తొలుగుతున్న ముసుగులు


Tue,October 31, 2017 11:08 PM

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోలేని సామాన్యులు అనవసరంగా ఆవేశకావేశాలకు లోనవుతున్నారు. అసలు వివిధ మతాలు, కులాలు, సంస్కృతులు, భాషలు, జీవన విధానాలకు చెందిన మనుషులు కలిసి ఒక సంఘంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరు ఏయే పరిధులు పాటించాలి? అసలు ఏ వ్యక్తికైనా తన పరిధులు ఎలా తెలుస్తాయి?ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనిషికి సహజంగా ఉండే గుణాలు, సంఘజీవనం వల్ల వచ్చే భావాలు, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం,
అబ్బిన విద్య, వయస్సుతో పెరిగే అనుభవం పరిశీలించాలి. వీటిని మూడు భాగాలుగా తెలుసుకోవచ్చు.

డిగ్రీలు, ఉన్నతోద్యోగాలు, అసంబద్ధ రచనలు మనిషిని మేధావిని చేయవు. అవగాహన, సంయమనం, విచక్షణ మనిషి వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. పదిమందిని కలిపే రచనలు చేస్తే, సంఘాన్ని ఒక తాటిమీద నిలబెట్టే పుస్తకాలు రాస్తే వారు నిజమైన మానవీయ రచయితలు అవుతారు. వ్యక్తులుగా ఎదుగని వారు సంఘానికి మార్గదర్శకులు కాలేరు. అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి అందులోంచి జ్ఞానంలోకి పయనించేవారే నిజమైన మేధావులు.

మనిషికి పుట్టుకతో ఉండేది అజ్ఞానమే! అంటే దేని గురించి ఎలా ఆలోచించాలో తెలియకపోవటం మొదలైన లక్షణా లు కలిగి ఉండటం. అయినా పెరుగుతున్న కాలంలో దగ్గ రి బాంధవ్యాల వల్ల, కుటుంబసభ్యుల మధ్య ఏర్పడిన ప్రేమాభిమానా ల వల్ల సంఘంలోని పరిచయస్తులు, కొత్తవారి పట్ల మర్యాదగా ఉండ టం అలవాటవుతుంది. అయినా ఈ కోవకు చెందినవారు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. వారిలో చాలామంది సంఘంతో ప్రశాంతంగానే ప్రవర్తిస్తారు. ఏదైనా అసంతృప్తి కలిగితే తమ కుటుంబసభ్యులను సూటిపోటి మాటలతోటి, హింసాయుత ప్రవర్తనతోటి బాధపెడుతారు. అంటే పక్కవారిని బాధపెట్టేవారు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే!
విజ్ఞానం అంటే మాట్లాడే విషయాల గురించి కొద్ది ఆలోచనచేసి బాగున్న వాటిని గ్రహించటం. సాధారణంగా మధ్యతరగతి ప్రజల్లో చదువుకున్నవారు విజ్ఞానవంతులు అంటారు. తమ చదువు, అనుభవాలు, ఇతరులు చెప్పిన మంచి విషయాలు కలిపి సంస్కారవంతమైన జీవన విధానాన్ని ఏర్పర్చుకొని పాటిస్తారు. వీరు సాధారణంగా తమ కుటుంబ సభ్యుల పట్ల, సంఘంలో ఇతరులతో సంబంధ బాంధవ్యాల పట్ల సున్నితంగా వ్యవహరిస్తారు. అందరూ సుఖశాంతులతో బతుకాలని కాంక్షిస్తారు.

జ్ఞానం అన్నది పెద్ద విషయం. పుట్టుక, పెరిగిన వాతావరణం, అలవర్చుకున్న ఆలోచనలు, కుటుంబ నేపథ్యం, చదువు, చూసిన అనుభవించిన ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకుని మంచిని గ్రహించడం.. ఇవన్నీ కలగలిపి నలుగురి మంచి, సంఘంలో సుఖశాంతులు కోరుకునేవారు జ్ఞానం కలిగినవారు. ప్రతిమనిషిలో ఉన్న మంచిని ప్రేమించి బలహీనతలను అర్థం చేసుకోవటం జ్ఞానవంతుల లక్షణం వీరికి ఉం డేది, ఇతరులకు ఉండనిది విలక్షణ లక్షణం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏ మనిషినీ, సమూహాన్ని గంపగుత్తగా లెక్కవేయరు వీరు. ఎందుకంటే ప్రపంచంలో మనం చూసేది ఏదీ పూర్తిగా మంచి, పూర్తిగా చెడు ఉండదు. గులాబీకి ముళ్ళు ఉంటాయి; ప్రాణానికి అవసరమైన నీరు వరదలా పారితే వేల ప్రాణాలు తీసుకుంటుంది. ఆశ్రయమిచ్చే భూ మి కంపిస్తే లక్షల మందికి అపాయం, ఆహారాన్ని అందించే చెట్ట మీదపడితే మనిషి బతుకడు. ఈ విషయాన్ని గ్రహించగలిగిన వాడే జ్ఞాని.

ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తున్నది? సాధారణంగా ఉన్న త విద్యావంతులు, సర్వసంగపరిత్యాగం చేసిన స్వాములు, బాబాలు, సన్యాసులు జ్ఞానులని సామాన్య ప్రజలు భావిస్తారు. దురదృష్టమేమం టే మంచి స్వాముల కాలం అయిపోయినట్టనిపిస్తున్నది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందుడి కాలం చెల్లిపోయింది. ధగధగ బట్టలేసుకొని సెంటుకొట్టుకునేవారు, భోగభాగ్యాల్లో తులతూగుతు న్న స్వాములు, బాబాలు ఎక్కువైపోయారు. వీరు ఇంతమంది ఉండటానికి కారణం మొదటగా చెప్పిన అజ్ఞానమే. పరిత్యాగం చేయనివాడు గురువు కాలేడు. మనం చేయలేని పనిచేసి అన్ని వదిలి జీవించేవాడిని మాత్రమే ప్రజలు విశ్వసిస్తే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఆగుతాయి. ఈ దొంగ స్వాములు, బాబాలు చేసే ఆకృత్యాలు జరుగవు.

రెండో కోవకు చెందినవారు ఉన్నత విద్యావంతులు. వీరు సంఘం లో చాలా గౌరవం పొందుతారు. వీరికి అన్ని విషయాల్లో అవగాహనే కాక సంఘాన్ని మంచిదారిలో పెట్టే శక్తి కూడా ఉంటుందని సామాన్య జనాలు భావిస్తారు. దేశంలో నిజానికి అందరికంటే, రాజకీయనాయకులు, వ్యాపారస్తులు, ధనవంతులు.. వీరందరికంటే ఎక్కువగా గౌర వం పొందేది ఉన్నత విద్య పొంది దాని ఆధారంగా ఉద్యోగాలు చేసేవారే! వీరిని మేధావులుగా భావిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు సామాన్యంగా ఉన్న భావాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో డాక్టర్ జయశంకర్ గారు అన్న మాట నిజమనిస్తుంది. మేధావులందరూ ప్రొఫెసర్లు కారు, ప్రొఫెసర్లందరూ మేధావులు కారు అనేవారు. మనిషి బుద్ధి, ప్రజ్ఞ, చేతనం, ధారణ, జ్ఞప్తి అన్నిటికీ మించి సంయమనం మేధావి లక్షణాలు. వీటన్నింటిలో మంచిని చెడును వేరుచేసి చూడటం, సంయమనం పాటించటం అనేవి ముఖ్యలక్షణాలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మేధావులెవరో చూద్దాం.

తెలంగాణలో జరిగిన అన్యాయాలను తన మరణం దాకా సభలు పెట్టి, పుస్తకాలు రాసి ప్రజలను చైతన్యవంతులుగా చేయటానికి ప్రయత్నించిన ప్రొఫెసర్ తోట ఆనందరావు ఆపరేషన్ పోలో నిర్వహించిన కేంద్రాన్ని గానీ, 1956 నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన ఆంధ్ర రాజకీయ నాయకులను గానీ ఒక్కమాట వ్యక్తిగతం గా మాట్లాడలేదు. రెండు ప్రాంతాలు విడిపోయి ఎట్లా బాగుపడవచ్చో వివరించారు. ఎంత కటువైన నిజాన్ని గురించి చెప్పినా, అంశాల గురిం చి మాట్లాడారే గానీ వ్యక్తుల గురించి మాట్లాడలేదు, విమర్శించలేదు. ఒక వివాదాంశంలో కూడా ఎవరూ నష్టపోకుండా పరిష్కారాలు చూపేవారు. అలాగే డాక్టర్ జయశంకర్ 1995- 2011 దాకా తెలంగాణ అంశాల మీద చేసిన పరిశోధన, సమస్యలకు చెప్పిన పరిష్కారాలు, ఉద్యమానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఒక్క అంశంలో కూడా ఆంధ్ర నాయకులను గానీ, కేంద్రంలోని కాంగ్రెస్‌ను గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. అంశాలను క్షుణ్ణంగా పరిశోధించి ప్రజలకు వివరించారు. వివిధ పార్టీలలో ఉన్న తెలంగాణ వారిని కలిసి పనిచేయాలని పదేపదే చెప్పేవారు. వీరిద్దరూ మంచిని మంచిగా, చెడును చెడుగా వేరుచేసి చూశారు. కాబట్టే నిర్భయంగా నిజాలు మాట్లాడారు. మనుషుల మీద కక్షలు పెట్టుకోలేదు. కాబట్టి నిజమైన మేధావులుగా నిలిచారు.

ఇక తెలంగాణకు పెద్ద వరం అఖండ మేధావి అయిన నాయకుడు దొరుకడం. కష్టకాలంలో, అధికారంలో ఒకేరకమైన సంయమనం చూప డం ప్రజ్ఞ, శక్తి, నిబద్ధతతో ప్రజారంజకంగా పరిపాలన చేయడం కేసీఆ ర్ గారి మేధావి తనానికి నిదర్శనం. ఉద్యమకారుడిగా ప్రజల సమస్యలు తెలుసుకున్న మనిషి అధికారంలోకి రావటమేగాక ఆ సమస్యలు, మధించి పరిష్కారాలు కనుక్కొని సత్వరంగా పథకాలు అమలు చేయడంలో మన ముఖ్యమంత్రికి దీటుగా దేశంలో ఇంకో నాయకుడు లేడు.
ఇప్పుడు మిగతా పేర్లతో మంచి చెడూ రెండూ సమంగా గమనించగలిగిన వారు ఎవరూ కన్పించటం లేదు. తెలంగాణపక్షం వహించినవాళ్ళు కూడా ఇన్నేళ్ళ తర్వాత (1952 నుంచి 2014 దాకా) ఏర్పడిన ఈ ప్రాంత ప్రభుత్వం మీద ప్రతి విషయంలో దుమ్మెత్తి పోయడమేగానీ ఒక్క పథకంలో బాగున్నదేమిటి, మార్చాల్సిదేమిటి, అని మాట్లాడిన మేధావి లేడు. ఉమ్మడి హైకోర్టు, ఆంధ్రప్రభుత్వ నీటి చౌర్యం, ఉద్యోగుల విభజన లాంటి విషయాలు వారికి బాగానే అనిపిస్తున్నాయి. కానీ తెలంగాణ పథకాలు, ప్రగతి రుచించటం లేదు. మరి వీరిని మేధావులందామా? ఇక కొందరు అసలే అంతంతమాత్రంగా ఉన్న సంఘటితత్వా న్ని నాశనం చేయటానికి పుస్తకరచనలు చేస్తారు. లేనిపోని ఆవేశకావేశాలకు కారణభూతమవుతున్నారు. ఒక గొప్ప రచయిత అంటాడు; ఆల్ జనరలైజేషన్స్, ఇంక్లూడింగ్ దిస్ వన్, ఆర్ రాంగ్ అంటే అర్థం దేన్ని గంపగుత్తగా తృణీకరించకూడదు అని! మరి ఒక మతాన్నో, కులాన్నో మొత్తంగా విమర్శించే వారిని ఏమనాలి? చదు వు లేనివారు అటువంటి భావాలు కలిగి ఉంటే అజ్ఞానం అనుకొని వదిలేయవచ్చు. పదిమందికి చదువు చెప్పేవారికే అంతులేని అజ్ఞానం ఉంటే ఈ సంఘాన్ని, దేశాన్ని రక్షించేదెవరు అడుగున ఉన్న కులంలో పుట్టిన అఖండ మేధావి వివేకానందుడు. ఏ మతాన్నీ, కులాన్నీ వేరుచేసి చూడలేదు సరికదా, అన్ని దేశాలూ ఒకే కుటుంబం అన్నాడు. చదువు ఇష్టముంటే చదువుకో, పశువులు తోలుకోవాలని ఉంటే పశువులు తోలుకో, అంతేకానీ పశువులను ఇతరుల మీదికి తోలకు అన్నాడు. అదీ మేధావి ఆలోచన.
kankadhurga
డిగ్రీలు, ఉన్నతోద్యోగాలు, అసంబద్ధ రచనలు మనిషిని మేధావిని చేయవు. అవగాహన, సంయమనం, విచక్షణ మనిషి వ్యక్తిత్వాన్ని పెం చుతాయి. పదిమందిని కలిపే రచనలు చేస్తే, సంఘాన్ని ఒక తాటిమీద నిలబెట్టే పుస్తకాలు రాస్తే వారు నిజమైన మానవీయ రచయితలు అవుతారు. వ్యక్తులుగా ఎదుగని వారు సంఘానికి మార్గదర్శకులు కాలేరు. అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి అందులోంచి జ్ఞానంలోకి పయనించేవారే నిజమైన మేధావులు. సామాన్య ప్రజలు కొద్దిగా వారి బుద్ధి ఉపయోగించి మంచీ చెడూ గ్రహించాలని కోరుకుందాం. మేధావుల ముసుగులో సంఘానికి చెఱుపు చేస్తున్న ఈ అజ్ఞానులను దూరం పెడుతారని ఆశిద్దాం.

738

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles