నటరాజ లాస్యం, ప్రేరణా..


Sun,June 7, 2015 12:03 AM

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద రక్తం ప్రవహించలేదు. అంతకు మించి చెరువుల పూడికతీ తా జరుగుతోంది. ఒక గొప్ప కాలం ఇది. ఆటా పాటా వంటి సంబురం. కానీ, సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఇం కా అవశ్యమైన ముద్రల గురించి, మొత్తంగా మన వైతాళికుల పునర్ముద్ర గురించి కానీ తెలంగాణ తల్లి ఇంకా నడుం బిగించలేదు.

తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించేందుకు సరైన వెసులుబాటు తీసుకోనేలేదు. కానీ, ఇక పూనుకోవాలె. సత్వరమే సాంస్కృతిక విధానంవైపు శరవేగంగా పనులు ఊపందుకోవాలె. ముఖ్యంగా పునరుజ్జీవనంలో తమ జీవితాలను, సర్వస్వాన్నీ అంకితం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని చూడకుండానే కన్నుమూసిన వాళ్ల ఆశయాలను లేశమాత్రమైనా తీర్చడానికి మనందరం నడుం కట్టాలె. ఆ స్పృహతోనే నటరాజ స్మరణ.

చలం లేకపోతే తెలుగు సాహిత్యం ఎంత కోల్పోయేదో అని గుడిపాటి వెంకటచలం గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసినట్టు గానే నటరాజ రామకృష్ణ లేకపోతే తెలుగు సంస్కృతి ఎంత నష్టపోయేదో అనిపిస్తుంది! కానీ, ఇప్పుడు చలం అక్కరలేదు. మనకంటూ మన ప్రభుత్వం ఉంది. సాహిత్యం, చరిత్ర, కళలపట్ల అవగాహన ఉన్న అధినేతా ఉన్నారు. వివిధ శ్రేణుల్లో చైతన్యం పోగయింది.

అధికారులున్నారు. కార్యకర్తలున్నారు. గొప్ప కవులు, మేధావులూ, కళాకారులూ బంగారు తెలంగాణ కోసం పునరంకితం కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అంతర్గత ఆధిపత్యం గురించి వదిలేసి కొన్ని పనులైనా అందరం చేయడానికి పట్టువిడుపులతో పని చేయాలె. లేకపోతే తెచ్చుకున్న రాష్ట్రం కేవలం స్వీయరాజకీయ అస్తిత్వంతోనే దానంతట అది నిలబడలేదు. అందుకు సాంస్కృతి అస్తిత్వాన్ని పునర్నిర్వచించుకుని, సరిదిద్దుకుని ఆ దిశగా కృషి చేసిన మన మహనీయులను స్మరించుకుంటూ ముందుకు సాగాలె.

నటరాజ రామకృష్ణ గురించి ఒక్క పేరాలో చెప్పాలంటే- వీరు కృషి చేయకపోతే కూచిపూడి నృత్యం ఇంత ఆదరణలోకి రాకపోయేది. ఈయన సంకల్పించకపోతే ప్రాచీన ఆలయ నృత్యమైన ఆంధ్రనాట్యం మరుగున పడిపోయేది. ఈయన నిర్లక్ష్యం చేసి వుంటే పదకొండవ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగిన పేరిణి శివతాండవం కాలగర్భంలో కలిసిపోయేది.

ఈయన ప్రచారం చేయకపోతే ప్రాచీన యక్షగాన రూపమైన చిందు కళ తిరిగి ప్రజాబాహుళ్యంలోకి వెళ్లకపోయేది. అంతెందుకు? చివరకు ఈయన సంకల్పించకపోతే తారామతి ప్రేమావతిల కళామందిరాలు ఒట్టి శిథిల భవనాలుగా ఉండేవి. అటువంటి కృషీవలుడు నటరాజ. ఇప్పుడు ఆయన ఆ తారామతి ప్రేమావతిల సన్నిధిలోనే విశ్రమిస్తున్నారు. తానే రచించిన గ్రంథం శీర్షిక స్వర్గధామంలో స్వర్ణకమలాలు ఆ కమలాల సమక్షంలోనే కదలక మెదలక మన కదలిక ఎలా వుండబోతున్నదా అన్నట్టు మౌనంగా చూస్తూనే ఉండివుంటారు.

తానే ఈ వ్యాసకర్త కిచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు, పవిత్రమైన కళకు కళంకం ఆపాదిస్తుంటే కడుపు మండింది. ఇక అప్పటి నుంచి నా శక్తిని, ధనాన్ని, విద్వత్తును, విజ్ఞానాన్నీ, వయస్సునీ ఆంధ్రనాట్యం కోసమే వినియోగించాను అన్నారు. అవును మరి. ఆయన జీవితకాలం కృషిలో ఆంధ్రనాట్యం ఒక మకుటం. ఆ నాట్యాన్ని పునరుజ్జీవింప చేయడంలో తాను ఎలా పనిచేశారంటే, కాళిదాసు కుమార సంభవంలో రాస్తాడు. పార్వతీదేవి శివుడ్ని భర్తగా పొందడానికి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ప్రత్యేకత ఏమిటంటే తన చుట్టూ నిప్పుల వలయాన్ని హోమం వలే ఏర్పాటు చేసుకుని, ఆ అగ్నిజ్వాలల మధ్య పార్వతి తపస్సులో నిమగ్నమవుతుంది. ఆ తపస్సులోంచి బయటకు వచ్చిన తరువాత పరమశివుడ్ని వివాహమాడుతుంది. అనంతరం పార్వతీ పరమేశ్వరులిద్దరూ హిమాలయాల్లో నర్తన చేస్తారు.

ఈ మాటలు చెబుతూ ఆయన ఇంకా ఇలా అన్నారు. ఆంధ్ర నాట్యం గురించి కూడా నేను ఇలాగే అనుకున్నా ను. ఆంధ్రనాట్యం అగ్నిగుండం. అది తన చుట్టూ ఉన్న అగ్నిలోంచి పార్వతి వలే బంగారు వన్నె తేలినట్టు బయటకు వస్తుందనుకున్నాను. నాడు తెలుగు సంస్కృతిని కాపాడతారనుకున్న పెద్దలు ఆ నాట్యాన్నే అగ్నికి ఆహుతిస్తారని అనుకోలేదు. అలా అనుకుని వుంటే చాలాకాలం క్రితమే ఇంతటి మహత్తరమైన కళ గురించి పాటుపడకుండా ఆలస్యం చేసేవాడిని కాదు అన్నారు. అంటే, నిజానికి తానే ముందు మేల్కొన్నారు. కానీ, ఆ మెలకువా ఒక రకంగా ఆలస్యమే అయిందని ఆయన దశాబ్దాల క్రితమే గ్రహించారు. అట్లా అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కళల్ని బతికి బట్టకట్టనీయకుండా జరిగిన ఘటనలను ఆయన ఎప్పుడో వాచ్యంగా చెప్పారు కూడా.

అయితే, ఇదంతా ఎందుకూ అంటే తాను ఆంధ్రనాట్యం కోసం పునరంకితమైన విషయాన్ని ఇవ్వాళ యాది చేసుకోవడం కోసం. ఆ నాట్యాన్ని మళ్లీ మనదైన అస్తిత్వంతో రంగరించుకోవడం కోసం. అలాగే-ఆయన రామప్ప శిల్ప సముదాయం నుంచి వెలుగులోకి తెచ్చిన పేరిణి నాట్యం గురించీ మళ్లీ ఆలోచించేందుకు. లేకపోతే మళ్లీ ఆ కళలన్నీ ఆహుతవుతాయి. పునరుజ్జీవించి కూడా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడకుండా అదృశ్యమౌతాయి. కాబట్టే, ఈ స్మరణ. వర్తమానానికి అనుగుణంగా నటరాజ నాడు ప్రదర్శనయోగ్యంగా మలిచిన ఆ రెండు నాట్యాలనైనా మనం మళ్లీ మన సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడానికి సానుకూలంగా స్వీకరించాలి. వాటినుంచి ఏం స్వీకరించాలో అది స్వీకరించి, ఏం చేర్చాలో అది చేర్చి మనం వారి కృషిని ఘనంగా గుండెల్లో పొదువుకోవాలి. వేదిక మీద అపూర్వంగా నర్తించాలి.

అదే మనం ఆయనకిచ్చే ఘన నివాళి అవుతుంది.అయితే, ఇక్కడో విషయం. ప్రాచీన ఆలయ నృత్యాన్ని ఆయన గడి నుంచి, గుడి నుంచి, ప్రజా కూడలినుంచి సంగ్రహించి, సంక్షిప్తం చేసి ప్రదర్శనా యోగ్యంగా మలిచారని గ్రహించాలి. ఈ క్రమంలో ఆయనకు కళావంతులే గురువులు. ఆ మలిచిన నాట్యమే ఆయన నామకరణం చేసిన ఆంధ్రనాట్యం. దానికి ఆయన సిలబస్ రాశారు.

అది బోధనకు యోగ్యంగా మార్చి తాను బోధించారు, ఇప్పుడు తన శిష్యులూ బోధిస్తున్నారు. ఇదంతానూ దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నది. అదే ఒరవడిలో వీరనాట్యం అయిన పేరిణి విషయంలోనూ జరగవలసి ఉంది. ఆంధ్రనాట్యం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే సమయంలో పురుషులకే పేరెన్నిక అయిన పేరిణిని లాస్యనర్తనంతో మేళవించి దాన్ని మన దేశీయ నృత్య రీతిగా కల్పన చేసుకోవలసి ఉంది. ఇదంతానూ నటరాజ రామకృష్ణ లేరుకదా అని విస్మరిస్తే ఆయన పాదుకొల్పిన సంస్కృతీ సమైక్యతలకు పెద్ద పగులే అనాలి.

అందుకే ఒక చేతన అవసరం. నాట్యకళ పునరుజ్జీవనంలో తన లాస్యాన్ని, ప్రేరణనూ మహోజ్వలంగా ఆవిష్కరించే నటరాజ స్మరణ చారిత్రక అవసరం. అందుకే కొందరైనా పూనుకోవాలి. నటరాజ రామకృష్ణ కృషిని, స్వప్నాలను, ఆశయాలను ఆదినుంచి గమనిస్తున్న రమణాచారిగానీ, నటరాజ శిష్యులైన కళాకృష్ణ, పేరిణి కుమార్‌గానీ... ఇంకా చాలామంది ఆలోచించాలి. నటరాజ వర్ధంతి సందర్భంగా నాట్యకళా పునరుజ్జీవనం ఒక జయంతిలా జరగాలి.

963

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె

Featured Articles