...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి


Fri,December 7, 2012 03:43 PM

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనెవరు అన్న ప్రశ్నలకు లక్ష్మణ్ గైక్వాడ్ జవాబేమిటం తెలుగు వాడిని కాను, తెలంగాణా వాడిని తన పూర్వీకులు కరీంనగర్ వారేనని, ఊరు పేరు బంజేపల్లి అని కూడా చెప్పారు. ఇక్కడ్నుంచి తన తాత ముత్తాతలు సంచారం చేస్తూ అప్పటి నైజాం రాజ్యంలోనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లారట.

నేనేగనుక ప్రధాని అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గాడిద ఫొటో తప్పక పెట్టిస్తాను. శ్రమశక్తికి ప్రతీకగా ఉండే గాడిదను మహోన్నతంగా అవిష్కరిస్తాను
ఈ మాటల తూటాలు పేల్చింది రచయితగా పేరున్న లక్ష్మన్ గైక్వాడ్. తాను మరాఠీ రచయిత. 32 ఏళ్లకే కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న రచయిత. అంతకుమించి పుట్టిన నాటినుంచే తామంతా దొంగలుగా, నేరస్థ జాతులుగా నాటి బిటీష్ ప్రెసిడెన్సీ హయాం నుంచే ముద్ర పడ్డ బిడ్డ. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వికాస్ సంస్థ అలాగే నోమాడిక్ ట్రైబ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు. అతడే దేశంలోనే తొట్టతొలి వడ్డెర బతుకు ఆత్మకథ గ్రంథకర్త లక్ష్మణ్ మారుతీ గైక్వాడ్.
తమకు చాకిరీ తెలుసు. ఆ చాకిరీకి తోడుగా ఉన్న గాడిద విలువా తెలుసు. అవేవీ తెలియని ప్రజానీకానికి, తమను కనీసం మనుషులుగానైనా జమకట్టని ప్రభుత్వాలకు లక్ష్మణ్ గైక్వాడ్ ఇట్లాంటి మాటల తూటాల్ని పేలుస్తూనే వస్తున్నరు. నిన్నా ఇవ్వాళా కాదు, తాను ఎమ్జన్సీలోనే కవిత కట్టాడు. తర్వాత్తర్వాత తన ఆవేశకావేశాల్ని కథన రీతిలో చెప్పి సామాన్యులను, మాన్యులనూ ఆలోచింపజేసే నవలారచయితగా గుర్తింపు పొందారు.

సమాజంలో కుల వ్యవస్థ, సాంఘిక వ్యవస్థఈ రెండూ నన్ను పురుగును చూసినట్టు చూశాయి. మనిషిగా కాదు, జంతువువలే బతికేలా చేశాయి. అందుకే నేను రచయిత నయ్యాను అన్నారాయన. అమ్మా, నాన్నా, అక్కచెప్లూండ్లుమేమందరం పుట్టుక కారణంగా నేరస్తులుగా చూడబడ్డాము. అందుకే దొంగతనం చేయకుండా బతకాలనుకున్నాను. రచయితనై మీ ముందుకు వచ్చాను. గుర్రాన్ని ప్రేమించే పెద్దలందరికీ మా జాతి వాళ్ల గురించి చెప్పాలనుకున్నాను. నా వంతుగా ఆ పని చేశాను. ఆ పనిలో భాగమే గాడిద గురించి కూడా చెబుతున్నాను అని ఆ రచయిత తన మనసు పంచుకున్నారు.

తాను రాసిన మొట్ట మొదటి నవల కేంద్ర సాహిత్య పురస్కారం దక్కడంతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జీవితం భారతీయ భాషల్లోకి అనువాదమై లక్షలాది పాఠకులను కదిలించింది. అప్పట్నుంచీ ఆయన దేశవ్యాప్తంగా అనేక వేదికలు ఎక్కే పరిస్థితి దక్కింది. వారు మొన్న పదోతేదీన హైదరాబాద్లో జరిగిన అఖిలభారత తెలంగాణ రచయితల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై చక్కటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోనే ఆయన చాకిరీ చేసే కులాల ప్రస్తావన తెచ్చారు. ముఖ్యంగా సంచార తెగల గురించి చెప్పాడు. ఆయా కులాలు, తెగలకు చెందిన మనుషుల్ని గౌరవంగా చూడని సమాజాన్ని నిందిస్తూ, ఇటువంటి మెజారిటీ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్యాలు దక్కాలం శ్రమనూ గౌరవించాలని, ఆ శ్రామికుల ఆత్మగౌరవానికి చేయవలసిందంతా చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ దిశగా, సమస్త జాతుల స్వేచ్ఛా, స్వాతంత్యాలకీ, వారి ఆత్మగౌరవానికీ పెద్ద పీట వేసే రీతిలో సాగాలనీ గట్టిగా సూచించారు.

అయితే లక్ష్మణ్ గైక్వాడ్ ఎవరు? ఎక్కడివారు? ఆయన ఇంకా ఏం చేశారో చెప్పడానికిముందు మరో సంగతీ చెప్పుకోవాలి. ఒక పాఠకురాలు దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి ఉత్తరం రాసింది. మరేం లేదు. రాష్ట్రపతి గుండెల్లోకి తూటాలు దింపుతానని బెదిరింపు లేఖే రాసింది. అది చదివి అధికారులు ఎంక్వయిరీ చేస్తే తేలిందేమిటం, ఆ అమ్మాయి లక్ష్మణ్ గైక్వాడ్ పుస్తకం చదివిందని! ఆ స్ఫూర్తితోనే ఉత్తరం రాసిందట! మరి. గడిచినా, ప్రభుత్వాపూన్ని మారినా వడ్డెర బతుకుల్లో ఇసుమంతైనా మార్పులేకపోతే, ఈ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రపతి గుండెల్లో తూటాలు దింపితే తప్పేమిటీ అందట ఆ అమ్మాయి. ఈ సంగతిని పంచుకుంటూ, తన పుస్తకాలు ఇట్లా ఎందరినో కదిలించాయని చెప్పారు లక్ష్మణ్ గైక్వాడ్.

అదీ ఆయన పుస్తకాల మహిమ. సంచార తెగల జీవితాలు ఎంత కడు హీనంగా ఉన్నాయో ఆయన కళ్లకు కట్టినట్టు రాసి, ఇట్లా ఎందరో పాఠకులను ఉప్పొంగించారు. అందువల్లే శ్రామికులను అని భావించకుండా దేవుళ్లు మాత్రమే చూడకుండా వారందరికీ మూర్తిమత్వంగా భాసిల్లే గాడిదను సమున్నతంగా ప్రతిష్టించుకోవాలని ఆయన సూచించారు. ఇదొక నిరసనే కావచ్చు, ఆర్తీ, ఆవేదనే కావచ్చు. అయితే, ఇప్పుడేకాదు, ఆయన రచనల్నిండా ఇదే ఒరవడి. కడుపులు నింపడానికి దొంగతనం తప్పా మరో దారిలేని బతుకులు బతికిన మనుషుల ప్రతినిధి తాను. అలా అని ఆయన దాన్ని సమర్థించినట్లు కాదు. తన నవల్లోని ఒక పాత్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుందో తెలుసా? తమకు చదువు చెప్పించి పట్టా చేతపెట్టండి లేదం దొంగతనం చేయడానికి లైసెన్సులైనా ఇప్పించండి. ఇదీ తన నవలా నాయకుడి డిమాండ్.

ఇట్లా గైక్వాడ్ తన రచనల్లో జాతిపుతుడిగా ఉంటాడు, తరతరాలుగా నిర్లక్ష్యంచేయబడ్డ తమ జాతి తరపున ఆయన ఇట్లాంటి సూటైన ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. రొట్టెకోసం దొంగతనం చేయడం నేరమైతే వేలాది కోట్ల స్కామ్లు చేసి కూడా ఘనంగా ఊరేగే సంపన్నులు దొంగలు కారా? అని మండి పడుతాడు, ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నల పరంపరనుంచే, స్వీయ జీవన అస్తిత్వం నుంచే లక్ష్మణ్ గైక్వాడ్ మహోన్నతమైన సాహిత్య సృష్టి చేయగలిగారు. గొప్ప మరాఠీ రచయితగా పేరొందారు.

అయితే మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వుతూ ఇట్లాంటి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అయితే, ఆయనెవరు అన్న ప్రశ్నకు జవాబేమిటం, తెలుగువాడిని కాను, తెలంగాణా వాడిని అన్నారు. తన పూర్వీకులు కరీంనగర్ వారేనని, ఊరు పేరు బంజేపల్లి అని కూడా చెప్పారు. ఇక్కడ్నుంచి తన తాత ముత్తాతలు సంచారం చేస్తూ అప్పటి నైజాం రాజ్యంలోనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లారట. లాథూర్జిల్లాలోని ధనేగావ్లో స్థిరపడ్డారట. అక్కడే తాను జన్మించానని గైక్వాడ్ చెప్పారు. పూర్వీకులది తెలంగాణ కావడంవల్ల ఎప్పట్నుంచో మా గ్రామాన్ని సందర్శించాలనుకున్నాను, తెలంగాణ అస్తిత్వ ఉద్యమం కారణంగా మళ్లీ నా పూర్వీకుల భూమిపై కాలుమెపాను. మళ్లీ మళ్లీ ఇక్కడకు వస్తుంటాను అని అభిమానంగా చెప్పారు.

అయితే, తాను తెలంగాణ రచయితల మహాసభకు రావడానికి కారణం తన వేళ్లను తడుముకోవడం ఒక్కపూకాదన్నారు. అంతకన్నా ముఖ్యం, తమ జాతివంటి అనేకానేక జాతుల ప్రజాసమూహాలకు సరైన న్యాయం జరిగే దిశలో తెలంగాణ ఉద్యమ ఫలితం ఉండాలని కోరుకున్నరు. ఇక్కడి తెలంగాణ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూనే తాము అక్కడ విదర్భ కోసం పోరాడుతున్నామని, వారికి మన సహకారం కూడా అందజేయాలని కవులు, కళాకారులు, మేధావులకు విజ్ఞప్తి చేశారు.

ఇంతకీ తాను తెలుగులో మాట్లాడారా? అం లేదు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడా
లని ప్రయత్నిస్తే, తెలుగులో తడుముకుంటూ మాట్లాడారు. నిజానికి తనకు తెలుగు రాదట. తన శ్రీమతి చుబూ బాయి, పిల్లలు తెలుగు మాట్లాడుతారట. తాను తెలుగు నేర్చుకోకపోవడానికి కారణం అక్కడలాథూర్లో తెలుగు మాట్లాడితే మళ్లీ పోలీసుల భయం. తానొక్కరికేకాదు, దొంగలుగా ముద్రపడ్డ తమ జాతివారందరికీ ఇదే భయం అట! తమను తాము వెల్లడి కాకుండా, తమ మూలాలు సగర్వంగా చెప్పుకోకుండా బతకాల్సిన దుస్థితిలో పెరిగారట. ఇట్లా పరాయీకరణకు గురైన విషయాన్ని కూడా ఆయన వివరిం చారు.

ఇక తన రచనల గురించి అడిగినప్పుడు ఆయనకు కేంద్ర సాహిత్య పురస్కారం తెచ్చిన ఉచల్యా (1981) గురించి చెప్పారు. అ్ల, దుబంగ్ (1988),సమాజంస్వతంతంతిరుగుబాటు (1999), వడ్డార్ వేదన (2000), వకీలా పార్దీ (2002), ఏ ఆజాదీ కిసీకీ హై (2004) వంటి నవలలు రాసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన విపశ్యన అన్న గ్రంథ రచనలో ఉన్నారు. సాహిత్య అకాడమీ కోసం అంబేద్కర్ జీవితం, కార్యాచరణపై మరో గ్రంథం రాస్తున్నారు. అయితే తన రచనల్ని సాహిత్యపు విలువల కోసం చదవద్దొని ఆయన అంటారు. మా బతుకుల్ని చెప్పడానికి రాసిన ఈ సాహిత్యాన్ని సామాజిక దృష్టితోనే చదవమని ఆయన విజ్ఞప్తి చేస్తారు.

అలా అని ఆయన శిల్ప నైపుణ్యానికి తక్కువలేదు. కానీ వినమంగా ఆయన అలా అభ్యర్థిస్తారు. ఈ నవల గురించి చూడండి. వకీలా పార్తా అన్ననవలలో తమ తెగ పాత్రలకి పేర్లు ఉండవు. పిస్తోల్, బందూఖ్, రైఫల్ఇట్లా పోలీసులు తమని ఎట్లాగైతే పిల్చారో అవే పేర్లతో పాత్రలతో కథనం నడిపిస్తారు. సాహిత్యంలో ఇదొక ప్రత్యేక ప్రయోగమే. అయితే ఇది పాఠకులకు ప్రయోగంగా అనిపిస్తుంది గానీ ఇలా పిలువబడ్డ తమ జాతి పుత్రులకు ఇది సహజాతి సహజం. అందుకే తన రచనలన్నీ జీవిత కథనాలే, వాటిని విశ్లేషించడం కన్నా చదవి అర్థం చేసుకోవడం మంచిదంటారు. తద్వారా ఈ వ్యవప్థ ఎట్లా ఉందో విశ్లేషించమని అసలు కథ వైపు వేలు చూపెడతారు.

మరో నవల గురించి చెప్పారు. అందులో ఒక డాక్టరుంటాడట. అతడి వద్దకు వచ్చిన పేషెంట్ను పరీక్షించిన డాక్టరు రోజుకు నాలుగు గుడ్లు తినమని చెబుతాడట. అప్పుడు ఆ పేషెంట్ అంటాడుట, అంత ఉం భీమారీ ఎందుకు వస్తదని! నిజమే కదా, రోగి కి వైద్యం చేయడం కన్నా వ్యవస్థకు చికిత్స చేయడమే మేలు. ఈ సంగతి తెల్సుకున్న వైద్యుడు తర్వాత సామాజిక కార్యాచరణకు నడుం కడతాడు. ఈ నవల కథాంశం అదే. అయితే, నవలల్లో చాలా పాత్రలుంటాయి. అందులో డాక్టర్లు, న్యాయవాదు లు, ఇతర వృత్తుల్లో ఉండేవాళ్లు తమ జీవితాల్లో మార్పుకోసం ఉద్యోగాలను మించిన కార్యాచరణకు నడుం కడుతారు. ఇదీ వకీల్పార్ది అన్న నవలా కథాంశంగా చెప్పారాయన.

భూకంపం సంభవించినప్పుడు ఆ ఊరి సర్సంచ్ పిల్లలంతా మరణిస్తారు. అప్పుడు ఆ సర్పంచ్కు తన హోదా, దర్పం ఇవేవీ గుర్తురావు. విలాపంలో అంతా సమానమే. విషాదంలో అందరూ ఒక్క. ఇట్లాంటి కన్నీటి గాథల సమాహారమే అని చెప్పారాయన. దీన్లో తాను ఒక మానవతావాదిగా సర్వజనుల అవస్థలను భూకంపం నేపథ్యంలో చెబుతారాయన.
ఇట్లా ఆయన రచనల గురించి మాట్లాడితే అవన్నీ సహజాతి సహజంగా రాసినవని తెలుస్తది. సామాజిక మార్పు కోసం తండ్లాట కనిపిస్తుంది. కథలన్నీ అచ్చంగా నా జీవితానుభవాలే అన్నారాయన. అవును మరి. మొదట ఆయన కాటన్ మిల్లులలో కూలీగా జీవితం ప్రారంభించాడు. అటు తర్వాత ఎమ్జన్సీ సమయంలో కార్మికోద్యమాల్లో చురుగ్గా ఉంటూనే కలం పట్టారు.

పేరుతో దీర్ఘ కవిత రాశాడు. జైలు పాలయ్యాడు. అప్పుట్నుంచీ ఆయన కార్మికోద్యమంలో ఉంటూ ఇటు తన జాతి మేలుకొలుపు కోసం డినోటిఫైడ్ సంఘటనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రచనా వ్యాసంగాన్ని సీరియస్గా తీసుకుని, పూర్తికాలం రచయితగా, కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా తనపై నలభై దాకా కేసులున్నాయి. అయితే, తాను వామపక్ష ఉద్యమం నుంచి ప్రారంభమై అటు రాజ్యాన్ని, అర్థం చేసుకున్నారు. అ్ల, బుద్దుడు, అంబేద్కర్, ఫూలే ఆలోచనా విధానంతో తనను తాను మలుచుకుని సామాజిక బాధ్యతను గుర్తింపజేసే దిశలో రచనలు చేస్తున్నారు.

ముందే చెప్పినట్టు ఆయన నవలలు సామూహిక నిరసన గీతాలు. వ్యవస్థపై ఎత్తిపట్టిన చెర్నకోలాలు. అయితే, రచయితగా కేంద్ర సాహిత్య పురస్కారం అందుకోవడం,
అ్ల వంటి నవల కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యక్షిగంథంగా మారడంఇవన్నీ గొప్పవిషయాలే. అయినా తాను రచయిత అయినందుకు సంతోషించడం కన్నా, పేరు, ప్రఖ్యాతులకు మురిసిపోవడం కన్నా, ఇదంతా ఒక బాధ్యతగా భావిస్తున్నానని అన్నారాయన. అంతకుమించి నేపథ్యం ఉన్నవారికి ఇంకేముంటుంది? అని కూడా ప్రశ్నించారు.

నేను గర్భదారిద్యాన్ని చూస్తూనే ఉన్నాను. మహారాష్ట్రలో మమ్మల్ని ఉచల్యా వారంటారు. ఒక కార్యకర్తగా మా జాతివాళ్ల గురించి రాస్తున్నాను. మా జాతి పేరు వింనే అసహ్యించుకునే మా బతుకుల గురించి చెబుతున్నాను. మనిషిగా బతకడానికి ప్రతివాడికీ హక్కు ఉన్న్ట నాకూ ఉందనుకున్నాను. దొంగతనం చేయకుండా చదువుకుని నా కాళ్లపై నేను బతికేందుకు కూడా పోరాడాల్సి వచ్చింది. అది కూడా చెప్పకపోతే మీ వంటివారికి మా జీవితాలు అర్థమే కావు. అందుకే నేను రచయితగా సంతోషించడం కన్నా బాధ్యత నిర్వహిస్తున్న కార్యకర్తవలే ఉన్నాను. అందుకు సంతృప్తి మాత్రం ఉంది. తెలంగాణంలో మీ బాధ్యతకూడా అంతే అనుకుంటున్నాను అని కూడా అన్నారాయాన.

గైక్వాడ్కు ఒక కూతురు. ఆమె డాక్టరు. మరాఠీ యువ రచయిత కిషోర్బాయి శాంతాకాలే పేరు విన్నారా. ఆయనే తన అల్లుడు. ఇక ఒక అబ్బాయి పభుత్వ కార్యాలయంలో సీనియర్ హెడ్క్లర్క్, మరొక అబ్బాయి కాంట్రాక్టర్ . వీరు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు.

ఆయన తెలంగాణ రచయితల మహాసభకు హాజరవడంపట్ల చాలా సంతోషంగా కనిపించారు. ముందే చెప్పినట్టు తమ పూర్వీకులది ఈ నేల కావడం ఒక్క కాదు, కింది కులాల జీవితంపట్ల ఒక మెలుకువ ఉండే మాటలు చెప్పే అవకాశం వచ్చినందుకు కూడా. ఈ వ్యవస్థలో మార్పు రావాలి అని ఊరికే చెప్పకుండా, ప్రతిష్టించుకుందాం అని ఆయన ఎలుగెత్తి చాటడం, అధికారంలోకి వస్తే అని విస్ఫస్టంగా ప్రకటించడంఇదంతా ఆయన గొప్ప ఆశావహ దృష్టితోనే చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి.

నిజమే మరి! ఆయన అంటున్నది ఒక్క. వ్యవస్థ కొయ్యగుపూరంలా ఉన్నదని! దానిపై ఎంత పోరాడినా ప్రయోజనం లేదని! తెలంగాణ సాకారం అవుతున్న నేపథ్యంలోనైనా ఇక్క డి భూమిపుతులు, కష్టజీవులకు గౌరవం దక్కాలని గట్టిగా చెబుతున్నారు. వారికి సహజ న్యాయం జరగాలంటున్నారు. తరతరాలుగా దోపిడీకి, పీడనకు గురైన ఆయా వర్గాల స్వప్నం సాకారం కావాలం గాడిదనే ప్రతిష్టించుకోవాలి. శ్రమైక జీవన సౌందర్యానికి అచ్చంగా ప్రాణ ప్రతిష్ట జరగాలి. ఆ దిశగా కవులు, కళాకారులు,రచయితలు, మేధావులే కాదు, రాజకీయ నాయకులూ ఆలోచించాలి. కార్యాచరణకు దిగాలి. లేకపోతే ఆయన ఆవేదన ఆవేదనగానే ఉంటది. తెలంగాణ వచ్చినా దొంగతనాలు జరుగుతూనే ఉంటయి. పేర్లు వేరు. అప్పుడు నేరస్థ జాతులన్నరు. ఇప్పుడు నేరస్తులు ఇంకే పేర్లయినా కావచ్చు. ఉండనే ఉంటరు. మరి, నమస్తే తెలంగాణ...
రాజ్యం కొయ్యగుపూరమే అయినపుడు శ్రమైక జీవన చిహ్నాన్నే పునః

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత లక్ష్మణ్ గైక్వాడ్తో సంభాషణ
కందుకూరి రమేష్ బాబు

39

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం