వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె


Wed,January 27, 2016 12:44 AM

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మన విశ్వవిద్యాలయాలు బాగుపడాలంటే కనీసం ఒక దశాబ్దమైనా వాటిలో శాంతి, ప్రశాంతి నెలకొనడం ఎంతో అవసరం.

VKR

రోహిత్ ఆత్మహత్యకు మరెవ్వరూ కారణం కాదు ఒక్క వీసీ తప్ప.
విశ్వవిద్యాలయాల పరిపాలకులకు విద్యార్థుల విషయాల్లో భయం, పిరికితనం ఎంత పనికిరాదో, మూర్ఖ త్వం, మొండితనం కూడా అంతే పనికిరావు. శక్తి మాత్రమే సరిపోదు, యుక్తి కూడా అవసరం. అంటే ట్యాక్ట్, స్ట్రాటజీ, డిప్లొమసీ, పట్టువిడుపు మున్నగునవి కూడా అనవసరం. ప్రతి చిన్న కారణానికి విద్యార్థులు ఆత్మహత్యలకు పూనుకుంటున్న ఈ రోజుల్లో అవి మరీ అవసరం. కానీ అవే ఈనాటి విద్యారంగ ఉన్నత పరిపాలకులకు చాలామందికి కాస్త తక్కువ అని హెచ్‌సీయూలో జరిగిన దుర్ఘటన రుజువు చేసింది.

ఆ దుర్ఘటన జరగడానికి పాలకులకు అక్షరాలా యుక్తి లేకపోవడమే కారణం. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు అడపాదడపా గొడవ చేయడం, రాజకీయవేత్తలు వాటిలో అడుగుపెట్టి ఆజ్యం పోయడం కొత్తేం కాదు. అలాంటివి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అవి ఎక్కువైపోయాయి. గట్టి వీసీలు వాటిని తట్టుకుంటున్నారు, వట్టి వీసీలు ఇలా గోరంతను కొండంత చేసు కొని అభాసుపాలవుతున్నారు. వారు అవమానాల పాలై ఇతరులను కూడా అవమానాల పాలు చేస్తున్నా రు.

ఉదాహరణకు హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన లాంటివే కొన్ని గొడవలు ఇఫ్లూ (IFLU)లో కూడా ఆ మధ్య జరిగాయి. అది కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం. కానీ వాటిని ఇఫ్లూ వీసీ సునైనా సింగ్ ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగక, తన సమస్యల ను తానే సమంజసంగా, సమర్థవంతంగా పరిష్కరించుకున్నారు. నేను వట్టి వీసీని కాదు గట్టి వీసీని అని నిరూపించుకున్నారు.

ఒక ప్రిన్సిపల్‌పై , ఒక వీసీపై అనేకానేక ఒత్తిళ్లు తప్పవు. అవి విద్యార్థుల నుంచి, అధ్యాపకుల నుంచి, రాజకీయ వేత్తల నుంచి, పరిపాలనా సిబ్బంది నుంచీ వస్తాయి. ఆ ఒత్తిళ్లకు లొంగకుండా కదా వీసీలు నిర్ణయాలు తీసుకోవలసింది?అందుకు కదా వారు నియమించబడింది? ఆ పనే తగినవిధంగా హెచ్‌సీయూలో చేయలేదని రోహిత్ ఆత్మహత్య నిరూపిస్తున్నది.

రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన అతి ముఖ్య కార ణం అతని మానసిక పరితాపం. అతడు చాలా సున్ని త మనస్వి (sensitive)అని, తాత్విక చింతన కలవాడని అతని ఉత్తరం ద్వారా తెలుస్తూనే ఉన్నది. లేకపోతే అంత జరిగాక కూడా, అంత అవమానాల పాలయ్యాక కూడా అతడు ఎవరినీ తప్పుపట్టకుండా, నిం దించకుండా ఆత్మహత్య చేసుకుంటాడా మరి?

కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నుం చి explanations అడగడం, వారికి హెచ్చరికలు చేయడం, వారిపై జరిమానాలు విధించడం, వారేదై నా అతిగా ప్రవర్తిస్తే తుదకు సస్పెన్షన్స్ expulsions చేయడం, సాధారణంగా ఆ వరుసలో జరిగే శిక్షా పద్ధతులే. ఆ పద్ధతులను వీసీ అవలంబిస్తే వారికి సావధానంగా ఆలోచించి సరైన తదుపరి చర్యలు తీసుకోవడానికి తగినంత వ్యవధి లభించేది. విద్యార్థులకు కూడా నెమ్మదిగా ఆలోచించే అవకాశం ఉండేది. సస్పె న్షన్లను ఎవరూ పట్టించుకోరు. దానిని మామూలుగా జరిగే తతంగంలో ఒకదానిలా భావిస్తారు. అవి ఎలాగూ ఎత్తివేయబడతాయని ఊహించి విద్యార్థులు వాటిని అంత సీరియస్‌గా కూడా తీసుకోరు. దానిని అవమానంగా భావించి రోహిత్ పాల్పడినట్లు ఆత్మహత్యలకు పాల్పడరు. అలా దేశంలో ఎక్కడా ఎప్పు డూ జరగలేదు.

సస్పెన్షనే ఒక శిక్ష అయితే దానికి తోడు సస్పెన్షన్ చేసినవారిపై అదనంగా బహిష్కరణ, వెలివేయడం, అస్పృశ్యత, అంటరానితనం లాంటి ఆంక్షలు కూడా జోడించి దానిని డబుల్ పనిష్మెంట్‌గా మార్చారు. అది ఘోరం, అవివేకం. అదే విధించిన శిక్షను అవమానం కిందికి మార్చింది. శిక్ష వేసే హక్కు వీసీకి ఉన్నది, కానీ అవమానించే హక్కు లేదు. అలాంటిది ఒక వీసీలకే కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, స్పీకర్ లాంటి వారికి కూడా లేదు.

అతి సున్నిత మనస్కుడైన రోహిత్‌కు ఆ అవమా నం ఆత్మవంచన లాంటిదైంది, అది అతన్ని ఆత్మాభిమానం కోల్పోయిన వాడిగా, భరించరాని అవమానానికి గురైన వాడిగా మానసికంగా కలవరపరిచి, ఇక బతకడం అనవసరం అని అనుకునేట్టు చేసి అతని ఆత్మహత్యకు దారితీసింది.

రోహిత్ ఆత్మహత్యకు అసలు కారణం ఆ అవమా నం. తక్కిన కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడితే వాటిని తాను రాసిన లేఖలో తప్పకుండా పేర్కొనేవాడు. దానిని నిందలతో, నిష్ఠూరాలతో నింపేవాడు. అతడాపని చేయలేదు. That is where he is great, exemplary, nay, gentle, noble. Hats off to him.

వీసీ వేస్తున్నది శిక్షకన్నా ఎక్కువ అవమానమని కాస్త సావధానంగా ఆలోచిస్తే వీసీకే తెలిసివచ్చేది. వారేదో విద్యార్థులను అవమాన పరచాలని అలా చేశారని ఎవరూ అనుకోవడం లేదు. అలా సాధారణంగా ఎవరూ చేయరు. కానీ ఆ నిర్ణయం వారు కూల్‌గా ఆలోచించి తీసుకున్నది కాదని అక్షరాలా అనిపిస్తున్న ది. అలా వీసీ ఆలోచించకపోవడమే అతని తప్పని అంటున్నాను.

మరొక విషయం కూడా సస్పెన్షన్‌తో పాటు, ఆంక్ష లు విధిస్తున్నప్పుడు వీసీ జాగ్రత్తగా పట్టించుకున్నట్లు లేదు. అప్పటికే దేశమంతటా వారికి ఇవ్వబడిన అవార్డ్స్, రివార్డ్స్‌ను చాలామంది నిరసనగా వాపస్ చేసిన, ఇంకా చేస్తూనే ఉన్న ఉదంతం. ఆ అగ్ని ఇంకా చల్లారకముందే ఈ పని చేస్తే అది మరిన్ని తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చును అన్నది హెచ్‌సీయూ విద్యార్థులపై శిక్ష విధించే సమయంలో వీసీ ఆలోచించినట్లు లేదు. the decision was not only bad in itself but also ill timed.

వాస్తవానికి హెచ్‌సీయూలో జరిగిన లాంటిది ఈ రోజుల్లో ఏ సభ్య సమాజంలో కూడా జరుగకూడదు. అసలీ వెలివేయడాలు,బహిష్కరించడాలు అతి పూర్వకాలపు పద్ధతులు. They are absolutely anac -hronic and out dated. They have to be declared as illegal and unconconstitutio -nal in future. At least this incident sho -uld certainly lead to that declaration, so that Rohit could be remembered for ever for it.
రోహిత్ ఆత్మహత్య తర్వాతనైనా విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు, రాజకీయవాదుల ప్రమేయాలు తగ్గుతాయని, తగ్గాలని అందరమూ కోరుకుంటు న్నాం. (మాటల రూపంలో కాదు, చేతల రూపంలో)
విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల ప్రమేయం బాగుండదని అందరూ అనేవారే కానీ ఎవరూ ఊరుకుంటున్న వారు లేరు. ఆ సంస్కృతికి రోహిత్ ఆత్మహత్య ఆనకట్ట వేస్తుందని ఆశిస్తున్నాం.
ఈ దుర్ఘటన వట్టి వీసీల నియామకాలకు బదులు ఇకముందు గట్టి వీసీల నియామకాలకు కూడా దారితీస్తుందని ఆశిస్తున్నాం.

దానికోసం వీసీల నియామకాల్లోనే కాదు, ఛాన్స్‌లర్ల నియామకాల్లో కూడా వారి అధ్యయనాల కన్నా వారి అనుభవాలకు, సాధించిన విజయాలకు, సార్థవంతంగా తట్టుకున్న సమస్యలకు, వారు కనుగొన్న పరిష్కారాలకు, వారి నీతి నిజాయితీకి చెందిన కీర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం.

ఈ సందర్భంగా విద్యార్థులతో కూడా ఒక సవిన య కోరిక. ఈనాట globalisation, liberalis-ation రోజుల్లో విద్యార్థులకు ఇంట రిజర్వేషన్లు ఉన్న ట్లే, బయట కూడా రిజర్వేషన్లుండవు. అలాగే పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్నట్లే ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉండవు. బయటి ఉద్యోగాలే, ఇంటి ప్రైవేట్ ఉద్యోగా లే. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్‌రంగ ఉద్యోగాలు అత్యధికం. అవి కావాలంటే వారికి చక్కగా చదువుకొని యోగ్యతా కౌశల్యాలు పెంచుకోవడం తప్ప మరొక మార్గం లేదు. ఇంటా, బయటా ఉన్నతోద్యోగులకు ఇప్పుడు పోటీ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు డూ ఆర్ డై రోజులొచ్చాయి. కాబ ట్టి కష్టపడి శ్రద్ధగా, క్రమశిక్షణతో చదవకుంటే విద్యార్థులకు పెద్ద ఉద్యోగాలు రావు. కనుక వారిని కుల, మత, ప్రాంత కుమ్ములాటలు మాని సిన్సియర్‌గా, సీరియస్‌గా చదువుకోవాలని సవినయంగా కోరుతున్నాం.
ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చేసు కోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మన విశ్వవిద్యాలయాలు బాగుపడాలంటే కనీసం ఒక దశాబ్దమైనా వాటిలో శాంతి, ప్రశాంతి నెలకొనడం ఎం తో అవసరం. అది విద్యార్థులు, అధ్యాపకు లు, రాజకీయవేత్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేసి దాన్ని కూడా ఒక ఉద్యమంలా చేపట్టి సాధించాలని వారందరినీ కోరుతున్నాం.

Let us help the universities to help us. Let us make a hard bargain for a morato -rium on all agitations for at least a decade to make up the losses that we ha -ve suffered for long in the field of edu -cation in general and higher education in particular in our beloved Telangana State. Let us vow and avow to that.

1571

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు