ఆంగ్ల తౌరక్యాంధ్రం!


Sat,December 16, 2017 11:18 PM

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్రకటించడమే ఈ రచయిత్రి ఉద్దేశ్యం. అయితే తెలంగాణ కవిత్వం రాసిన కవులలో బహుభాషా కోవిదులు, మూడు నాలుగు భాషలలో రచనలు చేసినవారు అనేకులు ఉన్నారు.సామల సదాశివ, పీవీ నరసింహారావు వంటి దిగ్గజాలు, కాళోజీ వంటి ప్రజా కవులు అనేక రచనలు చేశారు. అయితే భాషల కలగాపులగం ఈ రచనల్లో కనపడదు.

ఆంధ్రం, తెలుగు ఒకే భాషలని పంచన చేరిన ఆంధ్రులు తెలంగాణ ప్రజల ను ఎంత చిన్నచూపు చూశారో ఈ రోజు ఎవరికీ చెప్పక్కరలేదు. అంతేకాదు, తెలంగా ణ వారు మాట్లాడే భాష భాషే కాదనీ, వారికి తెలివి లేదనీ పదేపదే ప్రచారం చేశారు. పాఠ్యపుస్తకాల్లో పూర్తిగా ఆంధ్ర రచయితలే కనిపించారు. దాదాపు తెలుగులో 22 సాహిత్య ప్రక్రియలకు పుట్టినిల్లు తెలంగాణ అన్న విషయం దాచిపెట్టారు. ఆంధ్ర సాహిత్యం మొదలవకముందు దాదాపు వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర తెలంగాణకు ఉందని గుర్తింపులేదు. అంతేకాదు కరుణ శ్రీ అనే జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణ వస్తే ఈ గడ్డ తౌరక్యాంధ్రం (ఉర్దూ కలిసిన ఆంధ్ర భాష) మాట్లాడుతుందని హేళన చేశారు, నిజాం రాష్ట్రం దక్షిణ పాకిస్థానం అవుతుందని అన్నారు. కానీ వారు ఒక విష యం గుర్తించలేదు. ఆధునిక ఆంధ్ర కవిత్వంలో అప్పటికే ఆంధ్ర ప్రాంతమంతా తౌరక్యాంధ్రం నిండిపోయింది. ఒక్కటైనా ఉర్దూ పదంలేని తెలు గు కవితలు ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్నాయి కానీ, ఆంధ్రలో లేవు. కరుణశ్రీయే గౌతమబుద్ధుడి మీద రాసిన పద్యంలో పంక్తులు ఇలా ఉన్నాయి.
ఆటంబాంబుల బీటవారినది బ్రహ్మాండంబు
లూటీ చేసిన మానవత్వమును ఆలోకింపు లోకప్రభూ!
ఈ ఒక్క పద్యంలోనే ఆంగ్లాంధ్రం, తౌరక్యాంధ్రం ప్రతిఫలించాయి! జీవితం గురించి ఎంతో తెలిసిన వాడిగా ఆంధ్రులు పొగిడే కరుణశ్రీ ఆ బతుకును వివరింపటానికి తౌరక్యాంధ్రాన్ని, ఆంగ్లాంధ్రాన్ని వాడుతా డు. జయశంకర్‌గారు అన్న మాట నిజమేననిపిస్తుంది.
తౌరక్యాంధ్రం ఆంధ్ర కవుల రచనల్లో విస్తృతంగా వాడిన వారిలో శ్రీశ్రీ ఒక రు.
పోస్టు చెయ్యని జాబులం/అట్టలు లేని కితాబులం
మృత్యువు దివాణంలో/ దివాలా తీసిన షరాబులం
ఇక ప్రాస కోసం ఏమైనా రాస్తారాయన.

1.ఆగు ఆగు మై బోల్తాహూం/ నిభాయించు మరి తమాయించు నీ/ శవంమీద మై చల్తాహుం., 2.హవాయీ జహాజ్ మే షమేషా/ ప్రయాణం చెయ్యడం తమాషా/మసాలా నాసాళానికెక్కు/ జవాబ్ శ్రీశ్రీ, 3.అబ్బబ్బా బలే జోరుగా / అన్నన్నా బలాదూరుగా/ అమ్మమ్మా ఇదే తీరుగా/ అర్రర్రే మరీ హోరుగా/ అయ్యయ్యో తిరగకురా సవాశేరుగా/, 4.సర్వత్రా శివసేనల శివాలా/స్వయం సేవ సంఘీయుల సవాలా/ఫేరవాల భైరవాలా రవాలా/ ఇక రాజ్యం రణరంగం అనాలా/ అయితే వాళ్ళు గతే తుదకు దివాలా/, 5.జాగోరే జాగోరే జాగో/జాగ్ రహోరే/దేఖోరే దేఖోరే దేఖో పంజా/ సలాము/ గులాము/ పుండాఖోరు.
ఈ మహాకవి పద్యాల్లో ఆంధ్రం నేతి బీరకాయలో నెయ్యున్నంత ఉంది. తౌరఖ్యాంధ్ర కవిత్వంలోనే కాక ఆంగ్లాంధ్ర కవిత్వంలో కూడా దిట్టే శ్రీశ్రీ.
1.సీసా లేబిల్ మార్చే/స్తే సారా బ్రాందియగునె సిరిసిరిమువ్వ.
2.పోలింగుకు పో/ వలసిని రోజువస్తే సెలవింక డెమోక్రసీకి సిసిము.
3.గోల్డ్ వ్యామోహం చెడ్డది/మైల్డ్ వ్యాయామం శరీరమాద్యం ఖలుడా/ చైల్డ్ వ్యాపారం కూడదు/ఓల్డు వ్యూలను హోల్డ్ చేయకుండముర
4.భగవంతుని మైక్రోస్కోపులం/ఎక్కుపెట్టిన టెలిస్కోపులం/శతకోటి స్టెతస్కోపులం/అనంతకోటి బయస్కోపులం.
5.ఆర్డినెన్సు పరిపాలన/ఆర్డినరీ రొటీను.
6.విదూషికుడి టెంపరమెంటు/ఏదో ఒక డిస్కౌంటెంట్/బ్రతుకుతో ఎక్సెరిమెంటు/పదాలు పేటెంట్/రసాలు టూరెంట్ సదసత్సమస్యకి సాల్వెంట్/శ్రీశ్రీ జెయింట్.
7.అసమర్థుడి చేతిలో అసోనెన్సు/అందించదు సరిగ్గా రిసొనెన్సు/దానికి కావాలెంతో విజిలెన్సు/ అందుకే ఛందో రహస్యం తెలిసిన వెటరన్సు/స్ట్రెయిట్‌రైమ్‌కే ఇస్తారు ప్రిఫరెన్సు.
8. నో పార్కింగ్ జోరుగా సూటైన బాటనేగో.
9. విచిత్ర వీరులు నక్సలైట్లు/అన్యాయాలకి డైనమెట్లు అంధకారంలో టార్చిలైట్లు/నవయువ జీవన కాస్మోనాట్లు. వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు.
10.సింహళదేశపు వోటర్లు/సిరిమావో వెనరేటర్లు/ విప్లవానికి ధర్మామీటర్లు/ విద్యచ్ఛక్తి జనరేటర్లు/ వాళ్ళే అమెరికాకి వాటర్లూ.
11.ఈనాడు నేషనల్/అంటే ఇర్రేషనల్/పైగా సెన్సేషనల్.

భావకవిత్వం మొదలైనప్పటి నుంచి ఈ రోజుదాకా తెలంగాణ కవితల్లో ఇంత ఉర్దూ పదజాలం గానీ, ఇలా ఇంగ్లీషు పదాలు కానీ అసలు కనపడవు. దీనిని సాంకేతికంగా ఫ్లోర్ క్రాసింగ్ అని అంటారు. అంటే మనం మాట్లాడేటప్పుడైనా, రాసేటప్పుడైనా సరిపోయిన పదం మన భాషలో తట్టకపోయినా, లేకపోయిన వేరే భాషలను ఆశ్రయించడమన్నమాట. ఇప్పటికీ కచేరీ, తయారు, సవాలు, జవాబు లాంటి పదాలు తెలుగు కాదనీ, ఉర్దూలోంచి తీసుకోబడ్డాయని తెలియని ఆంధ్రులు ఉన్నారు. మరి ఈ పద ప్రయోగం కవిత్వానికి శోభ చేకూరుస్తుందా, చెడుపు చేస్తుందా అన్న విషయం పండితులే చెప్పాలి. ఈ ప్రయోగాల వల్ల ఒక చెడు ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇంగ్లీషు పదాలు, ఉర్దూ పదాలు తెలుగు లిపిలో రాసినట్టుగానే పలకడం వలన ఉచ్చారణ దారుణంగా దెబ్బతింటుంది. ఉర్దూలో J, Z చాలా విస్పష్టంగా పలుకాలి. Jaleel అన్న పదానికి Zaleel అన్న పదాన్ని వాడి తే అర్థం పూర్తిగా మారుతుంది. అంతేకాదు, కొన్ని పదప్రయోగాలు చాలా వింతగా కూడా చేస్తారు ఆంధ్ర కవులు, ఆంధ్ర ప్రజలు. ఉర్దూ పదం ఖూన్ అంటే హత్య; ఖూనీ అంటే హంతకుడు. ఆంధ్రులంతా ఖూనీని హత్యగా వాడుతారు. ఇలా వేల పదాలు తప్పుడు అర్థాలు సంతరించుకున్నాయి ఆంధ్ర కవుల పుణ్యమాని.
ఆంగ్లాంధ్ర కవితా పితామహుడు అన తగ్గవాడు ఆరుద్ర. ఈయన రాసిన వేల పద్యాలలో అంతే సంఖ్యలో ఆంగ్ల పదాలు కనిపిస్తాయి.
1.అతడు ఆమెల ఫైటు/అతివ ఛాన్సులు బ్రైటు/ ఆడదెపుడూ రైటు/ ఓ కూనలమ్మా!
2.అయిదు రోజులు వేస్టు/అగుట కెయ్యది బెస్టు/ చూడుము క్రికెట్టు టెస్టు/ ఓ కూనలమ్మా/
3.పెరిగె ఇనకంటాక్సు/పెరిగె సూపరుటాక్సు/టాక్సులేనిది సెక్సు/ ఓ కూనలమ్మా!
ఇక త్వమేవాహం అన్న గొప్ప పద్య పీఠిక పెట్టుకుని దానిలో ఇలా రాస్తాడు.
బ్రెయిన్‌లో బెన్‌గన్/రెయిన్‌లా ఆలోచనల ట్రెయిన్ స్పయినల్ కార్డులో స్పెయన్/గ్లూమీ తిమిరాలు చెరిషించి సైతాన్ మనల్ని పరిషించినపుడు.ఈ రకంగా రాశారు మహామహులంతా.
kankadurga
ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్రకటించడమే ఈ రచయిత్రి ఉద్దేశం. అయితే తెలంగాణ కవిత్వం రాసిన కవులలో బహుభాషా కోవిదులు, మూడు నాలుగు భాషలలో రచనలు చేసినవారు అనేకులు ఉన్నారు. సామల సదాశివ, పీవీ నరసింహారావు వంటి దిగ్గజాలు, కాళోజీ వంటి ప్రజా కవులు అనేక రచనలు చేశారు. అయితే భాషల కలగాపులగం ఈ రచనల్లో కనపడదు. చక్కటి తేట తెలుగులో, అందమైన ఉర్దూ భాషలో, ఈ ప్రాంతంలో వాడిన మరాఠీ, కన్నడ భాషల్లో కూడా రచనలు మొద టి నుంచి వెలువడ్డాయి. కానీ ఏ భాష అందం చెడకుండా ఆ భాషలోనే స్వచ్ఛంగా రాయటం ఈ గడ్డలో పుట్టినవారి అలవాటు. అన్నపు రాశు లు ఒకచోట, ఆకలి మంటలు వేరొక చోట అని ఆర్ద్రంగా చెప్పినా,, చీకటి వెంట వెలుగు రాదనుకోవడం నిరాశ, ఆ వచ్చిన వెలుగు అలాగే ఉండాలనుకోవడం దురాశ అని బతుకును వర్ణించినా అది తెలంగాణ కవులకే చెల్లింది.
ఇప్పుడు జరుగుతున్న ఈ తెలుగు ప్రపంచ మహాసభలు ఈ తెలంగాణ సుసంపన్నం చేసిన తెలుగును ప్రపంచం గుర్తించేటట్టు చేస్తాయనీ, తెలంగాణ తెలుగు భాషకు పూర్వవైభవం తెస్తాయనీ ఆశిస్తూ ఈ సభా నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు తెలంగాణ, తెలుగు అభిమానులంతా.

1310

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles