విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు


Sun,December 6, 2015 03:32 AM

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి ఉదాహరణ అని, తక్కిన విశ్వవిద్యాలయాలను ఉద్దేశిస్తూ మీరు మీ విశ్వవిద్యాలయాలను సరిదిద్దండి, మేము మీకు కావలసినన్ని వనరులు తప్పకుండా సమకూరుస్తామని మంత్రి రాజేందర్ గారు సభాముఖంగా విశ్వవిద్యాలయాల వీసీలందరికీ హామీ ఇచ్చారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యం ముప్పయ్యేళ్ల వ్యవస్థాపక దిన ముగింపు సభలో ఈటల రాజేందర్ గారి నోట విద్య గురిం చి ఒక చక్కని చిక్కని ఉపన్యాసం విని ఆకర్షితు నె్నై, ఆశ్చర్యపోయి అమ్మయ్యా! ఎన్నాళ్లకెన్నాళ్ళ కు, ఎదురు చూస్తుండగా, ఎదురు చూస్తుండగా ఒక మంత్రి నోట విద్య గురించి ఒక గొప్ప ఉపన్యాసం విన్నానురా అని తబ్బిబ్బై మన ఉన్నత విద్యకు ఇక మంచి రోజులొచ్చినట్లేనని తలచి నా సంతోషాన్ని నమస్తే తెలంగాణ పాఠకులతో పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను. రాజేందర్ గారు మొట్ట మొదలే విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు అని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి మాటకన్నా గొప్ప మాటన్నారు. ఆనాడు నెహ్రూ గారు నేటి ప్రాజెక్టులు పరిశ్రమలే నేటి దేవాలయాలు అన్నారు . పాపం అంతపాటి పండితుడైనా కూడా అతడు బహుశా మర్చిపోయుంటాడు విద్యలే లేకపోతే ప్రాజెక్టులు పరిశ్రమలే లేవని, విద్యలే బాగుండకపోతే ఏ ప్రాజెక్టులు, పరిశ్రమలు బాగుండవని.

నేటి విద్యాలయాల ఆచార్యులు, అధ్యాపకులే నేటి దేవాలయాల లాంటి విద్యాలయాల పూజార్లు, నేటి విద్యలకు చెందిన పుస్తకాలే నేటి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు అని నేటి విద్యాలయాలే నేటి దేవాలయాలు అన్న మాటకు వాటిని నీటుగా, దీటుగా, స్వీటుగా జోడించారు. నేటి విద్యల్లో సాంఘిక మానవీయ శాస్త్రాల బోధనా అధ్యయనాల ప్రాధాన్యం తగ్గడం వల్లనే సమాజంలో విలువలు తగ్గాయన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీల ప్రాముఖ్యం పెరిగి సాంఘిక మానవీయ విలువల ప్రాముఖ్యత తరగడం చాలా ప్రమాదకరమని లోకమంతటా ఇపుడు జరుగుతు న్న ఉగ్రవాద ఉన్మాదవాదాలే సూచిస్తున్నాయన్నారు ఎంతో సమంజసంగా.

సైన్స్ అండ్ టెక్నాలజీల అభివృద్ధికి చెందిన ఫలితాలు కామన్ మ్యాన్‌కు తగిన మేరకు అందకపోవడానికి విలువలు లోపించిన మన విద్యలేనని తెలియని వారికి తేల్చి చెప్పారు. సమాజంలోని inequalityలకు కారణాలు కూడా ఈ విలువల్లేని విద్యలేనన్నారు. అలాగే పరిపాలనల్లోని అవినీతులకు, కార్యనిర్వహణల జాప్యాలకు కూడా విలువలు లోపిస్తున్న విద్యలే కారణమన్నారు. విద్యా ప్రమాణాలు ఎంత తగ్గితే అంత మేరకు ప్రభుత్వరంగంలోనే కాక ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి చురుకుదనం, మెరుగుదనం, సృజనాత్మకత కుంటుపడుతుందని, అది low productivityకి, వనరుల, వసతుల, సౌకర్యాల wastages కు దారి తీస్తుందన్నారు.

మన విలువలులేని విద్యల వల్ల మన పిల్లలకే కాదు, సగటు ప్రజానీకానికి కూడా మన సాంప్రదాయాల యెడ, మన సంస్కృతీ సంస్కారాల యెడ వైముఖ్యత ఏర్పడుతోంది. పాశ్చాత్య నాగరీకతా సంస్కృతుల యెడ వ్యామోహం ఎక్కువ ఏర్పడుతోంది. మన వారు చాలామంది westernity ని modernity అని అనుకుంటున్నారన్నారు. మనకు కావలసింది సవ్యతతో కూడిన నవ్యత కాని నవ్యతతో కూడని నవ్యత కాదన్నారు.

నేను దేవుని కన్నా ఎక్కువ దైవత్వాన్ని నమ్ముతాను, నేను దైవత్వమంటే మంచితనమని భావించే వాన్ని అన్నారు. To me old is gold అని రెండు సార్లు దానిని రిపీట్ చేస్తూ, ఇలా అంటే నన్ను out dated అంటారని నాకు తెలుసు కాని, నేనా వాక్యాన్ని old values are gold values అను అర్థంలో వాడుతున్నానన్నారు. ఒకనాడు విలువలకున్నంత గౌరవం, నేడు లేదంటూ ఇపుడంతా కౌశల్యాలదే కదా జోరు, హోరు. పరువంతా, పలుకుబడంతా, చలామణీ అంతా వాటిదే కదా? అపుడలా కాదే, అందుకని విలువల రూపేణా ఆ కాలాన్ని గోల్డ్ అని అనక తప్పదు. మనిషి మానవుడు అని అనిపించుకోవడానికి విలువలే గదా మరి ముఖ్యం! అని అన్నారు.

విద్యగురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి ఉదాహరణ అని, తక్కిన విశ్వవిద్యాలయాలను ఉద్దేశిస్తూ మీరు మీ విశ్వవిద్యాలయాలను సరిదిద్దండి, మేము మీకు కావలసినన్ని వనరులు తప్పకుండా సమకూరుస్తామని రాజేంద్ర గారు సభాముఖంగా విశ్వవిద్యాలయాల వీసీలందరికీ హామీ ఇచ్చారు.

రాజేందర్ గారి ఉపన్యాసం విన్నవారు అతనిని సాంప్రదాయవాదిగా భావించవచ్చు. కాని నేను దైవత్వ వాదిని కాని దైవ వాదిని కాను అని అన్నవాడు సాంఘిక సాంప్రదాయవాదవుతాడు కాని మత సాంప్రదాయ వాది కాడు కదా మరి? దేవున్ని నమ్మనివాడు మత సంప్రదాయవాది ఎలా కాగలడు మరి?

సాంఘిక సాంప్రదాయాలంటే ఎల్లకాలాలకు చెందిన విలువలు. వాటికి పాతకొత్తలుండవు. అవి అన్ని కాలాలకు వర్తించేవి. మతాచారాలు మారుతుంటాయి కాని సాంఘికాచారాలు మారవు. సాంఘికాచారాలు ఎల్ల కాలాలకు చెందిన మర్యాదలు, సచ్ఛీతలు. సత్యం మారుతుందా? మారదు. ధర్మం మారుతుందా? మారదు. సవ్యం మారుతుందా? మారదు. కృతజ్ఞత మారుతుందా? మారదు. అతిథి సత్కారం మారుతుందా? మారదు. ఆత్మగౌరవం మారుతుందా? మారదు. బంధుత్వ మితృత్వ మర్యాదలు మారుతాయా? మారవు. ఇలాంటివన్నీ సాంఘిక మర్యాదలు. రాజేంద ర్ గారి అభిప్రాయంలో సాంప్రదాయాలంటే ఇలాంటివి. వాటిని పాటించకపోతే నాగరీకత నాగరీకతే కాదు, సంస్కృతి సంస్కృతే కాదు, సంస్కారానికి తావే ఉండదు. మన విద్యల్లో ఇపుడు ఇలాంటి సాంఘిక, సాంప్రదాయాలే లోపిస్తున్నాయని, అది ప్రమాదకరమని వారు వారి ఆవేదనను వారి ప్రసంగంలో వ్యక్తం చేశారు.

మన సాంప్రదాయాలన్నీ మన జీవిత లక్ష్యాలతో, మన ఆకాంక్షా ఆదర్శాలతో, మన కళ్యాణ కోరికతో పాటు లోక కళ్యాణ కోరికతో ముడిబడి ఉంటాయి అని వారన్న లోతైన మాటలకు ఈ క్రింది విశదీకరణ అవసరమేమోనని దాన్ని ఇక్కడ జోడిస్తున్నాను.మనవారికి చాలామందికి సాంప్రదాయాలంటే మత సాంప్రదాయాలనే తెలుసు కాని సాంఘిక సాంప్రదాయాలు కూడా అని తెలియదు. ప్రజాస్వామ్యానికి, సామ్యవాదానికి కూడా సాంప్రదాయమనునది ఉంటుందని తెలియదు. Tradition, convention, precedent, custom మున్నగు వాటిని ఇంగ్లీష్‌లో system procedure mode. method అని అంటారని, సాంప్రదాయ పదాలకు అవి ఆంగ్లేయ పదాలని ఒకనాటి customs, conventions, precedents మరొకనాటి traditions అవుతాయని తెలియదు. raditional values అంటే normative behavioural systems అని అర్థం. అవి మారవు. ఎందుకంటే అవి చాలా వరకు మనిషి సత్ప్రవర్తనకు, సచ్చీలతకు, మంచితనానికి చెందినవి కనుక. అవి మారితే మానవీయ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది కనుక. ఒక్క వాక్యంలో సాంప్రదాయాలను రాజేందర్‌గారి అర్థంలో చెప్పాలంటే మంచితనాలు, సచ్ఛీలాలు, సత్ప్రవర్తనలు అని చెప్పాలి.

తెలంగాణలో సాంప్రదాయం అను పదాన్ని మంచితనం అనే అర్థంలో కూడా వాడుతారని రాజేందర్ గారికి తప్పకుండా తెలిసుంటుంది. దానికి ఈ అర్థం ఆంధ్ర ప్రాంతంలో లేదు. ఒక మనిషిని ఇతడు మంచివాడు అని అనదలచుకుంటే ఇతడు సాంప్రదాయకుడండీ అని కూడా అంటారు తెలంగాణాలో. అందుకే తెలంగాఫ వారిని ఆంధ్రా ప్రాంతం వారు కూడా అమాయకులు అంటే మంచివారు అను అర్థంలో అంటారు. రాజేందర్‌గారు సాంప్రదాయం అను పదాన్ని మంచితనం అను అర్థంలో వాడారని నేను మరోసారి పాఠకులకు తెలియజేస్తున్నాను వారికి సాంప్రదాయవాది అని సాంప్రదాయవాదానికి ఛాందసవాదమను, మతవాదమను సంకుచిత అర్థాన్ని ఎవరైనా అంటగట్టవచ్చని.

Dr


Hats off to him, and to his speech. అది అంత మంచిది కాబట్టే వీసీ ఎల్లూరి శివారెడ్డి గారు దానిని convocation address లాగుందని సమంజసంగా మెచ్చుకున్నారు. ఉపన్యాసమంతా విన్నాక నాకు రాజేందర్‌గారు లాల్ బహదూర్‌శాస్త్రిగారి లాంటి వాడనిపించాడు. అంత నెమ్మదైనవాడు అంత సిన్సియారిటీ, సీరియస్‌నెస్ కలవాడు మన మట్టికి చెందిన గట్టి వాడని అనిపించాడు. చిన్నగా, తిన్నగా మాట్లాడు కాని మిన్నగా చేయి అని అంటుంది ఒక సూక్తి. రాజేందర్‌గారు ఆ సామెతకు సరిపోయినవారిలా అనిపించారు నాకు. ఆయనకు నా అనేకానేక అభినందన లు. పెద్దవాడిని కనుక ఆశీస్సులు కూడా అందిస్తున్నాను వారికి.
(వ్యాసకర్త: తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ వ్యవస్థాపక కన్వీనర్)

1650

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు