ఆయన చిత్రమే కాదు చిత్తమూ జానపదమే!


Fri,December 7, 2012 03:46 PM

KALAMURTHIబడికి వెళ్లే పిల్లవాడివలే దినాం కళాభవన్‌కు వెళ్లి బొమ్మలు దించుకోవడం కాపు రాజయ్యకు అలవాటు.ఆయన ఈ అలవాటు ఎప్పుడూ మానలేదు. ఎనిమిదిన్నరకు ఇంటి నుంచి బయలుదేరి కళాభవన్‌కు చేరుకుంటే మళ్లీ పొద్దుపోయాక విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లేముందు స్వయంగా కళాభవన్‌కు తాళంవేసి, గేటు మూస్తారు. ఆ గేటు పక్కన సైకిల్‌పై ఇంటికి బయలుదేరుతారు. ఈ మధ్యలో ఆయన ఒక జానపద మహిళకో, ఒక పశువుల కాపరికో పురుడు పోస్తారు. లేదా పాత పెయింటింగ్‌పై పరుచుకున్న బల్లిపాతర (బూజు) తీసేస్తుంటారు. ఇదే ఆయన దిన చర్య. కాన్వాసుపై నిదానంగా ఆయన చిత్రానికి మెరుగులు దిద్దుతూ ఉంటే బతుకమ్మను తీర్చిదిద్దుతున్నట్లే ఉండేది.

ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను చూసి గర్వపడే ఈ పెద్దమనిషి కొత్త అన్నా, ఫ్యాషన్‌లన్నా అనుమానంతో చూస్తారు. అందుకే ఆయనకు హైదరాబాద్ కూడా ఇరకాటంగానే వుంటుంది. అందువల్లే, ఆయన పుట్టి పెరిగిన సిద్దిపేటలోనే కళాకారుడిగా, కళాబోధనలో నిమగ్నమయ్యారు. సంప్రదాయాలతో, పురాణ గాథలతో, విశ్వాసాలతో, ఊహలతో కూడిన తన సొంత ప్రపంచంలో సుఖంగా, సంతృప్తిగా జీవించారు.

’కాండిన్‌స్కీ అన్నట్లు, ఒక కళాఖండం రచించటమంటే ఒక ప్రపంచాన్ని సృజించటం. నేను నా చుట్టూ వున్న ప్రపంచాన్ని రచిస్తూనే వున్నాను. నా ప్రపంచం నిత్య నూతనం’ అని ఆయన అనేవారు.
రాజయ్య ప్రపంచం జానపదం. అందుల్లే ఆయన నాగరీకులకే కాదు, ఆధునిక చిత్రకారులకీ సంప్రదాయవాదిగా కనిపిస్తారు. ఇదే మాట ఆయనతో ప్రస్తావిస్తే ‘నేను సంప్రదాయవాదినే. అయితే ఆధునికత కూడా సంప్రదాయంలోనే ఇమిడి వుంది కదా’ అంటూ.. ‘అంతేకాదు, సంప్రదాయ చిత్రానికి మరణం లేదు’ అని విస్పష్టంగా చెప్పారు. ఆయనకు బాగా జీర్ణమైన జీవితాన్నే చిత్రిస్తారు. ఏదీ కృతకంగావుండదు. గ్రామీణుడికి అన్ని కులాలతో సంపర్కం వున్నట్టే రాజయ్యకు అన్ని కులాల జీవనశైలితో గాఢమైన పరిచయం, అనుబంధం వుంది. అందుకే ఆయన చిత్రాల్లో సమిష్టి జీవనశైలి, పనిపాటలు, పండగలు, పబ్బాలు తరచుగా కనిపిస్తాయి. తాను పుట్టి పెరిగిన గడ్డమీది మమకారం అతని ప్రతి చిత్రంలో కనిపిస్తుంది. దానికితోడు సంప్రదాయం అతని చేతిలో గొప్పశక్తి పుంజుకోవడంతో పాశ్చాత్య కళారీతులు వాటిముందు దిగదుడుపే అనిపిస్తుంది.ఇదే రాజయ్యలోని గొప్పతనం.
తన చిత్రకళను వ్యక్తిగతం అనుకోరాయన. చిత్రాలకు ఎంచుకునే జీవితం, శైలి, కాల్పనిక దృష్టి, సాంకేతిక ప్రక్రియ అంతా కూడా సమష్టివే అనుకుంటారు.

‘సిద్దిపేట మా సొంత గ్రామం. మా వీధి పారుపల్లి. ఇది కళాకారుల వీధి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, పద్మశాలి, మార్వాడి, నకాషి, బ్రాహ్మణ, ముదిరాజు, యాదవులు, గౌండ్లు, దూదేకులు, రజకులు-అందరి కూటమి’ అని అంటూ....‘మా గ్రామంలో జానపద సంప్రదాయాలు సుసంపన్నంగా వుండేవి. మా దగ్గర నకాషి చిత్రకారులు, రంగోళి కళాకారులు, రథ చిత్రలేఖకులు, బొమ్మల పనివాండ్రు, పట చిత్రకారులు వుండేవారు. అందుకే ఇంకెవరినీ కళకోసం యాచించే అవసరం నాకు రాలేదు’అంటారాయన. ‘దేవాలయాలపై మెరుగులు దిద్దడం. గ్రామ పొలిమేరల్లో దేవతలను చిత్రించడం, పల్లకీలను, గంపలను, కుండలను, మూకుళ్లను బొమ్మలతో అలంకరించడం, రథాలమీద వివిధ ఆకృతులను చిత్రించడం, వినాయక చవితి పండుగకు గణపతులను నిర్మించడం ఒకటి కాదు, ఎన్నో విధాల చిత్ర జీవితం నన్ను అంటిపెట్టుకునే వుండేది. వీటన్నిటినీ పరిశీలించేవాడిని. సున్నం, ఎర్రమట్టి, నీలిమందు వంటి సహజ వర్ణాలతోనే తన ప్రయాణ మని చెప్పుకున్నారు.

చిన్ననాడు మార్వాడి వాళ్ల ఇండ్లపై వేసిన నకాషి చిత్రాలు చూసి గీసేవాడిని. యింటి పెరట్లలో మట్టి ఇటుకలతో గుళ్లు, గోపురాలు కట్టేవాడిని. తోటి పిల్లలతో కలిసి భాగవతం ఆడేవాడిని. నాటకాలు, తోలు బొమ్మలాటలు, హరికథలు, పటముల ద్వారా చెప్పే పాండవుల కథ, ఒగ్గుకథలు, వీధి భాగవతాలను బాగా చూసేవాడిని. నాటక పరదాల చిత్రాలపై వుండే వాస్తవిక కళ నన్ను ఎంతగానో ఆకర్షించింది. నాట కళాశాలలో పెయింటింగ్ చేసేటప్పుడు ఎలా వేస్తున్నారో చూసేవాడిని. మొహర్రం పీరీలకు, ఉత్సవ రథములకు అలంకరణ చేసేవాడిని. అలా నా కళా వ్యాసంగం మొదలైందని, నకాషివాళ్ల పెద్ద పులులు, ఏనుగులు, నెమళ్లతో మొదలై అప్నా స్టయిల్ బనాయా’ అనేవారాయన.

తన పరిసరాల నుంచి ప్రేరణ పొందిన రాజయ్యను డ్రాయింగ్ పరీక్షలో కూర్చుండబెట్టి, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో చేర్చినవారు కుబేరుడు, నింబగిరిలు. వారిద్దరూ రాజయ్యకు చిత్రకళలో గురువులు. వారిని ఆయన సదా గుర్తుచేసుకునేవారు. హైదరాబాద్‌లో డిప్లొమా చేశాక డ్రాయింగ్ టీచర్‌గా ఉద్యోగంలో చేరిన రాజయ్య సంగాడ్డిలో నాలుగేళ్లు పనిచేశాక 33 ఏళ్లు సిద్దిపేటలోనే ఉన్నారు. కళాభవన్ కార్యక్షేవూతంగా ఆయన చివరి వరకూ కృషి చేస్తూనే ఉన్నారు.

రాజయ్య కళా ప్రతిభను, కళా వికాసాన్ని తొలుత గుర్తించింది సుప్రసిద్ధ కళా విమర్శకుడు ఇలస్ట్రేటెడ్ మాజీ సంపాదకులు అయిన ఎ.ఎస్. రామన్. ఆయన యాభయ్యవ దశకంలోనే రాజయ్య చిత్రాలను అచ్చువేశారు. లండన్ నుంచి వచ్చే ‘స్టూడియో’ పత్రికలో భారతదేశంలోని యువ చిత్రకారుల గురించి రాస్తూ రాజయ్య పనితనాన్ని ప్రశంసించారు. ‘పురాణ గాథలూ, నమ్మకాలూ, జానపద సంస్కృతితో సారవంతమైన జీవితం ఆయనది. అసలు వాటితో రూపొందిన మనిషే రాజయ్య. అతని చిత్రాలలో నన్ను ఎక్కువగా ఆకర్షించిన అంశం అచ్చమైన అతని జానపద ఆత్మ’ అని కొనియాడారు.

‘రాజయ్య కళలో గత కాలపు గతత్వం, వర్తమానపు యధార్థత రూపుగొంటుంది. అతడు గొప్ప కళాకారుడని నేను అనను. కానీ అతడు మంచి కళాకారుడు’ అని కూడా వేరొక సందర్భంలో పేర్కొన్నారు. రామన్ చెప్పినట్లు రాజయ్య మంచి కళాకారుడు. అందుకే కళను కాసులకు అమ్ముకోవడంలో ఆయనకు ఆసక్తి లేదు. తన జీవితంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన చిత్రం రిస్కీలైఫ్. వెల 70 వేలు అని అని చెప్పేవాడు. డబ్బుల కోసం తానెన్నడూ చిత్రించలేదని, తన దృష్టంతా కాల పరీక్షకు తట్టుకుని నిలబడే చిత్రం గురించేనని ఆయన చెప్పుకున్నారు. ‘కళాకారుడికైనా, ఎవడికైనా క్యారెక్టర్ ఒకటే ముఖ్యం. అదే సత్యం’ అనేవారు. ఆధునికులమని వ్యవహరించే వారిని చూసి తప్పుకుంటారు. అలాగే సృజనశక్తి సొంతదనుకునే కళాకారులను చూసినా ఆయన స్పందన అంతే. ‘పేందుకుగని, ఫలనా కళాకారుడు-నేను క్రియేటర్‌ని అన్నాడు. వాడికి ఎవడు చెప్తాడు!’ సుతి మెత్తగా తనదైన శైలిలో విమర్శించేవారు. సంస్కృతిని కాపాడటమే తన పని అని చెప్పేవారు. ‘ముందు తరాలకు మన సంస్కృతి తెలియాలంటే శిల్పకళ, చిత్రకళపైనే ఆధారపడాలి. నా వంతుగా చిత్రకళలో సాధన చేస్తున్నాను’ అని వినయంగా అనేవారు.

రాజయ్య తొలి చిత్రాలు సాంప్రదాయకమైనవి. మొదట వాష్ పద్ధతిలో చిత్రించేవారు. తర్వాత నకాషి చిత్రకారుల టెక్నిక్‌కు ముగ్దుడై టెంపరా (పౌడర్) రంగుల వాడకం మొదపూట్టారు. టెంపరా రంగుల నుంచి కాలానికి తట్టుకునేందుకుగానూ పాశ్చాత్యుల మాధ్యమమైన తైలవర్ణాలకు మారారు.1960ల నుంచి జాతీయస్థాయిలో అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌కు ఆదరణ పెరగడంతో రాజయ్య కూడా ఈ ప్రభావానికి గురయ్యారు. అయితే ఆయన ఈ పోకడల్లో కొట్టుకు పోలేదు. తన కళా విశిష్టత బాగా ఎరిగిన రాజయ్య ఒంటరిగా , అచంచలంగా నిలబడ్డారు. ‘అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌ను ఎందుకు వేయకూడదు’ అని మాత్రం రాజయ్య తనలో తానే ప్రశ్నించుకుని, ఆ ప్రశ్నకు వెంటనే తనే సమాధానంగా ‘..ఎందుకు ప్రయత్నించాలి? కళ అనేది ఏనాడూ అబ్‌స్ట్రాక్ట్‌గా, అంటే రూపాతీతంగా వుండదు. ఒక చిత్రకారుడు ఒక రేఖ గీసినా, ఒక రంగు చుక్కను కాన్వాసుపై వేసినా వెంటనే దానికి ఒక రూపం ఏర్పడుతుంది. అలాంటప్పుడు అబ్‌స్ట్రాక్ట్ అనేది అర్థరహితం’ అనిపించేదట.చివరి వరకూ ఆయన ఆలోచనల్లో మార్పు రాలేదు. ఆ సంగతి ప్రస్తావిస్తూ ‘సంగీతంవలె చిత్రలేఖనాన్ని నైరూప్యం చేయడం కష్టం’ అనేవారు.

‘అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్ అనేది వున్నదని, వుంటుందని అనుకోవడం వట్టి భ్రమ. అది కుందేటి కొమ్ము’ అంటూ హేళన చేసేవారు. అరవయ్యవ దశకం చివర్లో ఒక ఉదాత్తపు భావనతో అబ్‌స్ట్రాక్ట్‌ను పోలిన చిత్రాలు వేయడం ప్రారంభించారు రాజయ్య. తన ఇష్టదైవం నిరాకారతతో రాజయ్య సామరస్యాన్ని సాధించుకున్నారు.
రాజయ్యగారి అమ్మాయి విజయలక్ష్మి ఒకరోజు ‘నాయినా! నాకు కలలో వెంక కనిపించాడు. ఆయన మీద పెయింటింగ్ చేయవే!’ అని కోరిందట. వెంటనే ఏడుకొండల వాడిని వస్తువుగా గ్రహించి ‘గాడ్ ఆఫ్ సెవెన్ హిల్స్’ పేరిట తిరుపతిలో చిత్రాలను ప్రదర్శించారు రాజయ్య. ఈ చిత్రాల్లో స్వామిని తాళమాన నిష్పత్తులతో ప్రతీకాత్మకంగా చిత్రించారు. ఇటువంటి కళను చిత్రకళా పరిభాషలో తాంత్రిక్ పెయింటింగ్స్ అంటారు.

తీసుకున్న ఏ వస్తువునైనా కొంత వాస్తవిక దృష్టితోనూ, కొంత ప్రతీకాత్మకమైన దృష్టితోనూ చిత్రించే రాజయ్య అలాంటి చిత్రాలు చాలా చేశారు. రామన్ వీటిని భారతీయ చిత్రకళకు చక్కని లక్ష్యాలు, ఆధునిక చిత్రకళకు అవి విశిష్ట లక్ష్యాలు అని పేర్కొన్నారు. ‘తాంవూతిక కళలో నేను ఎక్కువేమీ లేను. మళ్లీ జానపద శైలికే వచ్చాను. ఇందులోనే నాకు సంతృప్తి లభించింది.’ అని ఆయన అనేవారు. ‘ఇటీవల అంటే 85నుంచి కొంచెం రియలిస్టిక్ పెయింటింగ్ చేస్తున్నాను. కార్గిల్ తర్వాత కొత్త పెయింటింగ్స్ చేశాను. అలాగే ఈ నడుమ పెయింటింగ్,నీరు, మీరు, మదర్ చైల్డ్, మ్యూజిక్ ఫ్లూట్, అరకులోయ వంటి వర్క్స్ చేశాన’ని తన నిరంతర కృషిని చెప్పేవారు. అలాగే ‘ఒక మాస్టర్ పీస్‌ను చేయాలని ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను ఇప్పటి వరకూ గీసిన చిత్రాలను తదేకంగా చూస్తూ ఉన్నాను. అందులోని లోటుపా పరిశీలిస్తున్నాను. పేరుకు తగ్గట్టు చేయాలిగద!’ అంటూ.. రంగుల లోకంలోని తన ప్రయాణాన్ని కొనసాగించారు.

-కందుకూరి రమేష్ బాబు
(‘కోళ్ల మంగారం మరి కొందరు’ పుస్తకంలోని ‘చిత్రరాజం’ వ్యాసం నుంచి కొన్నిభాగాలు )

35

KANDUKURI RAMESH BABU

Published: Mon,March 5, 2018 11:50 PM

రైతు కోసం దక్షిణాది సూర్యుడు

రైతుల కోసం రాజకీయంగానే పోరాడి సాధించడానికి కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని చిల్లరమల్లర రాజకీయాలు

Published: Sun,February 26, 2017 12:51 AM

కోటిలింగాలకు ఢోకా లేదు!

చివరాఖరికి ముంపు సమస్య ఉత్పన్నం కావడంలేదన్నది గొప్ప ఉపశమనం. దీంతో గత కొన్నేళ్లుగా అటు మట్టికింది మహానగరంగా, తర్వాత ముంపునకు గురవుత

Published: Sun,February 12, 2017 01:12 AM

..నిర్వేదంగా ధర్మపురి

ఒకనాడు ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలతో వేదంలా ఘోషించిన ధర్మపురి.. అమరధామంలా వర్ధిల్లిన గోదావరి... నేడు సప్త గుండాలన్నీ మునిగిపోయి ఒక మ

Published: Tue,December 27, 2016 12:53 AM

అభివృద్ధికి పుట్టిన కోతి!

తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబురపడుతున్నాం. మన భవితను మనమే నిర్వచించుకోగలమనీ ఆనందిస్తున్నం. కానీ, కొత్త సమస్యలు మనకి సవాళ్లు వి

Published: Sun,November 20, 2016 01:17 AM

వేదం ..ఖురాన్

బంగారు తెలంగాణ సాధనలో సూక్ష్మస్థాయి ప్రణాళికల అవసరాన్ని ప్రతి వూరు చెప్పకనే చెబుతున్నది. ముఖ్యంగా గేట్ వే ఆఫ్ తెలంగాణగా పునర్నిర్మ

Published: Sat,February 13, 2016 10:28 AM

మ్యూజిక్ నెవర్ డైస్

పురుషాధిక్య సమాజంలో ఇమడని పురుషుడు. ఆధునిక సమాజంలో ఇమడని ఆధునికుడు. అనారోగ్య సమాజంలో అనారోగ్య పీడితుడు. విప్లవించవలసిన తరుణంలో

Published: Fri,June 19, 2015 12:56 AM

అచ్చమైన స్వదేశీ ఆర్కిటెక్ట్

గాంధీ మహాత్ముడు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ లారీ బేకర్ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. పూర్ మ్యాన్స్ ఆర్కిటెక్ట్‌గ

Published: Sun,June 7, 2015 12:03 AM

నటరాజ లాస్యం, ప్రేరణా..

నేటికి నటరాజు నిష్క్రమించి సరిగ్గా నాలుగేళ్లు. మలిదశ తెలంగాణ ఉద్యమం కారణంగా, స్వరాష్ట్ర ఏర్పాటు వల్లానూ ఈ మధ్య కాలంలో వంతెన కింద ర

Published: Sat,January 17, 2015 12:50 AM

ముమూ

మరణించిన రచయితకు నివాళి చెప్పేటప్పు డు ఇవాన్ తుర్గెనెవ్ రాసిన ముమూ...అన్న కథ యాది కి వస్తున్నది. అది రష్యన్ ప్రౌఢ కథా సంకలనంలోని ఒ

Published: Thu,December 25, 2014 01:57 AM

మనకూ బాలచందర్ కావాలి...

పాలో కొయిలో అన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయిత రాస్తాడు, మన అందరి తలరాతలు రాసిన చేయి ఒకటేనా? అని! ఆయన విస్మయంగా అంటాడా మాట. కానీ,

Published: Wed,July 24, 2013 12:54 AM

కొండపల్లి సందర్భం...

కొన్ని కావలసి జరుగుతాయా అనిపిస్తుంది! నిజమే మరి. కొండపల్లి బతికున్నప్పుడు, చివరి రోజుల్లో ఆయన తనని కలిసిన ప్రతి ఒక్కరినీ, ‘నాయనా..

Published: Tue,May 21, 2013 11:55 PM

కలేకూరి ప్రసాద్

చాలామంది దళిత కవులు, రచయితలు మనకు ఉన్నారు. కానీ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా, రచన ప్రధానంగా కార్యాచరణ సాగించిన వాళ్లలో నేను ఇప్పటిదాక

Published: Fri,December 7, 2012 03:45 PM

నూరేళ్ల కదీర్ కథలు

పాత్రికేయానికీ, సాహిత్యానికీ ఉన్న తేడా గురించి ఇంగ్లిషులో మంచి నానుడి ఉండనే ఉంది. అది ఖదీర్ తెచ్చిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సరిగ్గా

Published: Fri,December 7, 2012 03:44 PM

‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’

స్థానికతను చూసే దృష్టే ఉంటే.. ‘గ్లోబు మన గుప్పిట్లో ఉసిరికాయ’ అఫ్సర్ కవి, కథకుడు, విమర్శకుడు, పాత్రికేయుడే కాదు, ఇప్పుడాయన అం

Published: Fri,December 7, 2012 03:43 PM

...గుర్రం కాదు, గాడిదను ప్రతిష్టించాలి

మనిషి చల్లగా ఉంటాడు. మృదుభాషి. తెల్లటి చొక్కాలో నిర్మలంగా నవ్వారు. చాలా విషయాలు నిర్మొహమాటంగా పంచుకున్నారు. అయితే, ఆయనె

Featured Articles