కోటిలింగాలకు ఢోకా లేదు!


Sun,February 26, 2017 12:51 AM

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుతున్న చరిత్రగా అందరినీ ఆందోళనకు గురిచేసిన కోటిలింగాల విషయంలో స్పష్టత వచ్చినట్టయింది.

ramesh
కోటిలింగాలకు ఎటువంటి ముప్పూ లేదు. దేశ చరిత్రలోకి ఒక కొత్త అధ్యాయంగా, దక్షిణ భారతావనిలోనే కీలకమైన అధ్యాయాన్ని చేర్చిన చరిత్ర మన కోటి లింగాల ది. అది ఆంధ్రుల తొలి రాజధాని గా నిర్ధారణవడం ఒక ఘనమైన విషయమైతే, దేశంలోనే రాజు పేరిట తొలి నాణాలు ముద్రించిన ఘనత గల రాజధాని కూడా. దక్షిణ భారతంలో మహా జనపదం విలసిల్లిందీ ఇక్క డే. గ్రీకు రాయబారి మెగస్తనీస్ పేర్కొన్న ముప్పై బలమైన కోటల్లో ఇదీ ఒకటని తేలింది. ఇప్పటిదాకా ఈ చారిత్రక స్థలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురవుతుందన్న భయాందోళనలుండేవి. కాగా, క్రీ.పూ.4వ శతాబ్దానికి ముం దరి నుంచి ఉన్న వైభవోపేత ప్రశస్థికి ఇక ఏ ఇబ్బందీ లేదు.

నిజమే మరి. ఇటు ఇరిగేషన్ శాఖాధికారులు, అటు పురావస్తు శాఖాధికారులు, వీరుగాక కోటిలింగాల గ్రామస్థులతో మాట్లాడిన పిదప స్వరాష్ట్రంలో మన ఘనమైన చరిత్రను ఇకముందు తవ్వి తలకెత్తుకోవడానికి ఏ అవరోధాలూ లేనట్లే అని నిర్ధారణ అయింది. అదే సమయంలో ఎల్లంపల్లి ముంపు గ్రామంగా ఉన్న కోటిలింగాల గ్రామస్థులు కూడా పునరావాసం కింద సమీపంలోని వెల్గటూరుకు వెళ్లక తప్పదన్న అంశాన్ని కూడా ప్రభుత్వం పునరాలోచించవచ్చనీ తెలుస్తున్నది. మొత్తానికి కోటిలింగాల రానున్న రోజుల్లో అపూర్వమైన చారిత్రక స్థలంగా, మ్యూజియంగా, గొప్ప ఇన్పోటేన్‌మెంట్ స్థలంగా అభివృద్ధి చెందడానికి ఏ అవరోధాలూ లేనట్లే అనొచ్చు. ఇక మన ముఖ్యమంత్రి తల్చుకుంటే బంగారు తెలంగాణలో ఇది ప్రపంచాన్ని ఆకర్షించే భారతీయ చారిత్రక కేంద్రంగా మారడమూ ఖాయమే.

గత కొన్నేళ్లుగా ప్రాజెక్ట్ కారణంగా ఈ స్థలం ముంపునకు గురైన పక్షంలో ఇరిగేషన్ శాఖ ద్వారా కోటిలింగాల చుట్టూ రాతి గోడ నిర్మించాలన్న ప్రతిపాదన ఉండింది. ఇందుకు 60 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. తర్వాత అది రాతి కట్టడం కాదు, మట్టితోనే నిర్మించాలని అనుకున్నారు. కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి నిల్వ నీటి సామర్థ్యంతో ఉన్నప్పుడు కూడా కోటిలింగాలకు ఎటువంటి ముప్పు రావడం లేదని ఇటీవలి కాలంలో ఆచరణాత్మకంగా నిర్ధారణ అయింది. దాంతో గోడ నిర్మాణం ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లే అని ఇరిగేషన్ శాఖ ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే నమస్తే తెలంగాణకు చెప్పారు. దాంతో కోటిలింగాల గ్రామం పొంటే ఉన్న వంద ఎకరాల్లో పురావస్తు శాఖాధికారులు వెంటనే తవ్వకాలు జరుపవచ్చని తేలింది.

ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాచి మాట్లాడుతూ, ఇదివరకు తాము రూ.11 కోట్ల ప్రతిపాదన ఇరిగేషన్ శాఖకు పంపామని, వారు నిధులు మంజూరు చేస్తే తవ్వకాలు జరుపాలనుకున్నామనీ, అయితే ఇప్పుడు ముంపు ప్రాంతం గా కోటిలింగాల చారిత్రక స్థలం లేనందున నిధుల కోసం మేం టూరిజం, సాంస్కృతిక శాఖకు త్వరలో ప్రతిపాదనలు పంపుతామన్నారు. తవ్వకాలు జరిపి ఆ స్థలాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుతామనీ చెప్పారు. కాగా, ఈ శాఖ రూ.11 కోట్లతో ఇదివరకు ప్రతిపాదనలు తయారుచేసింది. అయితే, కోటిలింగాలకున్న ప్రశస్థికి ఈ మాత్రం నిధులు సరిపోవని, భారతదేశంలోనే ఈ స్థలాన్ని అపూర్వ ప్రదర్శనా కేంద్రంగా మలిచే విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని నాగార్జునకొండ తరహాలో మ్యూజియం ఏర్పాటుకు పూనుకోవాలని, ఆ దిశగా నిధుల విషయంలో రాజీ పడకుండా వ్యవహరించాలని చరిత్రకారులు కోరుతున్నారు.

ప్రపంచ స్థాయి మ్యూజియంతో పోటీపడేలా మన దగ్గర కోటిలింగాలను తీర్చిదిద్దుకోవచ్చు. లభిస్తున్న ఆధారాలే అందుకు ఉదాహరణ. ఇక తవ్వకాలు జరిపిన తర్వాత మేం మరింత వివరంగా ప్రతిపాదనలు రూపొందిస్తాం. నిజానికి 110 ఎకరాల్లో దీర్ఘచతురస్రాకారంగా ఉన్న కోట, అందులో విలువైన నాటి ప్రాచీన వస్తువులతో త్రీడీ రూపంలో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌కు గురిచేసేలా ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయవచ్చు అని కూడా విశాలాచి అన్నారు. కాగా, కోటిలింగాలకు అనుబంధంగా నదికి ఆ పక్కన ఉన్న కర్ణమామిడిలో కూడా బలమైన ఆధారాలు లభించాయి. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నందున ఈ వేసవి కాలంలో తవ్వకాలు జరుపుతామని కూడా ఆమె చెప్పారు.

ఇదిలా ఉంటే, ఇక్కడ కోటిలింగాల గ్రామం ఉనికి ఒక ముఖ్య విషయంగా చెప్పుకోవాలి. ముంపునకు గురవుతుందన్న భావనతో ఈ గ్రామస్థులకు వెల్గటూరులో పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం నిశ్చయించి, ఆ మేరకు నష్టపరిహారాన్ని అందించింది. పునరావాసానికి స్థలాన్ని కూడా కేటాయించింది. అయితే, గ్రామంలోని 30 శాతం మంది తమ ఊరు ముంపునకు గురికావడం లేనందున ఇక్కడే ఉంటామ ని అంటున్నారు. నష్టపరిహారం అందినప్పటికీ అది కొత్త చోట గృహాలను నిర్మించుకుని స్థిరపడేంత కాదు కదా! అని అన్నా రు వాళ్లు. కన్నవూరితో పేగుబంధం తెంచకుండా ముఖ్యమం త్రి ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామస్థులు ఉండటానికి నిజానికి ఏ ఇబ్బందీ లేదు. సమస్యల్లా వరదనీరు ఉధృతంగా ఉన్నప్పుడు పెద్దవాగు మూడు వైపులా పొం గుతుంది. ఆ మూడు మాసాలు మాత్రం ఈ గ్రామానికి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మిగతా సమయంలో ఫరవాలేదు. ఇక ఈ కోటిలింగాల రావాలంటే వెల్గటూరు వద్ద ఉన్న కాజ్‌వే స్థలంలో బ్రిడ్జ్ నిర్మించుకుంటే అటు వూరికి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కోటిలింగాలలో నెలకొల్పే మ్యూజియం చూడవచ్చే సందర్శకులకూ అది సులువుగా ఉంటుంది.

ఏమైనా, ఇటు ఊరు నిలిచేలా, అటు ఆ ఊరి పక్కనే ఉన్న మహానగరం చరిత్ర నలుదిశలా చాటిచెప్పేలా ప్రభుత్వం వ్యవహరిస్తే రెండు విధాలా మేలు చేసినట్లవుతుంది. తద్వారా కోటిలింగాల ప్రజలకు ఆనందం. వైభవోపేతమైన కోటిలింగాల చరిత్రను అపూర్వ స్థలంగా మలిచినందుకు సమస్త ప్రజావళికీ మహానందం అని తిప్పర్తి చంద్రమౌళి అన్న వయోవృద్ధుడి అభిప్రాయం.
-(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)

1635

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె