విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె


Thu,January 1, 2015 01:17 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల్ల ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించటం ఎంత ముఖ్యమో దీర్ఘకాలిక ప్రణాళికలు ఏర్పరుచుకుని భవిష్యత్ తరాలకి దిశానిర్దేశం చేయడం కూడా అంతేముఖ్యం. విద్యారంగంలో ఇప్పుడున్న సమస్య లు పరిష్కరించేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం గురించి ఆలోచించాలి.

దేశంలో పాఠశాలల్లో భాషా మాధ్యమం ఏది ఉండాలన్న సమస్యకి ఇప్పటిదాకా సరైన పరిష్కారం కనుగొనలేదు. దీనికి రెండు కారణాలున్నాయి. ఇంత క్లిష్టమైన సమస్య గురించి మన భాష, పరాయి భాష అని భావోద్రేకాలతో ఆలోచించి ఆవేశపడడం ఒక్కటైతే ఇతర దేశాలకీ, భారతదేశానికీ ఉన్న వ్యత్యాసం గుర్తించకపోవడం రెండోది. వేరే ఏ దేశంలో వివిధ భాష లు, వాటి మాండలికాలు ఉన్నా, అధిక శాతం ప్రజలు మాట్లాడే భాష ఒకటుంటుంది. దాన్నే రాజభాషగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు తూర్పు ఆఫ్రి కా ఖండంలో ఉన్న ఎరిత్రియా 23 లక్షలు జనాభా కలిగిన చిన్నదేశం లో తొమ్మిది మాతృభాషలు కలవారున్నారు.

అయితే 84శాతం ప్రజలు మాట్లాడే టిగ్రిన్యా భాషని అధికారిక భాషగా నిర్ణయించింది అక్కడి ప్రభు త్వం. భారతదేశంలోని వివిధ రాష్ర్టాల్లో వివిధ భాషలు, మాండలికాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి లేదు. ప్రతి రాష్ర్టానికి తన స్థానికభాష పరిపూర్ణంగా సాహిత్యంతో సహ వృది ్ధపొందింది. అందుకే కేంద్రం త్రిభా షా సూత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో మొదటిది మాతృ(స్థానిక) భాష, రెండవది దేశ భాష, మూడవది అంతర్జాతీయ భాషగా ఉన్నాయి. కానీ ఈ మూడు భాషల్లో ఏది మాధ్యమంగా ఉండాలన్నది, అసలు ఈ మూడు భాషలు ఏ ఏ స్థాయిలో బోధించాలన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.

ఈ మూడు భాషలతో ఇంకా మూడు, నాలుగు సబ్జెక్టులు కలిపి 1వ తరగతి నుంచి బోధించటంతో ఆ విధానంలో చదివిన ఇప్పటి ఉద్యోగస్తులు, ఇదే విధానంతో చదువుతున్న విద్యార్థులు భాషా దారిద్య్రంతో బాధ పడుతున్నారు. దీనికి మనో వైజ్ఞానిక, భాషాధ్యయన రంగాల్లో పరిశోధకులు, నిపుణులు నిర్ధారించిన విషయాలను అనుసరించి నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ సమస్యని పరిష్కరించవచ్చు. వారు చెప్పే రెండు ముఖ్యమైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

పదేళ్లలోపు పిల్లలకు ఎన్ని భాషలైనా నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే భాష నేర్చుకోవటానికి కావాల్సింది ఆ భాష మాట్లాడేవారితో సోపతి మాత్రమే. ఇది అయిదు విధాలుగా పిల్లలకు ఆ భాషతో సంబంధం కలిగిస్తుంది. వినడం, చూడటం, అనుకరించడం, పదేపదే ఉచ్చరించడం, స్థిరీకరించుకోవడం. పిల్లల తెలివితేటలు, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక స్థాయితో సంబంధం లేకుండా నేర్చుకోగలిగినది భాష ఒక్కటే. ఏ భాషతో ఎక్కువ సమయం గడుపుతారో ఆ భాషని నాలుగైదేళ్లలో సహజంగా నేర్చుకోగలుగుతారు. పద్నాలుగేళ్ల వరకే పిల్లలకు భాషలు నేర్చుకోగలిగే సామ ర్థ్యం ఉంటుందనీ, తర్వాత తగ్గుతూ వస్తుందని, అందుకే 14 తరువాత ఏదైన భాష నేర్చుకునే వారిని అడల్ట్ లర్నర్స్ అంటారని పరిశోధకులు చెబుతున్నారు.

చింతనాత్మకమైన, భావప్రదమైన అంశాలు పిల్లలకు పదకొండు సంవత్సరాల తర్వాతే అర్థమవుతాయని, దానికి భాషాజ్ఞానం చాలా అవసరమని మనోవైజ్ఞానిక రంగ నిపుణులు అంటున్నారు. పరీక్షలకు బట్టీ పట్టే విధానం బహుశా ఒక్క మనదేశంలోనే ఉంది. ఈ పద్ధతి మారాలంటే ప్రాథమిక పాఠశాల దశలో విద్యార్థులకు మూడు భాషల్లో నిపుణత ఇవ్వాలి. ఇతర భావనా ప్రధానమైన సబ్జెక్టులు తొలగించి మూడు భాషలు, ఆంగ్ల మాధ్యమంలో లెక్కలు మాత్రం బోధించాలి. ఎందుకంటే ఈ భాషల్లో స్వయంగా మాట్లాడటం, చదవటం, రాయ టం రానప్పుడే విద్యార్థులు పై తరగతుల్లో కూడా బట్టీ విధానానికి అలవాటు పడలేరు.

ఈ బట్టీ జ్ఞాపకశక్తి పెంపొందించవచ్చు. కానీ విద్యార్థుల్లోని సహజ ప్రతిభా కౌశలాలను, సృజనాత్మకతను, ఎదుగుదలని అడ్డుకుంటుంది. ఈ పద్ధతి అనుసరించిన విద్యార్థులు మానవీయంగా ఎదగరు. మనదేశంలో వేదాధ్యయన పద్ధతిలో మొదట 6 నుంచి 12 ఏళ్ల దాకా వేద శాఖలను బట్టీ వేయించి, ఆ తరువాత వాటిలోని భావాలను, విషయాలను బోధించేవారు. అందుకే ఆ విద్యార్థులకి ఉచ్చారణ, జ్ఞాపకశక్తి అలవడ్డాక అర్థం విప్పిచెప్పేటప్పటికీ, నేర్చుకున్న అంశాల్లో నిష్ణాతులయ్యేవారు. పై విషయాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఈ కింది మార్పులు చేయాలి.

పాఠశాల విద్య నుంచి 5వ తరగతి దాకా మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు మాధ్యమంలో లెక్కలు మాత్రమే బోధించాలి. తెలంగాణలో దాదాపు అన్ని భాషల వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఒక నిర్ణయింపబడిన సంఖ్య మించితే ఆ విద్యార్థులకు వారి మాతృభాష చదువుకునే వెసులుబాటు కల్పించాలి. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తమిళం, కన్నడం, వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఇక స్థానిక భాషలైన తెలుగు, ఉర్దూలకు తోడు గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించాలి. కోయ, గోండు, లంబాడీ, చెంచు విద్యార్థులు తమ భాష చదివి ఆనందించాలి.

ఒకవేళ ఈ గిరిజన భాషల్లో ఏ భాషకైనా లిపి లేకపోతే 5వ తరగతి దాకా మౌఖికంగా నేర్చుకుని మౌఖికంగా పరీక్షలిచ్చే వెసులుబాటు ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్ని భాషలు సజీవంగా ఉంటాయి. ఆయా విద్యార్థులకు హైస్కూలు సీబీఎస్సీ విధానంలో అయితే ఏ సమస్యా ఉండదు కూడా! ఎందుకంటే సీబీఎస్సీలో 9, 10 తరగతుల్లో 2 భాషలు మాత్రమే చదవాలి. జాతీయ, అంతర్జాతీయ భాషలు ( గుర్తించిన భాషల్లో ఏదైనా జాతీయ భాష బదులు చదవవచ్చు).

ఇక ప్రాథమిక దశలో ఈ వివిధ భాషలు బోధించే ఉపాధ్యాయులు ఆ భాషను వారి మాతృభాషగా మాట్లాడే వారే కావాలి. అప్పుడే విద్యార్థులకు మూడు భాషలూ వాటి సహజమైన ఉచ్చారణతో మాట్లాడటం అలవడుతుంది. ఈ విధానం వల్ల అటు మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ ఆష అయిన ఇంగ్లీషు కూడా బాగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఈ సందర్భంలో దృష్టిపెట్టవలసిన అంశం ఇంగ్లీషు భాషాబోధన. ప్రపంచీకరణ సందర్భంలో అత్యంత ముఖ్యమైన ప్రపంచ భాషగా ఎదిగి కూర్చున్న ఇంగ్లీషు విషయంలో దేశంలోని విద్యావేత్తలు అవసరమైన మార్పులను ఇంకా గుర్తించలేదనే ఒప్పుకోవాలి.

2000 సంవత్సరం నుంచే తమ తమ దేశాల్లో ఇంగ్లీషు బోధన సీరియస్‌గా తీసుకున్న చైనా, జపాన్, కొరియా వంటి దేశాలు ఈ విషయంలో మనకంటే ముందున్నాయి. ఎందుకంటే ఇంగ్లీషు భాషా బోధన మీద నిపుణులు పరిశోధనల ప్రకారం ఆదేశాలు నిపుణతల మీద దృష్టి పెడుతున్నాయి. మన దేశంలో బి.ఎడ్. ఇంగ్లీషు మెథడాలజీతో చేసిన వారూ ఇంగ్లీషులో మాట్లాడలేకపోవడం చూస్తాం. అసలు ఏ ఉపాధ్యాయ శిక్షణ అయినా ముందు వారు తరగతిలో వాడే భాష మీద పట్టు పెంపొందించడానికి అనువుగా ఉండాలి. అందుకే ఇప్పుడు రెండేళ్ల కోర్సు చేసిన బి.ఎడ్‌లో ఒక ఏడాది ఉపాధ్యాయుల నిపుణతలు, వృత్తిపట్ల నిబద్ధత పెంచడానికి, రెండో ఏడాది వారు బోధించే అంశాల బోధనా పద్ధతి మీద శిక్షణ ఇస్తే బాగుంటుంది.

తమ భాష బాగులేని ఉపాధ్యాయులు విద్యార్థులకు మోడల్స్ కాలేరు. అందుకే ఇంగ్లీషు 5వ తరగతి దాకా బోధించే ఉపాధ్యాయుల డిగ్రీలు చూడకుండా, వారి భాషా నిపుణత బట్టి నియమించాలి. ఇంటర్ దాకా ఇంగ్లీషు, మీడియంలో మంచిస్థాయి కలిగిన పాఠశాలలో చదివి ధారాళంగా, తప్పులు లేకుండా, మంచి ఉచ్చారణతో మాట్లాడగలిగేవారినే 5వ తరగతి దాకా ఉపాధ్యాయులుగా నియమించాలి. భాషాబోధనలో ఇతర ఉపాధ్యాయుల మాదిరే ప్రతి ఏడాది నెల రోజుల పాటు శిక్షణ తప్పనిసరిగా కనీసం మూడేళ్లు ఇవ్వాలి.

భాష సరిగా నేర్పకుండా ఆ భాషలో పరీక్షలు రాయమనడం నీళ్లు లేని సరస్సులో ఈత కొట్టమనడం లాంటిదే. భాషలకు తోడు లలితకళలు కూడా రోజువారి విధానంలో ప్రతి విద్యార్థికి నేర్పించాలి. ఐదవ తరగతి దాకా వీటన్నింటిని పరిచయం చేస్తే ప్రతి విద్యార్థి ఎందులో ఉత్సకత ఉందో తెలుసుకొని శిక్షణ ఇవ్వవచ్చు. ఇటువంటి మౌలిక అంశాల మీద శ్రద్ధపెట్టి, విధానాన్ని మార్చుకుంటే విద్యావిధానం పటిష్టమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న అంశాలైన వసతులు, ఆట స్థలం, వసతిగృహాలు, ఉపాధ్యాయుల నియామకాలు, వారి జీతభత్యాలు అన్ని విద్యారంగంలో ముఖ్యమైనవే.

కానీ విద్యార్థులను తయారుచేసేవి ఉపయుక్తమైన పాఠ్యాంశాలు, మానవీయ విలువల పెంపు. విద్యార్థుల మానసిక ఎదుగుదల, ఉపాధ్యా య విద్యార్థుల ఆత్మీయ బంధాలు మొదలైనవి విద్యారంగాన్ని తీర్చిదిద్దితే తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమవుతుంది.

980

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Wed,December 3, 2014 02:09 AM

విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి.