భాష గౌరవ చిహ్నం


Sun,January 28, 2018 12:30 AM

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నాకీ చీర బాగుందా అని అడిగిన ప్రియురాలికి నీకే చీరైనా బ్రహ్మాండమే, చీరకే అందం వస్తుంది అని చెప్పే మొగవాడు ఈ మేధావుల కంటే తెలివైన వాడు కాదా? ఏనాడో చెప్పిన శతకంలోని పద్యాలు మర్చిపోతే భాష గురించి మరుపు వస్తుంది. నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ! ఇది ఇంటిలోపల పనిచేసే మంత్రం కాదు ఎందుకుంటే పని తప్పించుకునేవాడిని, బాధ్యత లేక తిరిగేవాడిని ఇంట్లో గౌరవించరు. కానీ సమాజ జీవితంలో నొప్పింపక తానొవ్వక అనేది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం.


ఒక భాషలో వివిధ స్థాయిలు ఉంటా యి. మానవుడు పుట్టిపెరుగుతున్నప్పుడు రకరకాల భాషాస్థాయిల ప్రభావానికి గురవుతాడు. సరిగ్గా పలుకలేని స్థితి లో ముద్దుమాటలతో పెద్దలు పెద్దవారిని మురిపిస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ కుటుంబంలో ని ఇతర వ్యక్తులు మాట్లాడే భాషా స్థాయే అతనికి అలవడుతుంది. విద్యాగంధం లేని కుటుంబాల్లో సాధారణంగా చిన్నపిల్లలు ఇంటిబయట తమస్థాయిలో ఉన్నవారితోనే కాలం గడుపుతారు. ఇం ట్లో కూడా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులంటే వారిస్థాయిలోనే భాష నేర్చుకుంటారు. ఆ స్థాయి పెరి గి భాషలోని అభ్యంతరకరమైన పదాలు అసభ్యకరమైన భావాలు వేరుచేసి చూడాలంటే భాషా సంస్కారం ఉన్న మనుషులతో కానీ, పాఠశాల వంటి సంస్థతో కానీ, సమాజంలో ఉన్న సంస్కారం ఉన్న సజ్జనులతో కానీ కలిస్తేనే సాధ్యం.
పాఠశాల విద్య గరిపే వారి భాష-కుటుంబ నేపథ్యం ఏదైనా-కొద్దిగా పైస్థాయికి పెరుగటానికి అవకాశముంటుంది. ఇంకాపైకి చదివి రకరకాల మనుషులను కలువడం, గమనించడం చేసిన వారి భాష సంస్కారవంతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ రకంగా తయారయిన సమాజంలో భాష వివిధ స్థాయిల్లో ఉంటుంది..

1.కేవలం తమ చుట్టుపక్కల ఉన్నవారిస్థాయి భాష ఉపయోగించడం అది శాంగ్ అంటారు.
2.పుట్టుకతో వచ్చిన సంస్కారం లేక చదువు ద్వారా అభ్యంతరకర పదాలు, వాక్యాలు విసర్జించి చుట్టుపక్కల వారికి, బాధ కలిగించని భాష వాడటం, అది కొంచెం ఫార్శల్ భాష అవుతుంది.
3.చదువుతో పాటు భాష మీద పట్టు సాధించి, ఏ పరిస్థితికి చుట్టూ ఉన్న సమాజానికి సరిపోయే భాష వాడి సంస్కారవంతుడ న్న సామాజిక ముద్ర సంపాదించడం. ఇది పూర్తి ఫార్మల్ స్థాయి భాష అవుతుంది.
4.విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళి పూర్తిగా పైస్థాయి భాషను వంట పట్టించుకుని సరైన పదాలు, క్లిష్ట వాక్యాలు సందర్భోచితంగా ఉపయోగించగలిగితే దానిని అకడమిక్ స్థాయి భాష అంటారు.
ఇన్నిస్థాయిల్లో భాషను వాడవచ్చు అని కూడా చాలామందికి తెలియదు. అయితే భాష మనిషికి ఉన్న ఒకే ఒక వరం, లేక ఆయుధం. అయితే, మనిషికి ఉన్న ఒకే ఒక వరం, లేక ఆయుధం. అయితే నాగరిక ప్రపంచంలో నివసిస్తున్నామని అనుకుంటున్న మనం పదేపదే ఈ భాషా స్థాయిలలో వ్యత్యాసాల వల్ల ఎందుకు పోట్లాడుకుంటున్నాము?
ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇన్ని స్థాయిలు ఉంటాయనీ ఇంట్లో, బయట భాషా స్థాయి కూడా ఒకటి ఉండదనీ తెలియకుండా మనుషులు మాట్లాడుతున్నారు గనుక. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్‌లో మాట్లాడే భాష గురించి ఒక జీవో తెస్తారన్న వార్తకు విపక్షాలు, సోకాల్డ్ మేధావులు స్పందించిన తీరు ఆశ్చర్యపరిచింది. నిజానికి ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తిరుగరాయటంలే దు, అవమానపర్చటం లేదు. అందులోని రెండు అధికరణలను ఉపయోగిస్తామంటున్నారు. వారు అన్నది ఏమిటంటే ఎవరి గురించై నా.. ముఖ్యమంత్రి గౌరవనీయ పదవుల్లో ఉన్నవారి గురించి మాట్లాడేటప్పుడు భాషాస్థాయి కూడా గౌరవప్రదంగా ఉండాలనీ, నీచస్థాయి పదాలు వాడినా, సరైనా ఆధారాలు లేకుండా కువిమర్శలు చేసినా అరెస్టులు చేసే అధికారం ఉపయోగిస్తామనీ. ఇందులో అభ్యంతరకరమైనదేమీలేదు. అయితే దానికి విపక్షాలు-బీజేపీ, కాం గ్రెస్, కమ్యూనిస్టులు, జేఏసీ నాయకుడిగా ప్రభుత్వం చేసే ప్రతిపని ని విమర్శించే ప్రొఫెసర్ కోదండరాం ఇతర మేధావులు చేసిన కామెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటిని వింటే ఈ కింది ప్రశ్నలు ఎవరికైనా మనసులో కలుగకమానవు.
kankadurga
1.ప్రభుత్వాన్ని గానీ, టీఆర్‌ఎస్‌ను గానీ, ఇతరులను గానీ విమర్శించేటప్పుడు గౌరవనీయమైన భాష వాడాలంటే అసలు విమర్శించవద్దని అర్థమా? లేక తాము విమర్శించాలంటే కేవలం కిందిస్థాయి భాషే మాట్లాడగలం, స్థాయి పెంచలేం అని వారు భావిస్తున్నారా?
2.గౌరవనీయ పదవుల్లో ఉన్నవారి గురించి అంటే, గౌరవనీయు లు అంటే కేవలం ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్, అధికారులేనా? కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టునేతలు, విమర్శించిన మేధావులు గౌరవనీయుల పట్టికలోకి రారా?
3.ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏదైనా మాట్లాడటమా? తన హక్కులాగే ఇతరులకూ గౌరవం గా బతికే హక్కును ఇవ్వకపోవడమా? ఏది మాట్లాడినా గౌరవనీయ భాషలో చెప్పటం, వ్యక్తిగత దూషణలు లేకుండా మాట్లాడటం ఈ విమర్శకులకు చేతకాదా?
4.ఎంత నష్టం, కష్టం కలిగించిన డిమానిటైజేషన్, జీఎస్టీ లాంటి వాటిమీద కోపంరాని వీరికి కేవలం నీచస్థాయి భాష వాడి మీ స్థాయి దించుకోకండి అంటే ఎందుకింత కోపం వస్తుంది?
నిజానికి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అతని భావాలు, ప్రవర్తన, మాట బట్టికదా నిర్ణయించే ది! భావాలనేవి అతినకేకానీ, ఇతరులకు తెలియదు. ప్రవర్తన గమనించటానికి సయయం పడుతుంది కానీ మాట అన్నది వినగానే ఆ మని షి సంస్కారస్థాయి తెలుస్తుంది. మరి ఇంత క్షణాల్లో మన గురించి చెప్పే ఆ భాషను ఎంత గౌరవించాలి, ఎంత జాగ్రత్తగా వాడాలి? యూ ఆర్ ఏ ఫూల్ అన్నా యూ ఆర్ నాట్ వెరీ వైజ్ అన్నా అర్థం ఒకటే. కానీ మొదటి మాట ఎదుటి మనిషిని మనకు శత్రువును చేస్తుంది. రెండవది అతన్ని ఆలోచింపజేస్తుంది. ఒక భాషావేత్త అంటాడు పాజిటివ్ లాంగ్వేజ్ గెట్స్ పాజిటివ్ రిజల్ట్స్, ఎండ్ నెగటివ్ లాంగ్వేజ్ నెగటివ్! అని. మరి రేవంత్‌రెడ్డి నుంచి కోదండరాంగారి దాకా ఒకలాగే స్పందించటమేమిటి?
ఈ మధ్య ఇంకో మేధావి రాసిన పుస్తకం దుమారం రేపింది. నిజానికి దుమారం లేచింది పుస్తకంలో రాసినది చదివాక కాదు, పుస్తకం టైటిల్ మీదే! అది కోమటోళ్ళు-సామాజిక స్మగ్లర్స్ అని. కానీ ఆయన దాని బదులు మోసపోయిన బహుజనులు అని పుస్త క పీఠిక పెట్టి ఉంటే దానికి ఎంతో విలువ ఉండేది. భాష అనేది మనిషికి ఉన్న ఒకే ఒక వరం. మనిషి శరీరం, బుద్ధి పెరిగినట్టే భాషా స్థాయి కూడా పెంచుకుంటే సామాజిక గౌరవం, వ్యక్తిగత ఆదరం ఎవరికైనా పెరుగుతాయి. ఎవరినైనా అవమానించాలన్న కొంటె ఆలోచనవచ్చినా చాలా తెలివిగా చేయొచ్చు ఐడోంట్ గివ్ వే టు ఫూల్స్ అని దారికడ్డంగా నిలబడిన మనిషిని చూసి చిరునవ్వుతో బట్ ఐడూ అని తప్పుకునే మేధావి కన్నా చిలిపి వారెవరు? కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నాకీ చీర బాగుందా అని అడిగిన ప్రియురాలికి నీకే చీరైనా బ్రహ్మాండమే, చీరకే అందం వస్తుంది అని చెప్పే మొగవాడు ఈ మేధావుల కంటే తెలివైన వాడు కాదా? ఏనాడో చెప్పి న శతకంలోని పద్యాలు మర్చిపోతే భాష గురించి మరుపు వస్తుంది. నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ! ఇది ఇంటిలోపల పనిచేసే మంత్రం కాదు ఎందుకుంటే పని తప్పించుకునేవాడిని, బాధ్యత లేక తిరిగేవాడిని ఇంట్లో గౌరవించరు. కానీ సమాజ జీవితంలో నొప్పింపక తానొవ్వక అనేది మాత్రం అంద రూ గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం. దీనికి పెద్ద చదువులు, మేధ అవసరం లేదు. మనిషిగా ఆత్మగౌరవం ఉంటే చాలు, అవతలవాడి గౌరవాన్ని కూడా గౌరవిస్తారు. దానిని నిర్ణయించేది మాత్రం భాషాసంస్కారమే!

725

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.