ధీర వనిత రాణిమా


Mon,February 18, 2013 06:09 PM

RaniGaidinliuభారత స్వాతంవూత్యోద్యమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఆదివాసీ వీరనారి రాణి గైడిన్ల్యూ. తెల్లదొరల దురాక్షికమణ నుంచి గిరిజనతెగల స్వేచ్ఛాస్వాతంవూత్యాల కోసం ఆయుధాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత. నాగాజాతిలోని రాంగ్‌మోయీ గిరిజన తెగకు చెందిన రాణిమా ఆదిమజాతికే కాదు, యావత్ భారతావని గర్వించదగ్గ గొప్ప పోరాట యోధురాలు. రాణిమా మణిపూర్ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో 1915, జనవరి 26న జన్మించారు. ఈశాన్య రాష్ట్రాల ఆదివాసుల జీవితాలకు వెలుగుబాటలు వేసిన గైడిన్ల్యూను తమ విముక్తి దాతగా గౌరవంగా రాణిమాగా పిలుచుకుంటారు.

రాణిమా మొదట బ్రిటిష్ సైన్యంలో చేరి మెసపోటెమియా యుద్ధంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆనాడు బ్రిటిష్ వారు భారతీయుల పట్ల అనుసరిస్తున్న విధానాలు చూసి సహించలేక పోయేవారు. దీంతో.. ఆమె బ్రిటిష్ సిపాయి ఉద్యోగానికి రాజీనామా చేశారు. మణిపూర్ ప్రాంతంలో అప్పటికే ఆదివాసీల తరఫున పోరాడుతున్న జాదోనాంగ్‌తో కలిసి రాణిమా హరాకా అనే ఉద్యమ సంస్థను స్థాపించారు. భరతగడ్డ నుంచి ఎలాగైనా బ్రిటిష్ వారిని తరిమికొట్టాలనే లక్ష్యంతో పోరాట ఎత్తుగడలు వేశారు. ఈ ఉద్యమం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే జాదోనాంగ్‌ను బ్రిటిష్ పాలకులు రాజవూదోహనేరం మోపి అరెస్టు చేసి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను 1931 ఆగష్టు 29న బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. జాదోనాంగ్ అమరత్వంతో 17 ఏళ్ల ప్రాయంలోనే రాణిమాకు ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టక తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో తాను స్వతంత్ర సాయుధ బలగాలను తయారు చేసుకుని తన స్థావరాన్ని బరక్‌నదీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు.

హరాకా ఉద్యమం నాగాజాతిలోని ముఖ్యమైన తెగలు జెమీ, ల్యాగ్‌మేయీ, రాంగ్ మేయీలను ఏకతాటిపై తెచ్చింది.తరతరాల తమ సంస్కృతి, సంప్రదాయాలను బ్రిటిష్ పాలకుల వివక్ష, అణచివేతల నుంచి కాపాడింది.రాణిమా నాయకత్వంలో మణిపూర్ పశ్చిమ ప్రాంతం, నాగాలాండ్ దక్షిణ వూపాంతం, అసోంలోని ఉత్తర ప్రాంతంలో స్వాతంవూత్యోద్యమ జ్వాలలు రేగాయి. రాణిమా నాయకత్వంలో ఆదివాసులు ఏకమై బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అడుగడుగునా బ్రిటిష్ పాలకుల దోపిడీ విధానాలను, చొరబాటు విధానాలను ఎదిరించారు. దీంతో బ్రిటిష్ పాలకులు ఎలాగైనా రాణిమాను బంధించాలని పన్నాగం పన్నారు. రాణిమాను బంధించేందుకు డిప్యూటీ కమిషనర్ జేపీ మీల్స్ ఆధ్వర్యంలో సైన్యాన్ని దించారు. రాణిమా ఆచూకీ తెలిపిన వారికి 500 రూపాయల బహుమానం, పదేళ్లపాటు పన్ను రద్దు చేస్తామని ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ పాలకులు ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభాలకు గురిచేసిన ఆదివాసులు రాణిమాను తమ గుండెల్లో పెట్టుకుని రక్షించుకున్నారు.

నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నా వలస పాలకులకు రాణిమా ఆచూకీ దొరకలేదు. దీంతో రెచ్చిపోయిన బ్రిటిష్ సైనికులు ఆదివాసులను అనేక రకాలుగా హింసించారు. 1932లో నాగా స్వాతంత్య్ర సైనిక దళం బ్రిటిష్ పాలకుల అస్సాం రైఫిల్స్‌పై దాడి చేసింది. కానీ సంప్రదాయ ఆయుదాలు కత్తి, డాలు, బాణంతో పోరాడిన నాగాలు ఆధునిక ఆయుధాలతో ఉన్న బ్రిటిష్ సైనికుల ధాటికి తట్టుకోలేకపోయారు. అనేక మంది వీరమరణం చెందారు. తర్వాత రాణిమా ఉత్తర మణిపూర్, నాగాల కేంద్ర స్థానమైన కోహిమాలో పర్యటిస్తూ సాయుధ సైన్యాన్ని కూడగట్టుకున్నది. హంగ్రమ్ అనే చోట అసోం రైఫిల్స్ కట్టెలతో కోటను నిర్మించుకున్నది. అలాగే రాణిమా కూడా పోలోమీ గ్రామ సమీపంలో కోటను నిర్మించుకున్నారు. ఆస్థావరాన్ని కనిపెట్టిన అస్సాం రైఫిల్స్ దళం అకస్మాత్తుగా 1932, అక్టోబర్ 17న పోలోమీపై దాడి చేసింది.

ఆధునిక ఆయుధాలతో దాడి చేసిన బ్రిటిష్ సైనికుల ముందు రాణిమా సేనలు నిలువలేక లేకపోయాయి. నాగా సాయుధ తిరుగుబాటు దారులకు ఓటమి తప్పలేదు. రాణిమాను అస్సాం రైఫిల్స్ బలగాలు అరెస్టు చేసి కోహిమాకు, ఆతర్వాత ఇంఫాల్ జైలుకు తరలించారు. బ్రిటిష్ ప్రభుత్వం రాణిమాకు కఠిన కారాగార శిక్ష విధించి, అమె అనుయాయులకు కూడా దీర్ఘకాల కారాగార శిక్షలు విధించారు. రాణిమా దాదాపు 15 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు అయినప్పటికీ రాణిమా ఉద్యమ స్ఫూర్తి ఈశాన్య భారతమంతటా,ముఖ్యంగా నాగాలాండ్, మణిపూర్ ప్రాంతమంతటా వ్యాపించింది. 1937లో జవహర్‌లాల్‌నెహ్రూ మణిపూర్ పర్యటన సందర్భంగా రాణిమా గురించి తెలుసుకుని ఆమె దేశ భక్తికి ఉత్తేజితుడై రాణిమాను విడుదల చేయాలని బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. నెహ్రూ రాణిమాను నాణేల రాణిగా పేర్కొనే వారు.

స్వాతంవూత్యానంతరం 1947లోటూరా జైలునుంచి రాణిమా విడుదలయ్యారు.ఐతే ఆమెను మణిపూర్‌లో ప్రవేశించడాన్ని మాత్రం నిషేధించారు. అప్పుడు నాగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయు ధ పోరాటం చేపట్టారు. అప్పటినుంచి రాణిమా అంటే 1960 నుంచి అజ్ఞాతంలో ఉన్నా రు.1966లో రహస్యజీవితం నుంచి బయటికి వచ్చి న ఆమె నాగాలాండ్‌లో శాంతిస్థాపనకు కృషిచేశారు. ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ..1972లో ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌పూర్‌లో ఏర్పాటైన అఖిలభారత వనవాసీ కళ్యాణాక్షిశమానికి సన్నిహితులయ్యారు. 1973లో ప్రయాగలో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమ్మేళనంలో పాల్గొన్నారు. తన 78 ఏటా 1993 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఈశాన్య రాష్ట్రాలకే కాదు, దేశ వ్యాప్తంగా ఆదివాసీ పోరాటాలకు రాణిమా పోరాటం స్ఫూర్తి.

-గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
(ఫిబ్రవరి 17, రాణిమా 20 వ వర్ధంతి..)

35

GUMMADI LAXMINARAYANA

Published: Tue,January 1, 2013 03:56 PM

ప్రశ్నార్థకమవుతున్న హక్కులు

ప్రపంచ దేశాలు ప్రతియేటా డిసెంబర్ 10 న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమును ఆనవాయితీగా నిర్వహిస్తున్నాయి. జాతి, మతం, కులం, భాష, ప్రా

Published: Wed,December 26, 2012 02:50 PM

గిరిజన మాణిక్యం

మడవి తుకారం ఒక సాధారణ గోండు తెగ గిరిజన వ్యక్తి. ఆయ న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో 1951 మే 4వ

Published: Sat,October 6, 2012 03:46 PM

వాకపల్లి బాధితులకు న్యాయం దక్కేనా?

భారత రాజ్యాంగం ప్రకారం మతం, కులం,లింగం ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. 1979 లో వియన్నాలో జరిగిన ‘సీడా’

Published: Sat,October 6, 2012 03:47 PM

ఆదివాసుల పోరాట స్ఫూర్తి అల్లూరి

భారత స్వాతంత్య్ర కోసం ప్రాణాన్ని తృణవూపాయంగా అర్పించి అసువులు బాసిన పోరాటవీరుల్లో అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయు డు. ఆదివాసీల మన

Published: Sat,October 6, 2012 03:51 PM

గోండుల తొలి పోరాటయోధుడు

భారత స్వాతంత్య్ర పోరాటం అంటే స్ఫురించేది సిపాయిల తిరుగుబాటు. మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివా

Published: Sat,October 6, 2012 03:51 PM

ఆదివాసీల ఆప్తుడు బియ్యాల

ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనస్సుల్లో చెరగని ము

Featured Articles