ఇంగ్లీషును భాషగా బోధించాలె


Wed,April 6, 2016 01:28 AM

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి భాషా నైపుణ్యాలు చాలా అవస రం. మన రాష్ట్ర చరిత్ర గమనిస్తే నిజాం హయాంలో ఉన్నంత భాషా పటిష్టత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక లేదు. చంద్రబాబు పాలనలోనైతే ఉన్నది కాస్తా నాశనమైంది. కంప్యూటర్ విద్య ద్వారా విప్లవం తెచ్చేశాను, రాష్ర్టాన్ని ప్రపంచ పటంలో నిలిపింది నేనే అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, ఆ కంప్యూటర్ విద్య నేర్పడానికి ఇంగ్లీష్ భాషా ప్రావీ ణ్యం అవసరం అనే విషయాన్ని మరిచారు. తెలుగుదేశం పాలన వచ్చాక అప్పటిదాకా వారానికి ఏడు క్లాసులున్న ఇంగ్లీషు సబ్జెక్టును డిగ్రీలో, ఇంటర్మీడియట్‌లో నాలుగు క్లాసులకు కుదించారు. వారి సహకారంతో కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఇం టర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఆయా కాలేజీలలో భాషలకు అసలు స్థానమే లేదు. జనవరి, ఫిబ్రవరిలో పది రోజులు క్లాసులు నడిపి ఇంగ్లీషు, రెండవభాష సిలబస్ అయిందనిపించారు. అసలు భాష అనేది విద్యార్థులు ఇతర సబ్జెక్టులు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న అవగాహన లేనివారు విద్యాసంస్థలు నడపడమే దీనికి కారణం. భాష అనేది నైపుణ్యాలు సంతరించుకోవడానికి బోధించబడుతుం ది. కానీ ఆ సిలబస్ ముఖ్యం కాదు. అందుకే ఈ విధానంలో పదేళ్లు ఇంగ్లీషును సబ్జెక్టుగా చదివినా, విద్యార్థులకు ఇంగ్లీషులో మాట్లాడటం, చదవటం రాదు.

1956 కంటే ముందు పాటించిన భాషా విధానం పటిష్టంగా ఉండబట్టి ఈ ప్రాంతంలో సామల సదాశివ, పీవీ నరసింహారావు వంటి పలు భాషాకోవిదు లు ఉండేవారు. ఉర్దూ మాధ్యమంలో చదువుకున్న ఎంతోమంది మేధావులు, ప్రపంచ ఖ్యాతి గడించిన ఇంజినీర్లు, డాక్టర్లు నిజాం రాష్ట్రంలో ఉండేవారు. ఆ విధానంలోనే చదువుకున్న ప్రొఫెసర్ జయశంకర్ నాలుగు భాషల్లో ఎకనామిక్స్ వంటి కష్టతరమైన సబ్జెక్టును డిగ్రీ దాకా విద్యార్థులకు బోధించారు. తెలుగు లో, ఇంగ్లీషులో సాహిత్యం వెలువరించిన వెల్చాల కొండలరావు ఉర్దూ, హిందీలో కూడా పండితులు. దానికి కారణం ఆ రోజుల్లో భాషా నైపుణ్యాలు బోధించడంలో పటిష్టమైన విధానం పాటించడమే. మాధ్య మం ఉర్దూ అయినా ఇంగ్లీషులో కూడా 50 శాతం మార్కులు రాని విద్యార్థులు పాస్ అయ్యేవారు కాదు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులందరికీ పటిష్టమైన విద్యా విధానం ద్వారా బోధించాలని పథకాలు రచిస్తోంది. ఏ మార్పు చేయాలన్నా ఇదే మంచి తరుణం. అయితే ఈ మార్పులు శాస్త్రీయంగా, పరిస్థితులను అవగాహన చేసుకుని చేయా లి. విద్య రెండు రకాలు-ఒకటి అతిముఖ్యమైనది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది. (దీన్ని నిజమైన విద్య అనవచ్చు) రెండోది భుక్తి కోసం, సంపాదన చేయడానికి ఉపయోగపడేది. (దీన్ని చదువు అనవచ్చు) విద్య అనేది ఆంతరంగికం; చదువు పేపర్ల మీద డిగ్రీలు చూపేది. ఈ రెండూ కలిగినప్పుడే ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరించుకుంటూ సమాజానికి సహాయపడుతాడు. ఉమ్మడి రాష్ట్రంలో పాటించిన విద్యా విధానంలో ఈ రెండు పార్శాలూ దెబ్బతిన్నాయి. నిజానికి పరిశోధకులు చెప్పే విషయాలు గమనిస్తే మంచి విధానాన్ని రూపొందించుకోవడం చాలా సులభం. విద్యా రంగంలో మూడు ఎమ్‌లు ముఖ్యం. మెన్, మెథడ్ అండ్ మెటీరియల్స్.

విద్యారంగంలో మెన్ అన్నది ఉపాధ్యాయులకు వర్తిస్తుంది. బోధనలో ఉత్సాహం, చెప్పే నైపుణ్యం ఉన్నవాడు సరైన వ్యక్తిగా ఈ ఉద్యోగానికి సరిపోతా డు. అయితే ఉత్సాహం ఉన్నా, వారి వారి పరిస్థితులను బట్టి వారికున్న నైపుణ్యాల్లో తేడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, మేనేజ్‌మెంట్లు వారి శిక్షణ మీద దృష్టిపెట్టడం చాలా అవసరం. ఈ శిక్షణలో ఒక మం చి ఉపాధ్యాయుడికి ఏ లక్షణాలు ఉండాలి అన్నది విశదీకరించడమే కాక, ఏ పద్ధతిలో బోధించాలి అన్నది కూడా తెలియపర్చాలి. ప్రభుత్వం ఈ శిక్షణా తరగతు లు వీలైనన్ని ఎక్కువ నిర్వహించాలి. అంతేకాదు సరై న శిక్షకులను (రీసోర్స్ పర్సన్స్) నియమించాలి. ఉదాహరణకు ఇప్పుడున్న పద్ధతిలో ఒక చిన్న లోపం ఎక్కడుందో చూద్దాం. ఇంగ్లీషు భాషలో శిక్షణ ఇచ్చే వారికి ఇంగ్లీషు భాషా బోధన తెలిసి ఉండాలి. కేవలం ఎడ్యుకేషన్ రంగంతో ఉంటే సరిపోదు. ఇప్పుడేం జరుగుతోందంటే ఒకరు బీఎస్సీ తర్వాత ఎమ్మెస్సీ చేసి, బి. ఎడ్, ఎం.ఎడ్ చేసి డైట్ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్నామనుకోండి. వారు ఉపాధ్యాయుల లక్షణాల గురించి, విద్య గురించి చెప్పగలరు. కానీ ఇంగ్లీషు భాషా బోధన పద్ధతుల గురించి చెప్పలేరు. దానికి ఆ రంగంలో నిపుణులు మాత్రమే శిక్షణ ఇవ్వాలి. విద్యా రంగంలో మెన్ (ఉపాధ్యాయులు) అనే అంశం పటిష్టంగా ఉంటే మిగతా చిన్న లోపాలు సర్దుకుపోతాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టు ఇంగ్లీషు మీడియం ప్రీ ప్రైమరీ, ప్రైమరీ దశల నుంచి పాటించాలంటే ప్రాథమిక దశ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల భాషా నైపుణ్యాలను పటిష్టం చేయాలి. అసలు పాఠశాల దశలో ఇంగ్లీషు బోధనకు ఒక దిశా మార్గదర్శనం చేయడానికి ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేయడం చాలా అవసరం. ఈ శిక్షణా తరగతులు, భాషా బోధన పద్ధతులు ఒకటి నుంచి పదవ తరగతి దాకా ఇంగ్లీష్ సిలబస్, పాఠ్యాంశాలు- ఈ బాధ్యతలన్నీ ఆ కమిటీకి అప్పగిస్తే మంచిది.

ఇక రెండవ అంశం మెథడ్. పైన చెప్పినట్టు ఇంగ్లీ షు భాషా బోధనకు పరిశోధకులు అందిస్తున్న పద్ధతులను ఎప్పటికప్పుడు గ్రహిస్తుండాలి. ఇప్పటి దాకా మనదేశంలో ముఖ్యంగా స్వాతంత్య్రానంతరం ఇంగ్లీషును భాషగా కాక సబ్జెక్టుగా బోధించడంతో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి దాకా సుమారు 3000 ఇంగ్లీషు క్లాసులు హాజరైన విద్యార్థులకు ఇంగ్లీషు నైపుణ్యాలు పట్టుబడలేదు. అందుకే ఇంగ్లీషును భాషగా బోధించాలి. సిలబస్ పూర్తి చేయడం కాకుండా, నైపుణ్యాలు విద్యార్థులకు వచ్చే మెథడాలజీ ఉపాధ్యాయులకు అందించాలి. బోధించే సమయంలోనూ (టీచిం గ్), పరీక్షా విధానంలోనూ (టెస్టింగ్) భాష మీదే దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడే విద్యార్థులందరికీ విజయవంతంగా ఇంగ్లీషు బోధించగలుగుతారు. భాష గురించి ఇంకో ముఖ్యమైన మాట. భాష నేర్చుకోవడానికి విద్యార్థి ఆర్థిక, సాంస్కృతిక, కుటుంబ అంశాలేవీ అడ్డురావు. సరైన వాతావరణం కల్పిస్తే ఏమనిషి అయినా, ఏ భాష అయినా నేర్చుకోగలరు. (ఈ వ్యాసకర్త 10 రోజులలో గూడూరు దగ్గర పల్లెటూరు లో కూలీ పనిచేసుకునే లంబాడీ స్త్రీలకు ఇంగ్లీషులో మాట్లాడటం నేర్పగలిగింది.)

ఇక మూడో అంశం మెటీరియల్స్. భాషా బోధన విషయంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. మాతృభాష కోసం పాఠ్యాంశాలు రూపొందించేటప్పుడు అంశం ఏదైనా ఉండవచ్చు. ఉదాహరణకు ఒక షేక్‌స్పియర్ నాటకాన్ని తెలుగులో చదివితే ఆ భాష మీద పట్టు ఉన్నవాడికి ఎక్కువ అర్థం అవుతుంది. అదే ఇం గ్లీషులో చదివితే అందులోని అంశం, భాషా కూడా పరాయిదే కాబట్టి తక్కువ అర్థమవుతుంది. అందుకే మన విద్యార్థులకు ఇంగ్లీషు పాఠ్యాంశాలు ఇక్కడి విషయాలకు సంబంధించినవైతే ఎక్కువ త్వరగా భాష పట్టుబడుతుంది. అంటే ఒక పాఠ్యాంశం ఆర్కే నారాయణ్ కథ గానీ, రవీంద్రనాథ్ కథ గానీ ఉండాలి. అం తేగానీ ఇంగ్లీషు చెప్తున్నామని జేమ్స్ థర్బర్, ఓ హెన్రీ అని కథలు ఉంటే వారికి సాంస్కృతిక పరాయీకరణ అవడమే కాక అర్థం కూడా కావు. ఎప్పుడూ పరాయి భాష నేర్పాలనుకునేటప్పుడు విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశాలు ఉంటే సులువు. ఇక ఇప్పు డు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషు భాషా మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలంటే ముం దు ఉపాధ్యాయులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో-ఇంగ్లీషు భాషను ఉపయోగించడంలో నిపుణుల్ని చేయాలి. ఇతర భాషలు (తెలుగు, ఉర్దూ, హిందీ) బోధించేవారు తప్ప మిగతా ఉపాధ్యాయులందరికీ ఇంగ్లీషులో క్లాస్ రూం డెలివరీతో సునిశిత నైపుణ్యం అబ్బేటట్టు శిక్షణ ఇవ్వాలి. ఇది కూడా ఇంగ్లీషు భాషా బోధనలో నిష్ణాతులైన వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ అంశాన్ని కూడా రాష్ట్ర స్థాయి ఇంగ్లీషు భాషా నిపుణుల కమిటీ పరిశీలించాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో వాడుతున్న ఏ పాఠశాల స్థాయి పుస్తకాలు గమనించినా ఒక విచిత్రమైన విష యం కనబడుతుంది. ఇంగ్లీషు మీడియంలో వాడుతు న్న పుస్తకాలే తీసుకుందాం. ఐదు నుంచి ఏ క్లాసువైనా ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, సైన్స్ పుస్తకాలలో వాడిన భాషా స్థాయి చూడండి. సోషల్ స్టడీస్, సైన్స్ పుస్తకాలలోని ఇంగ్లీషు, ఇంగ్లీషు సబ్జెక్టు పుస్తకంలో స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం అసలు ఇంగ్లీషు ఎందుకు బోధిస్తున్నట్టు? నిజానికి భాష అనేది మిగతా సబ్జెక్టు చదవడానికి సాధనంగా ఉపయోగపడాలి. అంటే ఆరవ తరగతి సైన్స్, సోషల్ స్టడీస్‌లో వాడే కొత్త పదాలు ఇంగ్లీష్ పుస్తకంలో ఐదవ క్లాస్‌లోనే బోధించాలి. ఇప్పుడు ఆ సబ్జెక్టు చదవడం తేలికవుతుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషు పుస్తకాలు ఒకటి నుంచి పదవ తరగతి దాకా రూపొందించుకోవాలి. అప్పుడు భాషా బోధనకు అర్థం ఉంటుంది. ఇప్పటి పరిస్థితిలో ఒక తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థికి ఫిజిక్స్‌లో 98 శాత ం, లెక్కల్లో 100 శాతం వచ్చి ఇంగ్లీషులో ఫెయిల్ అవుతున్నాడంటే అది ఎవరి లోపం?
- డాక్టర్ దంటు కనకదుర్గ

1796

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.