ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?


Sun,October 11, 2015 01:56 AM

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస్వామిక ఎన్నికల్లో పాల్గొని తన ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలు పోరాడి రాష్ట్రం సాధించుకోవడంలో కృతకృత్యులయ్యారు. మరి ఈ సాధనలో తమ పాత్రే గొప్పదని డప్పుకొట్టుకున్న ప్రతి రాజకీయపార్టీ ఈ తరుణంలో ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి? అసలు గత అర్ధ శతాబ్దం పాటు తెలంగాణ ప్రజల కష్టాలకీ, కన్నీళ్లకీ ప్రతి పార్టీ బాధ్యత ఎంత?
కాంగ్రెస్: అసలు ఆంధ్రప్రదేశ్ (మొదట నిర్ణయించబడ్డ పేరు తెలంగాణ -ఆంధ్ర) అనే రాష్ట్ర ఏర్పడటానికి, ఆ తరువాత ఇప్పటివరకు జరిగిన ప్రతి నష్టానికీ బాధ్యత వహించవలసిన కాంగ్రెస్ నాయకులు ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ముందు నిర్ణయించుకున్న బూర్గుల, కెవి.రంగారెడ్డి, చెన్నారెడ్డి హఠాత్తుగా మనసు ఎందుకు మార్చుకున్నారు? బూర్గుల రామకృష్ణారావు ఒక్క సంతకంతో తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలు ఎందుకు బాధపడవలసి వచ్చింది? ఆంధ్ర రాజకీయాలకు తలొగ్గి సుసంపన్నమైన తెలంగాణను వారిచేతిలో పెట్టి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా నోరుమూసుకొని ఎందుకు ఉన్నారు? అప్పటిదాకా ఉన్న హైదరాబాద్ పీసీసీని రద్దు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయారు? తర్వాతి కాలంలో ప్రాంతీయ బోర్డుకు అదేగతి పట్టినప్పుడు ఎందుకు పట్టనట్టు ఉండిపోయారు? 1957 నుంచీ కూడా గ్రామాధికారులను ఇతర అధికారులను సీమాంధ్ర నాయకులు నియమిస్తుంటే చోద్యం చూస్తూ ఎందుకు ఉండిపోయారు? ఇప్పుడు చూపిస్తున్న ఐకమత్యం, ఉత్సాహం తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం చూపించి ఉంటే రాష్ట్రం ఎప్పుడో వచ్చేది కదా! కనీసం సీమాంధ్రులను ఇదే ఐకమత్యంతో ఎదిరించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదుకదా!

1968లోనే యశోదారెడ్డి అనే పార్లమెంట్ సభ్యురాలు నిండు సభలో తెలంగాణ పట్ల మూడు దారుణాలు జరిగాయని అన్నారు. అవి: ఒకటి- పోలీస్ యాక్షన్, రెండు- మిలిటరీ ప్రభుత్వ యాక్షన్స్, మూడు- తెలంగాణ కాంగ్రెస్ సభ్యుల యాక్షన్స్. ఈ మూడో దాన్ని ఇనాక్షన్ అని చదువుకుంటే సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ పట్ల అన్యాయాలను ఎదిరించని వాళ్లు ఇప్పుడు ఏదో చేద్దామని తాపత్రయపడుతున్న సొంత ప్రభుత్వం మీద కత్తులు నూరుతున్నారు!
కమ్యూనిస్టులు: ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, తర్వాత కూడా విశాలాంధ్ర జెండా పట్టుకుని వేళ్లాడిన కమ్యూనిస్టులకు తెలంగాణ మీద ఏనాడూ ప్రేమలేదు. 1967 దాకా ప్రధాన విపక్షంగా వెలిగిన కమ్యూనిస్టు పార్టీ 1956 నుంచి 1967 దాకా తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎందుకు ఖండించలేదు? తెలంగాణకు సంబంధించిన ఏ విషయం కోసమయినా ఎప్పుడైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేశారా? ఈ రోజు కూడా వారి ద్వంద్వ నీతి తెలుస్తూనే ఉన్నది. సీపీఎం మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమే!

ఇక సీపీఐ నారాయణ సంగతి. చంద్రబాబు తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగును నిషేధిస్తే కిమ్మనలేడు. తమిళనాడులో తెలుగు తప్పనిసరిగా ఉండాలని ఉద్యమం చేస్తారట. కమ్యూనిస్టులది తమధోరణి తమదేకానీ, ఇంకో విషయం పట్టదనటానికి చక్కని ఉదాహరణ. సరైన పాలన ఉంటే ప్రత్యేక రాష్ట్రం లో బాగుపడేది సామాన్య ప్రజలే. బీజేపీ ఇచ్చిన మూడు రాష్ర్టాలలోను జీడీపీ ఎక్కువగా ఉండటమే దానికి నిదర్శనం. మరి ప్రజలకు సేవ చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వకుండా ఈ ధర్నాలు, యాత్రలు ఎవరికోసం? గత యాభై ఎనిమిదేళ్లలో మిగతా రాష్ర్టాలలో మేం వ్యతిరేకించిన పనులే సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణలో చేస్తుంటే ఎప్పుడైనా వారిని వ్యతిరేకించారా? కుంభకర్ణుడి లాగా ఆర్నెల్లకోసారి నిద్రలేచి ఎర్రచొక్కా వేసుకొని, ఎర్ర జెండాలు పట్టుకొని లంచ్ టైం దాకా చేసేవి నిజమైన ఉద్యమాలా? ఆ రోజుల్లోనే ప్రాణ్‌చోప్రా ఎడిటర్‌గా ఉన్న సిటిజన్ పత్రిక కమ్యూనిస్టుల అవకాశవాదాన్ని బట్టబయలు చేసింది.

బీజేపీ: మొదటి నుంచీ ఈ పార్టీ తెలంగాణ విషయంలో రోప్‌వాకింగ్ చేస్తూనే ఉన్నది. రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెడుతున్న సమయంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు ప్రవర్తన ఒక్కటి చాలు బీజేపీ ని అర్థం చేసుకోవటానికి. అర్ధరాత్రి రాష్ట్ర ప్రకటన చేశారని 2009లో యాగీ చేసిన చంద్రబాబు అదే అర్ధరాత్రి ఏడు తెలంగాణ మండలాలను ఆంధ్రలో ఆర్డినెన్స్ ద్వారా కలుపుకోవటానికి బీజేపీ సహా యం చెయ్యడం చూస్తే తెలంగాణ పట్ల వారి వైఖరి తెలియటం లేదా? ఉద్యోగుల విభజన, హైకోర్టు విభజన, తెలంగాణ రాష్ర్టానికి ఇవ్వవలసిన నిధుల విషయంలో బీజేపీ వైఖరి ఎలా ఉంది? నిష్పక్షపాతంగా ఇరు రాష్ట్రాలకు సహాయం చేయాల్సిన కేంద్రం న్యాయంగా ప్రవర్తిస్తున్నదా?

టీడీపీ: ఇక ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ ప్రతి చిన్న విషయంలోనూ తెలంగాణ మీద అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. కాంగ్రెస్ 49 ఏళ్లలో చేసినంత నష్టం తెలుగుదేశం తొమ్మిదేళ్లలో చేసింది తెలంగాణకు. ఆంధ్ర పార్టీ నాయకత్వానికి ఈ ప్రాంతం మీద ప్రేమలేకపోవడం చాలా సహజం. కానీ ఆ ఆనకొండలకు తోడు తెలంగాణలో ఉన్న వానపాములు తోడవడమే చికాగు కల్గించే విషయం.
ఈసారి అసెంబ్లీ జరిగిన తీరుతో ఈ పార్టీలకు ఒక నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఈ విపక్షాలు అసెంబ్లీలో ఉండి గొడవ చేసినప్పటికంటే వారు బహిష్కరణకు గురయ్యాక హాయిగా ప్రశాంతంగా సాగింది తెలంగాణ అసెంబ్లీ. మంత్రులందరూ వారి వారి ప్రణాళికలు వివరించారు.

ఎవరైనా కొత్త రాష్ట్రంలో ఆలోచించవలసింది. తమ స్వార్థ ప్రయోజనాలు కాదు. ప్రజల మంచి ఆలోచించాలి. కేంద్రంలో తమ పార్టీయే ఉంది కనుక బీజేపీ నాయకులు, తమ మిత్ర పక్షం ఉంది గనుక టీడీపీ నాయకులు కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కావాల్సిన సహాయాన్ని కేంద్రం అందించేలా చూడాలి. అలా కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్యాయంగా ఇబ్బందిపెడితే ఈ మిత్ర/మిత్రపక్షాలు (బీజేపీ/టీడీపీ) శత్రు/మిత్రపక్షాలు (బీజేపీ/ కాంగ్రెస్, కాంగ్రెస్/టీడీపీ), శతృ/మిత్ర పక్షాలు (బీజేపీ/కమ్యూనిస్టులు) అన్ని కూడా వచ్చే ఎన్నిక ల్లో మాయమైపోయే ప్రమాదం ఉన్నది. చేతులు పూర్తిగా కాల్చుకుంటే ఎవ్వరూ వారికి భరోసా, ఆసరా కాదు కదా, కనీసం ఆకులు కూడా ఇవ్వరు.

1052

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles