అభివృద్ధికి పుట్టిన కోతి!


Tue,December 27, 2016 12:53 AM

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు విసురబోతున్నాయని గమనించవలసిందే. ఆ దిశగా ఈ వ్యాసం ఒక చిన్న హెచ్చరిక మాత్రమే.

తెలంగాణకు రానున్న రోజుల్లో ఎదురయ్యే పెను సవాళ్లు నీళ్ల నుంచో, నిధుల నుంచో, ఉద్యోగ నియామకాల నుంచో కాకపోవచ్చు. మూగజీవుల నుంచి అంటే నమ్మరేమోగానీ, నిజం. కొంగలు, నెమళ్లు, అడవి పందులు.. వీటన్నింటికన్నా అతి ముఖ్యం కోతుల నుంచే ఎదురు కానుందీ అని నది పొడవునా ఉన్న తెలంగాణ గ్రామాలను సందర్శిస్తే తెలుస్తున్నది.మానవుడు ఎంచుకున్న అభివృద్ధి నమూనా తిరిగి ఆ మానవుడికే శాపంగా మారుతుండటం ఒక విషాద వాస్తవం. అటవీ ప్రాంతం తరిగిపోవడంతో మానవ ఆవాసాల చెంతకు, ముఖ్యంగా నీటి వనరులున్న చోటికి కోతులు వచ్చి చేరుతుండటంతో సమస్య నేడు భయం గొలిపేలా మారింది. పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే, ఇవ్వాళ గ్రామాలు కోడి కూతతో తెల్లవారడం లేదు. కోతుల కూతలే రైతులకు నిద్రాభంగం చేస్తున్నాయి. అంతేకాదు, ఇవ్వాళ రైతు ఏం పంట వేయాలన్నదీ కోతులే నిర్ణయిస్తున్నాయి. అవును మరి. అవి తినని వాటినే పంటగా వేసుకోవాల్సిన దుస్థితిలో రైతు ఉన్నాడు.

నిజానికి నదీ పరీవాహక ప్రాంతంలో నాగరికత వెలిసిందని అంటాం. మానవు డు అట్లా నవ నాగరికుడే అయ్యిండు. కానీ, మనిషి ఎలా నీటి ఆవాసాల చెంత తన నాగరికత పెంచుకున్నాడో కోతులు కూడా అలాగే నీటి కోసం ఇక్కడకు వచ్చి చేరాయి. దాంతో మనుగడ కోసం పోరాటంలో ఇప్పుడు మానవుడికీ వానరుడికీ మధ్య నిశ్శబ్ద యుద్ధమే జరుగుతోందనాలి. అందుకు మన గోదావరి పొడవునా ఉన్న గ్రామాలు.. ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో అడవి కిం ది గ్రామాలన్నీ కోతులమయం కావడంతో జీవావరణ వ్యవస్థలో ఒక అనివార్యమైన యుద్ధం మొదలైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పొడవునా ఐతే ఈ రామదండు ముప్పుకు నేడు రైతులు బెదిరిపోతున్నారు. పంట నష్టంతో విలవిల్లాడుతున్నారు. మొత్తంగా రమారమి ఒక లక్ష కోతులున్నాయని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే, ఇంకో ఏడాది, రెండేళ్లలో పొలం చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ కోసం సబ్సిడీ అడిగే పరిస్థితీ రావచ్చునని రైతులు హెచ్చరిస్తున్నారు.

మొదట్లో కోతులు చేతుల్లో ఏది ఉంటే అది ఎత్తుకునిపోయేవి. ముఖ్యంగా తినుబండారాలు. కానీ, ఇప్పుడు ఆవే కోతులు వంటింటిపై దాడి చేసి ఆహారాన్ని దొంగిలించేదాకా పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, మందలకు మందలుగా కోతులు ఊర్లపై దాడిచేస్తూ గూన పెంకల ఇండ్లన్నీ నాశనం చేస్తున్నాయి. ఇంటి నుంచి పొలానికి వెళ్లాలన్నా భయ మే! ఎంత ధైర్యం చేసుకొని వెళ్లినా కోతులు గాయపరుస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. కోతులు గాయపర్చడంతో పట్నంలో దవాఖానలో చేరితే శాసనసభ్యులు వచ్చి పరామర్శించే ఉదంతాలు పత్రికల్లో వస్తున్నాయి కూడా.

అయితే, చిత్రమైందేమిటంటే, కోతులను పట్టి పునరావాస కేంద్రాల కు తరలించాలని ప్రభుత్వం 58 లక్షలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులను విడుదల చేసింది. అంతేకాదు, ఈ కోతులను పట్టుకోవడానికి సుశిక్షితులను తయారుచేసే పనిలో కూడా ఉంది. కానీ, ఈ కోతులు అడవిలో పుట్టినవి కావు. అవును. కోతులు ఇప్పుడు గ్రామాలనే తమ ఆవాసాలు గా చేసుకోవడం, ఇక్కడే పుట్టి పెరుగడం వల్ల వీటిని అడవి కోతులుగా చూడలేం. మైదానాల్లో పుట్టిన వీటిని అడవిలోకి తరమడమూ సాధ్యం కాదు. అలాగే, మందలకు మందలుగా పెరుగుతున్నందువల్ల వాటికి సం తాన నిరోధక శస్త్ర చికిత్సలు కూడా కష్టసాధ్యమే. ఇక, పునరావాస కేం ద్రాలు ఏర్పాటు మరో ఆలోచన. అయితే, ఇవేవి చేయాలన్నా సమస్య ఏ స్థాయిలో ఉందన్నది ప్రభుత్వానికే కాదు, ప్రజలకూ సరిగ్గా అర్థం కావాలి.

ఒకనాడు కోతుల్ని తరమడానికి ప్రజలు కొండెంగల మీద ఆధారపడేవాళ్లు. కానీ, కోతులే మందలుగా వెంటబడి వాటిని తరుముతున్నా యి. అలాగే, గతంలో కుక్కల్ని కాపలాగా పెట్టుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు ఊర్లోనే పుట్టిన కోతిని చూసి ఆ కుక్కలూ మొరగడం లేదు. ఇట్లా గ్రామా ల్లో కోతుల ఉనికి సహజంగా మారిపోవడం ఒక చిత్రమైన పరిణామం. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఒక చెట్టు చెట్టులా లేదంటే, ఒక గూన పెంకల ఇల్లు ఇంటి రూపును కోల్పోయిందంటే, చిన్నచిన్న డబ్బా దుకాణాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయంటే అదంతా ఇక్కడ పుట్టిన కోతు లు జనావాసాలనే తమ ఆవాసాలుగా చేసుకుంటున్న ఒక నూతన పరిస్థితి అని గమనించవలసే ఉంది. వీటన్నింటినీ గమనించాక ఒక మాట చెప్పాలనిపిస్తున్నది. ఈ సమస్య కేవలం రైతాంగానిదే కాదని! అవును. ఇది అన్ని వృత్తుల వారి సమస్య. అభివృద్ధి చెందుతున్న మానవులందరి సమస్య. దీని పరిష్కారం అటవీశాఖకు సం బంధించింది మాత్రమే కాదు, ప్రజలందరిదీ.
kandukuri
నిజానికి కోతులవల్ల తలెత్తిన ఈ సమ స్య మున్ముందరి అనేక సమస్యలకు పరిష్కారం కూడా అని చెప్పుకోవాలి. ఎట్లా అంటే, మన అభివృద్ధి కోణం అన్నది కేవ లం మానవీయంగా ఉంటే సరిపోదు అనడానికి ఇదొక మంచి గుణపాఠం. అభివృద్ధి అన్నది పర్యావరణానికి అనుకూలంగా, ప్రకృతి సమతుల్యతకు తగ్గట్టుగా ఉండాలని కూడా ఈ కోతు లు మన ప్రాంతంలోని రైతులను అదరగొట్టి మరీ చెబుతున్న గొప్ప ఉదాహరణగా భావించాలి. అందుకే ఈ కోతి.. అభివృద్ధికి పుట్టింది అనడం!

1475

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె