విలువలతో కూడినదే విద్య


Fri,January 19, 2018 01:00 AM

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉదాహరణకు.. ఆబ్జెక్ట్, డెసర్ట్, సెంటెన్స్ వంటివి. అయితే తెలుగులో సాధారణ పదాలలో అటువంటిది ఒక్కటే ఉంది. చదువు అంటే విద్య లేక రీడింగ్ (ఇది క్రియాపదం). దీనికి సంబంధించిన ఇంకొక ఫ్రేస్ చదువు, జ్ఞానం అంటే చదువును విజ్ఞానం గానూ, విద్యను ఈ రెండు కలిసిన ప్రక్రియగానూ వాడటం సహజం. నిజానికి విద్య అంటే జ్ఞానం, విజ్ఞానం రెండూ కలిపినది.

అబ్రహాం లింకన్ తన కొడుకును స్కూల్లో చేర్పించినపుడు ఒక టీచర్‌కు రాసిన ఉత్తరం చదివితే స్కూల్లో చిన్న పిల్లలకు ఏం నేర్పాలో తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలో ఒక విశ్వవిద్యాలయం గేటు మీద ఈ రకంగా బోర్డు రాసి ఉంటుంది. ఒక దేశాన్ని చితికిపోయేటట్టు చేయాలంటే అణుబాంబుల అవసరం లేదు. ఆ దేశ విద్యాస్థాయిని దించి విద్యార్థులు పరీక్షలలో తాము గ్రహించింది కాక పుస్తకాల్లోని విషయాలు చూసిరాసి పట్టాలు తెచ్చుకునేటట్టు చేస్తే చాలు; ఆ దేశం నాశనమవుతుంది.

వ్యక్తిత్వ వికాసం జరిగి, ఉపాధి కూడా సంపాదించగలిగినదే విద్య. అయితే ఇప్పుడు మన దేశంలోని విద్యారంగం ఈ రెండూ సాధించగలిగే పౌరులను తయారుచేస్తున్నదా? అన్న ప్రశ్నకు సమాధానం చాలా నిరాశాజనకంగా ఉంది. విస్డమ్ జాబ్స్ డాట్‌కాం చేసిన సర్వేలో తేలినదేమిటంటే డిగ్రీలు పొందుతున్న అభ్యర్థుల్లో కేవలం నైపుణ్యానికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు; మేధకు సంబంధించిన క్రిటికల్, క్రియేటివ్ ఇంకా ఎనలిటికల్ స్కిల్సూ లేవు; ప్రవర్తన, ఆలోచనకు సంబంధించిన సాఫ్ట్ స్కిల్స్ లేవు! మరీ ఇం త నాసిరకంగా విద్యారంగం ఎందుకు తయారయింది? దేశాల్లో పెద్ద సంఖ్యలో యువతను కలిగిన ఉన్న భారతదేశం ఈ విషయంలో శ్రద్ధ వహించకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది?. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమి చెయ్యగలవు? ఎలాంటి జాగ్రత్తల పాటిస్తే, విధానాలు రూపొందిస్తే ఈ దుస్థితి నుంచి బైటపడుతాయి?
నిజానికి విద్య, మానసిక పెరుగుదల అనేవి నిరంతరం సాగే ప్రక్రి య. మనోవైజ్ఞానిక నిపుణుల అంచనాల ప్రకారం పిల్లలు 10 నెలల నుంచి తమ పరిసరాలను, మనుషులను నిశితంగా గమనిస్తారు. వారి కి మొట్టమొదటి అభిప్రాయాలు ఏర్పడే ఈ వయసులో దగ్గరగా ఉండే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సంతోషంగా కనిపిస్తూ, ఆ పిల్లలతో సున్నితంగా వ్యవహరిస్తే, వారిలో ప్రేమ, అభిమానం, దయ వంటి వి అభివృద్ధి చెందుతాయి. అదే వారు చూస్తుండగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, కోపంగా ఉండటం, పోట్లాడుకోవడం చేస్తే జీవితం అంటే పోరాటం అన్న భావం వారిలో పెరుగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ తమకు కావాలన్న వస్తువుల కోసం, కోరికలు తీరడం కోసం మారాం చేయడం, ఏడువడం, తమ వయసువారితో పోట్లాడ టం అలవాటవుతాయి. అమెరికాలోని కెన్‌కెయిసీ అనే సంస్థ జైళ్ళల్లో ఉన్న 10,000 మంది ఖైదీల బాల్యం గురించిన సర్వే చేసింది. అందు లో 9,960 మందికి పదేండ్ల వరకు అస్తవ్యస్త పరిస్థితులున్నాయని వారి రిపోర్టులో తెలిపారు. విడిపోయిన తల్లిదండ్రులు, వారి మళ్ళీ పెండ్లిళ్ళు లేక సహజీవనాలు, కలిసి ఒకే ఇంట్లో ఉంటూ రోజూ పోట్లాడుకునే జంటలు, వీరంతా వారి కోపాన్ని, అసంతృప్తిని ఈ పిల్లల మీద ప్రదర్శించడం, వారిని కొట్టడం, తిట్టడం ఇంకా ఇతర హింసలు గురిచేయ డం వంటి అనుభవాలతో పెరిగిన వారు ఎక్కువ భాగం పెరిగాక నేరస్తులయ్యారు. అంతేకాదు, వారిలో కొంతమంది తల్లిదండ్రులు చనిపోయి న, లేక వదిలేయబడిన అనాథలుగా రకరకాల హింసలకు గురి అయినవారు ఉన్నారు. ఆ సంస్థ వారు చెప్పిన చాలా విషయాల్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏడు సంవత్సరాలకు ముందే, చేదు అనుభవాలు, ముఖ్యంగా దెబ్బలు తిని, ఇతర హింసలకు సహించినవారు, చూసినవారు నేరప్రవృత్తిని అలవర్చుకుంటారని రాశారు.

పై విషయాన్ని నేటి సంఘంలో పెరుగుతున్న పిల్లలకు ఆపాదించి చూద్దాం. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలలో ఎంతమంది తల్లిదండ్రులు తాము అనుభవించే ఆర్థికపరమైన కష్టాలు, భావనాత్మక సంఘర్షణలకు 10లోపు వయసున్న తమ పిల్లలను దూరంగా ఉంచగలుగుతున్నారు? అసలు ఆ ఆలోచననైనా వారికి ఉందా? ఆర్థికంగా బాధలు లేని ఎగువ తరగతుల వారు తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తున్నారా? డబ్బులు విరజిమ్మి వారి కోరకలన్నీ తీర్చడం కాకుండా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని గమనించి వారికి విచక్షణ, ప్రవర్తన నేర్పిస్తున్నారా? సరైన శిక్షణ ఇస్తున్నారా? ఈ ప్రక్రియలో తల్లిదండ్రులిద్దరూ తమ పాత్రలు సరిగా పోషిస్తున్నారా? పైసలు పడేస్తూ, తమ పని వారు తాము చేయవలసిన పనిని నిర్వహిస్తున్నారని భావిస్తున్నారా? అసలు తల్లిదండ్రులు రోజులో ఎంత సమ యం పిల్లలతో గడుపుతున్నారు?

ఇక ఇతర రంగాలు గమనిస్తే, ఇళ్ళల్లో ఉండేవి ముఖ్యంగా టీవీ, సెల్‌ఫోన్. 10 లోపు పిల్లలు చూసే ఆనందకరమైన, ఆరోగ్యకరమైన ప్రోగ్రా మ్స్ ఎన్ని ఛానెల్స్‌లో ఎంత సమయం వస్తున్నాయి? మరీ చిన్నప్పుడు కార్టూన్లు ఆనందించినా, వారి భావాలు పెరుగడానికి దోహదం చేసే ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక న్యూస్ చూస్తే ఎంతసేపు హింసలకు, ఆకస్మిక ప్రమాదాలకు సంబంధించిన వార్తలు పదేపదే ప్రసారం చేస్తే చూసేవారిలో ఏ కొంచెం సున్నితత్వమైనా మిగిలి ఉంటే చంపేసే లాం టివే అవి కైలాస్ సత్యార్థికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని తెలిసినపుడు నాకు కలిగిన భావం (సిగ్గు) షేమ్. ఎందుకంటే అప్పటిదాకా రోజూ 6 న్యూస్‌పేపర్లు చదివే నాకు ఆయన ఎవరో నోబెల్ ప్రైజ్ వచ్చేదాకా తెలియలేదు. అప్పటి నుంచి ఒకే న్యూస్ పేపర్ చదువుతున్నాను. దేశంలో ఎంతోమం ది సమాజసేవ చేస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్నవారు కూడా ఎంతోమంది పక్కవారికి సహాయం చేస్తున్నారు. వెనుకబడిన కుటుంబాల నుంచి, జాతుల నుంచి అద్భుతంగా చదువుకొని రాణిస్తున్నవారున్నా రు. మరి ఇవేవీ చూపకుండా సినిమా యాక్టర్ల శృంగారాలు, విచ్చలవిడితనాలు, డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుపడ్డ వారి ముఖాలు, వారి చరిత్రలు, ధనమదంతో విహారం చేసేవారితో ఇంటర్వ్యూలు.. ఇవి పెరిగే పిల్లలకు ఏ రకంగా పనికి వస్తాయి? వారిలో మనం ఏ భావనలు పెంచుతు న్నాం? బాలికలు, స్త్రీల మీద లైంగికదాడులు జరుగుతున్నాయంటే ఎం దుకు జరుగవు? ఒక 6 నెలల అమ్మాయిని కూడా పార్లర్‌కు తీసుకెళ్ళి అందగత్తెగా తయారుచేయాలనే తపన పడే అమ్మ, అంగాంగ ప్రదర్శనలు చేసే యాంకర్లు, సినిమా తారలు, కేవలం భార్య అందమే గుర్తించే భర్తలు, అవే ప్రకటనలు! ఆడవారి వ్యక్తిత్వాలు, మేధ, వారు కృషిచేస్తున్న రంగాలు, సాధించిన విజయాలు.. ఇవి ఎవరు చూపిస్తున్నారు? ఏదో ఏడ్చిపోతారని మహిళల కోసం అంటున్న సుత్తి ప్రోగాంలు! ఆంధ్ర సినిమాలే ఘోరం అనుకుంటే వాటిమీదే ఆధారపడే 90 శాతం టీవీ ప్రోగ్రాములు! వినోదాత్మకం అంటే అందులోని స్థాయికి భయపడి పిల్లలు చూస్తారేమో అని టీవీ కట్టేసే పరిస్థితి! ఇక ప్లిలలకు ఇంట్లో వచ్చే ఆరోగ్యకరమైన ఎక్సోజరు ఎక్కడ ఉంది? తల్లులు చదువుకున్నవారైనా కథల పుస్తకాలు చదివి పిల్లలకు, అలవాటు చేసే వారెంతమంది ఉన్నారు?

ఇక స్కూలు వాతావరణం ఇంకా ఘోరం! ఎల్‌కేజీ నుంచీ వారికి పోటీ టెన్షనే! 5వ తరగతి దాకా కథలు చెప్పి, పాటలు పాడి వారి భాషా నైపుణాలు పెంచడం అన్న ఆలోచనే ఏ రాష్ట్రంలో లేదు. ఫిన్‌లాండ్, నార్వే వంటి దేశాలు ఆనందంగా ఉన్న దేశాల సూచికలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన విధ్వంసం కొద్దిగా సర్దుకున్నాక, ఆ దేశాల మేధావులు పెరిగిపోయిన వారి గురించి కాకుండా, చిన్నపిల్లల గురించి శ్రద్ధ తీసుకున్నారు. విద్య విషయంలో ముఖ్యంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే మూడేండ్ల నుంచి పిల్లల మీద చెప్పిన విషయాలకంటే వారు శ్రద్ధగా నేర్చుకున్నవి, గమనించిన అంశాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. సంస్కృత పంచతంత్రంలోని కథలు ఆయా భాషలలోనికి అనువదింపబడినాయని, వారు పాఠశాలలో ప్రాథమిక దశలలో ఆ కథలు చెప్పి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, భావపరిపక్వతకు కృషిచేస్తున్నారని ఎంతమందికి తెలుసు? 10వ సంత్సరం వరు పిల్లలకు ఇది చెయ్యి, అది చెయ్యకు అని నీతులు చెప్పడం కంటే నీతి కథల ద్వారా అన్యాపదేశంగా వారి ఎదుగుదలకు తోడ్పడవచ్చు. అసలు 5వ తరగతి దాకా వారికి మూడు భాషల్లోని చక్కటి కథలు, చిన్న కవితలు, పాటలు చెప్పిస్తూ, భాషా పటుత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తే, చక్కటి సమాజాన్ని నిర్మించవచ్చు. ఫిన్‌లాండ్, నార్వే, స్వీడన్, స్విడ్జర్‌లాండ్, డెన్మార్క్, బెలారస్ వంటి దేశాలు ఆనందంగా ఉన్నా దేశాలవటానికి కారణం వారు సరైన విద్యను (కేవలం చదువు కాకుండా) పిల్లలకు నేర్పేవారికి తర్కం, విచక్షణ, నిజాయితీ వంటి లక్షణాలు అబ్బేట్టు ప్రాథమిక విద్య స్థాయి నుంచి జాగ్రత్త తీసుకోవడమే! తాము ఎందుకు, ఎలా ఆనందంగా ఉన్నామో ఆ పిల్లలకు అర్థమయితే వారు ఇతర చెడ ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కిద్దగలుగుతారు కూడా!
kankadurga
అబ్రహాం లింకన్ తన కొడుకును స్కూల్లో చేర్పించినపుడు ఒక టీచర్‌కు రాసిన ఉత్తరం చదివితే స్కూల్లో చిన్న పిల్లలకు ఏం నేర్పాలో తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలో ఒక విశ్వవిద్యాలయం గేటు మీద ఈ రకంగా బోర్డు రాసి ఉంటుంది. ఒక దేశాన్ని చితికిపోయేటట్టు చేయాలంటే అణుబాంబుల అవసరం లేదు. ఆ దేశ విద్యాస్థాయిని దించి విద్యార్థులు పరీక్షలలో తాము గ్రహించింది కాక పుస్తకాల్లోని విషయాలు చూసిరాసి పట్టాలు తెచ్చుకునేటట్టు చేస్తే చాలు; ఆ దేశం నాశనమవుతుంది. ఈ విధంగా అర్ధ శతాబ్దం చదువుకొంటూ, కంఠస్థం చేసినవి పరీక్షలలో రాస్తూ మన విద్యార్థులు పాఠశాల, కళాశాలల దాటి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వీరిస్థాయిని బట్టే వీరు చేసే ఉద్యోగం ఆధారపడి ఉం టుం ది. వ్యక్తిగత నిజాయితీ, పనిలో నిబద్ధత, లంచాలకు, ఎదురుచూడకపోవడం, ఉద్యోగం చేసిన, చేస్తున్న ఆత్మ తృప్తి, పదిమందికి ఆదర్శమూర్తిగా నిలువడం, ఇవన్నీ భారత దేశ పౌరులలో ఎందుకు కొరవడ్డాయో అర్థమౌతున్నది కదా! వీదేశాలకు వెళ్లినవాళ్ళు మాతృదేశానికి ఎందుకు రావాలనుకోవటం లేదో బోధపడుతున్నది కదా! ఇకనైనా చదువు, పట్టాలని విద్యగా మార్చి ఈ అవిద్య (అవిద్య అంటే విద్య లేకపోవ డం కాదు; తప్పు రకం విద్య ఉండటం)ను పారదోలి మన పిల్లలను కాపాడుకుందామా?

897

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles