుగు తున్నది. ఇది బయటి ఉద్యోగాలకు ఎక్కువ పనికొస్తుంద ని, అది కూడా అమెరికా ఉద్యోగాలకని దాని చుట్టూరా తిరిగింది. ఆ ఉద్యోగాలు ఎన్ని, ఎలాంటివి, ఎందరి ప్రయోజనాలకు చెందినవి అని చర్చ జరుగలేదు. వాటివల్ల సగటుగా సమాజానికి జరిగే లాభమెంత, నష్టమెంత అనే దానిపై కూడా జరుగలేదు.

rao
జర్మనీ, జపాన్, చైనా, రష్యా, కొరియా, ఫ్రాన్స్, ఇంకా ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ దేశాలు వాటి మాతృభాషల ద్వారానే ఎందుకు బోధిస్తున్నాయి? అయినా ఆయా భాషల్లోనే చదువుకునే అక్కడి విద్యార్థులు వారి ఆలోచనాత్మకత, భావాత్మకత, జ్ఞానాత్మకత, సృజనాత్మకతను ఎలా పెంచుకొని వారే వారి ఉద్యోగాలు ఎలా పెంచుకుంటున్నారు, బయటి ఉద్యోగాలు ఎలా చేయగలుగుతున్నారు. మరి మన వారు ఎందుకలా చేయకుండా ఇంగ్లీషు మీడియం కావాలని కోరుతున్నారనే అంశంపై తగినంత చర్చ జరుగలేదు. అమెరికాకు పోదలచుకున్న వ్యక్తుల కోరికల ను దృష్టిలో పెట్టుకొని ఆ మాధ్యమాన్ని కోరడం, దాన్ని సమర్థించడం.. ప్రభుత్వపరమైన నిర్ణయా లు తీసుకున్నారు. విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి. అభివృద్ధి ఎంత పెరిగితే ఉద్యోగాలు అన్ని సమకూరుతాయి. ఆ అభివృద్ధి ఎంత ఇంట పెరిగితే ఆ ఉద్యోగాలు కూడా ఇంటనే అంత పెరుగుతాయి. దానికి కావలసింది మన విద్య అధికంగా జ్ఞానాత్మకం, సృజనాత్మకం కావడం.

మొదట ప్రభుత్వమైనా ప్రజలైనా ఇంగ్లీషు మీడియం వల్ల బహుజనుల ఉన్నతి సాధ్యమా అనే ప్రశ్నతో ఒక సర్వే లాంటిది చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఇంగ్లీషు మాధ్యమం వల్ల భాషా భారం విపరీతమౌతున్నది. ఆ భారం తరతరాల వరకు వెనుకబడిన వారికి మరీ ఎక్కువై మన విద్యార్థు లు గ్రిల్లింగ్ అండ్ డ్రిల్లింగ్‌కు (అంటే విషయం అర్థం కాక, అర్థం చేసుకోలేక, సందేహాలుంటే వాటిని ప్రశ్నలు వేసి తీర్చుకోలేక కంఠత పట్టడం) అలవాటు పడుతున్నారు. ఆ పద్ధతినే కింది విద్యల్లోనే కాక, పై విద్యల్లో కూడా కొనసాగిస్తూ వారి ఆలోచనాత్మకతను, భావాత్మకతను, జ్ఞానాత్మకతను, సృజనాత్మకతను కోల్పోతున్నారు. అందువల్లనే అంతర్జాతీయంగా మన వారి పరిశోధనా ప్రచురణలు అంతగా వెలువడటం లేదు, సాహిత్యంలో కానీ, తదితర రంగాల్లో కానీ అత్యుత్తమమైన అవార్డులు రివార్డులు, గుర్తింపులు మనకు రావడం లేదు. ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్, డిస్కవరీస్ అంతగా లేనందున మనవనే పేటెంట్స్, కాపీరైట్స్ అంతగా దక్కడం లేదు. మనం అప్పటికీ ఇప్పటికీ ఇతరులు సృజించిన వాటిని మాత్రమే వాడుకుంటున్నాం. మననమే స్వతహాగా వాటిని సృజించుకోవడం లేదు.

దీనికంతటికీ కారణం మన విద్య ఇంగ్లీషు భాషా భారం వల్ల గ్రిల్లింగ్, డ్రిల్లింగ్ లాంటిదై, దాని ఆలోచనాత్మకతను, భావాత్మకతను, జ్ఞానాత్మకత ను, సృజనాత్మకతను కోల్పోవడమే. ఇతరులు వారి స్థానిక భాషల్లోనే బోధనా అధ్యయనాలు చేస్తూ వాటిని కాపాడుకొని మరింత అభివృద్ధి చేసు కోవడమే. అది నిస్సందేహం, నిర్వివాదం. మనం చిత్తశుద్ధితో కనుకోవాలనుకొంటే దానికి ఎన్నో సాక్ష్యా లు దొరుకుతాయి. మనకు మనమే అధికంగా ఉద్యోగాలు సృష్టించుకొని మన కాళ్లపై మనమే నిలబడక మంది కాళ్ళపై నిలబడే దుస్థితి తెచ్చుకోవడానికి కారణం కూడా ఇంగ్లీషు మాధ్యమాన్ని చేబడుతూ మన సృజనాత్మకతను మనమే చేతులారా కోల్పోతుండటమే.
ఇంగ్లీషు మీడియం కావాలని కోరేవారు మొదట ఆ మీడియం వల్ల మన సృజనాత్మకత పెరుగుతుందా లేక తెలుగు మీడియం వల్లనా? అనే ప్రశ్నకు జవాబు చెప్పుకోవాలి. అందులోనే వారికి అన్ని జవాబులూ దొరుకుతాయి. ఇంగ్లీషు భాష ద్వారా మన సృజనాత్మకత పెరిగితే అది మంచిదే కాని, అలా జరుగడం లేదని పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అయినా ఎందుకు మరి మనం దాన్నే కావాలని కోరడం, చేబట్టడం! తద్వారా మన ఉద్యోగాలు మనమే ఎక్కువ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతూ కొద్దిపాటి ఉద్యోగాల కోసం పరదేశాలకు చేతులు చాపడం?

ఆదరాబాదరాగా అడుగులు వేసి ఆంగ్లభాష ద్వారా బోధనా అధ్యయనాలు చేపట్టి వెనుకబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. జరిగిన నష్టమేదో ఇంతవరకే జరిగింది. కానీ ఇకనైనా కాస్త సావధానంగా ఆలోచించి సరియైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సవినయంగా కోరుతున్నాను. అలా చేయకపోతే వెనుకబడిన వారి ప్రయోజనాలు మరీ దెబ్బతింటాయని అది తప్పదని, అటు వెనుకబడినవారిని, గ్రామీణులను, ఇటు పాలకులకు తెలియజేస్తున్నా.
తెలుగు మీడియం వెనుకబడిన వారికి ఒక రిజక్లేషన్ లాంటిది. దానిద్వారా వారు వారికన్నా ముందున్నవారిని సులభంగా వెంటాడవచ్చు. వారికన్నా కూడా ముందడుగు వేయవచ్చు.

వారికి కావలసినవి మంచి వసతులు, వనరులు గల విద్యాలయాలే కాని ఇంగ్లీషు మీడియం విద్యాలయా లు కావు. ఈ విషయాన్ని వారు నెమ్మదిగా ఆలోచించుకోవాలి. ఇంగ్లీషు మీడియం మొత్తం జనాభాలో పదిశాతం వారికే మేలు చేకూరుస్తుంది. తక్కినవారికి కీడు చేస్తుందని కూడా దాన్ని కోరేవారు గుర్తించాలి. మంచి విద్య కోసం, మంచి వసతి సౌకర్యాలు, వనరులు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి బదులు గొట్టుదైన ఇంగ్లీషు మీడియం కావాలని కొందరు కోరడం వెనుకాల అంతర్జాతీయ కుట్ర కూడా ఏదో ఉండవచ్చని జనులు అచటచటా ముచ్చటలాడుకుంటున్నారని కూడా ఈ వ్యాసం ద్వారా దృష్టికి తీసుకొస్తున్నా.

901

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles