ప్రతిపక్షాలకు గుణపాఠం


Sun,February 21, 2016 01:48 AM

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అందుకే అందరు చరిత్ర చదవాలి అని. కాంగ్రెస్ ఉత్థానపతనాలు చూశాం. బీజేపీ పరిస్థితి చూస్తున్నాం. ఇక రాష్ర్టాల ఎన్నికలన్నీ ఒకే సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నా యి. అన్నివేళలా ప్రజలను ఎవరూ మోసం చేయలేదరు. ఇప్పుడు నాయకులు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి.

తెలంగాణ ప్రజలు వరుసగా టీఆర్‌ఎస్‌కు ఘన విజయాలు అందిస్తూ ఇతర పార్టీలకు వాటి స్థానమేమిటో చూపిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికలలో టీడీపీతో అంటకాగిన బీజేపీ స్థానమేమిటో వెల్లడించారు. అయినా బీజేపీ హైదరాబాద్ పురపాలక ఎన్నికలలో అదే పార్టీతో కలిసి పోటీ చేసింది. ప్రజలు ఎంత ఈసడించుకున్నా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమ కార్యాచరణతో ప్రజల మన్నన పొందిందనేది తెలుస్తూనే ఉన్నది. టీఆర్‌ఎస్ నిర్మాణాత్మక వైఖరిని ప్రదర్శించింది. ఇందుకు భిన్నంగా ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ను తూలనాడుతూ ప్రజల ముందుకు వెళ్ళాయి. ప్రజలు వీటికి తగిన బుద్ధి చెప్పాయి. జాతీయ స్థాయిలో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోవడం లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ చతికిలపడింది. ఈ ఎన్నికల ఫలితాలు ఏం సూచిస్తున్నాయి? హుందాతనం కొరవడటం వల్లనే బీజేపీ పరాజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ రాజకీయ ప్రాబల్యం, తమ సిద్ధాంతాలే చెల్లుబాటు కావాలనే మూర్ఖత్వం వల్లనే ప్రజలకు దూరమయ్యారు. అది గమనించకుండా బీజేపీ బీహార్ ఎన్నికల్లో వాళ్లు ఇంకా ఎక్కువ మూర్ఖత్వం ప్రదర్శించారు. వరంగల్ ఉప ఎన్నికల్లోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఓటుకు నోటు కేసులో రెడ్ హాండెడ్‌గా పట్టుబడిన టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన అవినీతిమయం అనడమే విడ్డూరం. అలాగే బాబు వారసుడు కూడా హీరో బాలకృష్ణ సంభాషణలు వల్లిస్తూ, ప్రతి నిమిషం ఎన్టీఆర్ వారసులమని గుర్తుచేస్తూ.. తెలంగాణ రాష్ట్రసమితిపై విమర్శలు కురిపించడం ఆశ్చర్యంగా ఉన్నది. దీనిని ప్రజలు ఆమోదించడం లేదనేది ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తూనే ఉన్నది.

ఇక నూట పాతిక ఏళ్ల కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిన్న మొన్నటి దాకా వలస పాలకుల వివక్షను ప్రశ్నించడానికి బదు లు ప్రాంత వనరులను దోచిపెట్టిన నాయకులు, ఐదు దశాబ్దాలు రైతు ఆత్మహత్యలపై స్పందించలేదు. కానీ హటాత్తుగా రైతు బాంధవులుగా అవతారమెత్తారు. వారికి చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు లక్షలు చాలదని మాట్లాడారు. ఇబ్బడిముబ్బడిగా విద్యాసంస్థలు వలస పాలనలో పుట్టగొడుగుల్లా వెలిశాయి. కాంగ్రెస్ నేతలు వాటి క్వాలిటీ గురించి ప్రశ్నించకుండా, విద్యార్థుల జీవితాలతో ఆంధ్రా మేనేజ్‌మెంట్ల ఆడుకునేట్టు వదలేశారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంత విద్యార్థులను సీమాంధ్ర పోలీసులు చావగొడుతుంటే కనీసం పలుకలేదు. గద్దె దిగేదాకా తెలంగాణ వనరులు ఆంధ్రాకు తరలిపోతుంటే తెలంగాణ తన ఆదాయం తనకు ఖర్చు చేసుకోలేని దుస్థితిలో ఉంటే వారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఇవాల వాళ్లకు ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అంటే ఎవరు నమ్ముతారు?

తెలంగాణలో కనుమరుగవుతున టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకొని కలిసి మునగాలనుకుంటున్నది. ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని వారికి టికెట్టు ఇస్తే ప్రజలు ఆ విషయాన్ని గమనించరనుకుంటే పొరపాటే! ఇది వారి అవగాహనారాహిత్యం! ఈ పార్టీలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అయినా పూర్వానుభవం నుంచి కొద్దిగా నేర్చుకుంటాయి అని ప్రజలు అనుకున్నారు. కానీ చంద్రబాబు హైదరాబాద్ మొత్తం తొమ్మిదేళ్లలో కట్టేశాను. కాబట్టి నాకు ఓట్లు వేయాలని అడిగారు. బాబు మాటలు తెలంగాణ ప్రజలకు విస్మయాన్ని కలిగించాయి. ఒకవేళ టీడీపీ కార్పొరేటర్లు గెలిస్తే హైదరాబాద్‌కు ఏం చేయగలరు అని ప్రజలు ఆలోచించరా? పైగా తొమ్మిదేళ్లలో హైదరాబాద్ లాంటి పెద్ద నగరాన్ని కట్టాను అన్న బాబు ఏడాదిన్నర కాలంలో అమరావతికి ఏం చేశాడన్న విషయం ప్రజలకు అర్థం కాదా? ఎన్ని అడ్డంకులు కల్పించి నా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందిం చి అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నా ఆంధ్రా రాష్ట్రం ఏం సాధించిందో ప్రజలు అర్థం చేసుకోలేరా? ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు పూర్తిగా తెలుసు. పైగా ఆ పార్టీని తెలంగాణలో పూర్తిగా మాయం చేయడానికి ఆ పార్టీ నేతలే చాలు. దానికి టీఆర్‌ఎస్ పార్టీ ఏమీచేయనక్కర లేదు. రాష్ర్టాభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించడం, వ్యక్తిగతంగా నేతలను తిట్టడం వంటివి చేసే టీడీపీనేతలను ప్రజలు గౌరవిస్తారా?

బీజేపీ వాళ్లు మతతత్వమని ఎదుటివారిని అనేవారు కేంద్రంలో వీరు అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతున్నది దేశం మొత్తం చూస్తున్నది. ఉద్యోగుల విభజన, హైకోర్టు విభజన ఇంకా అనేక అంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత సహనంతో, హుందాగా వ్యవహరిస్తున్నది. అయినా కేంద్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సహకారం అందిస్తున్న విషయం ప్రజలకు తెలియదా?జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ప్రజల కోసం పనిచేస్తూఅన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తున్నది టీఆర్‌ఎస్ పార్టీ. మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూనే అన్ని మతాల, కులాల వారి అభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది.
అందుకే ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అందుకే అందరు చరిత్ర చదవాలి అని. కాంగ్రెస్ ఉత్థానపతనాలు చూశాం. బీజేపీ పరిస్థితి చూస్తున్నాం. ఇక రాష్ర్టాల ఎన్నికలన్నీ ఒకే సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నా యి. అన్నివేళలా ప్రజలను ఎవరూ మోసం చేయలేయలేరు. ఇప్పుడు నాయకులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది గమనించాలిది. ప్రజలు అరవై ఏళ్ల ప్రజాస్వామ్య అనుభవంతో చాలా ఎదిగారు. నేతలారా ఇప్పుడిక మీ వంతు!

1104

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles