యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..


Wed,December 16, 2015 01:41 AM

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పెట్టినట్లు ఈ ప్రభుత్వం కూడా అలాంటి పనే చేయకూడదు.

konda


వీసీల నియామకాలు జరగబోతున్నాయని విని, నా స్మృతి నేను చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం వైపు మళ్లింది. నాటి వైస్ ఛాన్స్‌లర్ అలియావర్ జంగ్ గారి వైపు. నేడు అతన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే ఠాగోర్‌గారి గీతాంజలిలోని where the mind is without fear, head is held high అను కవితా చరణం జ్ఞాపకమొస్తున్న ది నాకు. Head is held high అంటే ఎవరో ఒకరు దానిని అనువదించినట్లు తలెత్తేగడం కాదు, సింహంలా శిరస్సును సగర్వ స్వాభిమానంతో ఎత్తేగడం.
ఇప్పుడెందుకు ఉదహరిస్తున్నానంటే నేను అలియావర్ జంగ్ గారి ఠీవిని, దర్జాను, హుందాతనాన్ని, గాంభీర్యాన్ని చూసి ఆ చరణంలోని అర్థాన్ని అలా భావించాను కనుక.

అతనిలో ఒక రాజఠీవి ఉండేది. అది aristocratic ఠీవి కాదు, intelle ctual aristocracyకి చెందిన ఠీవి. నేనతన్ని ఒక విద్యార్థిగా చూసిన్నప్పుడల్లా ఒక able and noblemanను చూస్తున్న స్ఫూర్తినొందేవాన్ని. ఒక వైస్ ఛాన్స్‌లర్ అంటే అలాగుండాలని భావించేవాన్ని, ఇప్పటికీ అలాగే భావిస్తాను. ఆ పిదప అలాంటి ప్రతి భ గల, ఠీవిగల వీసీని నేను చూడలేదంటే నమ్మండి. అతడు అటు తదుపరి గవర్నరయ్యాడు, రాయబారయ్యాడు. అతని sister మాసూమాబేగం కూడా నాటి ప్రభుత్వంలో మంత్రిపదవిని అలంకరించింది.

రానూ రానూ అలాంటి వారికి బదులు వారి పేరేమిటో, ఊరేమిటో, వారి డిగ్రీలు, సినియారిటీలు తప్ప వారు సాధించిందేమిటో పదిమందికి తెలియని అనామకుల్లాంటి వాళ్ళెంతోమంది వైస్ ఛాన్స్‌లర్స్ అయ్యారు. కొంతమంది లంచాలిచ్చికూడా. అలా లంచమిచ్చి వైస్ ఛాన్స్‌లర్ అయిన వారే ఒకడు కొండలరావు గారూ! ఒక పదిలక్షల రూపాయలు ఇవ్వగలిగితే మీరు కూడా వైస్ ఛాన్స్‌లర్ అయ్యేవారు కదా! అని అన్నాడు నాతో. అతనలా అన్నందుకు సిగ్గుపడ్డ, నేనలాంటివాణ్ణి కానని తెలిసి కూడా. అలా లంచాలిచ్చి వీసీ వైస్ ఛాన్స్‌లర్లు అయ్యి ఇచ్చిందానికన్నా పదింతలెక్కువ సంపాధించిన వారి పేర్లు నేనెన్నో విన్నా.

గతంలో అయిదారుగురు వైస్ ఛాన్స్‌లర్లు అవినీతికి, అక్రమ నియామకాలకు పాల్పడినందున వారి పై ఇప్పటికీ ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా వీసీలు కూడా అవినీతికి, అక్రమాలకు పాల్పడి కేసు ల్లో ఇరుక్కుంటే ఇక తక్కినవారి గురించి మాట్లాడేదేముంటుంది? అలా వీసీలు అయినవారు యూనివర్సిటీలను ఎలా పకడ్బందీగా నడుపగలరు? రానురా నూ మన వీసీలు చాలామంది ఇలాంటివారు కావడానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు ఎలా జరగాలో అలా జరగకపోవడమే. ఇకనైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.మారుతున్నట్టు ఈ మధ్య టీఎస్‌పీఎస్‌సీకి చెందిన కొన్ని నియామకాలు సూచిస్తున్నాయి. అదెంతో సంతోషమైన సమాచారం.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాలు: యూనివర్సిటీలకు వీసీల నియామకాలు ఎంత ముఖ్యమో వాటికి చెందిన ఈసీ సభ్యుల నియామకాలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఈసీల్లోనే చర్చించి తీసుకోబడతాయి. కొన్ని దశాబ్దాలుగా నాటి ప్రభుత్వాలు యూనివర్సిటీ ల ఈసీల నియామకాలను రాజకీయ కాందిశీకులకు, రాజకీయవేత్తలు సిఫార్సు చేసిన వారికి, పైరవీకారుల కు రిహాబిలిటేషన్ కేంద్రాల్లాంటివిగా తయారు చేశా యి. నేను కరీంనగర్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఒకరెవరో నా వద్దకు వచ్చి సార్! మీకిది తెలుసా? మన పక్కవీధిలోని వ్యక్తి నన్నేమనుకుంటున్నారు మీరు, నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈసీ సభ్యున్ని అయినాని బొమ్మలెగరవేసి సగర్వంగా చెప్పాడు, అతనికి యూనివర్సిటీ పదంలోని అక్షరాలు కూడా తెలియవు. విద్య గురించి ఏ మాత్రం తెలియ దు.

మరీ అలాంటి వాళ్లను ఈసీ సభ్యులుగా వేస్తే వాళ్లు యూనివర్సిటీలకు ఏం చేయగలరు? అని అం టూ నవ్వాడు. యూనివర్సిటీకి చెందిన ఈసీలలో విద్య గురించి బాగా తెలిసినవారిని, మన విద్యార్థుల కు వారి విద్యల్లో, ఉద్యోగాల్లో కాస్తో కూస్తో తోడ్పడగ ల వారిని, అనుభవజ్ఞులను, విద్యారంగంలో మంచి పేరు గడించినవారిని, పరిశ్రమలతో మంచి సంబంధమున్న వారిని వేస్తే మన విద్యార్థులు, విద్యలు బాగుపడుతాయి. వారి ఉద్యోగవకాశాలు బాగుపడతాయి కానీ వాటిలో రాజకీయవాదులను, పైరవీకా రులను వేస్తే అవెలా బాగుపడతాయి? మన విద్యార్థు ల ఉద్యోగావకాశాలు బాగుపడాలంటే, వారి విద్యలు బాగుపడాలంటే ఇకముందైనా యూనివర్సిటీలకు చెందిన ఈసీలలో తగిన వారిని వేయాలి, కానీ ఎలాం టి అనుభవం లేనివారిని వేయకూడదు.

యూనివర్సిటీలల్లో రాజకీయ ప్రమేయాలు: ఎవరి ని వీసీలు నియమించినా యూనివర్సిటీల్లో రాజకీయవేత్తల ప్రమేయాలు, ప్రభుత్వ interferenceలు ఎక్కువైతే వాటిని తట్టుకోవడం వారికెంతో కష్టమౌతుంది. అలాంటి ఒత్తిళ్ళకు వారు లోనైతే ఇతరులు వాటిని ఆసరాగా తీసుకొని, విశ్వవిద్యాలయాలను దుయ్యబడతారు, దుర్భాషలాడుతారు. వాటివల్ల వీసీ పదవి లోకువైపోతుంది. ఇపుడు జరుగుతున్నది చాలావరకు అదే. ఇకముందైనా యూనివర్సిటీలల్లో రాజకీయవేత్తల ప్రభుత్వ interferenceల ప్రమేయాలు లేకుండా చూడాలి. దానికి రాజకీయాల పార్టీలన్నీ కలిసి యూనివర్సిటీలల్లో అలాంటివి జరగకుం డా చూస్తామని అంగీకరించి హామీ ఇవ్వాలి.

విద్యార్థులు రాజకీయాలు: విద్యార్థులు అత్యవసరంగా ఎంతో అవగాహనతో తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమాల్లో పాల్గొనడం వేరు. అటుతదుపరి చీటికిమాటికి చిన్నవాటిలో పెద్దవాటిలో పాల్గొనడం వేరు. తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాల లక్ష్యా లు గొప్పవి. అలాంటి వాటిలో పాల్గొనవచ్చును, పాల్గొనాలి కూడా. కానీ తక్కినవి అలాంటివి కావు. అవి విద్యార్థుల విద్యలను చెడగొట్టేవి, వారిని వారి విద్యలకు కాకుండా చేసేవి. అలాంటి వాటిలో పాల్గొనకూడదు. అవసరమైతే చదువుకుంటూనే వారి నిరసనలను నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి, పరిపాలకులకు తెలియజేయాలి. జపాన్‌లో విద్యార్థులు, ఉద్యోగులు అలాగే చేస్తారు. ఇకముందైనా రాజకీయ పార్టీలు చీటికిమాటికి విద్యార్థులను చిల్లర రాజకీయాల్లోకి లాగడం మాని వారి విద్యలకు ఉద్యోగావకాశాలకు అంతరాయాలు కలిగించడం మానుకోవాలి. విద్యార్థులకు రాజకీయాల గురించి వికాసవంతంగా తెలియాలి, కానీ వారు వారి విద్యార్థి దశలోనే ప్రొఫెషనల్ పాలిటీషియన్స్‌లా తయారు కాకూడదు. రాజకీయ నాయకులు కూడా విద్యార్థులను అలా తయా రుచేయకూడదు.

యూనివర్సిటీల్లో అధ్యాపకుల పాత్ర: యూనివర్సి టీల్లో విద్యలు పాడు కావడానికి మరొక బలమైన కార ణం యూనివర్సిటీ అధ్యాపకులకు UGC scales వచ్చినాక కూడా, వాటివల్ల వారి వేతనాలు లెక్కలేనంత పెరిగినాక కూడా వారు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించక అదనపు ఆదాయాల కోసం అచటచటా పనిచేస్తూ, రియల్ ఎస్టేట్, లిక్కర్ లాంటి వ్యాపారాలు చేస్తూ వారి అసలు వృత్తులకు ద్రోహం చేయడం. ఇకముందైనా వారు అలాంటివి చేయరని, వారలా చేయకుండా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.
వీసీల నియామక నిబంధనలు: వీసీల నియామకాలకు సరైనవారు దొరుకకపోతే రిటైరయిన వారి నుంచై నా, డిప్యుటేషన్ నుంచైనా యూజీసీ నియమ, నిబంధనలకు relaxations, exempitons కోరుతూ తగినవారిని మాత్రమే నియమించుకోవాలి.Locals, internals అనే వారిలో మంచివారు దొరికితే వారిని నియమించవచ్చు. కానీ, యోగ్యతలు కొరవడినా కూడా ఒత్తిళ్ళకు లోనై వారిలోనుండే నియమించగూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉమన్స్ లాంటి కోటాలు ఎలాగూ ఉంటాయి. వారిలో కూడా యోగ్యులైనవారినే నియమించాలి.

ఈ సందర్భంగా ఇంకో విషయం గమనించాలి. అదేమంటే, యూజీసీ నియమాలు రెగ్యులర్ ఉద్యోగ నియమాకాలకే వర్తిస్తాయి. కానీ డిప్యుటేషన్ నియామకాలకు, రిటైర్డ్ అయిన వారి నియామకాలకు వర్తించవు. అలాంటపుడు ఎలాగైతే ఎన్నో ఇతర రంగాల్లో రిటైరయిన జడ్జీలు, సివిల్ సర్వెంట్స్‌లాంటి వారిని నియమిస్తున్నారో, అలాగే యూనివర్సటీలల్లో కూడా ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో అలాంటి వారిని నియమించకూడదో అర్థం కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పరిస్థితుల్లో యూజీసీ నిబంధనలను దాటి నియామకాలు చేసుకోవడానికి హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీని కోరి తగిన ఉత్తర్వులు తెచ్చుకోవాలి. దానికి గవర్నర్ ప్రత్యేకంగా కృషి చేయాలి.

యూజీసీని కూడా ప్రత్యేక పరిస్థితుల్లో అలాంటి నిబంధనలను దాటి నియామకాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వాల్సిందిగా కోరాలి. దానికి మన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కేంద్రం మీద, యూజీసీ మీద, ఏఐసీ టీ, ఏఐసీఐటీ లాంటి కేంద్ర విద్యా విషయిక సంస్థల పై ఒత్తిడి తేవాలి. ఉత్తరాది రాష్ర్టాల్లో ఇలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి నిబంధనలను సడలించుకొని నియామకా లు చేసుకోవడం మామూలే. మనవారు కూడా ఎం దుకు చేయకూడదు అలాంటి కృషి?

ఉన్నత విద్య రాజ్యాంగంలోని concurrent list కు చెందింది. కేంద్ర ప్రభుత్వమైనా, యూజీసీ, ఎఐ సీటీ, న్యాక్ లాంటి కేంద్ర సంస్థలైనా రాష్ర్టానికి చెం దిన ఉన్నత విద్యల నిబంధనలను రూపొందిస్తున్నపు డు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా, వాటి అంగీకారం లేకుండా రూపొందించడం వల్ల రాష్ర్టాల కు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. గతంలో మన రాష్ట్రంలోనే, మన ప్రభుత్వానికి తెలియకుండా నే పైరవీకారులు నేరుగా ఏఐసీటీఈ, యూజీసీ, న్యాక్‌లకు వెళ్లి ఇష్టానుసారం అనుమతులు పొంది ఎన్నో కళాశాలలనే కాదు! ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీలను కూడా స్థాపించుకున్న ఉదంతాలు ఉన్నాయి. వాటి వల్ల ఇంజినీరింగ్ కళాశాలలు, ఎంబీఏ కళాశాలలు లాంటివి కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

అందు వల్లనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురవుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుం డా ఇకముందు యూజీసీయే కానీ ఏఐసీటీయే కాని మరే సంస్థ అయినా కళాశాలల స్థాపనలకు, డీమ్డ్ యూనివర్సిటీల స్థాపనలకు అనుమతులు ఇవ్వకూడదని మన ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీతో సంప్రదిం చి తగు ఉత్తర్వులు విడుదల చేయించుకోవాలి. ఇలా చేయడానికి బదులు గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పెట్టినట్లు ఈ ప్రభుత్వం కూడా అలాం టి పనే చేయకూడదు. అలా చేసే వారి అధికారాలు, అర్హతలు వారే చేతులారా పోగొట్టుకోకూడదు. అలా Concurrent List అనే పదాన్ని నిరర్థకం, నిర్వీర్యం చేయకూడదు.
(ఇంకా ఉంది)

1304

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles