కలేకూరి ప్రసాద్


Tue,May 21, 2013 11:55 PM

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాకా కలేకూరినే చూశాను.
నన్ను జీవితకాలం వెంటాడే ఒక జ్ఞాపకం రాస్తాను. అది రాంనగర్ కేం ద్రంగా కలేకూరి చాలాకాలం అందుబాటులో ఉన్న గౌతమ్ వాళ్ల ఆఫీసు. కలేకూరి అస్తమానం ఏదో రాస్తూ ఉండేవాడు. ఎప్పుడూ మూసిన పుస్తకం ఒకటి, రాస్తున్న కాగితాలు కొన్ని, బాగా ఉక్కపోస్తున్నందున షర్టు తీసేసి లుంగీమీద -నేలమీద కూచుండి రాస్తూ ఉండేవాడు. రాస్తూ రాస్తూ అలసిపోయి అట్లే నిద్రపోయేవాడు. లేచాక మళ్లీ ఎక్కడ కలం ఆగిందో అక్కడ్నుంచి అక్షరాలు పరుగు లు పెట్టేవి. ఇదంతా చూడటం, స్వతంవూతంగా ఒక మనిషి -పరిస్థితులు ఎంతమాత్రం ఒక బుద్ధిజీవికి తగిన పరిస్థితులేవీ లేనప్పటికీ వాటి గురించి లేశమావూతంగానూ ఆలోచించకుండా రాస్తూ ఉండటం..

అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. ఆయన చేతిలో పెన్నూ సిగట్టూ ఏకకాలంలో కాలిపోతూ ఉండేవి. అవును. ఆయన రాస్తూ ఉండగా వేళ్లమధ్య పెన్ను తుపాకీలా ఉండేది. వేళ్లల్లో చాలా బలమైన పట్టు కనిపించేది. ఆ తర్వాత బొటన వేలు, చూపుడు వేలు కలిపి కలాన్ని బంధించగా, ఆ తర్వాతి వేళ్లమధ్య బిగుసుకున్న సిగట్టు అట్లా ఎర్రగా మాడిపోతూ ఆ నుసి అట్లే నిలబడి చిటికేస్తే గానీ పడిపోకపోయేది. ఆయన రాస్తూ ఉండగా అటు పెన్ను పారు తూ, ఇటు పెదాలమధ్య సిగట్ వెలుగుతూ ఉండేది. అది పెదాల మధ్య లేనప్పుడు కలం పట్టుకున్న కిందివేళ్ల మధ్య అది వెలుగుతూ ఉండేది. ఈ దృశ్యం నన్ను ఎంతగా విభ్రాంతికి గురిచేసిందీ అంటే ఒక మనిషి ఒక ఆయుధాన్ని ఇట్లా బేలెన్స్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. కలాన్ని, సిగట్టునూ అతడట్లా రెంటినీ ఒక్కసారే వెలిగించి ఆలోచనల్లో కాగిపోవడం, ఆ ఆలోచనల్ని కాగితంపైకి తేగలగడం నేను మళ్లీ ఎవరివద్దా చూడలేదు. ఆయన సమస్త శరీరమూ, బుద్ధి, హృదయమూ ఆ పెన్నులోంచి అక్షరాల్లోకి అనువాదం అవుతున్నట్టు లేదా ఆ సిగట్టు వలే ఖననం అవుతున్నట్టు.. ఇదొక ఒక గొప్ప దర్శనం. పనిలో అంత దీర్ఘంగా లీనమై దేహమూ, పని వేరుకాదన్న రీతిని నిశ్శబ్దంగా ప్రకటించిన సాహసీకుడ్ని మళ్లీ ఎన్నడూ చూడలేదు.

ఒకే ఒకసారి కలేకూరి నన్ను మందలించినట్టు జ్ఞాపకం. నేనేం రాశానో గుర్తులేదు. కానీ ‘రాస్తున్నప్పుడు గుర్తుంచుకో, ఈ రెండు వేళ్లు కలిపి పెన్నుతో ఏదైనా రాస్తున్నామంటే ఆకాశం భూమి కలిసినట్టు ఒక గొప్ప కరచాలనం...అది చాలా మహత్తరమైన మార్పు తేవాలి. రాస్తే ఏదైనా జరగాలి. ఎవరి హృదయమైన కదలాలి. రాయడం సామాన్యమైన కార్యం కాదురా..’అని చెప్పాడు. రాతకు అంత కమిట్ అయిన వ్యక్తిని కలిశాక కలిగిన తృప్తీ, ఆనందం, స్నేహం మళ్లీ చాలా కొద్దిమందిలో చూశాను.

అతడి రాకతో ఇరానీ హోటళ్లు, కల్లు డిపోలు, చిన్న చిన్న సభలు, సమావేశాలూ అన్నీ ఒక గొప్ప మనిషి ప్రవేశంతో ఉప్పొంగిపోతున్నట్టు ఉప్పొంగిపోతాయి. అట్లా ఉప్పొంగిన క్షణాల్లో భాగస్వామ్యం పొందిన తృప్తి నాకుంది. చిత్రమేమిటంటే ఆయనకు మేమెవ్వరమూ అవసరం లేదు. మాకు ఆయన అవసరం ఉండేది. అందుకే కలిసేవాళ్లం. ఒక్కమాటలో ఆయన ఉనికి ఒక ప్రేరణ. ఒక గుణపాఠం. అయితే అతడెప్పుడూ నిరుపేదగానే ఉండేవాడు. సామాన్యంగానే ఉండేవాడు. సాక్షి మానవ హక్కుల సంఘంలో చేరాక మొదటిసారి అతడ్ని కంప్యూటర్ దగ్గర చూశాను. టక్ చేసుకుని కాళ్లకు షూస్‌తో చూశాను. ఎందుకో కృతిమంగా అనిపించింది. చెప్పినట్టు కూడా గుర్తు. ‘ఇవన్నీ మనవి కావురా..’ అన్నట్టు గుర్తు. అతడి మూలంగానే నాకు అంబేద్కర్ తెలిసింది, శివసాగర్ ‘పార్వతి’గారు తెలిశారు. గౌతమ్, లెల్లె సురేష్ వంటి మిత్రులు, వాళ్ల పరిచయాలూ కలిగాయి. అక్కడ రాంనగర్‌లో ఉన్నప్పుడే అతడే ‘యువక’ అని తెలిసింది. అతడే ‘సంఘమిత్ర’ పేరుమీద రచనలు చేసేదీ అని తెలిసింది.
అతడి పరిచయం అయ్యాకే నాదైన మార్గాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నించి ‘సామాన్యశాస్త్రం’ రచనలు చేశాను. అవి తనకు ఇవ్వలేదు. తనతో చదివించుకునే ప్రయత్నమూ చేయలేదు. కానీ నాకు తెలుసు. ఎవరి మార్గం వారికి తెలిశాక కలేకూరి ప్రసాద్‌ను కలవం. తెలవనప్పుడే అతడితో మనకు దోస్తీ. ఎందుకంటే అతడికి మన అవసరం లేదు. మనకే అతడి అవసరం ఉంది. అందుకే ఈ నివాళి.

కలేకూరి అంటే, ఇంటా బయటా సొంత ఆస్తి అన్నది లేకుండా, ఉండనీకుండా బతికిన కామ్రేడ్. విప్లవోద్యమానికి ఎట్లాగైతే వ్యక్తిత్వం ప్రధానంగా ఉండకూడదో, దళిత ఉద్యమానికీ అట్లే వ్యక్తిత్వం ఉండదని ఎరిగిన వాడు. ఐడెంటిటీ క్రైసిస్ అసలేమాత్రం లేని ప్యూర్ పోయెట్. దళిత సౌందర్శశాస్త్రానికి కొత్త వచనం జత చేసిన కవి. అనుకున్న లక్ష్యానికి మనల్ని చేర్చడానికి తన వచనాన్ని సదా సానబెట్టుకున్న రచయిత, మేధావి, కవీ. స్వతంత్ర రచనేమో అనుకునేంత శ్రద్ధతో, ప్రేమతో అనువాదాన్ని చేసే బాధ్యతాయుతమైన సృజనశీలి. నాకు తెలిసి పర్స్ లేకుండా జీవించిన ఏకైక వ్యక్తి కలేకూరి ప్రసాద్.


ఆయన ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించేవాడు. నవ్వితే కళ్లు చిన్న గా అయ్యేవి. అవీ నవ్వుతున్నట్టే ఉండేది కానీ విషాదం పలికేవి. రాంనగర్‌లో, పార్సీగుట్టలో, తర్వాత పెండర్‌గాస్ట్ రోడ్‌లో, బాగ్‌లింగంపల్లి పార్కువద్దా- ఇట్లా ఆయన్ని కలుస్తూనే ఉండేవాణ్ణి. తన షర్ట్ జేబుల్లో, ప్యాంటు జేబుల్లో కరెన్సీ కాగితాలు చిత్తు కాగితాల్లా పడి ఉండగా నేను చూశాను. డబ్బులు కావాలని ఆయన వద్దకు వచ్చే చాలామందికి ఆయన అట్లా జేబులోంచి తీసి -ఎంత, ఏమిటన్నది చూడకుండా ఇచ్చిన సందర్భాలు ఎన్నో చూశాను. కానీ తనకు డబ్బులు అవసరమైనప్పుడు, రాసుకుంటూ ఉన్నప్పుడు కాల్చడానికి సిగట్లకోసం, తాగాలనుకున్నప్పుడు క్వార్టర్ కోసం చాలా ఇబ్బంది పడేవాడు. ఆ రోజుల్లో నా దగ్గరా డబ్బులుండేవి కావు. అయినా ఉన్నప్పుడు తనని కల్సేందుకు తాపవూతాయ పడేవాడిని. జేబుల్లోంచి అమాంతం ఎన్ని ఉంటే అన్ని తీసుకోవడం ఆయనొక్కడ్నే చూశాను. ఇచ్చేప్పుడు, తీసుకునేటప్పుడూ లెక్కాపత్రం లేకుండా బతికిన ఏకైక అమరజీవి కలేకూరి ప్రసాద్.

అయితే, కలేకూరి ఎన్నడూ ‘ఇది చేయి, అది చేయి’ అని చెప్పలేదు. బోధించలేదు. తన జీవితం తన రచనే అన్నట్టుగా బతికాడు. ఎప్పుడైనా ఒకసారి నేను రాస్తున్నది గమనించి అందులో ఉన్న బ్రైటర్ సైడ్ గురించి చాలా ఉల్లాసంగా ఉండేవాడు. అది కూడా చెప్పాలనుకునేవాడు కాదు. అవకాశం దొరికితే రాసేవాడు . మొదట్లో నేను కవిత్వం రాసేవాడిని. కొత్తగా రాస్తున్న మంచి కలాల్లో ‘ఫ్లక్స్’ కూడా ఒకటని ఆయన రాయడం నేనెప్పుడూ మరచిపోను.

మహాశ్వేతాదేవిని, అంబేద్కర్‌నీ ఆయనే నాకు పరిచయం చేశారు. దానర్థం చదవమని పుస్తకాలు ఇవ్వలేదు. అతడి పక్కన వాళ్ల పుస్తకాలు పడి వుండేవి. వాటిని ఆయన ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉండేవాడు. భారత రాజ్యాంగం తాలూకు సంక్షిప్త ప్రతి ఒకటి నా దగ్గర ఉండటానికి కూడా ఆయనే కారణం. ఫోన్లు ఇంతగా లేనప్పుడే అతడు నాకు స్నేహితుడు. ఫోన్లు పెరిగాక మళ్లీ కలవలేదు. రెండేళ్ల క్రితం ఒకసారి ఫోన్.‘నేనురా..’అన్నాడు. పేరు చెప్పాల్సి రావడం అతడికి నచ్చేది కాదు. చాలా కాలం తర్వాత ఫోన్ చేయడంవల్ల నేను గుర్తు పట్టలేదు. అయితే, అతడి కార్ డ్రైవింగ్ గురించి చెప్పాలి. చాలా చక్కగా నడుపుతాడు. ఎత్తుపల్లాలున్నా సరే, ఆయన మనల్ని చేర్సాల్సిన గమ్యానికి సురక్షితంగా, సునాయాసంగా చేరుస్తాడు. ఒక డ్రైవర్ వలే ఆయన మనకు ఉపకరిస్తాడు. తాను మాత్రం ఏకాకే. సొంత ప్రయాణం, తనదైన గమ్యం లేని వ్యక్తులందరికీ మల్లే తానూ ఏకాకే. దుఃఖితుడే.

అతడి మరణం గురించి నాకెప్పుడూ బెంగలేదు. జీవితం గురించే. అంతమంచి రచయితను, కవిని, అనువాదకుడిని, సాహసీకుడిని, ప్రేమమయిని నేనింతవరకూ కలవలేదు. అతడు జీవించిన క్షణాల్లో నేనూ భాగమే. ఐయా మ్ ప్రౌడాఫ్ హిమ్. అతడి కాంట్రిబ్యూషన్ గురించి నిర్దిష్టంగా రాయవలసిన వాళ్లు రాయాలన్నదే నా ప్రేమపూర్వక డిమాండ్. లేకపోతే అతడు మరణించడం ఖాయం! మనవల్ల ఆ దుర్గతి పట్టకూడదనే నా మనవి!!

తాను ఒక క్వార్టర్ కోసం అడిగిన సందర్భాలు తెలుసు. అంతే ప్రేమగా ఆయన ‘మటన్‌తో అన్నం పెట్టించరా!’ అని అడిగిన సందర్భాలూ తెలుసు. అతడు మా ఇంటికి వచ్చేవాడు. మేం రాంనగర్, పార్సీగుట్టలోనే ఉండేవాళ్లం. వచ్చాడు. వెళ్లాడు. ఇంట్లో మందు తాగడానికి వీల్లేదన్న కారణంగా, అతడ్ని ఇంటికి తీసుకు రాకూడదన్న నిమయం పెట్టుకున్నందునా, మేం అతడ్ని మిస్సయ్యాం. మంచిదే. ఎందుకంటే, అతడికి ఇల్లు కుదరదు. కుటుంబమూ కుదరదు. భద్రలోకపు ప్రపంచంలో అతనొక ఔట్‌సైడర్. మరణించి మనకు స్వేచ్ఛను, స్వతంవూతాన్ని పంచుతున్నాడు.
-కందుకూరి రమేష్ బాబు,0966774

35

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Fri,December 7, 2012 03:46 PM

ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!

బడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్న

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె

Featured Articles