సార్ యాదిలో.. సార్ బాటలో


Fri,August 5, 2016 12:59 AM

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాదినని చెప్పుకున్నవారు ప్రొఫెసర్ జయశంకర్‌సార్. చదువు ఇచ్చిన జ్ఞానంతో తాను పుట్టిన గడ్డకు ఏదైనా ఉపకారం చెయ్యాలనేదే తన కోరిక అని చెప్పిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ నేడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిస్వార్థంగా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ సామాన్యమైన జీవితం గడుపుతూ ప్రజలకు సేవచేయాలని తలిచాడు. మనుషులందరూ ఆనందంగా జీవించాలని తాపత్రయపడి తనవంతు సమాజసేవ చేసేవారు చరిత్రలో ఎప్పుడూ నిలుస్తారు. నాది సింగిల్ పాయింట్ ప్రోగ్రాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటూ ఇరవై ఏళ్ళ పాటు ఇరవైనాలుగు గంటలూ దానికోసమే జీవించారు.

jayashankar
రాష్ట్ర ఏర్పాటుపై 2004 ఎన్నికల్లో వాగ్దానం చేసికూడా అయిదేళ్ళు తప్పించుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించటానికి జయశంకర్ ప్రయత్నించారు. అదే రీతిలో దాదాపు 36 పార్టీలను ఒప్పించారు. కానీ 2009 ఎన్నికల తర్వాత కూడా మోసగింపు విధానాలు కాంగ్రెస్ పాటించింది. అయితే రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం, తర్వాత జరిగిన అనూహ్యపరిణామాలతో దిగివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసినపుడు అమితంగా ఆనందించారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవడం, శ్రీ కృష్ణ కమిషన్ ఏర్పాటు, స్థానిక కాంగ్రె స్- టీడిపీ నాయకుల డొల్లతనం వారిని చాలా బాధించాయి. 2010 జనవరి నుంచి వారి ఆరో గ్యం దెబ్బతిని చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూడకుండానే కన్నుమూశారు. అయితే ఆయన మలిదశ ఉద్యమంలో చేసిన భావజాల వ్యాప్తి వల్ల అంతటి అఖండ ఉద్యమం జరిగిందన్నది నిర్వివాదాంశం. భావజాలవ్యాప్తి వారు నిర్వహిస్తే, రాజకీయ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర సమితి విజయవంతంగా నడిపింది.

జయశంకర్ సార్ మరణం తర్వాత రాష్ట్ర ఏర్పాటు, వారికి అపారమైన నమ్మకం ఉన్న నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దేశంలోనే ఆదర్శంగా నిలువ టం అన్నీ ఒకటి వెంట ఒకటి జరుగుతున్నాయి. అయితే ఒక నానుడి ఉంది. డెడ్ మాన్ ఆజ్ సైలెం ట్ అని దాన్ని ఉపయోగించుకుని కొందరు వ్యక్తు లు, కొన్ని సంస్థలు జయశంకర్ గారు వ్యతిరేకించే పనులు చేస్తున్నారు. ఆయన పేరు వాడుకుంటున్నారు. సార్ బాటలో నడుద్దామనిచెప్పి జీవితమంతా ధారపోసిన ఆయన బాటను తవ్వేద్దామని ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమం 1996లో ప్రారంభమైనప్పటి నుంచి జయశంకర్ గారు పూర్తిగా ఉద్యమాలకే అంకితమయ్యారు. ఉపన్యాసాలతో, పుస్తక రచనల ద్వారా భావజాల వ్యాప్తిని ఉద్యమంలా చేపట్టారు. ముప్ఫైకి పైగా ఉన్న తెలంగాణ సంఘాలన్నింటిని ఐక్యం చెయ్యటానికి ప్రయత్నించారు. ఈ ప్రాంత వనరులు ఏమిటి, సీమాంధ్ర ప్రభుత్వాలు వాటిని ఎలా,ఎక్కడ, ఎవరికోసం వాడుతున్నారు, దానివల్ల ఈ ప్రాంత ప్రజలకు కలిగే నష్టం, వాటి పరిష్కారాల గురించి ప్రజలకు తెలియజెప్పారు. అంతేకాదు. సామాజిక జీవనంలో విద్యావంతుల పాత్ర ఏమిటో స్పష్టంగా నిర్వచించారు. సామాన్య ప్రజలకు వారి సమస్యలేమిటో తెలుస్తాయి కానీ, వాటికి కారణాలు పరిష్కారాలు చెప్పటం విద్యావంతుల బాధ్యత. ఆ సమస్యలు పరిష్కరించటం రాజకీయ నాయకుల బాధ్యత. ఆ నాయకులతో కూడా తమ ఆలోచనలు విద్యావంతులు పం చుకోవాలి. ఒకవేళ ఉద్యమాలు అవసరమైతే అహింసాత్మకంగా వాటిని నిర్వహించటం కూడా విద్యావంతుల బాధ్యతే!

ఇప్పుడు జయశంకర్ గారు స్థాపించిన, ప్రోత్సహించిన సంస్థలేం చేస్తున్నాయి! తెలంగాణను అన్నివిధాలుగా అణగదొక్కిన సీమాంధ్ర ప్రభుత్వాల పట్ల చూపిన గౌరవంతో వెయ్యో వంతుకూడా స్థానిక ప్రభుత్వం మీద చూపుతున్నాయా? కొత్త రాష్ట్ర ఏర్పాటుతో ఎన్నో సమస్యలు పుట్టుకొస్తాయి. అందులో ఆగర్భ శత్రువుల్లా ప్రవర్తిస్తున్న పక్కరాష్ట్ర నాయకు లు, వారికి వంత పాడుతున్న కేంద్రప్రభుత్వం, ఇంకా విడిపోని అవసరంలేని బంధాలు ఇవన్నీ ఎదుర్కొని ప్రజలకు సేవచేస్తాం అన్న ప్రభుత్వం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? సమస్యలు సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులను తప్పుకోమని అత్యంత అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు!

ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో కానీ, మల్లన్నసాగర్ ముంపు బాధితులను ఆదుకోవటంలో కానీ ప్రభుత్వం తప్పిదాలు ఉంటే ధైర్యంగా ఆ ప్రభుత్వానికి చెప్పాలి కానీ రైతుల దగ్గరకెళ్ళి వారిని ఆగం చేస్తే ఎవరికి లాభం? తెలంగాణ ప్రాంతానికి దశాబ్దాల తరబడి నష్టం చేసిన సీమాంధ్ర ప్రభుత్వాల పట్ల జయశంకర్ సార్ గానీ, ఆనందరావు గానీ అట్లా ప్రవర్తించలేదే! మరి ఇదేనా సార్ బాటలో నడువటం?

ప్రభుత్వ పథకాలలో లోపాలుంటే, వాటి గురించి మాట్లాడాలంటే కేసీఆర్ లాగా నెలల తరబడి నదీ ప్రవాహాల వెంబడి ప్రయాణించి, నిపుణులతో సంప్రదించి, స్వయంగా నిర్దిష్టమైన ప్రణాళికలు తయారుచేసుకోవాలి. సీమాంధ్ర పక్షపాతి పత్రికల్లో ఆర్టికల్స్ రాయడం కాదు. వారి ఛానళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చెయ్యడం కాదు.
జయశంకర్ సార్ ఆలోచనలు అర్థం చేసుకోవాలంటే వారు స్థానిక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను ఎందుకు అంతగా బలపరిచారో ఆలోచించాలి.

వారి మాటల్లో చెప్పాలంటే చెన్నారెడ్డి దగ్గరి నుంచి చిన్నారెడ్డి దాకా, ఆరెస్సెస్ దగ్గర నుంచి ఆర్‌ఎస్‌యూ దాకా తెలంగాణ అన్న ప్రతివారితో ఎందుకు పనిచేశారో అర్థం చేసుకోవాలి. ఆ క్రమంలోనే తెలంగాణ గురించి, వివిధ అంశాల గురించి దాదాపు 7,8 నెలలు తనతో చర్చించిన కేసీఆర్ గారి మీద జయశంకర్ గారికి ఏర్పడిన నమ్మకం అపారం. అందుకే కొన్ని పత్రి కలు ఎన్ని కథలు వండి వార్చినా కేసీఆర్ గారిని, టీఆర్‌ఎస్ పార్టీని చివరిదాకా బలపరుస్తూ వచ్చా రు. వారి బలం ప్రజాబలమే. ఉద్యమాల నేపథ్యం లో తెలంగాణ ప్రజలు సంతరించుకున్న చైతన్యం మీద వారి నమ్మకం అపారం. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే స్థితికి ఎదిగారు అన్నమాట చాలాసార్లు అనేవారు. అందుకే సార్‌కు విద్యావంతుల వికారాలు కూడా బాగా తెలుసు. అందుకే చాలా హాస్యంగా మేధావులంతా ప్రొఫెసర్లు కారు, ప్రొఫెసర్లంతా మేధావులు కారు అని స్పష్టంగా చెప్పేవారు. పైగా చదువుకొని వంకర ఆలోచనలు చేయరు అనేవారు.

జయశంకర్ సార్ బతికి ఉంటే నిర్దంద్వంగా ప్రభుత్వాన్ని బలపరిచేవారు. ఒకవేళ ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్లు అనిపిస్తే, ఆ అంశం మీద క్షుణ్ణంగా పరిశోధన జరిపి నేరుగా ప్రభుత్వానికి అందించేవారు. తన సవరణలను ప్రభుత్వం వినే తీరులో సలహాలు ఇచ్చేవారు. పోరుబాట పట్టేవారు కాదు. అంతేకాక ఎన్నికల్లో చావుదెబ్బలు తిన్న అడుగుబొడుగు నాయకులతో కలిసి ప్రజల దగ్గర ప్రభుత్వాన్ని ఆగం చెయ్యాలని మాత్రం ప్రవర్తించేవారు కాదు. ఇది మన స్వంత ప్రాంత ప్రభుత్వం, దీన్ని కాపాడుకోవాలి, అధికారం స్థిరపడి, సమస్యలన్నీ తీరిన తరువాతే ఏ వివాదాలైనా అని బుద్ధి చెప్పేవారు. 2009 నుంచీ సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ, దళిత తెలంగాణ ఇంకోటి, ఇంకోటి అన్నవాళ్ళకు సార్ చెప్పిన సమాధానం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ముందు నీ ఇల్లు నువ్వు స్వాధీనపర్చుకోవయ్యా.

తర్వాత ఎవరెక్కడుండాలీ, ఏ సామాను ఎక్కడ పెట్టాలీ అని ఆలోచించుకోవచ్చు, పరాయివాడిని తరిమికొట్టి అప్పుడు ప్రాంతం వాడి పని పట్టాలనే కాళోజీ మాటలు అక్షరాలా బలపరిచేవారు. ఇప్పుడేం జరుగుతున్నది మన రాష్ట్రంలో? ఇంకా మన ఇల్లు పూర్తిగా మన స్వంతం కాలేదు. సార్ బాటలో పయనించడమంటే వారు బలపరచిన కేసీఆర్ గారిని, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. మన ఉద్యోగులు, మన హైకోర్టు మన కు ఏర్పడాలనీ ఉద్యమించేవారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపకూడదనీ ధర్నాలు చేయాలి కానీ మల్లన్నసాగర్ పనులు సాగనీయమని కాదు. అది ఎప్పటికీ సార్ మాట, బాట కాదు!

921

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.