సీమాంధ్రుల విద్యా వ్యాపారం


Sat,October 6, 2012 04:15 PM

తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే. కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’ని వ్యాపార సంస్కక్షుతిగా సీమాంధ్ర పాలకులు మార్చారు. ఆంగ్లేయ భాష పేరిట విద్యావకా శాలను, ఉద్యోగావకాశాలను బీదసాదలకు, వెనుకబడిన వారికి ఎలా కాకుండా చేశారో, అలాగే విద్యా విధానాన్ని రాజకీయాల కోసం ఎన్నికల పాలసీగా మార్చారు

సీమాంధ్ర వలసవాదులు తెలంగాణకు చేసిన నష్టాలు, ద్రోహాలు ఇన్నీ అన్నీ కావు. స్వచ్ఛమైన పాలకుండలాంటి తెలంగాణ సమాజాన్ని విషతుల్యం చేశారు. చివరికి విద్యను కూడా వదలలేదు. ఒకప్పుడు తెలంగాణలోని విద్యంతా ఉర్దూ భాషలో ఉండేది. విద్యాలయాలకొక నీతి, రీతి, పద్ధ తి, కావలసిన వనరులు, సౌకర్యాలు ఉండేవి. నిష్పక్షపాతంగా నియమించబడిన నిష్ణాతులైన అధ్యాపకులు ఉండేవారు. సరిపోయేంత భవనాలు, ఆటస్థలాలతో విద్యాలయాలు విలసిల్లేవి. విద్యారంగంలో అవినీతి, బంధువూపీతి, పక్షపాతం మచ్చుకైనా కనిపించేవి కావు. అధ్యాపకుల నియామకాలు, బదిలీల్లో నియమ నిబంధనలు, సీనియారిటీ తదితర అంశాలను విధిగా పాటించేవారు.

నాటి ప్రభుత్వం విద్యావికాసానికి కావలసిన జ్ఞానం కోసం ఎన్నో ఆంగ్లేయ పుస్తకాలను అనువాదాలు చేసి విద్యార్థులకు, అధ్యాపకులకు అందుబాటులో ఉంచేది. అనువాద పుస్తకాలతో పాటు, అస లు గ్రంథాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉండేవి. అప్పట్లో అన్నీ ప్రభుత్వ విద్యాలయాలే. ఎక్కడో కొన్ని ప్రైవేటు విద్యాలయాలున్నా.., అవి సంఘసంస్కర్తలు, సంఘసేవకుల నిర్వహణలో సేవా దృక్పథంతో నడిచేవి. ఫీజులు నామమావూతంగా ఉండేవి. డొనేషన్లు అనే మాటే తెలియదు. ప్రభుత్వమే ప్రైవేటు విద్యాలయాలు నడుపుటకు గ్రాంట్ ఇన్ ఏయిడ్ ఇచ్చేది. విద్యాలయాలు నడపడం ఓ సంఘసేవగా ఉండేది.
నాటి విద్యాలయాల్లో చర్చలు, సదస్సులు, సాహిత్య సారస్వత పోటీలు మున్నగు వాటితో పాటు ఎన్నో ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించబడేవి.

వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన ఎన్నో కార్యక్షికమాలు విద్యాలయాల్లో నిర్వహించబడేవి. పరిమితమైన సంఖ్యతో తరగతులు ఉండేవి. ఇలాంటి విశిష్టతలు చాలా ఉన్నాయి. ఇట్టి విద్యాలయాల నుంచే ఎంతో మంది ప్రతిభావంతులుపయోజకులు ఉద్భవించారు. పీవీ నరసింహారావు, మర్రిచెన్నాడ్డి, సురవరం ప్రతాపడ్డి, సీహెచ్ హనుమంతరావు, టీ. నవనీతరావు, సి. నారాయణడ్డి, జి రాంరెడ్డి, సీహెచ్ రాజేశ్వరరావు, రావి నారాయణడ్డి, కొండాలక్ష్మణ్ బాపూజీ, రాజ్‌బహదూర్ గౌర్, జయపాల్‌డ్డి, జె. గౌతమరావు, ఎం. నారాయణడ్డి, వి. జగపతిరావు, పి రామచంవూదాడ్డి, జస్టిస్ జగన్మోహనడ్డి, జస్టిస్ జీవన్‌డ్డి, జస్టిస్ సుదర్శన్‌డ్డి, డా.జయశంకర్, కాళోజీ, సదాశివ లాంటివారు ఎందరో మహానుభావులు మన విద్యాలయాల నుంచి వచ్చారు.

వీరితో పాటు ఉర్దూ మీడియం చదువుకున్న ఇతర ప్రాంతాల వారు కూడా ఉన్నారు. ఎక్బోటే, మెల్కొటే, జయసూర్యా, గోయిందాస్ షర్రాఫ్, వైషంపాయెన్ లాంటి వారు తెలుగు సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. నాటి ఉర్దూమీడియం చదువులు, నాటి విలువల గురించి మాట్లాడుతున్నానంటే.. నేను ఉర్దూ మీడియాన్ని, నాటి నిజామును సమర్థిస్తున్నట్లు కాదు. కానీ.. విద్యాలయాలు ఎలా ఎంత సమర్థంగా పనిచేశాయని చెప్పడానికే ఉదహరిస్తున్నాను.
సాంస్కృతికంగా.. ఆంగ్లేయభాషకన్నా ఊర్దూ భాష భారతీయ సంస్కృతికి చాలా దగ్గరిది. ఆ భాష ఇక్కడ పుట్టి పెరిగిన భాష. ఆంగ్లేయ భాష అలాంటిది కాదు. అది మన సంస్కృతికి చెందిన భాష నాడు కాదు, నేడు కాదు. ఈ దేశంలో విద్యాభ్యాసానికి మాతృభాష తదుపరి ఉర్దూ, హిందీ భాషలే మన సంస్కృతికి దగ్గరి భాషలు. ఒక భాషను దాని కల్చరల్ వ్యత్యాసాల ద్వారా బోధించడం వేరు, ఒక భాష మన కల్చరల్ భాష కావడం వేరు కదా. ఉర్దూ భాష తెలుగు వలెనే మన కల్చరల్ భాష. ఈ మధ్య సిఇఎఫ్‌ఎల్‌కు చెందిన వెంకటడ్డి ఇంగ్లీష్ భాషను కల్చరల్ వ్యత్యాసాల ద్వారా బోధిస్తే బాగుంటుందని ఒక మంచి సలహా ఇచ్చారు. కానీ అలా చేస్తే కొంత సులభమైతే కావచ్చు కానీ..మన కల్చరల్ భాష కానేరదు.

కల్చర్ అనేది దానిని చూడనిది, అనుభవించింది, ఆచరించింది, అనుకున్నంత మేరకు మనకర్థమూ కాదు. అబ్బదుకూడా. ఏ భాషా , విద్యా సిద్ధాంతం చూసినా.. ఇదే చెబుతుంది. ఇది గ్రహించే చైనా, రష్యా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, కొరియా లాంటి మరెన్నో దేశాలు వారి పౌరులకు వారి భాషల్లోనే విద్యాబోధన చేస్తాయి. ఇంగ్లీష్ భాష ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలమని మాట్లాడే వారు దీనిని గ్రహిస్తే మంచిది. మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ.. మన దేశీయ భాషల్లోనే విద్యా బోధన జరిగితే..మన దేశమూ.. ప్రపంచదేశాల కంటే ముందు భాగాన ఉండేవాళ్లం.

నాటి విద్యాలయాలు ఉర్దూ, తెలుగు ఇంగ్లీషు భాషలు నేర్చుకోవడానికి ‘సమాన ప్రాముఖ్యం ఇచ్చేవి. మీడియం సరే కాని మూడు భాషల బోధనల్లో మాత్రం ఏ వివక్షత చూపేవికావు. అందుకే తెలంగాణ వారు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉండేది. దీనికి పి.వి. నరసింహారావు ఇంకా ఎంతోమందిని ఉదాహరణగా తీసుకోవచ్చు. నాడు విద్యాలయాలన్నీ ప్రభుత్వ నిర్వహణలోనే ఉండేవి. చిన్న, పెద్ద కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా విద్యార్థులందరు ప్రభుత్వ పాఠశాల్లోనే చదివేవారు. అందరూ కలిసి మెలిసి చదువుకునేవారు. దానితో కలుపుగోలు సంస్కృతి బాల్యం నుంచే అబ్బేది. ఈనాడు మనమంటున్న ‘సెక్యులర్ సంస్కృతి’ నాటి వారికి చదువుతోపాటు అబ్బేది. అందుకే హైదరాబాద్ ఎప్పుటికీ కలుపుగోలు తనానికి, కలెగలుపు సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. అందుకే నెహ్రూ వంటి వారికి బాగా నచ్చేది. అందుకే ఆయనహైదరాబాద్ రాష్ట్రాన్ని విడగొట్టగూడదని అభివూపాయపడ్డారు. అలాంటి విద్యాసంస్కృతిలో పెరిగిన ఎంతోమంది నాబోటివారు ఈనాటికీ ఉన్నారు. తరతరాల నుంచి వచ్చిన ఆ సంస్కృతి నరనరాలలో ఇమిడిపోయింది. ఇంకా ఎన్నో జెనరేషన్స్ కొనసాగుతాయి.

సీమాంధ్ర సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి ప్రధానమైన తేడా ఆయా ప్రాంతాల విద్య, విద్యాలయాల సంస్కృతుల తేడాల వల్ల ఏర్పడిందేననే దాంట్లో సందేహం లేదు. సీమాంవూధులకు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనలోని లొసుగులు మావూతమే కనిపిస్తాయి. కానీ మంచి కనపడదు. వారు వాటిని చూడదలుచుకోరు. వారిది అన్నిటా పక్షపాత వైఖరే. ఒక వ్యవస్థగురించి మాట్లాడుతున్నప్పుడు మంచి, చెడుల గురించి కూడా మాట్లాడాలి. కానీ.. సీమాంవూధులు ఎప్పుడూ పక్షపాతంతో చూస్తారు. వారి కళ్లెప్పటికీ కామెర్ల కళ్లే. మెల్ల కళ్లే.

నైజాం రాష్ట్రంతోపాటు బ్రిటిష్ పాలనకు చెందని మరెన్నో రాచరిక రాష్ట్రాలు మైసూర్, కాశ్మీర్, ట్రావెన్‌కోర్ లాంటివి ఉండేవి. వాటికి చెందిన రాజులు ఆ ప్రాంత మాతృభాషలను విద్యాభాషలుగా పోషించలేదు, ప్రోత్సహించలేదు. ప్రవేశపెట్టలేదు.వారందరూ ఆంగ్లేయ భాషవైపే మొగ్గారు. కానీ ఒక్క హైదరాబాద్ రాష్ట్రంలోనే మాతృభాష కాకున్నా, మాతృభాషకు దగ్గరిదైన ఉర్దూ భాషను విద్యాభాషగా ప్రవేశపెట్టారు నాటి పరిపాలకుడు. వారిని మనం అభినందించాలా లేక నిందించాలా? కారణాలు ఎన్నో ఉంటాయి. రాష్ట్రంలో అప్పుడు తెలుగు మాధ్యమం ప్రవేశపెడితే బాగుండేది. అదికానప్పుడు ఆంగ్లేయం కంటే ఉర్దూ ప్రవేశపెట్టడాన్ని ఎలా నిందించగలం? ఎప్పుడైతే ఆ రోజుల్లో వేరే రాష్ట్రాల్లో అక్కడి పాలకుడు మన సంస్కృతికి చెందని ఆంగ్లేయ భాషకే తలొగ్గినప్పుడు, తలొగ్గని హైదరాబాద్ పరిపాలకులను ఎలా తప్పు పట్టగలం? ఇంతకూ పరాయిభాష అయిన ఇంగ్లీషు ప్రవేశపెడి తే ఒప్పు? ఉర్దూ పెడితే తప్పా? తెలంగాణలోని నాటి ‘విద్య’ ఒక వ్యాసంగమే.

కాని ఈనాటి లాగా ఒక వ్యాపార సంస్కృ తి మాత్రం కాదు. అలాంటి చక్కని తెలంగాణ విద్యా సంస్కృతి’ని వ్యాపార సంస్కక్షుతిగా సీమాంధ్ర పాలకులు మార్చారు. ఆంగ్లేయ భాష పేరిట జ్ఞానార్జనలను, విద్యావకాశాలను, ఉద్యోగావకాశాలను బీదసాదలకు, వెనుకబడినవారికి ఎలా కాకుండా చేశారో, అలాగే విద్యా విధానాన్ని రాజకీయాల కోసం ఎన్నికల పాలసీగా మార్చారు.

- డా. వెలిచాల కొండలరావు
తెలంగాణ కల్చరల్ ఫోరమ్ కన్వీనర


35

KONDAL RAO VELICHALA

Published: Fri,December 15, 2017 05:56 PM

పీవీ నోట తెలుగు భాష మాట

ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గారు వీటిగురించి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని తెలుగు భాషా పరిరక్షణ సమితి వైపున నేను ప్రత్యేకంగా

Published: Thu,November 30, 2017 11:39 PM

మహాసభలతో తెలుగు వెలుగులు

తెలుగు మహాసభలు నిర్వహించే సందర్భంలో నిర్వాహక పరిపాలక విషయాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలాగే మహాస

Published: Sat,April 22, 2017 11:35 PM

తెలంగాణ జోన్ ఆఫ్ ఆర్క్!

మన ప్రాంతంలో నెలకొల్పబడే శిల్పం మన తెలంగాణ అస్తిత్వవాద ఉద్యమానికి, పోరాటానికి సింబల్‌గా ఉండాలి. అలాంటి శిల్పం జోన్ ఆఫ్ ఆర్క్ లాం

Published: Thu,February 2, 2017 01:22 AM

ఆంగ్లం వల్ల ఆలస్యం

అభివృద్ధిని మనం ఎప్పుడూ పదార్థ అభివృద్ధితో పోలుస్తాం. కానీ మానవీయ అభివృద్ధితో పోల్చం. మానవుడు మానవీయతా అభివృద్ధిలో ఎంత అభివృద్ధి

Published: Sat,November 5, 2016 01:24 AM

అనువాద శిక్షణతో భాషల పరిరక్షణ

ఈ సమావేశంలో ఎదురయ్యే ప్రధానమైన అంశం భాషా సమస్య. ఇక్కడ హాజరైన వారిలో అత్యధిక సంఖ్యాకులు మరాఠీ మాట్లాడేవారే. అందుకని మరాఠీలోనే మాట్ల

Published: Sun,September 18, 2016 12:55 AM

ఆలోచించి ముందడుగు వేద్దాం..!

అరాచకం, అన్యాయం, అధర్మం, బలాత్కారం, దోపిడీ, మానభంగం మున్నగువాటిని హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరు ఎవరిపై జరిపి నా నీచం,

Published: Sun,June 26, 2016 01:19 AM

జ్ఞానాత్మక, సృజనాత్మక విద్య కావాలె

విద్య ప్రధానంగా ఆలోచనను పెంపొందించాలి. తద్వారా భావాన్ని, జ్ఞానాన్ని, సృజనను పెంపొందించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి.అభివృద్ధి ఎంత

Published: Fri,May 27, 2016 12:51 AM

అంచెలవారీగా ఆంగ్ల మాధ్యమం

భాషా భారాన్ని తగ్గించడానికి తెలుగు మీడియం సంస్థల్లో తెలుగును ఒక భాషగా బోధించవలసిన అవసరంలేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంస్థల్లో ఇంగ్ల

Published: Wed,January 27, 2016 12:44 AM

వీసీలకు ఓర్పు, నేర్పు కావాలె

గత ఐదారు దశాబ్దాలుగా విద్యారంగంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనడం వల్ల విద్యార్థుల విద్య ఎంతో దెబ్బతిన్నది. వాటిని తిరిగి మంచి చే

Published: Sat,December 26, 2015 01:06 AM

కాంట్రాక్టు బోధన ఇంకెన్నాళ్లు?

ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి. తెలంగాణ ప్రభుత్వమైనా విద్యా ప్రమాణాల విషయాలను పరిగణనలోనికి తీసుకొని యూనివర్సిటీ వి

Published: Wed,December 16, 2015 01:41 AM

యూనివర్సిటీలను బాగుచేద్దామిలా..

గత ప్రభుత్వాలు వారికిష్టమైన వారికి Irregular అనుమతులు ఇప్పించుకోవడానికి వారే దిగజారిపోయి వారి అర్హతలను, అధికారాలను వారే తాకట్టు పె

Published: Sun,December 6, 2015 03:32 AM

విశ్వవిద్యాలయాలే నేటి దేవాలయాలు

విద్య గురించి మీరు పట్టించుకుంటే, మేము తప్పకుండా మీ గురించి పట్టించుకుంటాం. తెలుగు విశ్వవిద్యాలయానికి పెంపొందించిన గ్రాంటే దానికి

Published: Sun,January 18, 2015 01:30 AM

పరీక్షలు-ప్రమేయాలువి

ద్యకు చెందిన అధ్యయన బోధనలన్నీ తుదకు పరీక్షల కోసమే. చదివినవాడు చదవవలసింది చదివినాడా లేదా, నేర్వవలసింది నేర్చినాడా లేదా అని తెలుసుకో

Published: Tue,December 30, 2014 01:06 AM

వాడుకభాషకు పరిమితులు

తెలంగాణ తెలుగు ఒకటుంది. అది దాని మాండలికాలకలె ఉంది, దాని సామెతల్లో వుంది, పండగలకు పబ్బాలకు చెందిన పదాల్లో ఉంది. దాని వ్యవసాయ వ్యవహ

Published: Sun,January 19, 2014 12:26 AM

సీమాంధ్ర పాలనలో పతనమైన విద్య

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో చక్కగా రూపొందించి, పోషించిన విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఉండేది. అది ఎందరో విద్య

Published: Wed,January 8, 2014 12:43 AM

సీమాంధ్ర నేతల వైఖరి రాజ్యాంగ విరుద్ధం

మన శాసనసభా సభ్యులు తెలంగాణ బిల్లును చించివేయ టం.. మన రాజ్యాంగం ప్రతిని చించివేయడం లాంటిది. బజా ర్లో ఎవరో చిల్లరమూకలు అలాంటి దేదైన

Published: Sat,October 6, 2012 04:16 PM

ఇపుడు తెలంగాణకు కట్టుబడిన వారికే ఓటు వేయండి

పదండి! కదం తొక్కండి! ‘ఎదుట సువిశాల మైదానముంది, వాంఛల తోట ఫలోన్ముఖమై మీవైపే చూస్తుంది’ మార్గ మధ్యంలో ఎన్ని నదులు, అడవులడ్డమైనా

Published: Sat,October 6, 2012 04:17 PM

‘బతకమ్మ గా మారిన ‘బతుకమ్మ

‘బతకమ్మ’ అంటే బతుకుదెరువును మెరుగుపరి చే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవ చ్చు

Published: Sat,October 6, 2012 04:15 PM

సీమాంధ్ర దొరతనం-2

సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌ను వారెంత అభివృద్ధి చేశారో జ్ఞాపకమొస్తుంది. కాని హైదరాబాద్ కు వచ్చి వారు ఎంత అభివృద్ధి చెందారో ఎన్ని

Published: Tue,October 9, 2012 03:34 PM

సీమాంధ్ర దొరతనం-1

ఈ మధ్య శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు మాత్రమే చట్టాల్లో ఏ మార్పులు చేయడానికైనా హక్కుంటుంది. కాని, బయటి వారికి అలాంటి హక్కు

Featured Articles