విధానాల మార్పుతోనే విద్యాభివృద్ధి


Wed,December 3, 2014 02:09 AM

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయాలి. ఈ రంగాన్ని మెరుగుపరచడానికి తగిన విధానాలను అమలు చేయాలి.
ఈ మార్పులు ప్రాథమిక స్థాయి నుంచి మొదలవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులకు వారి మాతృభాషలోనూ, ఇంగ్లీషులోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధానాలను రూపొందించాలి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ఉన్న సమస్యలు తీర్చడానికి కొత్త విధానాలను రూపొందిస్తున్నది. ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. అయి తే అన్ని రంగాల్లోకెల్లా విద్యా రంగం ప్రధానమైంది. ఎందుకంటే మిగతా రంగాలన్నీ ప్రకృతి ప్రసాదించేవి. ప్రకృ తి వనరులను వినియోగించుకుంటూ కాలుష్య రహితంగా ఉండడం ముఖ్యం. మారుతున్న కాలంతోపా టు ఎదగడానికి సరిపోయే నిపుణతలు పెంచుకోవడానికి మనుషులకు ఉన్న ఏకైక సాధనం విద్య. ఈ రంగంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. డిగ్రీ, ఇంట ర్, పదవ తరగతి పాసైన వారు తమ అర్హతలకు సరిపోయే ఉద్యోగాలు పొందాలంటే వాళ్లలో వాటికి సరిపడే నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఈ రకంగా విద్యారంగం పటిష్టంగా తయారవాలంటే ప్రతి కోర్సు విషయంలో, బోధనా విషయంలో, పరీక్షా విధానంలో అవసరమైన మార్పులు రెండేళ్లకొకసారి అయినా చేయాలి.

ఇందుకో కోసం చేయాల్సినవి ముఖ్యంగా 1) మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్న కోర్సు ల డిజైన్ మార్చాలి, కొత్త కోర్సులకు రూపకల్పన చేయాలి. 2) మారిన అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయా లి. 3) విద్యా రంగం లో, భాషా రంగాల్లో, మనో వైజ్ఞానిక రంగాల్లో జరిగిన, జరుగుతున్న పరిశోధనలకు అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పు లు తేవాలి. దీనికోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాలి. 4) దేశంలో అన్ని కోర్సుల్లోనూ మార్పు రావాలి. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహించే పరీక్షా విధానాలు విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తున్నాయి. కానీ వారి వ్యక్తిత్వం, నైపుణ్యాలు, ఆలోచనలు వ్యక్తీకరించేందుకు అవకాశాన్ని కల్పించడం లేదు. అడిగే ప్రశ్నలు, చదివిన పది పాఠాల్లో ఉన్న అంశాలు గుర్తుపెట్టుకుని రాసేట్టు ఉన్నాయి. కానీ వాటి మీద ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా సమాధానాలు రాసే పరీక్షా విధానాలు లేవు.

ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు ఇంగ్లీషు బోధించాలంటే బీ.ఎడ్(ఇంగ్లీషు మెథడాలజీ) కోర్సు చేసిన వారు అర్హులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీ.ఎడ్ కోర్సు నూతన పరిశోధనలను అనుసరించి లేదు. పైగా ఉపాధ్యాయుల స్వయం నిపుణత పెంచే అంశాలేవీ ఈ కోర్సులో లేవు. కాబట్టి బీ.ఎడ్ డిగ్రీ ఉన్నంత మాత్రానా ఇంగ్లీషు భాషను ఎలా బోధిస్తారు? కళాశాల అధ్యాపకులకు ఎంఏ ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఉన్నది ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ మాత్రమే. సాహిత్యం, భాష అన్నవి వేరు వేరు అంశాలనైప్పుడు లిటరేచర్ ఎంఏ చేసినవాళ్లు విద్యార్థులకు ఇంగ్లీషు భాషా నైపుణ్యాలను ఎలా అందిస్తారు? ఇంగ్లీషు భాషా బోధన అన్నది 1920 నుంచి జరిగిన పరిశోధనల వల్ల చాలా ప్రగతి సాధించిన రంగం. ఒక్క మనదేశం తప్ప మిగతా అన్ని దేశాల్లోనూ ఇంగ్లీషును భాషగానే బోధిస్తారు. ఒక సంవత్సరం చదివిన వారికి ఆ భాషలో ప్రాథమిక నైపుణ్యాలు అలవడ్తాయి.

మనదేశంలో పదేళ్లు తప్పనిసరిగా ఇంగ్లీషు చదివిన పట్టభద్రులు కూడా ఇంగ్లీషులో ధారళంగా మాట్లాడలేరని, రాయలేరన్నది అంగీకరించాల్సిన సత్యం. అసలు సాహిత్యం చదివి భాష బోధించడమంటే ఫిజిక్స్ ఎమ్మెస్సీ చేసి కెమిస్ట్రీ లెక్చరర్ అయినట్టు. ఇది విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగం? ఇంగ్లీషు భాష బోధనలో ఒక కోర్సు చేసిన వారు మాత్రమే బోధించగలుగుతారు.
ఇక సిలబస్ విషయానికి వస్తే ఎల్‌కేజీ నుంచి డిగ్రీ దాకా భాషా బోధన గోడకట్టినట్టు ఉండాలి. మొత్తం గా ఎల్‌కేజీ నుంచి పదవ తరగతి వరకు చదివిన ఏ విద్యార్థి అయినా ఇంగ్లీషులో ప్రాథమిక నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఇంగ్లీషును విని అర్థం చేసుకోవడం, మాట్లాడడం, చదవడం, రాయడంతో పా టు మంచి పదకోశాన్ని కూడా కలిగి ఉండాలి. కనీ సం 1000 ఇంగ్లీషు పదాలు ఉపయోగించగలగాలి. ఇది దృష్టిలో పెట్టుకుని ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఇంగ్లీషు సిలబస్ సమగ్రంగా, అనుక్రమంగా ముం దు ఏర్పరుచుకుని దాని కోసం పాఠా లు రూపొందించుకోవాలి. ఇప్పుడున్న పాఠాలు ఎం చుకుని ఏవో కొన్ని ఎక్సర్‌సైజులు పెడితే భాష నేర్చుకోవడం కుదరదు. ఇతర దేశాల్లో నేర్పే ఇంగ్లీషు కోర్సుల్లో ఏ స్థాయిలో ఇంత ఇంగ్లీషు నేర్చుకోవాల నీ/ నేర్పాలనీ ఆశిస్తారో అది కచ్చితంగా సాధిస్తారు. మన ఇంగ్లీషు పుస్తకాలు, వాటి బోధనాంశాలు ఈ రకమైన కాంప్రహెన్సివ్, గ్రేడెడ్ సిలబస్‌ను కలిగి ఉండవు.

భాషా బోధన విషయంలో మనదేశం చాలా వెనుకబడింది. అనేక భాషలకు నిలయమైన దేశంలో ఈ విషయంలో దూరదృష్టి లేకుండా నెహ్రూ అండ్ కో ప్రవేశపెట్టిన విధానాల వల్ల ఏ విద్యార్థికీ మాతృభాష రాదు, ఇంగ్లీషూ రాదు. ఈ పరిస్థితి మారాలంటే ప్రాథమిక విద్య దశలో భాషల బోధన, విధానం మారాలి. ప్రభుత్వాలకు ధైర్యం ఉంటే దీనికి పరిష్కారం చాలా తేలిక.

ఉదాహరణకు పాఠశాలల్లో బోధించడానికి శిక్షణ ఇచ్చే కోర్సు బీ.ఎడ్ సిలబస్ చూడండి.ఈ కోర్సులో రెండు మెథడాలజీలు ఉండాలని ఎవరు చెప్పారో కానీ క్రియాత్మకంగా పరిశీలిస్తే ఈ విధానం విధ్వంసకరమైనది. ఒక మెథడాలజీ నైపుణ్యాలు నేర్పవలసిన భాషకు సంబంధించింది. రెండోది భావనా, చింతాత్మకమైన శాస్ర్తానికి సంబంధించింది. ఈ రెండు రకాల మెథడాలజీలు పరస్పర విరుద్ధమైనవి.భాష బోధించేటప్పుడు టీచరు బోధిం చే సమయంలో తక్కువ. విద్యార్థులు బోధించిన అంశాలు అభ్యాసం చేసే సమయం ఎక్కువ ఉండా లి. అదే సాంఘిక, సామాజిక శాస్ర్తాలు బోధించేటప్పుడు వివిధ ఉదాహరణలతో అంశాలను విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేట్టు టీచర్ మాట్లాడే సమ యం ఎక్కువ ఉండాలి. కానీ ఈ రెండూ ఒక కోర్సులోనే ఉండేటప్పటికీ ఈ శిక్షణ తీసుకునేవారు డిగ్రీ కోసం ఆ సమయంలో చెప్పింది చేసినా, తాము ఉపాధ్యాయులయాక ఈ పరస్పర విరుద్ధమైన సబ్జెక్టుల భాష, శాస్త్రం-ఒక మెథడాలజీతో తరగతి సమయం అంతా తామే మాట్లాడుతూ బోధిస్తారు.

అందుకే విద్యార్థులు భాషా నైపుణ్యాలు ఏర్పరుచుకోలేక పరీక్షలకు జవాబులు సొంతంగా తయారు చేసుకోలేరు. బట్టీ విధానాన్ని అనుసరించడంతో డిగ్రీ వరకు ఇంగ్లీషు చదివినా ఆ భాషను ఉపయోగించడంలో విఫలమవుతున్నారు. కనుక ఈ బీ.ఎడ్ విధా నం మారాలి. పరీక్ష అనేది విద్యార్థి గ్రహించిన విషయాల కోసమే అనుకోవడం పొరపాటు. విద్యార్థులకు పెట్టిన పరీక్ష ఉపాధ్యాయులకు తమ బోధనా పద్ధతిని మెరుగుపర్చుకోవడానికి సాధనం. తమ పద్ధతిని పునఃపరీక్షించుకుని విద్యార్థులకు తగినట్టు బోధించడానికి అనువైన సాధనం పరీక్ష.

ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి. కానీ ఏడాది చివరలో ఒకసారి కాదు. మన ఇంగ్లీషు పరీక్షలను ఉదాహరణగా తీసుకుంటే మన పరీక్షా విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. అంతర్జాతీయంగా నిర్వహించే ఇంగ్లీషు పరీక్షలు జీఆర్‌ఈ, టోఫెల్, శాట్ వంటివి ఎన్నో ఏళ్లు పరిశోధనలు చేసి రూపొందించినవి. ఈ అంతర్జాతీయ పరీక్షలు పాసవ్వాలంటే మళ్లీ స్పెషల్ కోచింగ్ తీసుకోకతప్పదు. దీన్నిబట్టి మన పరీక్షా విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ చ్చు. ఇంగ్లీషు ప్రపంచ భాషగా మారాక దాని అవస రం గుర్తించి చైనా, జపాన్, మధ్య ప్రాచ్యదేశాలు, ఆసియాఖండంలోని ఇతర దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లోని వివిధ దేశాలు ఇంగ్లీషు భాషా నిపుణులను నియమించుకున్నాయి. వారి విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలను పటిష్టపరచడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి విద్యా రంగంలోనూ కావలసిన మార్పులు చేయా లి. ఈ రంగాన్ని మెరుగుపరచడానికి తగిన విధానాలను అమలు చేయాలి. ఈ మార్పులు ప్రాథమిక స్థాయి నుంచి మొదలవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులకు వారి మాతృభాషలోనూ, ఇంగ్లీషులోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధానాలను రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

1284

KANAKADURGA DANTU

Published: Thu,September 6, 2018 10:45 PM

ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి?

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఏం చేశారు? సరిగ్గా ఇదే చేశారు. పాత కథలు చెప్పలేదు, వివక్ష పార్టీల

Published: Tue,February 13, 2018 12:58 AM

వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట

Published: Sun,January 28, 2018 12:30 AM

భాష గౌరవ చిహ్నం

కూరలో ఉప్పెక్కువైందా? అని అడిగిన భార్యతో లేదు, నేను ఇంకో రెండు వంకాయలు ఎక్కువ తేవలసింది అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడడా? నా

Published: Fri,January 19, 2018 01:00 AM

విలువలతో కూడినదే విద్య

ఇంగ్లిష్ భాషలో ఒకే పదాన్ని కొద్ది ఉచ్చారణ తేడాతో నామవాచకం (నౌన్)గానూ, క్రియాపదం (వర్బ్) గానూ ప్రయోగించేవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉద

Published: Fri,January 12, 2018 12:22 AM

స్కూలు బ్యాగు బరువు నివారించవచ్చు

5వ తరగతి దాకా పిల్లలకు 3 భాషలూ మాట్లాడటం, చదువటం, రాయటం వచ్చేటట్టు బోధించాలి. లెక్కలు కూడా 5వ తరగతి దాకా బోధించాలి. కథలు చెప్పటం,

Published: Sat,December 16, 2017 11:18 PM

ఆంగ్ల తౌరక్యాంధ్రం!

ఒక కవి వేరొక భాష నుంచి పదాలు వాడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయలేదు. పక్కవారిని అనేటప్పుడు తమ చేతులు గమనించుకోవాలన్న సదుద్దేశం ప్

Published: Tue,October 31, 2017 11:08 PM

తొలుగుతున్న ముసుగులు

ఈ మధ్యకాలంలో కొన్నికొన్ని అంశాలమీద తీవ్రమైన వాదోపవాదాలు, పరస్పర నిందలు చేసుకోవటం ఎక్కువైంది. ఎవరు చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉందో త

Published: Thu,February 16, 2017 01:52 AM

త్రిభాషాసూత్రంలో చిన్న మార్పు

అన్ని రంగాలతో తనదైన శైలిలో వినూత్న పథకాలు రచించి, వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అతిముఖ్యమైన భాషావ

Published: Thu,August 18, 2016 01:08 AM

తెలుగు వైభవం తెలంగాణలోనే

-తెలుగు భాష - సంబురాలు-2 ఒకటవ శతాబ్దం నుంచి తెలంగాణలోని రచింపబడ్డ కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. మాతృభాషాభిమానంతో పాట

Published: Fri,August 5, 2016 12:59 AM

సార్ యాదిలో.. సార్ బాటలో

సిద్ధాంతకర్త, మేధావి, దార్శనికుడు, మహోపాధ్యాయుడు అంటూ ఎవరెన్ని పేర్లు పెట్టి పిలిచినా తాను సామాన్య కార్యకర్తనని, కేవలం తెలంగాణవాది

Published: Sat,June 11, 2016 01:21 AM

ఆంగ్ల మాధ్యమానికి సమగ్ర సిలబస్

అన్నిరంగాల ప్రగతివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ విద్యా రంగ ప్రగతితో వ్యక్తి ప్రమా ణాలు, ఆలోచనలు, ఆచరణ మారి ఒక జాతి గుణ

Published: Fri,April 29, 2016 12:54 AM

నాణ్యమైన విద్యకు ఇంటర్ నాంది

ఇంటర్మీడియెట్ (జనరల్) కోర్సు చేసినవారు సాంకేతిక విద్య పరిధిలోని ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో కానీ, బీఏ, బీబీఏ, బీకాం, బీయ

Published: Wed,April 6, 2016 01:28 AM

ఇంగ్లీషును భాషగా బోధించాలె

విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశాలలో భాషా మాధ్యమం ఒకటి. విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవాలన్నా, తిరిగి పరీక్షల్లో రాయాలన్నా వారికి

Published: Sun,February 21, 2016 01:48 AM

ప్రతిపక్షాలకు గుణపాఠం

ఇకనైనా రాజకీయ నాయకులు మారాలి. జయశంకర్ సార్ ఒకమంచి మాట చెప్పేవారు. అన్ని శాస్ర్తాలు పాఠాలు చెప్తాయి, చరిత్ర గుణపాఠాలు చెప్తుంది. అం

Published: Sun,October 11, 2015 01:56 AM

ఎవరికి భరోసా? ఎవరికి ఆసరా?

తెలంగాణ చరిత్ర నేపథ్యంలో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛగా ఒక ప్రజాస

Published: Thu,September 17, 2015 01:29 AM

జూన్ రెండునే మన పండుగ

1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర

Published: Sun,August 30, 2015 12:23 AM

భాషా, సంస్కృతులను బతికించుకుందాం

అరవై ఏళ్లలో మరుగునపడిన ఈ గొప్ప సంస్కృతినిమళ్లీ తెలంగాణలో ప్రతిష్ఠించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. విద్యారంగంలో ము

Published: Thu,April 23, 2015 01:35 AM

యూనివర్సిటీల నాణ్యతతోనే వికాసం

ఏ రాష్ట్రంలో అయినా మేధాసంపత్తి ని పెంపొందించటానికి గుణాత్మక విద్య ను ఉన్నతస్థాయి కోర్సుల ద్వారా, పరిశోధనల ద్వారా దోహదం చేసేవి విశ్

Published: Sat,January 24, 2015 12:10 AM

విద్యలోనే ఉపాధికి పునాది

ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చాలా ముఖ్యమైన మానవ వనరులను ఏర్పరిచేదిచదువు మాత్రమే. ముఖ్యంగా విజ్ఞానాన్ని అనుసరిం చి సాగే ఈ శతాబ్దపు స

Published: Thu,January 1, 2015 01:17 AM

విద్యలో భాషానైపుణ్యాలు ఉండాలె

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏ రంగంలో అయినా ఇప్పటివరకు జరిగిన తప్పుడు విధానాల వల

Featured Articles