కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?


Sat,December 26, 2015 01:06 AM

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ విద్యను పటిష్ఠం చేస్తుందేమోనని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.

konda


ఏళ్ల తరబడి మన విశ్వవిద్యాలయాల్లో Permanent ఉద్యోగాలకు అనేక కారణాల పేరిట contract basisపై అధ్యాపకుల నియామకాలు జరుగుతున్నాయి. 1.వీటికి రిజర్వేషన్స్ పాటించవలసిన అవసరం లేదు, 2.రెగ్యులర్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయవలసిన అవసరం లేదు, 3.స్కేల్స్ ఇచ్చి ఫుల్ సాలరీ ఇవ్వవలసిన అవసరం లేదు, 4.ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా అభ్యర్థులను కొనితెచ్చుకొని నియమించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇష్టమైన వారిని, లేక ఎవరై నా సిఫార్సు చేసిన వారిని అపాయింట్ చేసుకోవచ్చు.
అపాయింట్ చేసిన వారికి సమ్మర్ సాలరీ ఇవ్వకుండా contract Period అయిపోగానే తొలగించి మరొకరిని తీసుకోవచ్చు. లంచాలు తీసుకొని నియమిం చే ఆస్కారం వీటిలో అధికం. అందుకే ఈ పద్ధతిని ఏళ్లతరబడి కొనసాగించాయి విశ్వవిద్యాలయాలు. ఇన్ని అవకాశాలున్న విధానాన్ని ఏ ప్రభుత్వం, ఏ యూనివర్సిటీ మాత్రం ఎందుకు వదులుకుంటుంది? అందుకే అలా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ విధానం వల్ల ఖర్చు తక్కువ! విద్య ఎంత పాడైపోయినా ఫర్వాలేదు కానీ కొంత సొమ్ము మిగులుతుంది, దాన్ని మరోవైపుకు మళ్లించుకోవచ్చు కదా! ఈ నియామకాల్లో పేర్కొనవలసిన ఒక గొప్ప సౌకర్యమేమంటే ఒకరి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక మరొకరిని నియమించినపుడు లేక ఇంతవరకే పనిచేస్తున్న వారినే మరొకసారి నియమిస్తున్నపుడు ప్రతిసారీ లంచం తీసుకోవ చ్చు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సంస్కృతి.

ఈ నియామకాలు కొన్నాళ్లు సాగిస్తే అలాంటి వారందరు కలిసి ఒక అసోసియేషన్‌గా ఏర్పడతారు. మేం ఏళ్లుగా పనిచేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ అపాయింట్‌మెంట్స్ చేస్తున్నపుడు మాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాజకీయ ఒత్తిళ్లు తెస్తారు. కుదరకపోతే ధర్నా, రాస్తారోకోలు, సమ్మెలు లాంటివి చేపడుతారు.
అప్పుడు పాలకులు వీరి ఒత్తిడిని తట్టుకోలేరు. ఎందుకం టే ఇటువంటివారి డిమాండ్స్ మంచివైనా, కాకున్నా.. ప్రతి పక్ష పార్టీలన్నీ అండగా నిలుస్తాయి. అలా గే కోర్టులు కూడా ఆ గ్రౌండ్ ఈ గ్రౌండ్ ఆధారంగా అన్నిటికీ మించి హ్యుమనిటేరియన్ గ్రౌండ్‌ను ఒక బలమైన గ్రౌండ్‌గా పేర్కొంటూ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అభ్యర్థననే సమర్థిస్తాయి. దానికి ప్రముఖులైన లాయర్ల రంగప్రవేశం ఎలాగూ ఉంటుంది. తుదినిర్ణ యం ఏమైనా కేసును పదేళ్లవరకు లాగే అవకాశం కూడా ఉంటుంది. అలా ఒక స్టేటస్‌కో, ఒక స్టేల్‌మేట్‌ను కొనితెచ్చే అవకాశం.
కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌లో చాలామంది సరైన సమర్థత లేనివారే ఉంటారు.

మరి వారందరినీ రెగ్యులరైజ్ చేస్తే నిర్దేశించిన రీతిలో వారెలా బోధించగలరు? వారిని తీసివేయడమెంత దుర్లభమో, కొనసాగించి వారితో పాఠాలు చెప్పించడం కూడా అంతే. అలాంటి వారే టీచర్స్ గ్రేడ్ యూనియన్ లీడర్లుగా తయారవుతారు. తమ విధులను సక్రమంగా నిర్వహించక డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించి విశ్వవిద్యాలయాల అధిపతులను, పాలకులను బెదిరిస్తూ జాగిర్దారీ వ్యవస్థను మరోరకంగా ఆవిష్కరిస్తారు. వారే లక్షల జీతాలు నెలానెలా తీసుకునే జాగీర్దార్లు అవుతారు.

వీరే రియలెస్టేట్, లిక్కర్ బిజినెస్‌లాంటివి ఎన్నో చేస్తుంటారు. ట్యుటోరియల్, కార్పొరేట్ కళాశాలల్లో పనిచేస్తూ గడిస్తుంటారు. స్వయానా వీరే కళాశాలలు కూడా స్థాపించి నడుపుతుంటారు. అనేక కార్యాలయాల్లో పైరవీకార్లుగా అగుపడతారు. ఇలాంటి బహద్దుర్లే బహుసభలు, సమావేశాలు జరిపి రాజకీయ పెత్తందార్లకు పెద్ద పెద్ద దండలు వేసి, పెద్దపెద్ద ప్రశంసా పత్రాలు సమర్పిస్తారు. వారిని చేజిక్కించుకొని వారికి అవసరమైన, అనుకూలమైన పనులు చేయించుకుంటారు.

ఈ కాంట్రాక్ట్ నియామకాల వల్లనే దశాబ్దాలుగా మన విశ్వవిద్యాలయాల్లో విద్య భ్రష్టుపట్టింది. యూనివర్సిటీలు రాజకీయాలకు నిలయాలయ్యాయి. ఆ పద్ధతిని ప్రోత్సహించేవారు చాలావరకు కాంట్రాక్ట్ పద్ధతిపై నియమింపబడినవారే. మరి అలా కొనసాగడానికి విద్యార్థులకు ఎన్నో ప్రక్కదోవ సౌకర్యాలు కల్పిస్తూ అనుకూలంగా వాడుకుంటారు. విద్యార్థులు కూడా అలాంటి అనుకూలమైనవారే కావాలని కోరే అవకాశాలుంటాయి.
స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో వీటన్నింటికి ముగింపు పలకాలంటే మొదట కాంట్రాక్ట్ నియామకాలను రద్దు చేయాలి, ప్రభుత్వ కార్యాలయాల్లో పైరవీకారీ పద్ధతిని నిర్మూలించాలి, విద్యాలయాల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉండకూడదు, బోధనా అధ్యయన పరిస్థితులను మెరుగుపరచాలి, అడ్మిషన్ పాలసీలను, పరీక్షా పాలసీలను సక్రమంగా రూపొందించి పాటించాలి, విశ్వవిద్యాలయాల సిబ్బంది క్రమణశిక్షణ పాటించాలి.

విశ్వవిద్యాలయాల అటానమీకి అర్థం విశ్వవిద్యాలయాలను చక్కగా వృద్ధి చేయడానికి, వాటిలో ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి స్వేచ్ఛ కోరడం కానీ అలా చేయకపోవడానికి కాదు కదా..? దానినే అకౌంటబిలిటీ అని అంటారు. అలా దాని గురించి అంటూనే ఉంటారు, కానీ జరిగేది మాత్రం అన్‌అకౌంటబిలిటీ మాత్రమే. ఇప్పుడు విశ్వవిద్యాలయాలలోని అటానమీ అను పదానికి విలువెంత ఉన్నదో ఎకౌంటబిలిటీ అను పదానికి కూడా అంతే విలువున్నది. అటానమీ అన్నది ఎంత మిథ్యయో ఎకౌంటబిలిటీ అన్నది కూడా అంతే మిథ్య.
ఎంతవరకైతే అత్యున్నత స్థాయిలో పనిచేసే వారి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ లాంటివి బాగుపడవో తక్కినవారియి కూడా బాగుపడవు. కాబట్టి కిందివారి నిర్వహణలు బాగుపడాలంటే పైస్థాయి నుంచి మొదలు పెట్టాలి మన సంస్కరణలను.

లంచగొండితనం తగ్గాలంటే పైస్థాయి నుంచి మొదలెట్టాలి కానీ కింది నుంచి కాదు కదా..? పైస్థాయిలో చెప్పేవన్నీ ధర్మశాస్ర్తాల్లాంటివి, చేసేటివన్ని వాటికి విరుద్ధం కాకూడదు. పైస్థాయి వారు కింది స్థాయివారికి ఆదర్శం కావాలి. విశ్వవిద్యాలయాలకు చెందిన పాఠ్యాంశాల్లో రోల్‌మోడల్స్, కేస్ స్టడీస్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు విద్యార్థులకు లభిస్తున్న ఎక్కువ కేస్ స్టడీస్, రోల్ మోడల్స్ చెడ్డవే కానీ మంచివి కావు. అందువల్లనే విద్యార్థులు విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఎవరైనా కొంతమంది విద్యార్థులు బాగుపడుతున్నారంటే వారు వేరే కారణాలవల్ల. కానీ మన విశ్వవిద్యాలయాల్లోని విద్య వల్ల మాత్రం కాదని విశ్లేషకుల అభిప్రాయం.

ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో బోధన, అధ్యయనాలు అసలు జరగడం లేదనే అభిప్రాయం ఉన్నది. విద్యార్థులే కాదు అధ్యాపకులు కూడా ఎక్కువ వీధుల్లోనే తప్పా యూనివర్సిటీల్లో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. గతంలో ఆర్ట్స్ కళా శాలకు ఎప్పుడు వెళ్లినా విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లోనే కనపడేవారు. విద్యలేకాదు ఎన్నో మేధోపరమైన చర్చలు కూడా జరిగేవి. ఇప్పుడు అవేవి కనప డటం లేదని యూనివర్సిటీలను సందర్శిం చిన వాళ్లందరూ బయటకు వచ్చిన తర్వాత చెప్పే మొదటిమాట.ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ విద్యను పటిష్ఠం చేస్తుందేమోనని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.

1110

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు