అవినీతి వ్యతిరేక ఉద్యమం- తెలంగాణ


Tue,October 9, 2012 05:49 PM

అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చాలా గొప్పది. జన్‌లోక్ పాల్ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.దీనిని సమర్థించాలి. అలాగే.. జన్‌లోక్ పాల్ బిల్లే అన్నింటికీ పరిష్కారం కాదు. మరికొందరు దీనిని రెండో స్వాతంత్య్ర పోరాటంగా కూడా కీర్తిస్తున్నారు. కాని ఇది పొరపాటు. జనలోక్‌పాల్ బిల్లు దానికదిగా.. దేశంలోని సకల సమస్యలకు పరిష్కారం కాదు. కానీ ప్రస్తుతం దేశంలో రాజ్యం చేస్తున్న అవినీతి భూతాన్ని కట్టడి చేయడానికి అత్యవసరం. కాబట్టి ప్రజాస్వామ్య ప్రియులు, దేశవూపేమికులంతా అన్నా హజారే ఉద్యమానికి మద్దతునివ్వాలి. దానిలో భాగస్వాములవ్వాలి.


ప్రస్తుతం దేశంలో పెచ్చరిల్లిపోతున్న అవినీతికి ప్రధాన కారణం రాజకీయనేతలే. స్వాతంవూత్యానంతరం ఏ విలువలు లేని రాజకీయ తరం స్వాతంత్య్ర ఫలాలను ఫణంగా పెట్టాయి. అవినీతి, బంధువూపీతి, లంచగొండితనంతో దేశాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వలాభానికి వాడుకొని అవినీతిని అందలమెక్కించారు. ఈ నేపథ్యంలో అవినీతిని సమూలంగా నాశనం చేయాలంటే... అవినీతి మూలాలను తెలుసుకోవాలి. వాటిని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రయత్నించాలి. అలాగే.. రోగం వచ్చిన తర్వాత దాని నివారణ చర్యలు తీసుకునే కంటే.. అసలు రోగమే రాకుండా రోగ కారకాలను నాశనం చేయడం ఉత్తమమైన మార్గంగా ఎంచుకోవాలి.

అవినీతిలేని భారతదేశం అంటే.పస్తుతం ఊహకందని విషయంగా మారిపోయింది. ఎందుకంటే.. అవినీతి అంతగా.. సర్వత్రా వ్యాపించింది. స్వాతంవూత్యానంతరం బాగా అభివృద్ధి చెందింది ఏదన్నా ఉందంటే.. అది అవినీతి అనే చెప్పవచ్చు. మిగతా అన్ని రంగాలలో జరిగిన అభివృద్ధిని చూస్తే.. అవినీతి అంతకంటే.. ఎక్కువ రెట్లు పెరిగి భూతంలా తయారయింది. సరళీకరణ ఆర్థిక విధానాల పుణ్యమాని ఇది ఇంకా అడ్డూ, అదుపూ లేకుండా పెరిగిపోయింది. 15 ఏళ్లుగా సాగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ కారణంగా.. అవినీతి వ్యవస్థీకృతం అయ్యింది. ప్రభుత్వ యంత్రాంగమంతా.. అవినీతి మయమై పోయింది. దీని కారణంగానే.. సహజవనరులు కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టారు. సెజ్‌లు, ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టుల పేరుతో 100 నుంచి 1000 ఎకరాల దాకా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పారు. ప్రజల ఆస్తులను, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసమే.. ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే విధంగా మారిపోయింది.

దీంతో.. ప్రభుత్వ యంత్రాంగమంతా.. ప్రజలకు జవాబుదారిగా గాకుండా.. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకోసం పని చేస్తోంది. ఈ క్రమంలోనే హైటెక్ కార్పొరేట్ అవినీతి కుంభకోణాలు ఆంధ్రవూపదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. ఈ హైటెక్ అవినీతికి మన రాష్ట్రంలో చంద్రబాబునాయుడి కాలంలోనే బీజం పడింది. హైటెక్ అభివృద్ధి పేరిట చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి నమూనాలో.. అప్పుడే.. కార్పొరేట్ అవినీతి పురుడు పోసుకుంది. జనాకర్షక, ఓట్ బ్యాంక్ రాజకీయాల నేపథ్యంలో కార్పొరేట్ అవినీతిని పాలకులు పెంచి పోషించారు. ఇది ఆ తర్వాత వైఎస్‌ఆర్ పాలనలో ఆకాశాన్నంటింది. అవినీతి వట వృక్షమై మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసే స్థాయికి చేరింది. టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడైతే.. ఏకంగా.. ఒక ప్రాంతానికి చెందిన ఓ వర్గానికి అంటకాగి వారికి రాష్ట్రాన్ని దోచి పెట్టారు.

హైదరాబాద్ చుట్టూరా రియల్ ఎస్టేట్ పేర తన వర్గానికి భూములన్నింటినీ దారాదత్తం చేశారు. సహజ వనరులను దోచిపెట్టారు. అందినంతా దోచుకున్న చంద్రాబాబు తన అవినీతి డబ్బుతో.. మలేషియా, సింగపూర్, దుబాయిలలో తన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విధంగానే రెండున్నర ఎకరాల ఆసామి 20 వేల కోట్లకు పడగపూత్తాడు. ప్రపంచబ్యాంకు అభివృద్ధి విధానాలతో.. ప్రజలకు దూరమైన చంద్రబాబు తర్వాత, సుదీర్ఘ పాదయావూతతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ బాబును తలదన్నారు. ప్రపంచబ్యాంకు విధానాలను వ్యతిరేకిస్తూ.. అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి అవే విధానాలను భుజానకెత్తుకున్నారు. బాబును తలదన్నే విధంగా కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ.. జనాకర్షక జలయజ్ఞం తో రెండుచేతులా దోచుకున్నారు. అక్రమార్కులకు తోచిన తీరుగా దోచుకునేందుకు వీలు కల్పించారు.

రింగురోడ్డు, కోస్టల్ కారిడార్, సెజ్‌లు, ఇండవూస్టియల్ పార్కుల పేరుతో పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. వైఎస్ ప్రభుత్వంలో అబ్ధిపొందిన కార్పొరేట్ సంస్థలు దొడ్డిదారిన నిధులను వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ కంపెనీల్లోకి మళ్లించాయి. 2004లో సంవత్సరాదాయం 11 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు , 2010 నాటికి 20 వేల కోట్లకు పెరిగిపోయాయి. ఇదంతా.. అవినీతి చీకటి సొమ్మే. ఈ రకమైన కార్పొరేట్ అవినీతి దేశమంతా విస్తరించింది. ఈ కోవలో వెలుగు చూసిన కుంభకోణాలే.. టూ-జీ స్పెక్ట్రమ్, కామన్ వెల్త్ గేమ్స్ తదితరాలు.

అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు, వైఎస్సార్ తమ దోపిడీని ఎల్లకాలం సాగేందుకు తమ ప్రయోజనాలను కాపాడే.. ‘రాజగురువు’లను తయారు చేసుకున్నారు. రామోజీరావు, కావూరి, లగడపాటి, రాయపాటి లాంటి సీమాంధ్ర దోపిడిదారులు పాలకుల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ముసుగులో.. తమ దోపిడిని కాపాడుకునేందుకు తమ అధికార, ధన బలాన్ని ఉపయోగిస్తున్నారు. సీమాంధ్ర వలసవాద దోపిడీని ఎదిరిస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ఈ వర్గాలే ముందుభాగాన ఉండి పనిచేస్తున్నాయి. అంధ్ర ప్రదేశ్ అవతరణ నాటి నుంచీ వివక్ష, దోపిడీ పీడనలకు బలి అవుతున్న తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పాలన పోవాలంటే.. వారి అవినీతి పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. అవినీతి వ్యతిరేక అన్నా హజారే ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. అవినీతి మూలాలను శాస్త్రీయంగా అర్థం చేసుకొని దాని నిర్మూలనకు పోరాడాలి. తెలంగాణ విషయంలో.. అవినీతి వ్యతిరేక పోరాటం అంటే.. సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాడటమే. సీమాంధ్ర పాలకుల పాలన అంతమైనప్పుడే.. తెలంగాణలో అవినీతి అంతం అవుతుంది. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవిక్షిశాంతంగా పోరాడుతున్నారు. ఇప్పటికే 700 పైచిలుకు విద్యార్థి , యువజనులు ప్రాణత్యాగం చేశారు. పల్లెనుంచి పట్నం దాకా తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్యమాలు చేశారు, చేస్తున్నారు.

అయినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా తగిన విధంగా స్పందించకుండా.. నిర్లక్ష్యం చేస్తున్నాయి. వివక్షను పాటిస్తున్నాయి. ‘అన్నా’ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న జాతీయ మీడియా సంస్థలు.. , దశాబ్దకాలంగా పోరాడుతున్న తెలంగాణ శాంతియుత పోరాటాన్ని చూడక పోవడం విడ్డూరం. చిత్తశుద్ధిగా అవినీతిని వ్యతిరేకిస్తూ.. కార్పొరేట్ దోపిడీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజల పోరాటం నిజమైన అవినీతి వ్యతిరేక పోరాటం. దీనిని ప్రతి ఒక్కరూ.. సమర్థించాలి. తెలంగాణ రాష్టం ఏర్పాటు కావాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంటుంది.

-జె ఆర్ జనుంపల్లి

35

JANUMPALLI JR

Published: Tue,October 9, 2012 05:46 PM

తెలంగాణ తెగువ

సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన పౌరుషం, పోరాట పటిమ భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర

Published: Tue,October 9, 2012 05:47 PM

దగాపడిన పాలమూరు

పాలమూరును ఆ జిల్లా ప్రజలు, బైబిల్‌లో వర్ణించిన పాలు, తేనే కలిసి ప్రవహించే ప్రాంతం పాలస్తీనా అను రీతిగా పాలు జాలువారే ప్రదేశంగా ప్ర

Published: Tue,October 9, 2012 05:51 PM

ఇక తెగించి కొట్లాడుడే..

కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కలిసి తెలంగాణ ఉద్యమానికి చుట్టూ రాతి గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం తదితరులు పూర్

Published: Tue,October 9, 2012 05:47 PM

విధ్వంసకారుల వితండవాదాలు

హైదరాబాద్ నగరాన్ని 5లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఆంధ్ర నాయకులు వేలు పెట్టే సందు ఇస్

Featured Articles