మ్యూజిక్ నెవర్ డైస్


Sat,February 13, 2016 10:28 AM

arun
పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో విప్లవించిన మానవుడు, కవి, పాత్రికేయుడు, నిండు మనిషి - అరుణ్ సాగర్. అతడి చివరి పుస్తకం ఒక మరణ వాం గ్మూలము. డెత్ స్టేట్‌మెంట్.
నిన్న ఉదయం అస్తమించిన అరుణ్ సాగర్ తెలుగు సాహిత్యంలో ఒక బలమైన ముద్రవే సి పోయాడంటే అది పేలవంగా వుంటుంది. ఒక మేలుకొలుపును అందించి నిద్రించాడనడమూ తక్కువే. ఇటీవల తన కవితా సంకలనం మ్యూజిక్ డైస్. దీంతో అతడు ఒక మర ణ మృదంగాన్ని వినిపించి మనల్ని నిద్ర లేపుతూ సుషుప్తిలోకి వెళ్లిపోయాడనడం ఇంకా నిజం.

ఆయన రెండు దశాబ్దాల కవితా ప్రస్థానంలో ముందు పురుషుడిని సాహిత్యంలోకి తెచ్చాడు. మగవాడిని సాహిత్యంలోకి ప్రవేశపెట్టాడు. తండ్రి గురించి రాసిన కవిగా చాలామందికి గుర్తుండిపోయాడు. అటు తర్వాత ఇటీవలే రామయ తండ్రీ అంటూ తన మహాప్రస్థానాన్ని ముగించాడు. రా. నా పక్కన కూచొని నాతో కలిసి ఈ మట్టి మరణ వాంగ్మూలాన్ని విను అంటూ సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు ఫెటఫెటేల్ ధ్వానాల్ వినిపించి ఒక నీట మునుగుతున్న ఒక పురానాగరీక త దృశ్యాన్ని పంచి అదృశ్యమయ్యాడు.

ఒకనాడు మైఖేల్ జాక్సన్‌పై రాసిన కవి నేడు నిర్వాసితులవుతున్న లక్షలాది ఆదివాసుల ఆఖరివాక్యాన్ని వినిపించి తన సంగీత సాగరాన్ని మనకు వదిలివెళ్లాడు. దివిసీమ ఉప్పెన సమయంలో కొయ్యగుర్రం ఎట్లా ఒక కలవరం రేపిందో ఇప్పు డు అవశ్య ఆధునిక మహాకావ్యం అనదగ్గ కవి త్వ నిధిని ఆదివాసీగా మైదానవాసులకు ఇచ్చి వెళ్లాడు. అతడి గుండె, ఊపిరి ఆగిన తిత్తీ, అతడి సమస్త సాహిత్యమూ చెప్పేది ఒకటే, ముఖ్యంగా కన్నతల్లి ముందు మోకరిల్లి మరణ వాంగ్మూలంగా వినిపించిందీ అదే! మనల్ని మన అస్తిత్వం నుంచి మేలుకోమనే! కాపాడుకోమనే! అదే అతడికి మనం ఇచ్చే నివాళి.అరుణ్ సాగర్ బతికిన మనిషి. ఇచ్చోటనే ఉంటాడు.
ఒక కొమ్ముబూర ఉంటుంది.అన్నా... నువ్వు చచ్చిపోవే! ట్రూ. మ్యూజిక్ నెవర్ డైస్.మేల్ కొలుపు


arun1


ఇందులో మనం చెవులు మూసుకుందామనుకున్నా ప్రతిధ్వనించే, చూసీ చూడనట్లు పోదామన్నా వెంటాడే, వేటాడే విషయాలెన్నో ఉన్నాయి. దాన్ని సెక్సిజంగా ముద్రవేసిన వారున్నారు. ఛావనిజమని చెప్పిన వారూ ఉన్నారు. కానీ, ఇందులో పురుషుడి అంతరంగం ఉంది. ఆధునిక మగవాడి మనసుంది. అతని ఆకాంక్షలున్నాయి. అతని ఆరోపణలున్నాయి. కన్‌ఫెషన్లున్నాయి.


మాగ్జిమమ్ రిస్క్ అను మెట్రో సెక్సువల్ కవిత్వము


arun2


సాగర్ మాటల్లో వ్యక్తీకరణల్లో ఒక గుం పు సంస్కృతి గుబాళిస్తూ ఉంటుంది. అదే దో వండర్ వరల్డ్ కాదు. సబ్ కల్చర్. మన మనసుల్లోనే ఉండి కింది పొర, నలుగురు కూర్చుని నవ్వేవేళల మాత్రమే పలికే లోనాలుక. బృంద మాండలికం.


మియర్ మేల్


arun3


నథింగ్ మోర్ దెన్, నో బెటర్ పురుషుడితను. ఇతడు కేవల పురుషుడు. ఇతన్లా గా కవిత్వం రాసిన వాడెవడూ లేడు ఇత ను తప్ప. పరిపరి విధాలా వామాక్షుల గురించి వివిధ అవస్థలలో, వివిధ చిత్తవృత్తులతో కవన కీర్తింపును వినండి సాగర్ కవిత్వంలో. కవిలాగే కీచకుడు కూడా మియర్ మేలుడు. లవ్ అజ్‌కల్ కనుడు. నా జీవితమంతా నీవెక్కడుంటివే అందాల రాక్షసీ అంటున్న సాగర్ ప్రేమను స్పూర్లతో కొలవండి. పిచ్చిగడ్డి మాటున కనుక్కున్న హృదయానికి దిగిన పాతికేళ్ల గాజుముక్కను ఆరాధించండి. అంతే తప్ప ఫెమినిజమనీ యాంటీ ఫెమినిజమనీ సిద్ధాంతీకరించారో...


మ్యూజిక్ డైస్


arun4


అమెరికాలో ఎవడో ఒకడు ఎంటీవి పెట్టుబడికి ముందు అమెరికా సంగీతం ఎలా ఉందో అని తెలుసుకోవడానికి బిఫోర్ ద మ్యూసిక్ డైస్ అనే పరిధోధన మొదలు పెట్టినట్టు అరుణ్ సాగర్ మ్యూజిక్ డైస్ పేరతో ముందస్తు హెచ్చరిక చేస్తున్నాడు. రాష్ట్ర పునర్విభజన చట్టం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు వరప్రదాయనిగా మారిపోయిన పోలవరం నేపథ్యంలో ఆయన నిర్వాసితులవుతోన్న తన లక్షాది ఆదివాసీల ఆఖరి వాక్యంగా వినిపించాడు.

1237

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె