ముమూ


Sat,January 17, 2015 12:50 AM

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒకానొక కథ. నిరంకుశత్వం, ఆధిపత్యం మధ్య మని షి మూగవోయిన గాథ అది. పనివాడు. ఎత్తయిన వాడు. బలిష్టుడు ముమూ. అతడ్ని ఒక యజమాని ఊరు నుంచి తెప్పించుకుంటుంది. ఇంట్లో ఏ పని చెబితే అది చేయాలి. ఆయన చాలా ఈజీగా చేసేస్త డు. ఇట్ల ఊడిస్తే సగం వాకిలి సాఫవుతుంది. ఏ పని చేసి నా అంతే. తాను చేయి వేస్తే అది అమిత శ్రద్ధ. జరూరుగా ఆ పని పూర్తవుతుంది. అయితే ఆ మనిషి ఒక్కడే ఆ ఇంట్లో లేడు. అంటే ఆ ఔట్ హౌజ్‌లో లేడు. పదులు, ఇరవైలు, బహుశా చాలామంది నౌకర్లే ఉన్నరు.

అందు లో ఇతనొకడు. కానీ తనకంటూ ఒక గది ఉంటుంది. అందులో తాను ఇష్టంగా ఉంటాడు. బయ ట పనంతా చేసి ఇంట్లో ఉన్నట్టే ఉంటడు. అయితే అతడికీ హృద యం ఉంది. ఒక చాకలామె ఉంటుంది. ఆమెను ప్రేమిస్తాడు. కానీ, ఒక ఫైన్ మార్నింగ్ యజమానురాలు ఆమెను పిలిచి, నీకు పెళ్లి చేస్తున్నా అంటుం ది. చేసేస్తుంది. అప్పుడే ముమూ... సగం మూగవాడవుతాడు. నిజానికి అతడికి మాటలు రావు. కానీ, గుండె. అది సగం కునారిల్లుతుంది. ఆ తర్వాత అత డు కుక్కను పెంచుకుంటాడు. ఎంత ఇష్టంగా అంటే చెప్పరాదు. మరొక ఫైన్ మార్నింగ్ యజమానురాలు పిలుస్తుంది.

అది మొరగవద్దని చెబుతుంది. కానీ ముమూ ఆ కుక్కకు చెప్పలేడు. దానికి అర్థం కాదు.కానీ మనకు అర్థమౌతుంది.యజమానికి ఒక కుక్క కావాలి. కానీ కుక్కకు కూడా కుక్క ఉండటం, అది మొరగడం యజమాని సహించదు. అందుకే వేరొకరితో దాన్ని ఎక్కడో వదిలేసి రమ్మంటుంది. కానీ కుక్క మళ్లీ ఇతడ్ని చేరుకుంటుంది. కానీ యజమానికి మరొక ఫైన్ మార్నింగ్ ఉండనే ఉం టుంది. దాంతో అతడ్ని మళ్లీ పిలుస్తుంది. ఈసారి ఆ కుక్కను నువ్వే చంపమని చెబుతుంది. చంపుతాడు. నిజం. అతడు ఆ కుక్కను చంపే సన్నివేశం చదివాక ముమూనే కాదు, మళ్లీ మనమే మూగబోతాం.

ముమూ గుండె అయితే పూర్తిగా మూగబోతుంది. ఆ తర్వాత అతడు తన రూంకి వస్తడు. కొంచెం సామాను ఏదో ఉంటుంది. ఇరవై ఏళ్ల క్రితం తన ఊరు నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చింది. అది సర్దుకుని బయలుదేరుతాడు. 24 గంటలో 48 గంటలో ఇంకా ఎక్కువో.. కానీ తాను ఊరుకు చేరుతాడు. ఒక ఏడు గడుస్తుంది. రెండేళ్లు, మూడేళ్లు. దశాబ్దం. దశాబ్దాలూ గడుస్తయి. ఊర్లో మాత్రం ఒక మాట చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకో అతడికి ఆడవాళ్లన్నా పడదు. కుక్కలన్నా పడదు. వాటివైపే చూడడు అని!
నిరంకుశత్వం మనిషిని ఎట్లా అణచివేసి మూగవాళ్లను సైతం జీవితాంతం మూగవోయేలా చేస్తుందో చెప్పే అద్భుతమైన విషాద నిరసన కావ్యం ముమూ. గుర్తున్నంత వరకూ ఇది ఆ కథాంశం.

ఈ కథ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదీ అంటే ఒక రచయిత మూన్నాలుగురోజుల కింద నేను రచయితగా మరణించాను. ఇక ముందు నేను కేవలం సాధారణ ఉపాధ్యాయుడినే అని ప్రకటించినందువల్ల! పాతికేళ్ల క్రితం నెలకొన్న ఒక ఆచారాన్ని ఎత్తి చూపినందుకు ఆయన ముమూ అయ్యాడు. అయ్యేలా చేశారు.

ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్ అన్న రచయిత తాను రాసిన నవల-మధోరుభగన్‌ను అడ్డుకున్న కారణంగా విసిగిపోయి పంచాయితీ ఎదుర్కొని, తాను రచయితగా మరణించానని, ఇక సాధారణ ఉపాధ్యాయుడిగానే జీవిస్తానని, తనను ఎవరూ కలవనక్కర్లేదని, తన రచనల అమ్మకాలను కూడా నిలిపివేయాలని, ఇక తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.

తనకు భగవంతుడు లేడు గనుక పునర్జన్మ కూడా ఉండదని, అందువల్ల ఇక తనలో రచయిత లేడనీ ప్రకటించిం డు. అంతేకాదు, తన కు గత మూ భవిష్యత్తూ లేదనీ చెప్పేశిండు. అవును. మున్ముం దు ఇక తాను రాయబోయే రచనలు మరణించాయనీ చెప్పిం డు. అలాగే రాసినవి రద్దు చేసుకుంటున్నట్టూ చెప్పేశిండు. అలా అత డు వెనక్కి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయి ముమూ అయ్యిండు.

చిత్రమేమిటంటే మనం హత్యల్ని చూస్తాం. ఎవరో ఒకర్ని హత్య చేయడం చూస్తాం. కానీ ఆత్మహత్యలు ఎవరికి వారే చేసుకోగా చూస్తాం. కానీ మురుగన్‌ను వేరెవరో ఆత్మహత్య చేయ డం... ఆ సంగతి గ్రహిం చి ఆయన తనలోని రచయిత మరణించాడని చెప్పడం ఒక విషాద కావ్యం. అది ఆత్మహ త్యా వాంగ్మూలం.

తన నవల కథాంశం ఏమిటంటే- అది నూటా పాతికేళ్ల నాటి ఆచారం. తమిళనాడులోని తిరుచెంగోడు ప్రాంతంలో సంతానంలేని మహిళలు ఒక జాతర సందర్భంగా ఆలయంలో అపరిచితులతో శారీరకంగా కలవడం. ఈ అంశంపై మరుగన్ నవలను రాసినందుకు అతడిని ముందు ఊర్లోంచి వెళ్లగొట్టి అటు తర్వాత పంచాయితీ పెట్టి అటు తర్వాత తనంతట తాను ఇలా మరణించేలా చేయడం అన్నది ఈ నిజ జీవిత కథ లేదా ముమూ లేదంటే కొన్ని హిందూ సంస్థల విజయగాథ.

మనిషి మూగవోయినప్పుడల్లా, అది ముమూనే కానవసరం లేదు, మురుగన్ అయినా ఎవరైనా ఒకటే. కథ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక అతడు వెనక్కిపోతాడు. జీవితాన్ని పరిశీలనగా చూడడు. బాధ్యత వహించడు. ప్రేమించడు. ప్రేమతో దేన్నీ ముట్టుకోడు. ఒక్క మాటలో జీవించడు. జీవచ్ఛవం. అంతే! నివాళి.

612

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె

Featured Articles