ఇక తెగించి కొట్లాడుడే..


Tue,October 9, 2012 05:51 PM

కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కలిసి తెలంగాణ ఉద్యమానికి చుట్టూ రాతి గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం తదితరులు పూర్తిగా చంద్రబాబు మకిలి రాజకీయాల్లో ఇరుక్కొని తమకు తమ ప్రజలకు కావలసినదేదో తెలుసుకోలేని అయోమయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. వారికి తెలంగాణ ప్రజ ల గోడుకంటే తెలంగాణలో వారి పార్టీ భవిష్యత్తు వారి నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఎంతో మహత్వపూరితంగా కనిపిస్తున్నవి. లేని చోట రాజకీయం సృష్టించి, తన ఉనికి కాపాడుకోవ డం నాయుడి రాజకీయ లక్షణం. పైగా ఆయనొక తెలంగాణ అన్న పదాన్నే ఇష్టపడని ‘ఆంధ్ర ఛావిసిస్ట్’ తెలంగాణలో ఇదివరకు లాగే అయోమయం సృష్టించి తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు.

ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా అర్థమైంది. కానీ ఆయన కాటుకు గురైన ఆయన తెలంగాణ అనుయాయులకు అర్థం కావడం లేదు. వీరు చంద్రబాబు వెలికి రాజకీయాల సాలెగూట్లో, వెలికి రాలేనంత గాఢంగా చిక్కుకుపోయారు. వారు ఆ సాలెగూట్లోనే రాజకీయంగా అసువు లు బాయడం ఖాయం వీరిలో ప్రజాభీష్టానికి అనుగుణంగా మార్పు తేవడానికి, తెలంగాణ ప్రజలు, జేఏసీ ఎన్ని దినాలుగా చేసిన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీ రే. వారివల్ల నష్టం తప్ప లాభం జరిగే అవకాశం ఏ కోశానా లేదు. ప్రజలు జేఏసీ వారిని పూర్తిగా విస్మరించడం మంచిది. వారి చర్యలను ఖండించడం కూడా వారి ఉపయోగం లేని ఉనికిని గుర్తించడమౌతుంది. అభినవ సైంధవుడు బాబుకు నాడు అసలు సైంధవునికి పట్టిన గతి పట్టబోతుంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన ఈ దుర్గతికి మూల కార ణం. ఈ సమస్యకు విత్తనం వేసింది, పెంచి పోషించింది ఈ పార్టీ నే. తమ పూర్వికుల, ప్రసాదమైన, ఈ సమస్యను సోనియా గాంధీ, ఆమె కోటరీ తిరిగి లేవనెత్తి పెంచి పోషించారు. ఇప్పుడు నిర్ణాయక దశలో ఉన్న ఆ సమస్యను జటిలం చేసి, ఆగమ్యగోచర పరిస్థితులు సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రజల అరిగోసకు కారణమైన సమైక్యాంధ్రవాదులతో అనైతికంగా కలిసి ఈ సమస్యను 2014 దాక లాగి, తిరిగి అయోమయం సృష్టించి లాభం పొందుదామని ప్రయత్నిస్తున్నారు. దేశంలో ముఖ్యమైన రాజకీయ పార్టీ లు తెలంగాణవాదంలోని నిజాయితీని గుర్తించాయి. వీరు ఆంధ్ర అవినీతి ‘బారన్ల’తో కలిసి చేస్తున్న ఈ అనైతిక రాజకీయాన్ని యావత్ భారతదేశం నిశితంగా గమనిస్తున్నది. ఇది సోనియా సొంత ఎత్తుగడా లేక ఆంధ్ర కాంగ్రెస్, టిడిపితో కలిసి ఆమె కోట రీ చేస్తున్న షడ్యంవూతమా? ఈ ఆగమ్యంలో ఆమెకు నిజంగా ప్రయోజనముందా? అనేవి తెలంగాణ వాదులకు అర్థం కానీ ప్రశ్నలు

సోనియా స్వయం కృతమైన ఈ ఉద్యమంలో ప్రస్తుతం ఆమె సానుభూతి ఎక్కడుందో స్పష్టంగా తెలంగాణ త్రుణ మూలాలకు కూడా అర్థమవుతున్నది. కానీ ఆమె అత్యంత విధేయులు, ఆమెను దేవతగా కొలిచే మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇంకా పూర్తిగా అర్థమైనట్టు లేదు. ఆమె ఈ విషయంలో మాట్లాడితేనే ముత్యాలు రాలి పోతాయేమో అన్నట్టుగా మొండి మౌనం పాటిస్తూ, తన కోటరీతో మన వాళ్ళను చెట్టు గుట్టలు తిప్పతున్న ది. ఈ విధేయులను ఎక్కడ ముంచుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ప్రస్తుతానికికైతే ఈ పార్లమెంటు సమావేశాన్ని దాట వేసే యుక్తితో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో వెండి తెర మీద చూడవలసిందే!

తెలంగాణ ప్రజల, జేఏసీ ఒత్తిడితో కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చినప్పటికీ, వారితో తెలంగాణ కోసం అధిష్ఠానం దాష్టీకాన్ని ఎదిరించి తెగించి కొట్లాడే తెగువ రాలేదు. అది వచ్చేంతవరకు ఈ విషయంలో వారి చిత్తశుద్ధి ప్రశ్నార్థకమే. అధిష్ఠానం దృక్పథంలో కూడా పెద్ద మార్పు అశించలేము. తెలుగుదేశం తెలంగాణ ఏర్పాటుకు చేసిన ద్రోహం, తెలంగాణ కాంగ్రెస్ ఈ అరకొర చేష్టల బలహీనతలను ఉపయోగించి, తమకు ఇష్టులైన ఆంధ్ర కాంగ్రెస్ అనైతిక డిమాండ్లకు ఒప్పించే ప్రమాద మున్నది. అందుకే ఈ సాగతీత, మానసిక యుద్ధం మరి మన కుహనా విధేయులకు వారి అధిష్ఠానాన్ని మెప్పించటానికి, మన ప్రజల ఆకాంక్షలను తాకట్టు పెట్టడం కొత్త విద్యేమీ కాదు. ఆంధ్రులకు వేలు పెట్టే ఇస్తే మన బతుకు మరీ దుర్భరం చేస్తారనేది కూడా చరిత్ర చెప్పే సత్యం. ఈ సంధి కాలంలో తెలంగాణ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నది. లేనిచో తెలుగుదేశం, అధిష్ఠానం, ఆంధ్ర కాంగ్రెస్ దుష్ట కూటమి చాప కింద నీళ్ళు తెచ్చే ప్రయత్నం తప్పక చేస్తారు. అది వారి స్వాభావిక నైజం.

తెలంగాణ కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలను కాదని ఈ పార్లమెం ట్ సమావేశాల్లో పాల్గొంటే, వాళ్ళు విధులు నిర్వర్తిస్తూపోతూ ఉంటే వారు ప్రజల పక్షాన లేరు అని భావించక తప్పదు. అప్పు డు వారికి కూడా తెలుగుదేశం వారితో సమానంగా భావించి తక్షణమే పరిత్యజించాల్సి వస్తుంది. ఇప్పటికీ వీరికి ప్రజలు, జేఏసీ వీరి సంఖ్యా బలాన్ని, రాజకీయ ఉపయోగాన్ని గుర్తించి ఎంతో విలువనిచ్చి సహకారాన్నందించా రు. ఇంకా వీరిని నమ్మి కాలహరణ చేసి ఉద్యమానికి నష్టం కలు గ చేసుకోవడం. ఉచితమనిపించుకోదు. అధికార పార్టీ దివాలా కోరుతనము, ప్రతిపక్ష పార్టీ ద్రోహం. రాష్ట్రవూపభుత్వ దమన నీతి కలిసి, తెలంగాణ మరోసారి ఓడించాలని చూస్తున్నాయి. కానీ ఈసారి తెలంగాణ ప్రజలు అందుకు సిద్ధంగా లేరు. ఈసారి విజయం సాధించకపోతే ,అది ప్రాంతానికి మరణ శాసనమే అవుతుంది. ప్రజా ప్రతినిధులైన రాజకీయ నాయకులు మోసం చేస్తే, ప్రజలే వారి భవితవ్యం నిర్ణయించుకోవాలి. ఎవడి మెహర్బానికీ దేవిరించాల్సిన అవసరం లేదు. అదే ప్రజా ఉద్యమమంటే.

ఇప్పుడు మన ప్రజల తక్షణ కర్తవ్యం తెగించి కొట్లాడుడే. సాగదీయడంలో ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణకు పూర్తి నిష్టతో ఉన్న టీఆర్‌ఎస్, సిపీఐ, బీజేపీ, న్యూడెమాక్షికసీ తదితర పార్టీల తో కలిసి జేఏసీ తుది రాజకీయ సమరం చెయ్యాల్సి ఉంటుంది. ఈ సమరం నిర్ణయాత్మకం కావాలి. దీనికి రాబోయే సకల జనుల సమ్మె సరయిన వేదిక. అయితే దీంట్లో జేఏసీ దాని అనుయాయ రాజకీయ పక్షాలు ప్రముఖ పాత్ర వహించాలి. ఉద్యోగ సంఘాలు వీరికి వెన్నుముకగా నిలుస్తాయి. ఈ సమ్మె బాధ్యత పూర్తిగా జేఏసీదే కావాలి. ఇది మరోక ‘బార్డోలి’ ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి. తెలంగాణ ప్రజలకు విజయం తప్ప వేరే ప్రత్యామ్నాయము లేదు.

-జే.ఆర్. జనుంపల్లి

35

JANUMPALLI JR

Published: Tue,October 9, 2012 05:46 PM

తెలంగాణ తెగువ

సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన పౌరుషం, పోరాట పటిమ భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర

Published: Tue,October 9, 2012 05:47 PM

దగాపడిన పాలమూరు

పాలమూరును ఆ జిల్లా ప్రజలు, బైబిల్‌లో వర్ణించిన పాలు, తేనే కలిసి ప్రవహించే ప్రాంతం పాలస్తీనా అను రీతిగా పాలు జాలువారే ప్రదేశంగా ప్ర

Published: Tue,October 9, 2012 05:49 PM

అవినీతి వ్యతిరేక ఉద్యమం- తెలంగాణ

అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చాలా గొప్పది. జన్‌లోక్ పాల్ బిల్లు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.దీనిని సమర్థించా

Published: Tue,October 9, 2012 05:47 PM

విధ్వంసకారుల వితండవాదాలు

హైదరాబాద్ నగరాన్ని 5లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ఆంధ్ర నాయకులు వేలు పెట్టే సందు ఇస్