భాషా, సంస్కృతులను బతికించుకుందాం


Sun,August 30, 2015 12:23 AM

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ముఖ్యంగా పాఠశాల స్థాయిలో భాష గురించిన పాలసీని రూపొందించాలి. పాఠశాల స్థాయిలో కేంద్రం నిర్దేశించిన విధానాన్ని అవలంబిస్తూనే..తెలంగాణలో ఉన్న వివిధ భాషల వారికి సంతృప్తి
కలిగేట్టు భాషాబోధన విధానాన్ని రూపొందించుకోవచ్చు.

ఫజల్ అలీ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ ఒక ముఖ్యమైన మాట అన్నారు. నిజానికి 1956లో విడాకులు అన్నమాట సంప్రదాయ కుటుంబీకులకు అత్యంత భయంకరమైనది. కానీ మనసులు కలవని వారికి అదే పరిష్కారంగా నెహ్రూ సూచించడం గమనార్హం. అయితే ఆ ఆంధ్రా కుట్రల నుంచి బైట పడడానికి అరవై ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా మొగుడికి విడాకులిచ్చి ఆడబిడ్డలను సాకినట్టు ఉమ్మడి ఖాతాల్లోని తెలంగాణ నిధులను తరలించుకుపోవడం, ఈ రాష్ర్టానికి అన్ని విషయాల్లో వీలైనంత అపకారం చేయడం లాంటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉనికి సుమారు అరవై ఏళ్లు. అయినా తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య భావసమైక్యత కుదరకపోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఈ రెండు ప్రాంతాల సాంస్కృతిక చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా నిజాంల చేత పాలించబడిన ఒక ప్రత్యేక దేశం. దాదాపు వెయ్యేళ్లు శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు,ఆసఫ్‌జాహీలు, కుతుబ్‌షాహీలు వంటి రాజవంశాలు పాలించిన ప్రాంతం. ప్రపంచంలోనే ఐదవ సంపన్న దేశంగా అలరారిన ప్రాంతమిది. అలాంటి ఈ ప్రాంత సంస్కృతికి ఇప్పుడు భారతదేశంలోని ఇతర రాష్ర్టాల సంస్కృతికి ఎక్కడా పోలిక లేదు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి ఒక దేశానిదో, ప్రాంతానిదో, భాషదో కాదు. అది ఒక సంపన్న సంస్కృతి.

హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం రాజుల పరిపాలనలో ఎన్నో భాషలు ఆదరించబడినాయి. మూడు వందల ఏళ్ల ముందు నుంచే ఇరాన్, ఇరాక్, ఆఫ్రికన్ దేశాల న, ఇతర విదేశాల నుంచి, ఉత్తర భారతదేశంలోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి దక్షిణాది రాష్ర్టాలైన కేరళ, తమిళనాడు నుంచి ఎంతో మంది ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. నిజాం రాష్ట్రంలో అధికార భాష ఉర్దూ తో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ మాతృభాషలైన ప్రజలు స్థానికులు. అరబిక్, పర్షియన్ భాషల్లో నిష్ణాతులైన పండితులు, కవులు, తాత్వికులు తరచు వచ్చి నిజాం ప్రభుత్వంలో ఉండేవారు. వివిధ దేశాల, ప్రాంతాల ప్రజలు తమతో తెచ్చిన భాషలను, సంస్కృతులను మేళవించుకుని ఈ దేశ ప్రజలు ఒక సమైక్య సంస్కృతిని అలవర్చుకున్నారు.

అన్ని భాషల సంగమం ఉన్నచోట సహజంగానే భావ ఔన్నత్యం, విశాలత్వం, సహజీవన సాంగత్యం కలిగిన ఒక విలక్షణమైన సంస్కృతి పెరుగుతుంది. మనోవైజ్ఞానిక పరిశోధనలలోనూ, భాషా శాస్త్ర పరిశోధనలలోనూ ఈ విషయం పరిశోధకులు స్పష్టం చేశారు. ఒకే మతాన్ని అనుసరించే , ఒకే భాషను వాడే సమాజాలలో పెరిగిన మనుషులకు వేరే మతం, వేరేభాషలను గౌరవించడం, తేడాలతో సహజీవనం చేయడం వంటివి అలవడవు. ఇది శాస్త్రీయంగా రుజువు కాబడిన సిద్ధాంతం.

అన్ని భాషలూ సమాన గౌరవాదరాలు పొందాయి. కనుకనే బహుభాషా కోవిదులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. కాళోజీ,సామల సదాశివ, మాజీ ప్రధాని పీవీ లాంటి వారు ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలామంది చదువుకున్న వారికి మూడు నాలుగు భాషలు తేలికగా వస్తాయి. అటువంటి ఈ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకులు అజ్ఞానంతో వెనుకబడిన ప్రాంతంగా భావించి తమ అహంకారాన్ని ప్రదర్శించారు. నిజాం కాలంలో ఉర్దూ మీడియంలో చదివిన ఇంజినీర్లు, డాక్టర్లు, ఆర్కిటెక్టులు ప్రపంచస్థాయి నిపుణులుగా ప్రశస్తి చెందారు.

హైదరాబాద్‌లో ఆనాటి కట్టడాలు ఆ ఇంజినీర్ల, ఆర్కిటెక్టుల ప్రతిభకు నిదర్శనం. అలాగే ఇక్కడి డాక్టర్ల శస్త్ర చికిత్సల కోసం ఇరాన్, ఇరాక్ ఇతర మధ్యప్రాచ్య దేశాల నుంచి రోగులు హైదరాబాద్‌కు వచ్చేవారు. భాష విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర వారికి హిందీ రాదు కాబట్టి పరీక్షలో 15 శాతం వస్తే చాలనే నిబంధన పెట్టారు. కానీ నిజాం రాష్ట్రంలో ఇంగ్లీషులో కూడా 50 శాతం వస్తేనే ఉత్తీర్ణులుగా నిర్ణయించి, పై క్లాసులకు పంపేవారు. ఈ రకంగా వేరు భాషలు, సంస్కృతుల మధ్య బతికిన తెలంగాణ సామాన్య ప్రజల సంస్కారం కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది.

సీమాంధ్ర సంస్కృతి, భాష గమనిస్తే- వారికి రెండే భాషలు. వారి మాతృభాష ఆంధ్రం, పరాయి భాష ఆంగ్లం మాత్రమే తెలుసు. ఆ భాషల మధ్య సంబంధం బానిస, దొరల మధ్య ఉండే సంబంధం. పాలితులు, పాలకుల మధ్య ఉన్న భావనతోనే ఆంగ్లం పట్ల ఆరాధనాభావం పెంపొందడం, ఆంధ్ర భాషలో గొప్ప అనుకుని ఆంగ్ల పదాలు విపరీతంగా వాడటం చూస్తాం. అందుకే ప్రజా కవి కాళోజీ సడక్ మీద చాయ్, రోడ్డు మీద టీ అయింది అన్నారు. తెలంగాణ వారు దఫ్తర్‌కెళ్లి దరఖాస్తు దాఖలు చేసిన అంటే వెక్కిరింతగా నవ్వే ఆంధ్రులకు ఆఫీసుకు వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేశా అన్న వాక్యం గొప్పగా కనిపిస్తుంది. నిజానికి పరాయి భాషలను, పరాయి మనుషులను సమానంగా గౌరవించే సంస్కారం ఆంధ్ర వారికి అలవడే అవకాశం లేకనే తమిళులతో విడిపోయారు.

భాషల పట్ల వారికి ఎంత అవగాహనారాహిత్యం ఉంటుందంటే, వారిలో చాలామంది ఉర్దూని ముస్లిం భాషగా భావిస్తారు. సామాన్యులే కాదు, కరుణశ్రీ లాంటి పండితుడు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే ఇక్కడి తెలుగు ఉర్దూకలిసిపోయి తౌరక్యాంధ్రం అవుతుందని ఆక్రోశించాడు. అయితే డాక్టర్ జయశంకర్ ఒక చక్కటి మాట చెప్పేవారు ఒక మతానికి ఒక భాష ఉండవచ్చు కానీ, ఏ భాషకీ మతమనేది ఉండదు అని. సంకుచిత భావజాలాలున్న వారే భాషకీ, మతానికీ ముడిపెట్టగలుగుతారు. కానీ తెలంగాణలో పలు భాషలు మాతృభాషలుగా కలిగినవారు కలిసిమెలసి సహనంతో సహజీవనం చేయడటమే దేశంలో ఎక్కడా లేని సంస్కృతి ఇక్కడ ఉంటానికి కారణం. అందుకే ఈ ప్రాంతాన్ని మహాత్మాగాంధీ గంగా జమున తహజీబ్ అన్నారు.

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతిని మళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ముఖ్యంగా పాఠశాల స్థాయిలో భాష గురించిన పాలసీని రూపొందించాలి. పాఠశాల స్థాయిలో కేంద్రం నిర్దేశించిన విధానాన్ని అవలంబిస్తూనే.. తెలంగాణలో ఉన్న వివిధ భాషల వారికి సంతృప్తి కలిగేట్టు భాషాబోధన విధానాన్ని రూపొందించుకోవచ్చు. ఇందుకోసం కింది విషయాలపై ఆలోచించాలి.

1) కేంద్ర ప్రభుత్వ విద్యావిధానం ప్రకారం పాఠశాల విద్యార్థులు మూడు భాషలు చదవాలి. అన్ని రాష్ర్టాల్లో సాధారణంగా మాతృభాష తప్పనిసరిగా ఉంటుంది. అయితే తమిళనాడులో ఏ మాతృభాష వారైనా తమిళం తప్పనిసరిగా చదవాలి. నిజానికి ప్రాథమిక దశలో ఏయే భాషలు సరిగా చదువుతారో ఆ భాషల్లో నైపుణ్యాలు పిల్లలకు అలవడతాయి. అంతేకాక చాలామంది విద్యారంగ నిపుణులు చెప్పినట్టు మాతృభాష తప్పనిసరిగా చదవడటం అన్నది భావాల ఏర్పాటుకు, మానసిక పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

తెలంగాణలో స్థానిక భాష కాకుండా ఎవరి మాతృభాషను వారు మొదటిభాషగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా భాషలు బోధించే ఉపాధ్యాయులను నియమించి శిక్షణ ఇవ్వాలి. ఈ విధానం వల్ల ఇక్కడ ఉన్నవారందరూ తమ మాతృభాషలో కనీసం ఐదవ తరగతి దాకా చదివే వీలుంటుంది.

2) ఐదవ తరగతి పూర్తయ్యే సరికి విద్యార్థులకు తాము అభ్యసించిన మూడు భాషల్లో మౌలికమైన నైపుణ్యాలు-భాష విని అర్థం చేసుకోవడం, మాట్లాడటం, చదవటం, రాయటం, పదకోశం, వ్యాకరణం-పట్టుబడి ఉంటాయి. భాషను భాషగా బోధించే శిక్షణను ఉపాధ్యాయులకు ఇవ్వడం తప్పనిసరి.
3)ఐదవ తరగతి దాకా మూడు భాషలకు తోడు ఒక్కటే ఇంగ్లీషు ద్వారా బోధించాలి.
4)ప్రాథమిక దశలో ఇప్పుడు దొరకుతున్న ఆడియో, వీడియో సీడీలు, డీవీడీలు ఉపయోగించి అన్ని భాషలూ సరైన ఉచ్చారణతో మాట్లాడేటట్టు పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.
5) ఇప్పుడున్న శిక్షణా కోర్సులు-ఎస్జీటీ, బీ.ఎడ్ వంటి వాటి సిలబస్ మొత్తంగా ప్రక్షాళన చేయాలి.
విద్యారంగంలో పాఠశాల విద్య, ప్రాథమిక దశ చాలా ముఖ్యమైనవి. ఈ దశ విద్యార్థులను భాషల్లో నిష్ణాతులను చేస్తే వారికి పై చదువులు చదవడం సులభమౌతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న సమైక్య సంస్కృతిలో అన్ని భాషలు గౌరవించబడాలి. తెలంగాణ సంస్కృతికి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చేందుకు మనిషికి ఉన్న అత్యున్నత నైపుణ్యం అయిన భాషలను కాపాడేటందుకు ఈ విధానం ఉపయోగిస్తుంది.

1303

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles