సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య


Sun,January 19, 2014 12:26 AM

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్యావేత్తలను, న్యాయవాదులను, డాక్టర్లను, ఇంజినీర్లను, న్యాయమూర్తులను పరిపాలనాదక్షులను, ఉన్నతవూశేణి వృత్తి నిర్వాహకులను, ఉద్యోగులను, రాజకీయవేత్తలను తయారు చేసింది. నీతి నిజాయితీలతోపాటు సంస్కారం, క్రమశిక్షణ కలిగిన వారిని కూడా అందించింది. అటువంటి వారిలో సురవరం ప్రతాపడ్డి, పి.వి. నరసింహారావు, జె.వి. నరసింగరావు, బి. రామకృష్ణారావు, డాక్టర్ ఎం.చెన్నాడ్డి, జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, రావి నారాయణడ్డి, రాజ్ బహద్దూర్‌గౌడ్, డాక్టర్ జె.ఎస్.మెల్కోటె, రామానంద తీర్థ, పండిట్ నరేంద్ర, ఆలీయావర్ జంగ్, జెయిన్యార్ జంగ్, మాడపాటి హనుమంతరావు, సీహెచ్.రాజేశ్వరరావు, సీహెచ్ హనుమంతరావు, జె. గౌతమరావు, పిసి నారాయణరావు, రాజాబహద్దూర్ వెంకట రామిడ్డి, రావాడ సత్యనారాయణ, వామన్‌రావు, సి. నారాయణడ్డి, జస్టిస్. పి.జగన్‌మోహన్‌డ్డి, మహదేవ్‌సింగ్, టి.నవనీతరావు, డాక్టర్ ఎం. బల్వంత్‌డ్డి, జి. రామిడ్డి, జస్టిస్ సర్దార్ అలీఖాన్, ప్రొఫసర్ జయశంకర్, వందేమాతరం రామచందర్‌రావు, దాశరథి సోదరులు, కాళోజీ సోదరు లు, ఆనందరావు తోట, కొండా లక్ష్మణ్ బాపూజీ, వి.జగపతిరావు, పి.రామచంవూదాడ్డి, బి.నర్సింగ్‌రావు, పి.నర్సింగ్‌రావు, డాక్టర్ పి.యశోదాడ్డి, డాక్ట ర్ విద్యాలంకార్, కొండపల్లి శేషగిరిరావు, సామల సదాశివ లాంటి వారెంతో మంది ఉన్నారు.

అన్నింటిలో ఆనాటి బోధనా మాధ్యమం ఉర్దూ అయినా, విద్యా ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉండేవి. వాటికి ప్రతి సంవత్సరం తగినన్ని నిధులు కేటాయించబడేవి. విద్యార్థులకు ఎన్నో ఉర్దూ పుస్తకాలతోపాటు ఆంగ్ల గ్రం థాలు కూడా చదువుకోవడానికి సమకూర్చబడేవి. ఉర్దూ మాధ్యమం విద్యార్థులను ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో సరిసమంగా తీర్చిదిద్దడానికి తగినన్ని అనువాద గ్రంథాలను వాటికి చెందిన అనువాద శాఖలు సిద్ధం చేసేవి. విద్యార్థులకు పత్రికలు, రిఫన్స్ గ్రంథాలు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉండేవి. నిజానికి ఆ రోజుల్లో ఆనాటి హైదరాబాద్ విద్యార్థులు భారతదేశం మొత్తంలో మంచి ప్రతిభా పాటవాలు, వాక్పటిమ కలవారు, క్రీడాకారులుగా ప్రఖ్యాతినొందేవారు. ఆనాటి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు గులాం అహ్మద్ భాగ్యనగరవాసియే. సంగీతానికి రంగస్థల కళలకు ఆ రోజుల్లో ఎంతో ప్రోత్సాహమిచ్చేది. తరచుగా కవి సమ్మేళనాలు, ముషాయిరాలు మున్నగునవి జరిగేవి.వాటిలో హిందూకవులు, ముస్లింకవులు అధికసంఖ్యలో పాల్గొనేవారు.

తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషా బోధనలు సమాన ప్రతిపత్తి కలిగి ఉండేవి. వాటి బోధనల్లో ఏ తేడా ఉండేది కాదు. ఆ రోజుల్లో కూడా అభివ్యక్తి కౌశల్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మూడు భాషలకు సమాన ప్రాధాన్యం ఇవ్వటమే కాక వాటికి ఐచ్ఛికాంశాలుగా సరిసమస్థాయి కల్పించారు. రేఖాచిత్రాలు గీయడం, చిత్రలేఖనం, ‘దస్తకారి’(వడ్రంగం) నేర్పడానికి కూడా తరగతులు నిర్వహించేవారు. నైతిక విలువలను కూడా పాఠ్యాంశాలతో పాటు బోధించేవారు. వాస్తవానికి ‘దీనియాత్’, ‘ఆఖ్లాఖియాత్’ (ఆధ్యాత్మికత, నైతిక విలువలు) అనే రెండు సబ్జెక్ట్స్ ప్రత్యేకంగా నిర్దేశించేవారు. విద్యార్థులకు మట్టి స్పర్శ సోకాలని, శారీరక శ్రమ అంటే ఏమిటో తెలియాలని వారిచే చిన్న తరహా వ్యవసాయపు పనులు కూడా చేయించేవారు. వారు బొమ్మలు, ఆటవస్తువులు మున్నగునవి తయారు చేయడాన్ని ప్రోత్సహించే వారు. విద్యార్థులకు బయటి పరిసరాలను, సమాజాలను పరిచయం చెయడానికి సెలవుల్లో వినోద వికాసయాత్రలు నిర్వహించేవారు. వారికి సాంఘిక, హేతువాద దృష్టి దృక్పథాలు కలిగించడానికి స్కౌట్లు &గైడ్స్ బృందాలను, తరువాతి కాలంలో ఎన్‌సీసీ దళాలను ఏర్పరచేవారు.

విద్యార్థులకు స్వపరిపాలన, ప్రజాస్వామ్య విధి విధానాలలో, బాధ్యతాయుత పౌరసత్వంలో శిక్షణ ఇవ్వడానికి పార్లమెంట్, అసెం బ్లీ, ఐక్యరాజ్యసమితి సమావేశాల్లాంటివి నిర్వహించేవారు. దేశం కోసం పోరాడి త్యాగాలు చేసిన వారి ‘జయంతులు’ ‘వర్ధంతుల’ రోజుల్లో చర్చలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచనా పోటీలు నిర్వహించేవారు. ఆ రోజుల్లో స్వాతంత్య్రదినం, రిపబ్లిక్ దినాలు ఈనాటిలా సెలవు రోజుల్లా పరిగణింపబడేవి కావు. అలనాటి ముఖ్య సంఘటనలు మననం చేసుకొని, దేశం కోసం విద్యార్థులు వారి జీవి తాల ను పునరంకితం చేసుకునే రోజులుగా భావించి ప్రతిజ్ఞాదినాలుగా జరుపుకునే వారు. ఆనాడు తగినంతమంది అనుభవం, అర్హత, సమర్థత గల ఉపాధ్యాయులు, పరిపాలకులతో విద్యాలయాలు కళకళలాడేవి. విద్యాసంస్థల్లో బోధనా అధ్యయన ప్రమాణాలను పరీక్షించి నిర్ధారించడానికి సీనియర్ అధికారులను నియమించేవా రు. వారు ఉపాధ్యాయులను, విద్యార్థులను పర్యవేక్షణా సందర్భాల్లో చిన్నబుచ్చే వారు కాదు. ఎవరు తప్పు చేసినా, వారిని సానుభూతితో సున్నితంగా మందలించి సరిదిద్దేవారు.

సంఘంలో ఉపాధ్యాయులు, విద్యాసంస్థల పరిపాలకులు ఎంతో గౌరవం పొందేవారు. సమాజంలో వారిని మర్యాద పూర్వకంగా చూస్తూ వారి గురించి ఎంతో వినయంగా, గౌరవంగా మాట్లాడేవారు. వారి సమర్థతను, సచ్ఛీ లతను గుర్తిస్తూ గౌరవించేవారు. పాఠశాల, కళాశాల విద్య చాలామందికి అందు బాటులో ఉండడానికి అన్ని స్థాయిల్లో ఫీజులు చాలా తక్కువగా నిర్దేశించేవారు. చాలామంది విద్యార్థులకు ఉచిత విద్య, ఉపకార వేతనాలు ఇచ్చి వారిని చదువు కోవడానికి ప్రోత్సహించేవారు. బీద విద్యార్థులకు పుస్తకాలు కూడా ఉచితంగా ఇచ్చేవారు.నాటి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి, ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ స్థానం పొందడానికి, కేంద్ర రాష్ట్ర స్థాయి ఉన్నత ఉద్యోగాల కోసం జరిపే పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఈ రోజుల్లో వలె ‘ట్యుటోరియల్ సంస్థ’లను ఆశ్రయించేవారు కాదు. సాధారణ విద్యా సంస్థల్లో రెగ్యులర్‌గా జరిగే చదువులే వారికి సరిపోవునంత తోడ్ప డేవి. నిజానికి ఆ రోజుల్లో ‘ట్యుటోరియల్స్’లో చేరడం సిగ్గుచేటుగా పరిగణించే వారు. అవి తెలివి తక్కువ వారికి, చదువుల్లో వెనుకబడ్డ వారికి మాత్రమే చెందిన వని భావించేవారు. ‘బుద్ధి వికాసం కలిగించే విద్య’తో గాక, ప్రవేశపరీక్షలు బాగా రాయటం కోసం బట్టీ పట్టించే ‘ట్యుటోరియల్ సంస్థలు’ చాలావరకు సీమాంధ్ర వారివే. ఉన్నత ఉద్యోగాల నియామకాల కోసం పోటీ పరీక్షల కోసం ‘సమాచార విజ్ఞానాన్ని’ మాత్రమే అందించే ‘కోచింగ్ సెంటర్లు’ మేధావిగా, సామాజిక దృష్టి కల ఉద్యోగిగా, మంచి పౌరునిగా వికసించాలనే విద్యార్థి కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని నీరు గార్చాయి.


ఆంధ్రప్రాంతానికి చెందిన ట్యుటోరియల్ సంస్థలు ప్రశ్నా పత్రాలు రూపొం దించేవారి నుంచి ప్రశ్నలను, సమాధాన పత్రాలు దిద్దేవారి నుంచి మార్కులను ఏదో విధంగా సేకరిస్తాయనే విమర్శలూ ఉన్నాయి. ఏది ఏమైనా ‘మెరిట్’ అనే దాని పరువు పోగొట్టాయి. ఈ సంస్థల యాజమాన్యం ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పెద్ద జీతాల ఎరవేసి ట్యుటోరియల్ సంస్థల్లో రహస్యంగా పనిచేసేట్టుగా ప్రోత్సహించాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన ఈ ట్యుటోరియల్లు సాధారణ కళాశాలల్లోని విద్యా విధానాన్ని దెబ్బతీశాయి. దానికి ఆంధ్రా పాలకులే కారణం. ఇపుడు పాఠశాల తరగతుల్లో 60మంది, కళాశాల తరగతుల్లో 100 మంది విద్యార్థులకు ప్రవేశం ఇస్తున్నా, నిజానికి తరగతి గదులు 40 నుంచి 60 మందికి మాత్రమే సరిపోయేట్లుగా ఉంటాయి.

కిక్కిరిసిన తరగతి గదుల్లో సరిగ్గ్గా బోధిం చ డం, నేర్చుకోవటం ఎలా కుదురుతుంది? ఇది మన ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల గైర్‌హాజరు, పరీక్షలలో ఉత్తీర్ణులు కాకపోవటం అన్న విషయం పట్ల ప్రభుత్వానికున్న ఉదాసీనతను చాటుతున్నది.నాటి విద్యా విధానం వలన కలిగిన గొప్ప మేలు ‘సెక్యులరిజం’ అనే సద్భావ న విద్యార్థుల్లో పెంపొందేది. ప్రతి పాఠశాలలోనూ అధిక సంఖ్యలో హిందూ, ముస్లిం విద్యార్థులు చదువుకున్నా ఉపాధ్యాయులుగా పనిచేసినా అపుడు వారి మధ్య మత విద్వేషాలు తలెత్తేవికావు. అందుకే మిగిలిన ప్రాంతాల వారికన్నా తెలం గాణ ప్రాంతంలో ప్రజలు మానవతా దృష్టినీ, విశ్వజనీనతను ఎక్కువ కలిగి ఉంటా రు. దీనికి కారణం విద్యావంతులు వారి పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే రోజుల్లోనే ‘సెక్యులరిజం’ను జీర్ణించుకోవడం.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడగానే ఆ ప్రాంతం పాలకులు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించటం కోసం ఉద్దేశపూర్వకంగా ఒకనాటి తెలంగాణలోని ప్రభుత్వ సంస్థ కు చాలీచాలని సౌకర్యాలు, శుభ్రంగా లేనిపరిసరాలు, పడిపోవటానికి సిద్ధం గా ఉన్న భవనాలు సమకూరు స్తూ కావాలని వాటిని బక్కచిక్కేట్టు చేశారు. చాలా పాఠశాలలో తగినంత మంది ఉద్యోగులు లేకుండా ఉపాధ్యాయ శిక్షణగాని, అర్హతగాని లేని ఎంతోమంది ఉపాధ్యాయులను తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతి మీద, కన్సాలిడేటెడ్ జీతం మీద నియమిస్తూ వారిని వారికి సమర్థత లేని సబ్జెక్ట్స్ చెప్పమని బలవంత పెడుతూ, పర్యవేక్షణా విధానానికి తిలోదకాలిస్తూ విద్యాలయాలకు అతి తక్కువ నిధులు కేటాయించడం మొదలుపెట్టారు. దాని వల్ల విద్యాలయాల్లో క్రమశిక్షణా రాహి త్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనడం మామూలై పోయింది.

ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో అద్భుతాలను చేసేది ఆంగ్ల మాధ్యమం కాదు, వాటికి నిధులు, వసతి సౌకర్యాలు సమంజసంగా సమకూర్చు అలాంటి వనరులు, వసతులు ప్రభుత్వరంగ విద్యాలయాలకు కూడా సమకూరిస్తే అవి వాటికన్నా మంచి ఫలితాలు ఇస్తాయి. బీద వారికి ప్రభుత్వం మంచి విద్య అందించదలచుకుంటే వారు చదువుతున్న సంస్థలకు తగినన్ని సదుపాయాలు కల్పించి వాటిని సక్రమంగా పట్టించుకోవాలి. వాటిలో చదివే బీదవారికి బ్యాంకుల నుంచి తిరిగి తీర్చే విధంగా అప్పులిప్పించి ధన సహాయం చేయాలి. చేయవలిసింది తెలుగు మాధ్యమాన్ని ఇంగ్లిష్‌లోనికి మార్చడం కాదు, చేయవలసింది. ఈ సందర్భంగా చెప్పదలచిందేమిటంటే ఆంధ్రా నాయకులు, పాలకులు, ధనవంతులు ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పి, అధిక ఫీజులు, డొనేషన్లు వసూలు చేసి, ధనం సంపాదించటానికి తెలంగాణలో అపుడున్న విద్యా విధానాన్ని, వ్యవస్థను సర్వనాశనం చేయడానికి బుద్ధిపూర్వకంగా కుట్ర పన్నారు. గత అరవై ఏళ్లుగా వారు అలా చేస్తూనే ఉన్నారు. దీంతో ఆంధ్రాలోని ప్రైవేట్‌రంగ విద్యాసంస్థలు ఎంత పుంజుకున్నాయంటే వాటి యజమానులు ఎన్.టి.ఆర్ లాంటి ముఖ్యమంవూతిని కూడా వారికి అనుకూలమైన విద్యాసంబంధిత విషయాలలో వేలుపెడితే రాజకీయ విషయాలలో వారికి ఇబ్బంది కలిగిస్తామని బెదిరించగలిగారు.
ఎన్.టి.ఆర్. జమానాలో జరిగిందే మరిం త బాహాటంగా ఇప్పుడూ జరుగుతున్నది. నేడు రాష్ట్ర రాజకీయాలను ఆదేశిస్తున్నవి ఐదు ‘సిండికేట్‌లు’ మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ సిండికేట్, ఖనిజాలు గ్రానైట్ సిండికేట్, విద్యారంగ సిండికేట్, కాంట్రాక్టర్ల సిండికేట్. వీటిని అదుపులో పెట్టకపోతే రాబోయే తెలంగాణ కూడా ఇలాంటి వారితోనే పాలించబడుతుంది.
-డాక్టర్ వెల్చాల కొండలరావు
తెలంగాణ కల్చరల్ ఫోరం కన్వీనర్

226

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్రుల విద్యా వ్యాపారం

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’న

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles