నూరేళ్ల కదీర్ కథలు


Fri,December 7, 2012 03:45 PM

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా సరిపోతుంది. ‘లిటరేచర్ ఇన్ హర్రీ’- ఈ మాట ఎందుకంటే దినాం ఒక కథను ఫ్యామిలీ పేజీ ద్వారా అందించాలనుకుని రాయడం ఒకటైతే, ఒక కావ్యం అనదగ్గ కథను ప్రతిరోజూ పాఠకులకు చెప్పాల్సినప్పుడు బాగా ఎక్సర్‌సైజ్ చేసి రాయాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫీచర్‌ను నిర్వహించిన ఖదీర్ అంత ఓపిక ఉన్న మనిషి కాకపోవడం, ఫీచర్ కూడా డైలీ ఇవ్వాల్సి రావడం. అదీగాక స్వభావ రీత్యానే దేన్నయినా తనదైన శైలిలో రాసే ధోరణి కలవాడు కావడం- దీంతో వందేళ్ల తెలుగు కథలన్నీ ఖదీర్ స్థాయి కథలుగా మారిపోయిన వైనం ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ కనబడుతున్నది.
మరో విషయం. తెలుగు జర్నలిజంలో విడిగా సాహిత్యానికి పేజీలు ఏర్పడ్డాయి. అట్లే ఆదివారం అనుబంధాలు సాహిత్యానికి- ముఖ్యంగా కథ, కవిత్వానికి మంచి ప్రాధాన్యం ఇవ్వసాగాయి. ఈ ఒరవడిలోంచే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాహిత్యం సీరియస్‌గా చర్చకు వస్తోంది. వివిధ ధోరణులు సాహిత్యకారులకు, పాఠకులకు అందుతూ ఉన్నయ్. ఇదొక సంప్రదాయంగా మారింది. విడిగా సాహిత్య పత్రికల రీచ్ పెద్దగా లేకపోవడం వల్ల దినపవూతికల నుంచే సాహిత్యం ప్రజలకు చేరువ అవుతున్నది. అది తెలుగు పాఠకుల బలమూ, బలహీనత కూడా. అయితే, దాదాపు అన్ని పత్రికల సండే మేగజైన్ నిర్వాహకులు, సాహిత్య పేజీల నిర్వాహకులు ఎంతో బాధ్యతగానే ఈ పనులు నెరవేరుస్తున్నారు. ఆయా బాధ్యులు కూడా మంచిపేరు సంపాదించుకున్నారు. అయితే, వాళ్లెవరూ సాహిత్యాన్ని ఒక్కోసారి వాద వివాదాల్లోకి నెట్టారుగానీ, పగటిపూట ఉబుసుపోక చూసే వంటల ప్రోగ్రాంలా మార్చలేదు. అయితే, సాక్షి పత్రిక పెద్దఎత్తున వచ్చింది. ఫీచర్స్ ఇంఛార్జీగా అడ్వర్టయిజ్‌మెంట్ రంగం నుంచి వచ్చిన ప్రియదర్శినీ రామ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన వద్ద ఖదీర్ ఫ్యామిలీ పేజీ ఇంచార్జీగా పనిచేయడం ప్రారంభించా డు. రామ్ ఏదైనా పాఠకులకు ఎమోషనలైజ్ చేసి ఇవ్వాలనుకునే మనిషి. అది తమాషా అంశం అయినా సీరియస్ అయినా మంచి ప్యాకేజీతో ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతీ అంశాన్నీ వ్యాపార సూత్రంలో ఒదిగేలా, ఒక యాడ్ కాపీలా ఆసక్తిగా మలి చి ఇవ్వడం ఆయన సరళి. ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ వల్ల రకరకాల ఫీచర్స్‌ను ఆసక్తిగా మలవడం, పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విజయవంతం అయ్యాడ నే చెప్పుకోవాలి.

కానీ, కథంతా ఖదీర్‌తో నే వచ్చింది. అవును. రామ్ సూచనతో ఖదీర్ డైలీ ఒక ప్రసిద్ధ రచయిత కథను వండి వార్చడంతోనే వచ్చింది. అది కూడా ఫ్యామిలీ పేజీలో కొత్త పాఠకులను, ముఖ్యంగా స్త్ర్రీ పాఠకులను ఆకట్టుకునే రీతిలో, ఓ టీవీ సీరియల్ చూసిన అనుభూతిని పంచేందుకు ఏర్పాటైన ఫీచర్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది పత్రికలో వచ్చినన్ని రోజులూ సక్సెసే. అంతటితో కథ ముగిసింది. కానీ వివిధ ప్రాంతాలు, వాదా లు, వ్యక్తుల బ్యాలెన్స్ కోసం మరి 25 కథలు కలిపి ‘నూరుగురు కథకుల నూరు ప్రసిద్ధ కథల’ పుస్తకంగా ఖదీర్ తేవడం, సీరియస్ సాహిత్యానికి నాదో కానుక అన్నట్లు వ్యవహరించడంవల్ల కొందరు ఈ పుస్తకాన్ని సీరియస్‌గా తీసుకుని లోతుగా చర్చించారు. అయితే, ఇదొక్కటే కాదు, ఖదీర్ ఇటువంటి ప్రయత్నాలు ఇది వరకు కూడా చేశాడు. బాలీవుడ్ క్లాసిక్స్ పేరిట కూడా ఓ ఫీచర్ నడిపి ఇట్లే బుక్ వేసుకున్నాడు. ఈ విషయాలన్నీ గమనించి చదువుకుంటే ఈ పుస్తకం బాగుంటుందని అభివూపాయపడవలసి వస్తున్నది. అయితే, ఇక్కడ మరో విషయమూ చెప్పుకోవాలి. ఖదీర్ కథలపై భిన్నాభివూపాయం ఉంది. జమీన్, న్యూ బాంబే టైలర్స్, దూద్ బఖష్, ఖాదర్ లేడు...దర్గామిట్ట కథలు, పోలేర మ్మ బండ కథలు...ఇవన్నీ తన కథలు. వాటిని చదివి ఆనందించిన పాఠకులూ ఉన్నారు. కథకుడిగా ఖదీర్ సృజన వరకూ అభినందనీయుడే. కానీ ఒక పాత్రికేయుడిగా, ఫీచర్ రైటర్‌గా ఈ శీర్షికను నిర్వహించినప్పుడు, అది కథలమీదే అయినప్పుడు, దాన్ని నిర్వహిస్తున్నది సాహిత్యంలో భాగంగానా కాదా? అన్న విచక్షణ ఉండి వుంటే- ఆ ఫీచర్ పూర్తయ్యాక దాన్నుంచి కాస్తంత ఎడంగా జరిగి ఉంటే గౌరవంగా ఉండేది. కానీ ఖదీర్ ఆ ఫీచర్ నుంచి బాగా ఆశించాడనే అనిపిస్తున్నది. అందువల్లే ఈ పుస్తకం కథాత్మను ఆవిష్కరించే దిశలో సాగలేదని చెప్పవలసి వస్తున్నది. ‘నూరేళ్ల తెలుగు కథలు’ అన్న గంభీర శీర్షికతో ఈ కథల్ని పరిశీలిస్తే భంగపడక తప్పదనీ అనవలసి వస్తున్నది. ఈ పుస్తకం ‘లిటరేచర్ ఇన్ హర్రీ’ అన్న నానుడికి దగ్గరగా ఉందని పేర్కొనడం కూడా అందుకే. చివరగా, ఏ విషయాన్నయినా తనదైన శైలిలో చెప్పే మనిషి రాసినందువల్ల ఈ కథలన్నీ ఖదీర్ స్థాయిలోకి వచ్చిపడ్డాయని, అందుకే పుస్తకాన్ని ‘నూరేళ్ల ఖదీర్ కథలు’ అనీ పేర్కొనవలసి వస్తున్నది. అదీ విషయం.

-కందుకూరి రమేష్ బాబు
(పేజీలు 375. ₹: 190. ప్రతులకు: అన్ని పెద్ద పుస్తకాల షాపులు)

35

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె

Featured Articles