వాడుకభాషకు పరిమితులు


Tue,December 30, 2014 01:06 AM

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహార భాషలోఉంది. దాని వంట భాషలో పంట భాషలో వుంది. దాన్ని మనం ఎక్కువగా మన సాహిత్యాల్లో, మన కవితల్లో కొంతవరకు మన సాంఘీక శాస్ర్తాల్లో వాడుకుందాం. ఇది ఆషామాషీగా ఆదరబాదరాగా ఉద్వేగంతో చేయవలసిన పని కానేకాదు. సావధానంగా, అవగాహనతో ఎంతో ఆలోచించి, పరిశోధించి చేయవలసిన పని.

తెలంగాణ భాష గురించి మాట్లాడేవారంతా కొన్ని ప్రధానమైన భాషా విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవి మన భాషకేకాదు, అన్ని నాగరిక భాషలకు చెందేవి. తెలుగు భాషవరకొస్తే అవి తెలుగుభాష మాట్లాడేవారందరికీ వర్తించేవి. స్థూలంగా భాష రెండు విధాలుగా వాడబడుతుంది. మాట్లాడే ది, రాసేది. ఈ రెండు వాడుకల్లో తేడా ఉంటుంది. అందుకే మాట్లాడేభాష రాయబడదు, రాసే భాష మాట్లాడబడ దు. వాటి ఉపయోగాలు, సమయాలు, సందర్భాలే వేర్వేరు.

స్థూలంగా రాసే భాషే ప్రామాణికమవుతుం ది, అవ్వాలి కూడా. ఎందుకంటే మాట్లాడే భాష రికార్డుకు ఎక్కదు. పదిమందికి ఎవరు ఎలా ఎందుకు మాట్లారో తెలియదు. మాట్లాడేభాషలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. మాట్లాడేభాష unrigistered docum ent లాంటిది, రాసే భాష rigistered document లాంటిది. అందుకే రాసేవానికి జాగ్రత్త మరీ ఎక్కువ అవసరమవుతుంది.

రాసే భాషలో పుస్తక (గ్రాంథిక) భాష, పుస్తకేతర (గ్రాంథికేతర) భాష అనేది మరొకటుంటుంది. పుస్తకాల్లోనూ సాంకేతిక పుస్తకాల భాష ఒక విధంగా ఉంటుంది. సాంకేతికేతర పుస్తకాల భాష మరొక విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఆరోగ్య, వ్యవసా య శాస్ర్తాలకు, కంప్యూటర్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ మొదలగు శాస్ర్తాలకు చెందిన భాష మరీ సాంకేతికంగా, పారిభాషికంగా, టర్మినాలాజికల్‌గా ఉంటుం ది. అలాగే సైన్స్‌కు చెందిన భాష కూడా. వీటిలో వేటికి చెందిన ప్రత్యేక పదజాలం వాటికుంటుంది. వాటి లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత భాషంటూ వుండదు. అది కేవలం శాస్త్రీయాంశాలకు, విద్యాంశాలకు, బోధనాంశాలకు, అధ్యయనాంశాలకు చెందిన భాషే అవుతుంది.

పాఠ్యపుస్తకాలు తెలంగాణ భాషలో రాయాలని అనేవారు ఇది ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. పాఠ్యాంశాల భాష, వాటికి చెందిన పాఠ్యపుస్తకాల, అనుబంధ గ్రంథాల, పత్రికల భాష ప్రపంచంలోని ఏ భాషలోనైనా ఒకేలా ఉంటుంది. సామాజిక శాస్ర్తాల్లో మాత్రం ఆయా సమాజాల వైవిధ్యాలు, వృద్ధి అభివృద్ధి భేద విభేదాలు సూచించడానికి కొంత స్థానిక భాష వాడే అవకాశం, అవసరముంటుంది. కానీ సైన్స్‌కు, టెక్నాలజీలకు చెందిన భాషల్లో మాత్రం అలాంటి అవకాశాలు చాలా తక్కువ.

మానవీయ శాస్ర్తాల్లో కూడ సాంస్క ృతిక భేద విభేదాల వల్ల కొన్ని పదప్రయోగాలు, వాక్య నిర్మాణాలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందినవి ఉంటే ఉండవచ్చు స్థానిక సాంస్క ృతిక పరిస్థితులను బట్టి. అందుకే కథలు, కథానికలు, నవలలు, నాటకాలు, కవితలు స్థానిక వాసనలను, సంస్క ృతులను ప్రతిబింబిస్తాయి. అందువల్ల తెలంగాణ మానవీయ శాస్ర్తాల తెలుగులో తెలంగాణ అస్తిత్వాన్ని, దాని సంస్క ృతిని ప్రతిబింబించేందుకు ఆ ప్రాంతపు మాండలికాలు, సామెతలు, నానుడుల, దేశీయాలు, ప్రతీకలు మున్నగునవి ఆ ప్రాంత తెలుగులో ఉండాలి.

సామాజిక మానవీయ శాస్ర్తాల్లో ఇతర భాషల పదా లు కూడా వుండడానికి ఆస్కారముంటుంది. ఆయా సమాజాలకు చెందిన భేద విభేదాల వల్ల, పరిసర ప్రాంతాల ప్రభావాల వల్ల. ఉదాహరణకు ఆంధ్ర ప్రాంత తెలుగులో ఉన్నన్ని సంస్కృత, తమిళ, కన్న డ, ఒరియా, ఇంగ్లీష్ పదాలు తెలంగాణ తెలుగులో వుండవు ఏవో కొన్ని ఉర్దూ పదాలు తప్ప. దానికి కార ణం అచ్చమైన తెలుగుభాష తెలంగాణలోనే పుట్టి, తెలంగాణ నుంచే ఆంధ్రకు తరలిపోయిందని నా ఊహ. ఆ విషయం తెలంగాణమను పేరులోనే వుం ది. తెలంగాణ తెలుగు తెలుగు భాషకు పుట్టినిల్లు. ఆంధ్ర అన్న పదం ప్రాంతానికి చెందిందే కాని భాషకు చెందింది కాదని దాని పేరే చెబుతున్నది. కనుక ఆంధ్ర లో మాట్లాబడే, రాయబడే భాష ఇతర భాషల పదాలతో పాటు తెలంగాణలోని అచ్చ తెలుగు పదాల సమ్మిశ్రమము.

ఆంధ్రాప్రాంత అచ్చ తెలుగు భాష కానే కాదు. ఆంధ్ర ప్రాంతం వారు తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ కలిపి మాట్లాడితే అది గొప్ప భాష అనుకుంటారు. సంస్కృత భాష ఎక్కువ కలిపి మాట్లాడితే కూడా అలాగే గొప్ప అని అనుకుంటారు. వారికి వారి భాష తెలంగాణ భాషకన్నా గొప్పది అను అహంకారం అలా వచ్చింది. కానీ వారి తెలుగు అచ్చతెలుగుదనం వల్ల కాదు. కానీ తెలంగాణ వారిదే అచ్చ తెలుగు. ఆంధ్రాప్రాంతం భాషలోని ఎన్నో తెలుగు పదాలు తెలంగాణావి. అవి ఇటు నుంచి ఎగుమతి చేసినవి. వారిది మిశ్రమ భాష. తెలంగాణ భాషలో సంస్క ృత, ఉర్దూతో సహా ఇతర భాషా పదాలు చాలా తక్కువ. అందుకే మాదే అచ్చ తెలుగు, మీది కాదు. దానికి గర్వించవలసినవారు తెలంగాణ కాని ఆంధ్రా ప్రాంతంవారు కారు.

తమాషా ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం కూడ ఇతర భాషారాష్ర్టాలు ఏర్పడినట్లే తెలుగు భాష పేరట ఏర్పడడం. ఆంధ్రా ప్రాంతం మాత్రం అలా భాష పేరట ఏర్పడక ప్రాంతం పేరట ఏర్పడ డం. ఎందుకంటే ఆంధ్రా అను ప్రాంతం ఒక ప్రాంతానికి తప్ప ఒక భాషకు వర్తించదు గదా మరి? రాజ్యాం గం పేర్కొన్న ముఖ్య భాషల్లో తెలుగు తప్ప ఆంధ్రభాష ప్రస్తావనే లేదు కదా!

పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల వైపు దృష్టి ప్రసరిస్తే సామాజిక, మానవీయ శాస్ర్తాల్లో కొన్ని పరిసర ప్రాం తాలకు చెందిన, ఉప ప్రాంతీయ పదాలకు తావుంటే ఉండవచ్చు. వాటిలోనూ ప్రామాణికం కానీ ప్రాంతీ య, ఉపప్రాంతీయ పదాలు విచ్చలవిడిగా వాడితే అవి బోధించే వారికి, నేర్చుకునే వారికి ఎంతో అసౌకర్యంగా వుంటాయి. వాటివల్ల Comparative study కి చెందిన ఇబ్బందులొస్తాయి. ఒకే పదానికి వేరు వేరు అర్థాలు వచ్చే అవకాశాలు ఏర్పడుతాయి. అన్ని శాస్ర్తాలకూ వాటికి చెందిన భాషంటూ ఉంటుం ది. ఆ భాష ప్రామాణికమైనది కావలసి ఉంటుంది. లేకపోతే ఆ శాస్త్రం దాని శాస్త్రీయతే కోల్పోతుంది.

పాఠ్యపుస్తకాలన్నీ శాస్ర్తాలకు చెందినవే కనుక వాటి భాషలను అలా ప్రామాణికం చేయడం ఆవశ్యకమైపోతుం ది. తెలంగాణ భాషలో రాయబడిన ఫిజిక్స్, ఎకనమి క్స్ అంటూ ఉండదు. ఇక ప్రతి భాషకు చెందిన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు, నగర ప్రాంతాలుంటాయి. వీటిలో కాస్తో కూస్తో తేలుంటాయి. పాఠ్యపుస్తకాలు గ్రామీణ భాషలో రాయాలా లేక నగర భాషలోనా? అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా నగర భాష దేశవిదేశాలలో మాట్లాడే భాషవుతుంది కనుక మన విద్యాధికులు అంతటా చెలామణీ కావాలంటే మనకు నగరాలలో మాట్లాడే భాష వాడక తప్పదు.

గ్రామీణ భాష పరిమితమైన పదాల భాష కనుక విద్యా భాషగా అంతగా నడవదు. అలాంటి భాషలో విద్యాపరమైన, విషయపరమైన పాఠ్యపుస్తకాలు రాయడం అంతగా కుదరదు. భాషలో colloq ual, non-colloqual భాష, సున్నితమైన శానిభాష కాని భాష అన్నది కూడా ఒకటుంటుంది. ఇది వారి వారి వృత్తుల, నివసించే ప్రాంతాల, పరిసరాల, విద్య, సాంఘిక సాంస్క ృతిక నేపథ్యాలనుంచి వారికి అబ్బుతుంది. colloqual భాష ఎక్కువ గ్రామాల్లో వాడబడుతుంది. గ్రామ భాష ఎంత కాదన్నా, అవునన్నా కొన్ని అవసరాలకు తప్ప అన్ని అవసరాలకు పనికిరాదు. దానిలో colloqual భాష ఎక్కువ ఉంటుంది కనుక. అయినా తెలంగాణ భాషలోనే పాఠ్యపుస్తకాలు రాయాలంటే ఏ తెలంగాణ భాషలో అనే ప్రశ్న ఉద్భవిస్తుందిగా మరి? తెలంగాణ జిల్లాల్లో, మండలాల్లో, ఉప ప్రాంతాల్లో మాట్లాడే భాషల్లో తేడాలున్నాయి.

మొదట అందరు అంతటా వాడే పదాలను తీసుకొని సదరు తెలంగాణ భాషను తయారు చేయాలి. ఆ భాషను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని విద్యలో, పరిపాలనలో, పరిభాషేతర తెలంగాణ భాషగా వాడ లి. పాఠాలలో, పాఠ్యపుస్తకాలలో తెలంగాణా భాష అంటే అలాంటి సాంకేతిక భాష, పరిభాష కాని భాష, వాక్యనిర్మాణానికి చెందిన వ్యాకరణభాష linking wordsకు చెందిన భాష. నా అభిప్రాయంలో పై పేర్కొన్న కారణాల వల్ల తెలంగాణ తెలుగును పనికట్టుకొని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టడం వీలుకాదు. అలాచేస్తే అది వెక్కిరింపుకు, ఎబ్బెట్టుకు దారితీస్తుంది. భాషాభివృద్ధి అనునది ఒక ప్రత్యేక అంశం.

ఏ దేశమై నా మొదట దాని భాషను అభివృద్ధి చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు దానిని సరళీకృతం, నవ్యం చేసుకోవాలి. అది నిరంతరం చేయవలసిన పని. ఈ పని కొంతవరకు తెలుగు అకాడమీ ఇంతవరకు చేసింది. అది అలాంటి పని ఇకెంతో చేయవలసి వున్నది. దాన్ని మరింత బలపరిస్తే అఫీషియల్ లాంగ్వేజ్ కమీషన్‌తో జోడిస్తే ఒక అనువాద విభాగాన్ని కూడ దానిలో నెలకొల్పి దాని పరిధిని విస్తృతపరిస్తే ఇటు తెలుగు మాధ్యమం ఉన్నత విద్య బాగు పడుతుంది, అటు అధికార భాషగా కూడా తెలుగు బాగుపడుతుంది. ఉన్నత విద్య కోసం, ఉద్యోగ పరీక్షలకు చెందిన ఎన్నో పుస్తకాలు ప్రచురించడానికి, తెలుగు భాషను సుసంపన్నం చేయుటకు అదెంతో పనికొస్తుంది.

తెలుగు భాష పేరిట మనకు తెలంగాణ రాష్ట్రమొచ్చింది. దాన్ని సాధించి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులచే కూడా కొనియాడబడే తెలుగు భాషను కంకణం కట్టుకొని కాపాడుకోవాలి. తెలంగా ణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాల్లో ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహార భాషలోఉంది. దాని వంట భాషలో పంట భాష లో వుంది. దాన్ని మనం ఎక్కువగా మన సాహిత్యా ల్లో, మన కవితల్లో కొంతవరకు మన సాంఘీక శాస్ర్తా ల్లో వాడుకుందాం.

ఇది ఆషామాషీగా ఆదరబాదరా గా ఉద్వేగంతో చేయవలసిన పని కానేకాదు. సావధానంగా, అవగాహనతో ఎంతో ఆలోచించి, పరిశోధించి చేయవలసిన పని. తెలుగు ఒక భాషగానైనా బతకాలంటే దానికి చెందిన పాఠ్యాంశాలు సాంఘీక, మానవీయ శాస్ర్తాల నుంచి చేబట్టాలి. ఒకనాడు పీవీ తెలంగాణలో తెలుగు మాధ్యమం ద్వారా తెలుగును కాపాడిన వారయ్యారు. నేడు కేసీఆర్ గారు కూడా తెలుగును కాపాడినవారు కాగలరని నా దృఢ విశ్వాసం. తెలుగుపై వారికున్న పట్టు దానికి సాక్ష్యం.

2120

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు