అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం


Fri,May 27, 2016 12:51 AM

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్లీష్‌ను ఒక భాషగా బోధించవలసిన అవసరం లేదు. అలా భాషా భారాలను కూడా తగ్గించవచ్చు... ప్రభుత్వ, ప్రైవేట్ తెలుగు మీడియం విద్యాసంస్థల్లో కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్‌ను ఒక భాషగా బోధించాలి. అలాగే అన్ని ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించాలి. తెలుగు పాలనాభాష కాబట్టి ఈ రాష్ట్రంలో చదివే వారందరికీ అది నేర్చుకోవడం తప్పనిసరి చేయాలి.

rao
సాంకేతిక విద్యలన్నీ చాలావరకు కౌశల్యాలకు చెందినవి. అవి ఎక్కువ ప్రాక్టికల్స్‌కు, తక్కువ theoriesకు చెందినవి. సామాజిక మానవీయ విద్యలు ఎక్కువ theoriesకు, తక్కు వ ప్రాక్టికల్స్‌కు చెందినవి. సాంకేతిక విద్యల్లో communication skills కన్నా operational skillsకే ప్రాధాన్యం ఎక్కువ. వీటిలో పరికరాల, పనిముట్ల పని ఎక్కువ, మనుషుల పని తక్కువ. ఆ పని ఎక్కువ వాటిని handle చేయడానికే చెందింది. వాటి నెలా వాడాలో, ఎలా ఉత్పత్తి చేయాలో వాటికి చెందిందే. కనుక వాటిలో భావ ప్రాముఖ్యం కన్నా భాషా ప్రాముఖ్యం తక్కువ. (అలాంటి సాంకేతిక విద్యలకు చెందినవారు ఉపాధ్యాయవృత్తి నిర్వహించునపుడు తప్ప)కానీ అలాంటి వారు తమ కౌశల్యాలు పెంచుకోవాలంటే ఎన్నో పుస్తకాలు, పత్రికలు చదవాలి. ఎందరితోనో చర్చించాలి, సంప్రదించాలి. కనుక వారికి భాషా ప్రావీణ్యం కూడా అవసరమవుతుంది. కాని అది నాన్‌టెక్నికల్ విద్యలైన సామాజిక మానవీయ విద్యల్లో అవసరమైనంత కాదు.

సాంకేతిక విద్యల్లో భాషాప్రమేయం కన్నా భావ ప్రమేయం, లాజిక్, రీజనింగ్‌ల ప్రమేయం ఎక్కువ కనుక, ఇంగ్లీష్ భాష ద్వారా కన్నా తెలుగుభాష ద్వారా చదివితేనే ఎక్కువ అబ్బే ఆస్కారముంటుంది. అందువల్ల ఇంటర్మీడియట్ వరకైనా తెలుగు మాధ్యమం ద్వారా చదివితే అలా చదివిన వారికి ఆ విద్యలకు చెం దిన conceptual knowledge, logic, reas-oning, analysis లాంటివి సులభంగా పట్టుబడుతాయి. భావ clarity అబ్బితే భాష కూడా సులభంగా సహకరిస్తుంది. ఎందుకంటే సాంకేతిక భాష చాలావర కు terminological భాష. అంటే పరిభాషే కనుక దానిలో మామూలు భాషాభాగం తక్కువ.
పెద్ద ఉద్యోగాలు, పెద్ద చదువులు తక్కువ vocal ఎక్కువ foculకు చెందినవి.

వాటిలో భాషకన్నా జ్ఞానానికి, భావానికి, లాజిక్‌కు, రీజనింగ్‌కు ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. వాటిలో ప్రతిభా కౌశల్యాలున్న వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అందువల్ల భాష కాస్త తక్కువైనా భావంలో, లాజిక్‌లో, జ్ఞానంలో బాగుంటే పెద్ద ఉద్యోగాలు రావడం, అలాగే ఉన్నత చదువులు చదవడానికి అర్హతలు సంపాదించుకోవడం సులభమవుతుంది.వాస్తవానికి పెద్ద ఉద్యోగాలకు, పెద్ద చదువులకు, జ్ఞానం బాగుండటానికి, లాజిక్ అండ్ రీజనింగ్ భావం సులభమై, కౌశల్యాలు మున్నగునవి బాగుండటానికి మాతృభాషలో బోధనా అధ్యయనాలే చాలా తోడ్పడతాయి. ఈ విషయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి. భాష.. భాష కోసం కాదు గదా! జ్ఞానం కోసం కదా! అందుకని ఏ పద్ధతి ద్వారా, ఏ భాష ద్వారా జ్ఞానోత్పత్తి జరగడానికి ఎక్కువ ఆస్కారముంటుందో ఆ భాష ద్వారానే విద్యలు నేర్చుకోవాలి. అలా నేర్పిన, నేర్చుకున్న వారికే ఉన్నతోద్యోగావకాశాలు, ఉన్నత విద్యాధ్యయన అవకాశాలు ఎక్కువ లభిస్తాయి.

ఇంగ్లీష్ మీడియం వెంటపడేవారు అటు ఇంగ్లీష్ చక్కగా రాక, ఇటు భావ మూ, జ్ఞానమూ, కౌశల్యమూ సులభం గాక కష్టనష్టాల పాలవుతారు, అవుతూ నే ఉన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇంగ్లీష్ మీడియం కోరేవారికి తెలిసినవారు నచ్చజెప్పాలి. కానీ ఆ భాషే అందరినీ అందలానికెక్కిస్తుందని భ్రమ, వ్యామోహం కలిగించకూడదు. అది మంచి చదువులకు అవసరమైన మంచి సౌకర్యాలు, తగినన్ని వనరులు సమకూర్చడానికి బదులు గొట్టయిన ఇంగ్లీష్ భాషను విద్యార్థులకు సమకూర్చి వారి చదువులను మరింత గొట్టు చేసినట్లవుతుంది. అది వారికి మంచికన్నా ఎక్కువ చెడు చేసినట్లవుతుంది, లాభానికన్నా ఎక్కువ నష్టం చేసినట్లవుతుంది.

ఇంగ్లీష్ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలి కానీ అది నేర్చుకోవడం సంస్కృ తం నేర్చుకోవడం కన్నా కష్టమే కాదు అతి కష్టమని తెలుసుకోవాలి. అందుకే అది నేర్చుకోవడంలో మన పిల్లలు చాలామంది వెనుకబడిపోతున్నారు. ఆ మీడియం ద్వారా భావార్జన, జ్ఞానార్జన, లాజిక్, రీజనింగ్ ఆర్జనలు సులభం కావు. కనుక వాటిలో కూడా వారు వెనుకబడి పోతున్నారు. ఈ సగటు సంగతి అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ అగ్ర కులాల వారు బాగుపడుతున్నారని, తెలుగు మీడియం ద్వారా చదివి అన్య కులాలవారు వెనుకబడుతున్నారని కొందరనడం, రాయడం పనికట్టుకొని ప్రచారం చేయ డం అన్యాయమవుతుంది, అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించడం అవుతుం ది. ఇప్పుడు అక్షరాల అదే జరుగుతున్నది. అమాయకులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి మాటల కు బలై పోతున్నారు.

సాంకేతిక విషయాలు తెలుగు మీడియం ద్వారా చదివితే ఆ చదువు ఎక్కువ terminological (పరిభాష)గా ఉంటుంది కనుక ఆ భాష ఎలాగూ ఏ మాధ్య మం ద్వారా చదివినా ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఆ బోధన తెలుగులో జరిగినా దాదాపు ఇంగ్లీష్ భాష ద్వారా జరుగుతున్నట్లే ఉంటుంది. ఇపుడు తెలుగు మీడియం ద్వారా బోధించబడే సైన్స్, సాంకేతిక విద్య చాలావరకు మిశ్రమ భాషలోనే జరుగుతున్నది. అంటే తెలుగు, ఇంగ్లీష్ కలెగలుపు భాషలో.కనుక కనీసం ఇంటర్మీడియట్ విద్యాస్థాయి వరకైనా గవర్నమెంట్ స్కూళ్లల్లో, ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లలో తెలుగునే బోధనా భాషగా కొనసాగించడం, కొత్తవాటిని కూడా ఆ భాషలోనే ఏర్పరచడం విద్యా ప్రమాణాల దృష్ట్యా, ఉన్నత ఉద్యోగ, విద్య అవసరాల దృష్ట్యా అత్యవసరం. అలాగే మానవీయ శాస్ర్తాల విద్యలను తెలుగు మీడియం ద్వారానే ఇవ్వడం మంచిది.

1.సామాజిక మానవీయ విద్యలకు ఇంగ్లీష్ మీడి యం అక్కరలేదు, కేజీ నుంచి పీజీ దాకా ఒక భాషగా చక్కగా నేర్పితే చాలు. 2.ఇంటర్ వరకు సైన్స్ సాంకేతిక విద్యలు తెలుగులో బోధించి, హయ్యర్ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో బోధించదలచుకుంటే బోధించవచ్చు. కానీ తెలుగును ఒక భాషగానైనా కేజీ నుంచి పీజీ దాకా కొనసాగించడం మంచిది. 3.తెలుగు బతకాలంటే, తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్‌గా కూడా కొనసాగాలంటే ఇంతకంటే మరో మార్గం లేదు. 4)భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్లీష్‌ను ఒక భాష గా బోధించవలసిన అవసరం లేదు. అలా భాషా భారాలను కూడా తగ్గించవ చ్చు. 5)అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ తెలుగు మీడియం విద్యాసంస్థల్లో కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్‌ను ఒక భాషగా బోధించాలి. అలాగే అన్ని ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించాలి. తెలుగు పాలనాభాష కాబట్టి ఈ రాష్ట్రంలో చదివే వారందరికీ అది నేర్చుకోవడం తప్పనిసరి చేయాలి.

1598

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles