యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం


Thu,April 23, 2015 01:35 AM

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్వవిద్యాలయాలే.పాఠశాలస్థాయి విద్య లోకజ్ఞానార్జనకు, డిగ్రీ విద్య ఉపాధి సంపాదించడానికి పనికివస్తుంది. ఈ స్థాయివరకు విద్య వ్యక్తిగతంగా ఉపయోగ పడుతుంది. విశ్వవిద్యాలయ స్థాయి విద్య మాత్రం తెలివి, ఉత్సాహం, పట్టుదల ఉన్న విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతుంది. విద్యలో స్థాయి పెరిగి న కొద్దీ ఆలోచనా పరిధి, అభ్యుదయ భావాలు, క్రియాశీలత్వం పెంపొందే అవకాశం పుష్కలంగా ఉంటుంది.

సాంఘిక జీవన ప్రమాణాలు గుణాత్మకంగా పెరగాలంటే విశ్వవిద్యాలయ విద్యార్థుల మేధో సంపత్తి పెంచుతూ వారికి సామాజిక స్పృహ, సమా జం పట్ల వారి బాధ్యతను బోధించేవే నిజమైన విశ్వవిద్యాలయాలు. తమని విద్యావంతులుగా తీర్చి దిద్ది న సంఘం పట్ల బాధ్యత మరచిన వారిని వివేకానం దుడు ద్రోహులు అన్నాడు. నిజానికి భారతదేశం లో చాలాభాగం మేధోసంపత్తి విదేశాలకు తరలిపోవటానికి కారణం- ఇక్కడ విలువైన కోర్సులు చేసిన వారికి దేశంలో కనీసం అయిదో, పదో సంవత్సరాలు పనిచేయాలన్న నిబంధన లేకపోవడమే! అందుకే ఐఐటీల్లో, ఐఐఎమ్‌లల్లో చదువుకున్న వాళ్లు వారి మేధని విదేశాలకి అందిస్తున్నారు. డాక్టర్లు పల్లెటూళ్ల ల్లో పనిచేయటానికి విముఖత చూపిస్తున్నారు. ఏ దేశవాసులు ఆ దేశాన్ని సేవిస్తే, ప్రపంచంలో చాలా వెనుకపడి ఉన్న దేశాలు బాగుపడతాయి.

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు సమైక్యపాలనలో జరిగిన విధ్వం సం నుంచి బయటపడి తెలంగాణ యువతకు గుణాత్మకమైన విద్యనందించి వారిలోని మేధని పెంపొందించాలి. తద్వారా నిరుద్యోగ సమస్యని తీర్చడమే కాకుండా, వారు తెలంగాణ సమాజానికి కరదీపికలుగా ఉండేటట్టు చేయాలి. తెలంగాణ తన విశ్వవిద్యాలయాలు చూసి గర్వపడేటట్టు తయారవ్వాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే స్థానిక భాషా మాధ్యమంతో ప్రవేశపెట్టిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం. 1956 తర్వాత ఎక్కువ భాగం ఉద్యోగాలు, అధికారం ఆంధ్రప్రాంతం వారు దక్కించుకున్నారు. ఉర్దూ మీడియాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు వలసపాలకులు. చరిత్రలోకి తొంగిచూస్తే ఆశ్చర్యకరమైన సత్యాలు బయటపడతాయి. నిజాం కాలంలో ఉర్దూ మీడియంలో చదువుకున్న వైద్యు లు, సాంకేతిక నిపుణులు ప్రపంచఖ్యాతి పొందారు.

ఆ కాలంలో మధ్య, తూర్పుదేశాల వారు నిజాం ప్రభుత్వంలో వెలసిన వైద్యశాలలకు వచ్చి ఇక్కడి వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్యం పొందే వారు, శస్త్రచికిత్సలు చేయించుకునేవారు. ఇక హైదరాబాదులోని అందరికే కనువిందు చేసే చారిత్రక కట్టడాలన్నీ ఈ ప్రాంత ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌ల ప్రతిభకు నిదర్శనాలే. గతమంతా వలసపాలకులచే అణచ బడి న చరిత్ర. ఇక ఇప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే.. అవి అన్నీ వివక్ష వల్ల బక్కపడి ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రాంటు విషయంలో ఉదారంగానూ, పాలన విషయంలో కఠినంగానూ వ్యవహరించాలి.

ఇక ఈ విద్యాలయాలన్నీ బాగుపడాలంటే ఏం చేయాలో పరిశీలిద్దాం.
విశ్వవిద్యాలయానికి అధిపతులైన ఉపకులపతి, రిజిస్ట్రారు ఆ సంస్థను ప్రగతి పథంలో నడిపించడంలో ముఖ్యపాత్ర వహిస్తారు. వీసీ తన రంగంలో నిష్ణాతుడై విద్యా విషయాలలో లోతైన అవగాహన కలవాడై ఉండాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర దేశాలలోని విద్యావ్యవస్థల గురించి తెలిసి, దానికి సరిపడేటట్టు తన విశ్వవిద్యాలయంలోని అకడెమిక్స్‌కి దిశానిర్దేశం చేయగలిగినవాడై ఉండాలి. ఇక రిజిస్ట్రారు పాలనారంగంలో అనుభవజ్ఞుడై ఉండాలి. వారిద్దరూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, అవినీతి రహితంగా పాలన చేయాలి. తెలంగాణ యువతను ప్రపంచ పౌరులుగా తయారుచేయగలిగిన కోర్సుల రూపకల్పనకు వీరిద్దరూ దిశానిర్దేశం చేయాలి.

యథా రాజా, తథాప్రజా అన్నట్టుగా వీరిని బట్టే మిగతా ఉద్యోగుల ప్రవర్తన ఉంటుంది. ఇదంతా జరగాలంటే తెలంగాణ విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నియమించే పద్ధతి కులమతాలకు, అతీతంగా ప్రతిభ, నిబద్ధతపై ఆధారపడి ఉండాలి. విశ్వవిద్యాలయాల్లో ఇంకొక ముఖ్యమైన అంగం పాలనా సంఘం. ఇందులోని సభ్యులు విద్యారంగంలో నిష్ణాతులై సరైన నిర్ణయాలతో పరిపాలన సక్రమంగా జరిగేటట్టు చూడాలి. అలా జరగాలంటే వారి ఎంపిక కూడా నిష్పక్షపాతంగా జరగాలి.

విశ్వవిద్యాలయం అనేది సంఘానికి దిశానిర్దేశం చేసే నిపుణులను తయారుచేసే సంస్థ. అందుకే ఇది అందించే ఉన్నతస్థాయి కోర్సులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి. సిలబస్‌ను మూడేళ్ళ కొకసారి సవరించడమే కాక, అవసరాన్ని బట్టి కొత్త కోర్సుల రూపకల్పన చేయాలి. ఇవి విదేశీ విద్యార్థులను ఆకర్షించే విధంగా ఉండాలి. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి యువతకు కావాలసిన ఇంగ్లీషు భాషాబోధన ఉండాలి. ఈ విషయంలో ఏ భారతీ య విశ్వవిద్యాలయమూ ఒక్క కోర్సు కూడా రూపకల్పన చేయలేదు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలు శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ మొదలైన వాటికి హైదరాబాద్‌లో ఉన్న జేఎన్‌టీయూ ఇంగ్లీషు డిపార్ట్‌మెంట్‌కు ఎంఏ (ఇఎల్‌టీ పెట్టాలన్న) విన్నపం పదేపదే పంపడం జరిగింది.

దురదృష్టం ఏమంటే ఏ విశ్వవిద్యాలయంలోనూ ఏ ఇంగ్లీషు డిపార్ట్‌మెంటూ ఇప్పుడూ మన యువతకు ఇంగ్లీషు భాషా నిపుణతలు బోధించగలిగిన ఉపాధ్యాయులను తయారుచేయాలన్న ఆలోచన చేయటం లేదన్నమాట! సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ- ఏభాషా సాహిత్యమైనా ఉత్సుకత ఉన్న వాళ్ళు చదువుకోవటానికి ఎం.ఏ కోర్సును విశ్వవిద్యాలయాలు అందించవచ్చు. కానీ అందరికీ ఉపయుక్తమైన ఇంగ్లీషు భాషానిపుణతలను అందించటానికి సరిపోయే కోర్సు గురించి ఏ ఇంగ్లీషు ప్రొఫెసరూ ఆలోచించటం లేదు.
ఈ విధంగా కాకుండా తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఇప్పుడున్న ప్రతీ కోర్సు ఉపయోగం గురించి విశ్లేషించుకోవాలి.

అవసరమైన కొత్త కోర్సుల రూపకల్పన చేయాలి. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఇంగ్లీషు సాహిత్యం కోర్సు ఉంచైనా సరే, తీసేసైనా సరే ఎం.ఏ ఇంగ్లీషు (ఇఎల్‌టీ) ప్రవేశపెట్టాలి. అలాగే ఏ సమాజానికైనా ప్రగతిబాటలో పయనించాలంటే, విశ్వవిద్యాలయాలు తమ పరిశోధనల ద్వారా ఆ బాటను చూపించాలి.
ఏ విద్యాసంస్థలో అయినా అతి ముఖ్య భూమిక వహించేది ఉపాధ్యాయులు (టీచింగ్ ఫ్యాకల్టీ). ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలు భర్తీచేసి కోర్సులన్నీ విజయవంతంగా నడిచేట్టు సహాయపడాలి.

ఇప్పటిదాకా ఆంధ్రా వారు చాలా ఉద్యోగాలు దక్కించుకోవటంతో ఉన్నత చదువులు చదివి, డాక్టరేటు డిగ్రీలున్నా తెలంగాణ యువతకు విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ, ఇంటర్, కాలేజీల్లో ఉద్యోగాలు దొరకలేదు. ఇప్పుడు జూనియర్ కాలేజీ లు, డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు.. ఈ సంస్థలన్నింటిలో ఉద్యోగఖాళీలు తెలంగాణ యువతకే దక్కాలి. ఇప్పటిదాకా జరిగిన వివక్ష వలన కలిగిన నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పూడ్చాలి.

సమైక్య రాష్ట్రంలో వలసపాలకుల వివక్ష, అవినీతి వలన తెలంగాణ విశ్వవిద్యాలయాలన్నీ చాలా నష్టపోయాయి. ఈ నష్టం అపారం. ఇప్పుడు స్థానిక పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కనుక విశ్వవిద్యాలయా లు ఎవరికోసం ఏర్పడ్డాయో వారికి కావలసిన వసతులు, సౌకర్యాలు ఏర్పరిచి తెలంగాణ విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దాలి.
విద్యాసంస్థల్లో లైబ్రరీ పుస్తకాలే కాకుండా, ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ లైబ్రరీ కూడా ఉండాలి. అన్నిరకాల స్పోర్ట్స్, గేమ్స్ ఆడటానికి సౌకర్యాలు కల్పించాలి. కోచ్‌లను నియమించి, ఉత్సాహం, నైపుణ్యం ఉన్న విద్యార్థులను వారికి ఇష్టమైన రంగా ల్లో శిక్షణనిచ్చి తీర్చిదిద్దాలి. రాష్ట్రీయ, అంతరాష్ట్రీయ క్రీడాపోటీలకు తయారుచేయాలి. హాస్టల్‌లో ఉండాలనుకునే విద్యార్థులకు కుల, మత వివక్ష లేకుండా వసతి కల్పించి సౌకర్యాలను అందించాలి.

చదువులో వెనుకబడిన విద్యార్థులకు, ముఖ్యంగా బలహీనవర్గాలకు చెందిన వారికి ఒక అకడమిక్ సెంటర్ ఉండాలి. ఇంగ్లీషు భాషానిపుణతలో, సాఫ్ట్‌స్కిల్స్‌తో, ఇంటర్వూ స్కిల్స్‌తో అకడమిక్ రైటింగ్‌లో కోర్సులు అందించాలి. రిజర్వేషన్ ప్రకారం విద్యార్థులకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి సీటివ్వగానే విశ్వవిద్యాలయం బాధ్యత తీరదు. వారు మిగ తా విద్యార్థులతో పోటీపడేటట్టు తీర్చిదిద్దితేనే ఆ రిజర్వేషన్ ఇచ్చిన అవకాశానికి న్యాయం చేకూర్చినట్టు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ అకడమిక్ సెంటర్ ఉండాలి. ఇది తెలంగాణ యువతకు ప్రభుత్వం అందించే గ్రూప్స్ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇవ్వాలి.
సమాజానికి దిశానిర్దేశం చేసే మేధావులను తయా రు చేసేవిధంగా ఈ విద్యా సంస్థలను ప్రభుత్వం తీర్చిదిద్దాలి. ఉదారంగా గ్రాంట్లు ఇచ్చి, క్వాలిటీ విద్యనందించే విధంగా మలచాలి. సమర్థవంతమైన పాలన, సరైన కోర్సులు, మేధావులైన ఉపాధ్యాయులు, ఉత్సాహవంతులైన విద్యార్థులు కలిస్తే ఈ ప్రాంతం మానవ వనరుల విషయంలో దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

960

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.

Featured Articles